logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో మేడ్చల్ క్రీడాకారుల మెరుపులు _ పలు విభాగాల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించి జిల్లా ఖ్యాతిని చాటిన యువ అథ్లెట్లు హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం లో మే 10న నిర్వహించిన 3వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ జంప్స్, త్రోస్ & 400 మీటర్ల ఛాంపియన్‌షిప్‌లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా యువ అథ్లెట్లు ప్రతిభా పాటవాలతో ఆకట్టుకున్నారు. అండర్-16, అండర్-18, అండర్-20 బాలురు, బాలికలు, పురుషులు, మహిళల విభాగాల్లో జరిగిన ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న జిల్లా క్రీడాకారులు పలు పతకాలు సాధించి జిల్లా కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటారు.అండర్-16 విభాగంలో జి. అభినయశ్రీ లాంగ్ జంప్‌లో 3.80 మీటర్లు దూకి స్వర్ణ పతకం సాధించింది. అదే సమయంలో హైజంప్‌లో 1.20 మీటర్లు దాటి రజత పతకం అందుకుంది.మహిళల 400 మీటర్ల పరుగుపందెంలో పి. సరిత 1.17.27 సెకన్ల టైమింగ్‌తో అద్భుత ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.అండర్-18 విభాగంలో సిహెచ్. గణేష్ హైజంప్‌లో 1.45 మీటర్లు దాటి ఐదో స్థానంలో నిలవగా, షాట్‌పుట్ పోటీల్లో ఏడో స్థానం సాధించాడు. మరోవైపు మహిళల లాంగ్ జంప్ విభాగంలో వి. ఢిల్లీశ్వరి 3.35 మీటర్లు దూకి నాలుగో స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంది.కోచ్ తిరుమల రావు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న ఈ క్రీడాకారులు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో భాగంగా కఠిన సాధన చేసి ఈ విజయాలను అందుకున్నారు. యువ అథ్లెట్ల ప్రతిభను అభినందిస్తూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ టి వినయ్ కృష్ణ రెడ్డి, డీవైఎస్‌వో దామోదర్ రెడ్డి, స్పోర్ట్స్ ఇన్‌స్పెక్టర్ విఘ్నేష్ యాదవ్ కోచ్ తిరుమల రావు మరియు క్రీడాకారులను ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు.

1 hr ago
user_Suresh Sagar
Suresh Sagar
కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
1 hr ago

రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో మేడ్చల్ క్రీడాకారుల మెరుపులు _ పలు విభాగాల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించి జిల్లా ఖ్యాతిని చాటిన యువ అథ్లెట్లు హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం లో మే 10న నిర్వహించిన 3వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ జంప్స్, త్రోస్ & 400 మీటర్ల ఛాంపియన్‌షిప్‌లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా యువ అథ్లెట్లు ప్రతిభా పాటవాలతో ఆకట్టుకున్నారు. అండర్-16, అండర్-18, అండర్-20 బాలురు, బాలికలు, పురుషులు, మహిళల విభాగాల్లో జరిగిన ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న జిల్లా క్రీడాకారులు పలు పతకాలు సాధించి జిల్లా కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటారు.అండర్-16 విభాగంలో జి. అభినయశ్రీ లాంగ్ జంప్‌లో 3.80 మీటర్లు దూకి స్వర్ణ పతకం సాధించింది. అదే సమయంలో హైజంప్‌లో 1.20 మీటర్లు దాటి రజత పతకం అందుకుంది.మహిళల 400 మీటర్ల పరుగుపందెంలో పి. సరిత 1.17.27 సెకన్ల టైమింగ్‌తో అద్భుత ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.అండర్-18 విభాగంలో సిహెచ్. గణేష్ హైజంప్‌లో 1.45 మీటర్లు దాటి ఐదో స్థానంలో నిలవగా, షాట్‌పుట్ పోటీల్లో ఏడో స్థానం సాధించాడు. మరోవైపు మహిళల లాంగ్ జంప్ విభాగంలో వి. ఢిల్లీశ్వరి 3.35 మీటర్లు దూకి నాలుగో స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంది.కోచ్ తిరుమల రావు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న ఈ క్రీడాకారులు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో భాగంగా కఠిన సాధన చేసి ఈ విజయాలను అందుకున్నారు. యువ అథ్లెట్ల ప్రతిభను అభినందిస్తూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ టి వినయ్ కృష్ణ రెడ్డి, డీవైఎస్‌వో దామోదర్ రెడ్డి, స్పోర్ట్స్ ఇన్‌స్పెక్టర్ విఘ్నేష్ యాదవ్ కోచ్ తిరుమల రావు మరియు క్రీడాకారులను ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు.

