logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాఖీ పౌర్ణమి: మూడు రాశుల దశ తిరగనుంది!రాఖీ పౌర్ణమి సందర్భంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. 🌕✨ రాఖీ పౌర్ణమి రోజున బుధాదిత్య, సమసప్తక, మహాపురుష రాజయోగాలు ఏర్పడనున్నాయి. వీటి ప్రభావంతో మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సింహ రాశి వారికి విదేశీ ప్రయాణ యోగం, ప్రతి పనిలో విజయం లభిస్తుంది. కర్కాటక రాశి వారికి సమాజంలో గుర్తింపు, ఆదాయం పెరుగుతుంది, వ్యాపారస్తులకు లాభాలు, స్థిరాస్తి కొనుగోలుకు మంచి సమయం. మేష రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరిగి, పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు అందుతాయి.

56 min ago
user_BAINA PURUSHOTHAM REDDY
BAINA PURUSHOTHAM REDDY
Nandikotkur, Nandyal•
56 min ago
c4d6350b-d857-47a9-b591-5fb85eb794db

రాఖీ పౌర్ణమి: మూడు రాశుల దశ తిరగనుంది!రాఖీ పౌర్ణమి సందర్భంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. 🌕✨ రాఖీ పౌర్ణమి రోజున బుధాదిత్య, సమసప్తక, మహాపురుష రాజయోగాలు ఏర్పడనున్నాయి. వీటి ప్రభావంతో మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సింహ రాశి వారికి విదేశీ ప్రయాణ యోగం, ప్రతి పనిలో విజయం లభిస్తుంది. కర్కాటక రాశి వారికి సమాజంలో గుర్తింపు, ఆదాయం పెరుగుతుంది, వ్యాపారస్తులకు లాభాలు, స్థిరాస్తి కొనుగోలుకు మంచి సమయం. మేష రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరిగి, పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు అందుతాయి.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రైతులు ఉధ్యాన పంటలపై మెగ్గు చూపాలి:రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు రైతులు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలపై మెగ్గు చూపాలని రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు పేర్కొన్నారు.బుధవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఉద్యాన పంటలను సందర్శించారు. అనంతరం రైతులు వేసిన అంతర పంట యాలక్కి అరటి, 30 రకాల విత్తనాలతో వేసిన పీఎండీస్, ఫారం పాండ్లు, బిందు సేద్యం పద్ధతి ద్వారా సాగు చేస్తున్న బంతిపూలు, గులాబి, మామిడి, అన్న యాపిల్ పంటలను పరిశీలించారు. అనంతరం రైతులతో పంటల సాగు, పద్ధతులు, మార్కెటింగ్ గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జిల్లా సూక్ష్మ సేద్య సాగు అధికారిణి విజయలక్ష్మి , నంద్యాల ఉద్యాన శాఖ అధికారి హరేంద్ర, రైతులు హుస్సేన్, హుస్సేన్ రెడ్డి,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
    1
    రైతులు ఉధ్యాన పంటలపై మెగ్గు చూపాలి:రాష్ట్ర  ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు
రైతులు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలపై మెగ్గు చూపాలని రాష్ట్ర  ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు పేర్కొన్నారు.బుధవారం మహానంది మండలం గాజులపల్లె  గ్రామంలోని ఉద్యాన పంటలను సందర్శించారు. అనంతరం రైతులు వేసిన  అంతర పంట యాలక్కి అరటి, 30 రకాల విత్తనాలతో వేసిన పీఎండీస్, ఫారం పాండ్లు, బిందు సేద్యం పద్ధతి ద్వారా సాగు చేస్తున్న బంతిపూలు, గులాబి, మామిడి, అన్న యాపిల్ పంటలను  పరిశీలించారు. అనంతరం రైతులతో పంటల సాగు,  పద్ధతులు,  మార్కెటింగ్ గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జిల్లా సూక్ష్మ సేద్య సాగు  అధికారిణి విజయలక్ష్మి , నంద్యాల ఉద్యాన శాఖ అధికారి హరేంద్ర,  రైతులు హుస్సేన్, హుస్సేన్ రెడ్డి,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కొరకు భూమి పూజ బండి ఆత్మకూరు మండలం జి. సీ. పాలెం గ్రామం నందు శ్రీవాణి ట్రస్ట్ ధ్వరా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కి దేవాలయం పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ దేవాలయం నిర్మాణానికి రూ. 40 లక్షలు, అనుమతులు మంజూరు చేయించినటువంటి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి గ్రామం తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో కంచెర్ల లింగారెడ్డి, సుబ్బయ్య, మోహనరావు, గోపాల్, వై రమణ, ప్రసాద్, వై శ్రీను, శివుడు, లక్ష్మీ రెడ్డి, సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అందరు పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.
