Shuru
Apke Nagar Ki App…
ఎట్టకేలకు తొలగిన మహానీయులు అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ముసుగులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మహానీయుల విగ్రహల ముసుగులను అధికారుల సమక్షంలో సోమవారం సాయంత్రం ఎట్టకేలకు తొలగించారు. తిమ్మాపూర్ మండల కేంద్రం లోని ఆర్టిసి బస్టాండ్ ఆవరణలో బిఆర్ఎస్ హయాంలో నెలకొల్పిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ముసుగులకు మోక్షం లభించింది. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవతో విగ్రహల ముసుగులను అధికారులు తొలగించారు.రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు విగ్రహల ముసుగులు తొలగిపోవడంతో దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Kommera Rajureddy Reporter
ఎట్టకేలకు తొలగిన మహానీయులు అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ముసుగులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మహానీయుల విగ్రహల ముసుగులను అధికారుల సమక్షంలో సోమవారం సాయంత్రం ఎట్టకేలకు తొలగించారు. తిమ్మాపూర్ మండల కేంద్రం లోని ఆర్టిసి బస్టాండ్ ఆవరణలో బిఆర్ఎస్ హయాంలో నెలకొల్పిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ముసుగులకు మోక్షం లభించింది. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవతో విగ్రహల ముసుగులను అధికారులు తొలగించారు.రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు విగ్రహల ముసుగులు తొలగిపోవడంతో దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్1
- మెట్‌పల్లి, ఏప్రిల్ 13: మెట్‌పల్లి డిపోలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జాతీయ రోడ్డు భద్రత–2026 కార్యక్రమాన్ని డిపో ఎస్‌టీఐ టి. ప్రమీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం డిపో నుంచి పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ ఏ. రాములు, సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ పి. కిరణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం డీఎస్పీ రాములు మాట్లాడుతూ, ఒక ప్రైవేట్ వాహనం సరుకులు తీసుకెళ్తే అవి పాడవుతాయని, కానీ బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరి ప్రాణ భద్రత డ్రైవర్ చేతుల్లో ఉంటుందని తెలిపారు. అందువల్ల డ్రైవర్లు అత్యంత జాగ్రత్తగా, బాధ్యతతో వాహనం నడపాలని సూచించారు.అనంతరం డిపో నుండి పాత బస్టాండ్ వరకు డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ, భద్రతా సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మెకానిక్ సూపర్వైజర్ ఏ. చంద్రయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ పవన్, ఎం.డి. ముజిబ్ ఖాన్ (ఆర్‌హెచ్‌సీ), ట్రాఫిక్ సూపర్వైజర్లు, మెకానికల్ సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ మరియు భద్రతా సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.3
- 18 సంవత్సరాల లోపు మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దని మంచిర్యాల జిల్లా ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ కోరారు. మంచిర్యాల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేటలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నలిమెల రాజు, ఆర్టిఏ అధికారులు ఉన్నారు.1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ అగ్నిప్రమాదాలపై ప్రజలందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే 101 నంబర్‌కు సమాచారం అందించాలని ఆయన తెలిపారు. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.1
- పత్రిక ప్రకటన తేది: 13-04-2026 కామారెడ్డి జిల్లా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 135 దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలపై తమ వినతిపత్రాలను సమర్పించగా, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి, వేగవంతమైన పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, మేడంమోహన్, సీఈఓ జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.1
- వరంగల్ జిల్లా, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ సామాజిక సమానత్వం కోసం కృషి చేయాలని పలువురు ప్రసంగించారు. వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా, స్థానిక ప్రజల భాగస్వామ్యం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.3
- మంథని లో మంత్రి శ్రీధర్ బాబు కు వింత నిరసన ఎదురయింది. గోవు ద్వారా గోశాల నిర్వాహకుడు వినతి పత్రం సమర్పించారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీపాద కాలనీలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబును ఆ కాలనీలో ఉన్న గౌతమేశ్వర గోశాల నిర్వహకులు ఆకుల విద్యాసాగర్ వినూత్నంగా వినతి పత్రం సమర్పించారు. గోశాల లోని పార్వతి అనే గోవు ద్వారా గోశాల దీనస్థితిని వినతి పత్రం ద్వారా మంత్రికి విన్నవించారు. మంత్రి కాన్వాయ్ కు ఎదురుగా గోవు గోశాల నిర్వహకుడు రావడంతో మంత్రి కారు దిగి అతని వద్దకు వెళ్ళాడు. గోశాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని సహాయం చేయాలని వినతి పత్రం ద్వారా కోరారు. గతంలో పలుమార్లు వినతులు సమర్పించిన ఎవరూ పట్టించుకోలేదని, గోవుకు వినతి పత్రం కట్టి మీ దృష్టికి తీసుకొచ్చానని తెలిపారు. గోవు వినతి పత్రాన్ని స్వీకరించిన మంత్రి గోవుకు అరటిపండు తినిపించి శ్రీపాద ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తామని గోశాల నిర్వాహకునికి మంత్రి హామీ ఇచ్చారు.2
- భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అధికారులతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని మరియు కూడలిని పరిశీలించారు.ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించబోయే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలోని మున్సిపల్ ద్వారా నిర్వహించాల్సిన వాటర్ ఫౌంటెంట్ మరియు ఇతర నిర్వహణ పనులలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని మరియు అంబేద్కర్ చౌరస్తా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ దార్నం అరుణ లక్ష్మీనారాయణ, మున్సిపల్ డిఈ వాని , ఏఈ నరసింహస్వామి , అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సంఘం అధ్యక్షులు కత్తెర దేవదాస్ మరియు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు..1
- జన్నారం మండలంలో అంబేద్కర్ జయంతిని అంబేద్కర్ వాదులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు భరత్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో పార్టీలు, సంఘాల నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జన్నారంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసే నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.1