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
    1
    తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    21 hrs ago
  • ప్రొటోకాల్ పాటించకుంటే ఆందోళనలు: టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎస్కే హైమద్. ​మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతలు ప్రొటోకాల్‌ను బేఖాతరు చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకుడు ఎస్కే హైమద్ మండిపడ్డారు. వార్డుల పర్యటనలో కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను గౌరవించాల్సిన బాధ్యత అధికారులదేనని, తీరు మార్చుకోకపోతే మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.
    1
    ప్రొటోకాల్ పాటించకుంటే ఆందోళనలు: 
టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎస్కే హైమద్.
​మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతలు ప్రొటోకాల్‌ను బేఖాతరు చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకుడు ఎస్కే హైమద్ మండిపడ్డారు. వార్డుల పర్యటనలో కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను గౌరవించాల్సిన బాధ్యత అధికారులదేనని, తీరు మార్చుకోకపోతే మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.
    user_తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    Local News Reporter Ramayampet, Medak•
    2 hrs ago
  • ఖచ్చితమైన గణాంకాల రూపకల్పన జనగణన కీలకం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకం కలెక్టర్ జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వామ్యులు కావాలి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి . రాందాస్ చౌరస్తా వరకు మారథాన్ వాక్ కార్యక్రమాన్ని జెండాతో ప్రారంభించిన కలెక్టర్ జనగణన ట్యాబ్లు ఆవిష్కరించిన కలెక్టర్ మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జనగణన 2027లో భాగంగా సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు మొదటి దశ జనగణనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి మారథాన్ వాక్ కార్యక్రమాన్ని పాల్గొని ఇంటింటి సందర్శనతో అవగాహన కల్పించారు. ప్రజల సహకారంతో కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం జనగణన ట్యాబ్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... చాలా సంవత్సరాల తర్వాత భారతదేశంలో జనగణన చేయడం జరుగుతుందని, 2021లో జనగణన జరగాల్సింది ఉంది కానీ కోవిడ్ కారణంగా జరగలేదని, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి చేస్తున్న జనగణన ఇది 16వసారి, మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇది మొదటి జనగణన అని, మొదటి సారి డిజిటల్ విధానంలో ఈ జనగణన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వీయగణన అనే విధానం తొలిసారి ప్రవేశపెట్టి జనగణన ప్రక్రియలో నూతన అధ్యాయానికి నాంది పలకడం జరిగిందని పేర్కొన్నారు. మీ కుటుంబ వివరాలను స్వయంగా మీరే నమోదు చేసుకునే చేసుకునే అవకాశం స్వీయ గణన ద్వారా కల్పించారని, ఇందులో 34 ప్రశ్నలు ఉన్నాయని, కేవలం ఐదు నిమిషాల్లో స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. సోమవారం నుండి జనగణన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరించడం జరుగుతుందని అన్నారు. అనుభవజ్ఞులైన సిబ్బందిని జనగణన సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లుగా నియమించి వారికి అవసరమైన శిక్షణ అందించడం జరిగిందని వెల్లడించారు. వారికి ప్రత్యేక ఐడీ కార్డులు కూడా జారీ చేశామని, ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించాలని కోరారు. జనగణన పేరుతో ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని, అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. జనగణనలో పాల్గొనే సిబ్బందికి జారీ చేసిన గుర్తింపు కార్డుల మీద క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే అధికారిక వెబ్ సైట్ లో పొంది ఉంచిన వారి పూర్తి వివరాలు వస్తాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. జనగణన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, జనగణనలో భాగస్వామ్యులు అయ్యే బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉంటుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతి రాజు, మెదక్ ఆర్డీవో రమాదేవి, డీఎఫ్ఓ జోజి, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత జిల్లా అధికారులు వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు క్రీడాభిమానులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
    1
    ఖచ్చితమైన గణాంకాల రూపకల్పన జనగణన కీలకం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 
సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన  కీలకం 
కలెక్టర్
జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వామ్యులు కావాలి
పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి . రాందాస్ చౌరస్తా వరకు మారథాన్ వాక్ కార్యక్రమాన్ని జెండాతో ప్రారంభించిన కలెక్టర్
జనగణన ట్యాబ్లు ఆవిష్కరించిన కలెక్టర్
మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
జనగణన 2027లో భాగంగా సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.
సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్   వరకు  మొదటి దశ జనగణనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో
కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి మారథాన్ వాక్ కార్యక్రమాన్ని పాల్గొని ఇంటింటి సందర్శనతో అవగాహన కల్పించారు. ప్రజల సహకారంతో కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం జనగణన ట్యాబ్లు ఆవిష్కరించారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...
చాలా సంవత్సరాల తర్వాత భారతదేశంలో జనగణన చేయడం జరుగుతుందని, 2021లో జనగణన జరగాల్సింది ఉంది కానీ కోవిడ్ కారణంగా జరగలేదని, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి చేస్తున్న జనగణన ఇది 16వసారి, మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇది మొదటి జనగణన అని, మొదటి సారి డిజిటల్ విధానంలో ఈ జనగణన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.   స్వీయగణన అనే విధానం తొలిసారి ప్రవేశపెట్టి జనగణన ప్రక్రియలో నూతన అధ్యాయానికి నాంది పలకడం జరిగిందని పేర్కొన్నారు. మీ కుటుంబ వివరాలను స్వయంగా మీరే నమోదు చేసుకునే చేసుకునే అవకాశం స్వీయ గణన ద్వారా కల్పించారని, ఇందులో 34 ప్రశ్నలు ఉన్నాయని, కేవలం ఐదు నిమిషాల్లో స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. సోమవారం నుండి జనగణన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరించడం జరుగుతుందని అన్నారు. అనుభవజ్ఞులైన సిబ్బందిని జనగణన సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లుగా నియమించి వారికి అవసరమైన శిక్షణ అందించడం జరిగిందని వెల్లడించారు. వారికి ప్రత్యేక ఐడీ కార్డులు కూడా జారీ చేశామని, ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించాలని కోరారు. జనగణన పేరుతో ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని, అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. జనగణనలో పాల్గొనే సిబ్బందికి జారీ చేసిన గుర్తింపు కార్డుల మీద క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే అధికారిక వెబ్ సైట్ లో పొంది ఉంచిన వారి పూర్తి వివరాలు వస్తాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.  జనగణన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, జనగణనలో భాగస్వామ్యులు అయ్యే బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉంటుందని గుర్తుచేశారు. 
ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతి రాజు, మెదక్ ఆర్డీవో రమాదేవి, డీఎఫ్ఓ జోజి, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత జిల్లా అధికారులు  వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు క్రీడాభిమానులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    2 hrs ago
  • బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం: సుభాషిని నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన & పట్టు పరిశ్రమల శాఖ అధికారి సుభాషిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోటలో దిగుబడి తక్కువగా వచ్చి నష్టపోతున్నామని అనేక మంది రైతులు చెబుతున్నారని, భూమి సారం కోల్పోవడం ద్వారా దిగుబడి తగ్గుతుందని అధికారులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో బత్తాయికి రేటు ఉందని తెలిపారు.