    1
    శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కొరకు భూమి పూజ
బండి ఆత్మకూరు మండలం  జి. సీ. పాలెం గ్రామం నందు శ్రీవాణి ట్రస్ట్ ధ్వరా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కి దేవాలయం పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ దేవాలయం నిర్మాణానికి రూ. 40 లక్షలు, అనుమతులు మంజూరు చేయించినటువంటి  శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి గ్రామం తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో కంచెర్ల లింగారెడ్డి, సుబ్బయ్య, మోహనరావు, గోపాల్, వై రమణ, ప్రసాద్, వై శ్రీను, శివుడు, లక్ష్మీ రెడ్డి, సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అందరు పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • అలంపూర్: సంగమేశ్వర దేవాలయం కి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి ఏర్పాటు!! కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు!! పనుల ఆటంగానికి సహకరించాలని కోరిన సభ్యులు అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న సంగమేశ్వర దేవాలయానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి లేక వచ్చిన భక్తులు దేవాలయం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో స్పందించిన కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు దాదాపు 18 లక్షలతో ఆర్చి పనులు ప్రారంభించారు. ఈ పనుల ద్వారా భక్తులకు కొద్దిగా ఆటంకం కలగవచ్చని భక్తులు సహకరించాలని వారు కోరారు.
    1
    అలంపూర్: సంగమేశ్వర దేవాలయం కి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి ఏర్పాటు!! కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు!! పనుల ఆటంగానికి సహకరించాలని కోరిన సభ్యులు
అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న సంగమేశ్వర దేవాలయానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి లేక వచ్చిన భక్తులు దేవాలయం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో స్పందించిన కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు దాదాపు 18 లక్షలతో ఆర్చి పనులు ప్రారంభించారు. ఈ పనుల ద్వారా భక్తులకు కొద్దిగా ఆటంకం కలగవచ్చని భక్తులు సహకరించాలని వారు కోరారు.
    user_Zakeer
    Zakeer
    Grocer ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    22 hrs ago
  • వెలిగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా కృతజ్ఞతగా 1000 బైకులతో భారీ ర్యాలీ ఆగస్టు 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా కృతజ్ఞతగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మరియు కూటమి నేతల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో 1000 బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీకి నియోజకవర్గంలోని కూటమి శ్రేణులు,రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మొదటిగా మార్కాపురం పట్టణంలోని అల్లూరి పోలేరమ్మ గుడి వద్ద నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ బైక్ ర్యాలీ తర్లుపాడు రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, కోర్ట్ సెంటర్, కంభం బస్టాండ్, దోర్నాల బస్టాండ్, సప్తగిరి సెంటర్, తూర్పు వీధి మీదుగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కల అయిన వెలుగొండ ప్రాజెక్టు 1996వ సంవత్సరంలో నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారని అనంతరం పలు ఇబ్బందులను దాటుకొని ఈ నెల 31వ తేదీన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుపుకోవడం ఈ ప్రాంత ప్రజలకు పట్టరాని సంతోషంతో ఉన్నారని అన్నారు. వైసిపి నాయకులు నిర్వాసితులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని కానీ ఇప్పటికే 768 కోట్ల రూపాయలు నిర్వాసితులకు పరిహారంగా చెల్లించడం జరిగిందని ప్రతి నిర్వాసితునికి న్యాయం జరుగుతుందని ఈ విషయంలో ఎవరు ఎటువంటి అపోహలకు లోను కావద్దని ముంపు గ్రామాల ప్రజలు త్యాగదనులని వారి వలన నాలుగు లక్షల 60 వేల ఎకరాలకు సాగునీరు, 22 లక్షల మందికి త్రాగునీరు అందించడం జరుగుతుందని వారి త్యాగాలు వెలకట్టలేనివి అని అన్నారు. ఈనెల 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగును ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల చేసి జల హారతి కార్యక్రమంలో పాల్గొంటారని ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి, యువ నాయకులు కందుల విగ్నేష్ రెడ్డి , మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ , బిజెపి జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు , కూటమి నాయకులు కార్యకర్తలు వారి సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    వెలిగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా కృతజ్ఞతగా 1000 బైకులతో భారీ ర్యాలీ
