Shuru
Apke Nagar Ki App…
బిజినపల్లి మండలం పాలెం లో సమాజ రక్షణకు విద్యార్థులు నడుం బిగించాలి: ఏబీవీపీ “నీవు నాకు రక్ష.. నేను నీకు రక్ష.. మనమంతా మన దేశానికి రక్ష” అనే భావనతో విద్యార్థులు ముందుకు సాగాలని ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఉద్బోధించారు. ఏబీవీపీ పాలెం శాఖ నేతృత్వంలో పాలెం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో రాఖీ పండుగ ముందస్తు వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. రాఖీ బంధం కేవలం రక్తసంబంధీకులకే పరిమితం కాకుండా పరస్పర రక్షణ, సేవాభావానికి ప్రతీకగా నిలవాలన్నారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, దేశభక్తి అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు జీవన్ యాదవ్, విష్ణు నాయుడు, ఆకాష్, జహంగీర్, వెంకటేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
NAVADEEP
బిజినపల్లి మండలం పాలెం లో సమాజ రక్షణకు విద్యార్థులు నడుం బిగించాలి: ఏబీవీపీ “నీవు నాకు రక్ష.. నేను నీకు రక్ష.. మనమంతా మన దేశానికి రక్ష” అనే భావనతో విద్యార్థులు ముందుకు సాగాలని ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఉద్బోధించారు. ఏబీవీపీ పాలెం శాఖ నేతృత్వంలో పాలెం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో రాఖీ పండుగ ముందస్తు వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. రాఖీ బంధం కేవలం రక్తసంబంధీకులకే పరిమితం కాకుండా పరస్పర రక్షణ, సేవాభావానికి ప్రతీకగా నిలవాలన్నారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, దేశభక్తి అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు జీవన్ యాదవ్, విష్ణు నాయుడు, ఆకాష్, జహంగీర్, వెంకటేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 1500 విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, యువ క్రీడాకారులతో ఆన్లైన్ ద్వారా ముచ్చటించారు. యువత ప్రత్యేక పథకాలు సాధించడమే ప్రధాన నరేంద్ర మోడీ లక్ష్యం అని పేర్కొన్నారు 20 30 కామన్వెల్స్ గేమ్స్ కు ఆదిపత్యం ఇవ్వనుంది అలాగే 2036 ఒలంపిక్స్ ను భారత్ నిర్వహించేలా ఇతర దేశాలతో చర్చలు జరుపుతూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యాసంస్థల నిర్వాహకులు చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.4
- రాంకీ–కార్మికుల వివాదంతో ఉప్పల్‌లో పారిశుధ్య సంక్షోభం రోడ్లపైనే చెత్త.. అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో చెత్త సేకరణ బాధ్యతల విషయంలో రాంకీ సంస్థకు, గతంలో చెత్త సేకరణలో పనిచేసిన రిక్షా కార్మికులకు మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చెత్త సేకరణ బాధ్యతలను రాంకీ వంటి పెద్ద సంస్థకు అప్పగించడం వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని రిక్షా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ప్రభావం ఉప్పల్ సర్కిల్ పారిశుధ్యంపై పడినట్లు కనిపిస్తోంది. చెత్త తరలించే ఆటో కార్మికులు చెత్తను రహదారుల పక్కనే వదిలివెళుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. ఉప్పల్ దేవేంద్రనగర్ ప్రధాన రహదారి మీదుగా వెళుతున్న స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను గమనించి విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిపై తీవ్రంగా నిలదీశారు1
- తీన్మార్ మల్లన్న సర్జికల్ స్ట్రైక్ లో మేడ్చల్ మల్కాజ్గిరి గురించి ప్రస్తావన1
- రైతులు ఉధ్యాన పంటలపై మెగ్గు చూపాలి:రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు రైతులు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలపై మెగ్గు చూపాలని రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు పేర్కొన్నారు.బుధవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఉద్యాన పంటలను సందర్శించారు. అనంతరం రైతులు వేసిన అంతర పంట యాలక్కి అరటి, 30 రకాల విత్తనాలతో వేసిన పీఎండీస్, ఫారం పాండ్లు, బిందు సేద్యం పద్ధతి ద్వారా సాగు చేస్తున్న బంతిపూలు, గులాబి, మామిడి, అన్న యాపిల్ పంటలను పరిశీలించారు. అనంతరం రైతులతో పంటల సాగు, పద్ధతులు, మార్కెటింగ్ గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జిల్లా సూక్ష్మ సేద్య సాగు అధికారిణి విజయలక్ష్మి , నంద్యాల ఉద్యాన శాఖ అధికారి హరేంద్ర, రైతులు హుస్సేన్, హుస్సేన్ రెడ్డి,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.1
- శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- చౌటుప్పల్ లో భారీగా నిలిచిన ట్రాఫిక్.. వాహనదారుల ఇబ్బందులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల పొడవున నిలిచిన వాహనాలు, మధ్యలోనే ఇరుక్కుపోయిన రెండు అంబులెన్సులు .. అంబులెన్సులు కు సైతం దొరకని దారి. ..1
- 22ఏ భూ సమస్యలపై బీజేపీ ఆందోళన ఉధృతం చేస్తాం: ఎంపీ ఈటల రాజేందర్ మల్కాజ్‌గిరి: 22ఏ కింద నమోదు చేసిన భూ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. 22ఏ భూ సమస్యల కారణంగా అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే బాధితులకు అండగా బీజేపీ పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపడుతుందని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.1
- గాజుల పల్లెలో బంతిపూల సాగు.. లాభాలు బాగు..ఉద్యాన పంటలపై ఆసక్తి రైతులు వరి, ఇతర పంటల సాగుతో పాటు ఉద్యాన పంటలపై ఆసక్తి చూపుతున్నారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో రైతు హుస్సేన్ రెడ్డి బిందు సేద్యం, విడ్ మ్యాట్ ద్వారా నాలుగు ఎకరాల పొలంలో బంతి పూలు, మూడు ఎకరాల్లో గులాబీ పూలు సాగుచేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఎకరాకు సుమారు 4 టన్ను పూలు దిగుబడి వస్తాయని.. బంతి సాగు వల్ల మంచి ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు రైతు తెలిపారు.1
- *కోర్టు పరిధిలో భూమి..! కబ్జాలోకి ఎలా వచ్చింది.?* *ఈదులనాగులపల్లిలో సర్వే నంబర్లు 134, 135పై రైతుల ఆందోళన* *తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం చేస్తారంటున్న రైతులు* *కోర్టు పరిధిలో ఉన్న భూములలొ జేసీబీలతో రోడ్డు పనులు ఎలా చేస్తారు* *రియల్ వ్యాపారుల పనులను అడ్డుకున్న గ్రామస్తులు* *అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రైతుల ప్రశ్న* *తహసీల్దార్‌కు ఫిర్యాదు.. కలెక్టర్‌ను కలవనున్న గ్రామస్తులు* *భూముల రక్షణ కొరకు కార్యాచరణ కమిటీ ఏర్పాటు* *రోడ్డు పనులకు అనుమతులు ఎవరు అనుమతులు ఇచ్చారు* *కోర్టు వివాదం నడుస్తుండగానే పనులెలా సాగిస్తారు* తమ భూములు తమకు దక్కేవరకు పోరాటం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామ రైతులు స్పష్టం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం, ఈదులనాగులపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 134, 135లోని భూములపై వివాదం కొనసాగుతోంది. తమ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థాన పరిధిలో ఉండగానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడం రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు చేపట్టేందుకు అనుమతి ఎవరు ఇచ్చారు? అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారులు జేసీబీలతో భూమి చుట్టూ మట్టి రోడ్డు వేస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అప్పటికే కొంత దూరం వరకు మట్టి రోడ్డు వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కోర్టులో వివాదం కొనసాగుతున్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు, రోడ్డు పనులు, ఇతర మార్పులు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రైతులు ఆర్‌సీ పురం తహసీల్దార్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఆమె ఇది తన పరిధిలోకి రాదని తప్పించుకున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు జరుగుతున్న అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, భూముల రికార్డులు, కోర్టు కేసు వివరాలను పరిశీలించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. వివాదాస్పద భూములను పరిరక్షించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యను జిల్లా స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. భూముల పరి రక్షణ కోసం కార్యచరణ కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి పోరాట కార్యక్రమాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్న భూమిలో రియల్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడంపై అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోర్టు పరిధిలోని భూములలో రోడ్డు పనులు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? రికార్డులను పరిశీలించకుండానే పనులు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమి హద్దులు, రికార్డులు, కోర్టు కేసు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే తమ భూమి తమకు దక్కేవరకు పోరాటం తీవ్ర తరం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.3