    1
    బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం: సుభాషిని
నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన & పట్టు పరిశ్రమల శాఖ అధికారి సుభాషిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోటలో దిగుబడి తక్కువగా వచ్చి నష్టపోతున్నామని అనేక మంది రైతులు చెబుతున్నారని, భూమి సారం కోల్పోవడం ద్వారా దిగుబడి తగ్గుతుందని అధికారులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో బత్తాయికి రేటు ఉందని తెలిపారు.
    user_T Shankar Public News Reporter Nalgonda
    T Shankar Public News Reporter Nalgonda
    రిపోర్టర్ Nalgonda, Telangana•
    4 hrs ago
  • మన *యాడారం* గ్రామ *ముదిరాజుల* కులదేవత *శ్రీ శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి* దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తరతరాలుగా ముదిరాజుల ఆరాధ్య దైవంగా వెలసిన పెద్దమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, లగ్గంలా గ్రామమంతా ఒక్కటై జాతరను ఘనంగా నిర్వహించడం మా సంప్రదాయం, మా గౌరవం. *ముదిరాజ్ సదర్ సంఘం* ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల దాతలు, అభిమానులు కూడా సహకారం అందించడం అభినందనీయం. వారి సేవలను గుర్తిస్తూ పెద్దమ్మ తల్లి విగ్రహ చిత్రపటాలను బహుమతిగా అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందకరం. అమ్మవారి కటాక్షంతో గ్రామంలో సుఖశాంతులు, ఐకమత్యం, ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ… *జై వనదుర్గ పెద్దమ్మ తల్లి మన *యాడారం* గ్రామ *ముదిరాజుల* కులదేవత *శ్రీ శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి* దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తరతరాలుగా ముదిరాజుల ఆరాధ్య దైవంగా వెలసిన పెద్దమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, లగ్గంలా గ్రామమంతా ఒక్కటై జాతరను ఘనంగా నిర్వహించడం మా సంప్రదాయం, మా గౌరవం. *ముదిరాజ్ సదర్ సంఘం* ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల దాతలు, అభిమానులు కూడా సహకారం అందించడం అభినందనీయం. వారి సేవలను గుర్తిస్తూ పెద్దమ్మ తల్లి విగ్రహ చిత్రపటాలను బహుమతిగా అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందకరం. అమ్మవారి కటాక్షంతో గ్రామంలో సుఖశాంతులు, ఐకమత్యం, ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ… *జై వనదుర్గ పెద్దమ్మ తల్లి*
    1
    మన *యాడారం* గ్రామ *ముదిరాజుల* కులదేవత *శ్రీ శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి* దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.
తరతరాలుగా ముదిరాజుల ఆరాధ్య దైవంగా వెలసిన పెద్దమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, లగ్గంలా గ్రామమంతా ఒక్కటై జాతరను ఘనంగా నిర్వహించడం మా సంప్రదాయం, మా గౌరవం.
*ముదిరాజ్ సదర్ సంఘం* ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల దాతలు, అభిమానులు కూడా సహకారం అందించడం అభినందనీయం.
వారి సేవలను గుర్తిస్తూ పెద్దమ్మ తల్లి విగ్రహ చిత్రపటాలను బహుమతిగా అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందకరం.
అమ్మవారి కటాక్షంతో గ్రామంలో సుఖశాంతులు, ఐకమత్యం, ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ…
*జై వనదుర్గ పెద్దమ్మ తల్లి
మన *యాడారం* గ్రామ *ముదిరాజుల* కులదేవత *శ్రీ శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి* దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.
తరతరాలుగా ముదిరాజుల ఆరాధ్య దైవంగా వెలసిన పెద్దమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, లగ్గంలా గ్రామమంతా ఒక్కటై జాతరను ఘనంగా నిర్వహించడం మా సంప్రదాయం, మా గౌరవం.