ఆగస్టు 31వ తేదీన  రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా కృతజ్ఞతగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మరియు కూటమి నేతల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో 1000 బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ బైక్ ర్యాలీకి నియోజకవర్గంలోని కూటమి శ్రేణులు,రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
మొదటిగా మార్కాపురం పట్టణంలోని అల్లూరి పోలేరమ్మ గుడి వద్ద  నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ బైక్ ర్యాలీ  తర్లుపాడు రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, కోర్ట్ సెంటర్, కంభం బస్టాండ్, దోర్నాల బస్టాండ్, సప్తగిరి సెంటర్, తూర్పు వీధి మీదుగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి  మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కల అయిన వెలుగొండ ప్రాజెక్టు 1996వ సంవత్సరంలో నారా చంద్రబాబునాయుడు  శంకుస్థాపన చేశారని అనంతరం పలు ఇబ్బందులను దాటుకొని ఈ నెల 31వ తేదీన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుపుకోవడం  ఈ ప్రాంత ప్రజలకు పట్టరాని సంతోషంతో ఉన్నారని అన్నారు.
వైసిపి నాయకులు నిర్వాసితులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని కానీ ఇప్పటికే 768 కోట్ల రూపాయలు నిర్వాసితులకు పరిహారంగా చెల్లించడం జరిగిందని ప్రతి నిర్వాసితునికి న్యాయం జరుగుతుందని ఈ విషయంలో ఎవరు ఎటువంటి అపోహలకు లోను కావద్దని ముంపు గ్రామాల ప్రజలు త్యాగదనులని వారి వలన నాలుగు లక్షల 60 వేల ఎకరాలకు సాగునీరు, 22 లక్షల మందికి త్రాగునీరు అందించడం జరుగుతుందని వారి త్యాగాలు వెలకట్టలేనివి అని అన్నారు. ఈనెల 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగును ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల చేసి జల హారతి కార్యక్రమంలో పాల్గొంటారని ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి, యువ నాయకులు  కందుల విగ్నేష్ రెడ్డి , మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ , బిజెపి జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు , కూటమి నాయకులు కార్యకర్తలు వారి సంఖ్యలో పాల్గొన్నారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • హైవే భద్రతా లోపాలే ప్రమాదాలకు కారణం: జేసీ ప్రభాకర్ రెడ్డి కోదాడ వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తప్పిదమే కారణమని చెప్పడం సరికాదని అన్నారు.జాతీయ రహదారి నిర్వహణ లోపాలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపించారు.హైవేపై ఆగిపోయిన వాహనాలకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జాతీయ రహదారి నిర్వహణ సంస్థలదేనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఆగి ఉన్న వాహనాల చుట్టూ సరౌండింగ్ లైట్లు, హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయాలని సూచించారు.జాతీయ రహదారి కాంట్రాక్టర్లు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.హైవేపై కనీస భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.జాతీయ రహదారి అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.ప్రతి ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ బస్సు యజమానులనే తప్పుబట్టడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి నిర్వహణ లోపాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా హైవే భద్రతపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులపై సరైన భద్రతా సదుపాయాలు, ప్రమాణాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
    1
    హైవే భద్రతా లోపాలే ప్రమాదాలకు కారణం: జేసీ ప్రభాకర్ రెడ్డి
కోదాడ వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తప్పిదమే కారణమని చెప్పడం సరికాదని అన్నారు.జాతీయ రహదారి నిర్వహణ లోపాలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపించారు.హైవేపై ఆగిపోయిన వాహనాలకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జాతీయ రహదారి నిర్వహణ సంస్థలదేనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఆగి ఉన్న వాహనాల చుట్టూ సరౌండింగ్ లైట్లు, హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయాలని సూచించారు.జాతీయ రహదారి కాంట్రాక్టర్లు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.హైవేపై కనీస భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.జాతీయ రహదారి అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.ప్రతి ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ బస్సు యజమానులనే తప్పుబట్టడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి నిర్వహణ లోపాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా హైవే భద్రతపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులపై సరైన భద్రతా సదుపాయాలు, ప్రమాణాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
    user_Sanjeev
    Sanjeev
    Local News Reporter తాడిపత్రి, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు.
    1
    మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన

మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు.
మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన
మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • గాజుల పల్లెలో బంతిపూల సాగు.. లాభాలు బాగు..ఉద్యాన పంటలపై ఆసక్తి రైతులు వరి, ఇతర పంటల సాగుతో పాటు ఉద్యాన పంటలపై ఆసక్తి చూపుతున్నారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో రైతు హుస్సేన్ రెడ్డి బిందు సేద్యం, విడ్ మ్యాట్ ద్వారా నాలుగు ఎకరాల పొలంలో బంతి పూలు, మూడు ఎకరాల్లో గులాబీ పూలు సాగుచేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఎకరాకు సుమారు 4 టన్ను పూలు దిగుబడి వస్తాయని.. బంతి సాగు వల్ల మంచి ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు రైతు తెలిపారు.
    1
    గాజుల పల్లెలో  బంతిపూల సాగు.. లాభాలు బాగు..ఉద్యాన పంటలపై ఆసక్తి
రైతులు వరి, ఇతర పంటల సాగుతో పాటు ఉద్యాన పంటలపై ఆసక్తి చూపుతున్నారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో రైతు హుస్సేన్ రెడ్డి బిందు సేద్యం, విడ్ మ్యాట్ ద్వారా   నాలుగు ఎకరాల  పొలంలో బంతి పూలు, మూడు ఎకరాల్లో గులాబీ పూలు సాగుచేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఎకరాకు సుమారు 4 టన్ను పూలు దిగుబడి వస్తాయని.. బంతి సాగు వల్ల మంచి ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు రైతు తెలిపారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • అక్రమంగా బ్లాస్టింగ్ కు పాల్పడుతున్న భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీపై చర్యలు తీసుకోవాలి.. పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న రైతును పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామంలో భారత్ మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన క్రషర్ మిషన్‌ బ్లాస్టింగ్ వల్ల వచ్చే దూలి మరియు ప్రకంపనల వల్ల తన బోర్ ఎండిపోతుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన న్యాయం జరగలేదని రైతు యేసు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గద్వాల ప్రభుత్వ  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యేసును పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న గొంగల్ల రంజిత్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గట్టు మండలం సల్కాపురం గ్రామానికి చెందిన రైతు యేసు తన పట్టా భూమిలో సుమారు మూడు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. ఆయన వ్యవసాయ భూమికి సమీపంలో భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టర్ బ్లాస్టింగ్ కు పాల్పడటం తో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. క్రషర్ నిర్వహణతో పాటు