*ముదిరాజ్ సదర్ సంఘం* ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల దాతలు, అభిమానులు కూడా సహకారం అందించడం అభినందనీయం.
వారి సేవలను గుర్తిస్తూ పెద్దమ్మ తల్లి విగ్రహ చిత్రపటాలను బహుమతిగా అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందకరం.
అమ్మవారి కటాక్షంతో గ్రామంలో సుఖశాంతులు, ఐకమత్యం, ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ…
*జై వనదుర్గ పెద్దమ్మ తల్లి*
    user_Korivi Narsimlu
    Korivi Narsimlu
    బీబీపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కనిపించని స్పీడ్ బ్రేక‌ర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి అస్సలు కనిపించక అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కనిపించని స్పీడ్ బ్రేక‌ర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి అస్సలు కనిపించక అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    1 day ago
  • తెలంగాణలోని మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్లు నిరసన చేపట్టారు. బ్రీత్ ఎనలైజర్ యంత్రం మద్యం తాగకున్నా 56 పైగా రీడింగ్ చూపిస్తుండటంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆర్టీసీ సేవలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
    1
    తెలంగాణలోని మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్లు నిరసన చేపట్టారు. బ్రీత్ ఎనలైజర్ యంత్రం మద్యం తాగకున్నా 56 పైగా రీడింగ్ చూపిస్తుండటంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆర్టీసీ సేవలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    10 hrs ago
  • హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలి - కలెక్టర్ ప్రతిమా సింగ్. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. 14-15 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందేలా చూడాలన్నారు. మే 13 నుండి జరిగే ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని, ఉపాధి హామీలో 100 రోజుల పని కల్పించాలని ఆదేశించారు. నేటి నుంచి ప్రారంభమైన జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.
    1
    హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలి - కలెక్టర్ ప్రతిమా సింగ్.
కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. 14-15 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందేలా చూడాలన్నారు. మే 13 నుండి జరిగే ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని, ఉపాధి హామీలో 100 రోజుల పని కల్పించాలని ఆదేశించారు. నేటి నుంచి ప్రారంభమైన జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.
    user_తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    Local News Reporter Ramayampet, Medak•
    2 hrs ago
  • వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి జిల్లాలో జొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి సిపిఎం మెదక్ జిల్లా కమిటీ డిమాండ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి,అదనపు కలెక్టర్ నగేశ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు అడివయ్య మాట్లాడుతూ మెదక్ జిల్లా లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయనీ, రైతులు ఏదో ఒకచోట రోజు ఆందోళన చేస్తున్నారన్నారు.వాతావరణం లో మార్పులు రావడం వలస వర్షం వచ్చే పరిస్థితిని చూసి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. అక్కడికక్కడ చిరు జల్లుళ్లతో దాన్యం తడిపించిపోతుందనీ, అకస్మాత్తుగా వర్షాలు వస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారనీ ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలలో నిబంధనలు పాటించడం లేదన్నారు.తూఖం 41.6 కేజీలు పెట్టాల్సి ఉండగా 42 నుంచి 44 కేజీలు తూకం వేయడంతో రైతులు నష్టపోతున్నారన్నారు.తేమశాతం 17 వరకు కొనుగోలు చేయాల్సి ఉండగా 13 నుండి 14 వరకు ఉంటేనే కొనుగోలు చేస్తున్నారనీ మండి పడ్డారు.