తరచూ బ్లాస్టింగ్‌ చేపట్టడం వల్ల 100 మందికి పైగా రైతులు, గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని  అన్నాన్నారు. బ్లాస్టింగ్‌ సమయంలో రాళ్లు ఎగిరిపడటంతో పాటు భారీ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయని, దీంతో రైతుల పంట పొలాల్లో బోర్లు ప్రకంపన చెంది బోర్లు చెడిపోతున్నాయని , ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, రైతుల పంటలకు నష్టం కలిగించే విధంగా క్రషర్ నిర్వహణ కొనసాగించడం సరికాదని అన్నారు. రైతు సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భారత్ మాల ప్రాజెక్టు కంపెనీ క్రషర్ మిషన్‌ను నిలిపివేయడంతో పాటు బ్లాస్టింగ్‌ వల్ల ప్రజలకు, రైతులకు కలుగుతున్న ఇబ్బందులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.సమస్య పరిష్కారం కాకపోతే సల్కాపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని, అవసరమైతే రైతుల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులు, గ్రామ ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు బుచ్చిబాబు, కార్తీక్ విష్ణు, మీసాల కిష్టన్న, గోవిందు, మల్దకల్ విజయ్, రమేష్, రంగస్వామి, లక్ష్మన్న, స్వామి, సామెల్, ప్రేమ్‌రాజ్, చిన్న రాముడు, సుదర్శన్ నాయుడు, జమ్మన్న, గోపాల్, సుభాష్, దొడ్డన్న, భీమన్ గౌడ్, వీరేష్, రేనప్ప, శాంతిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
    2
    అక్రమంగా బ్లాస్టింగ్ కు పాల్పడుతున్న భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీపై చర్యలు తీసుకోవాలి..

పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న రైతును పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్.
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామంలో భారత్ మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన క్రషర్ మిషన్‌ బ్లాస్టింగ్ వల్ల వచ్చే దూలి మరియు ప్రకంపనల వల్ల తన బోర్ ఎండిపోతుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన న్యాయం జరగలేదని రైతు యేసు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గద్వాల ప్రభుత్వ  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యేసును పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న గొంగల్ల రంజిత్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గట్టు మండలం సల్కాపురం గ్రామానికి చెందిన రైతు యేసు తన పట్టా భూమిలో సుమారు మూడు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. ఆయన వ్యవసాయ భూమికి సమీపంలో భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టర్ బ్లాస్టింగ్ కు పాల్పడటం తో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. క్రషర్ నిర్వహణతో పాటు తరచూ బ్లాస్టింగ్‌ చేపట్టడం వల్ల 100 మందికి పైగా రైతులు, గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని  అన్నాన్నారు. బ్లాస్టింగ్‌ సమయంలో రాళ్లు ఎగిరిపడటంతో పాటు భారీ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయని, దీంతో రైతుల పంట పొలాల్లో బోర్లు ప్రకంపన చెంది బోర్లు చెడిపోతున్నాయని , ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, రైతుల పంటలకు నష్టం కలిగించే విధంగా క్రషర్ నిర్వహణ కొనసాగించడం సరికాదని అన్నారు.
రైతు సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భారత్ మాల ప్రాజెక్టు కంపెనీ క్రషర్ మిషన్‌ను నిలిపివేయడంతో పాటు బ్లాస్టింగ్‌ వల్ల ప్రజలకు, రైతులకు కలుగుతున్న ఇబ్బందులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.సమస్య పరిష్కారం కాకపోతే సల్కాపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని, అవసరమైతే రైతుల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులు, గ్రామ ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు బుచ్చిబాబు, కార్తీక్ విష్ణు, మీసాల కిష్టన్న, గోవిందు, మల్దకల్ విజయ్, రమేష్, రంగస్వామి, లక్ష్మన్న, స్వామి, సామెల్, ప్రేమ్‌రాజ్, చిన్న రాముడు, సుదర్శన్ నాయుడు, జమ్మన్న, గోపాల్, సుభాష్, దొడ్డన్న, భీమన్ గౌడ్, వీరేష్, రేనప్ప, శాంతిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    29 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.