రైస్ మిల్లులు సకాలంలో అన్లోడింగ్ చేయక పోవడం తో దాన్యం మిల్లుకు చేరిన తర్వాత తేమ తూకం విషయాలలో మిల్లర్లు దరఖాస్తులు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు టెంటు మంచినీటి సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. పరిస్థితుల రిత్య జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలు సకాలంలో అందించాలని మిల్లుల వద్ద వెంట వెంటనే అన్లోడింగ్ చేయాలని తూకంలో తేడాలు లేకుండా తేమశాతం తేడాలను పిల్లర్లు వేధించకుండా ఆపాలని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు నీడ కోసం దీంట్లో మంచినీరు సౌకర్యం కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.మల్లేశం మాట్లాడుతూ భవిష్యత్తులో వడ్లు ఆరబోయేసే తమకు శాశ్వత స్థలాల కేటాయింపు చేయాలని రాబోవు సీజన్స్ కు ముందుగానే వారి ధాన్యం వెంటనే అంచనా వేసి గోనె సంచులు లారీలు సరిపడా ముందస్తుగా ప్రణాళిక వేయాలి అని అన్నారు కొనుగోలు కేంద్రానికి దగ్గర్లోని రైస్ మిల్ లుకు దాన్యం పంపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ మెదక్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పద్మ గారు,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే మల్లేశం, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గౌరయ్య , అజయ్,పార్టీ సభ్యులు దుర్గ యాదగిరి వెంకట్ నరేందర్ నహీం ప్రవీణ్ ప్రశాంత్, లచ్చ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
    1
    వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి జిల్లాలో జొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి 
సిపిఎం మెదక్ జిల్లా కమిటీ డిమాండ్   
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి,అదనపు కలెక్టర్ నగేశ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు అడివయ్య మాట్లాడుతూ 
మెదక్ జిల్లా లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయనీ, రైతులు ఏదో ఒకచోట రోజు ఆందోళన చేస్తున్నారన్నారు.వాతావరణం లో మార్పులు రావడం వలస వర్షం వచ్చే పరిస్థితిని చూసి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. అక్కడికక్కడ చిరు జల్లుళ్లతో దాన్యం తడిపించిపోతుందనీ, అకస్మాత్తుగా వర్షాలు వస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారనీ ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాలలో నిబంధనలు పాటించడం లేదన్నారు.తూఖం 41.6 కేజీలు పెట్టాల్సి ఉండగా 42 నుంచి 44 కేజీలు తూకం వేయడంతో రైతులు నష్టపోతున్నారన్నారు.తేమశాతం 17 వరకు కొనుగోలు చేయాల్సి ఉండగా 13 నుండి 14 వరకు ఉంటేనే కొనుగోలు చేస్తున్నారనీ మండి పడ్డారు.రైస్ మిల్లులు సకాలంలో అన్లోడింగ్ చేయక పోవడం తో  దాన్యం మిల్లుకు చేరిన తర్వాత తేమ తూకం విషయాలలో మిల్లర్లు దరఖాస్తులు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు టెంటు మంచినీటి సౌకర్యాలు కల్పించడం లేదన్నారు.
పరిస్థితుల రిత్య జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలు సకాలంలో అందించాలని మిల్లుల వద్ద వెంట వెంటనే అన్లోడింగ్ చేయాలని తూకంలో తేడాలు లేకుండా తేమశాతం తేడాలను పిల్లర్లు వేధించకుండా ఆపాలని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు నీడ కోసం దీంట్లో మంచినీరు సౌకర్యం కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.మల్లేశం మాట్లాడుతూ భవిష్యత్తులో వడ్లు ఆరబోయేసే తమకు శాశ్వత స్థలాల కేటాయింపు చేయాలని రాబోవు సీజన్స్ కు ముందుగానే వారి ధాన్యం వెంటనే అంచనా వేసి గోనె సంచులు లారీలు సరిపడా ముందస్తుగా ప్రణాళిక వేయాలి అని అన్నారు కొనుగోలు కేంద్రానికి దగ్గర్లోని రైస్ మిల్ లుకు దాన్యం పంపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ మెదక్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పద్మ గారు,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే మల్లేశం, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గౌరయ్య , అజయ్,పార్టీ సభ్యులు దుర్గ యాదగిరి వెంకట్ నరేందర్ నహీం ప్రవీణ్ ప్రశాంత్, లచ్చ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.