Shuru
Apke Nagar Ki App…
వినాయక ఉత్సవాలలో DJ లకు అనుమతి లేదు : ఎస్సై జగన్ మోహన్ వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో బండి ఆత్మకూరు మండలంలోని వినాయక విగ్రహ నిర్వాహకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీసులు మాట్లాడుతూ, ఉత్సవాల సమయంలో DJ శబ్దాలకు ఎలాంటి అనుమతి లేదని నిర్వాహకులకు వివరించారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సౌండ్ సిస్టమ్స్ వాడాలని సూచించారు. అలాగే వినాయక మండపాల ఏర్పాటు, వేడుకల నిర్వహణకు ముందుగా బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నుండి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, అందరూ సహకరించి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.
Naga kanth
వినాయక ఉత్సవాలలో DJ లకు అనుమతి లేదు : ఎస్సై జగన్ మోహన్ వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో బండి ఆత్మకూరు మండలంలోని వినాయక విగ్రహ నిర్వాహకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీసులు మాట్లాడుతూ, ఉత్సవాల సమయంలో DJ శబ్దాలకు ఎలాంటి అనుమతి లేదని నిర్వాహకులకు వివరించారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సౌండ్ సిస్టమ్స్ వాడాలని సూచించారు. అలాగే వినాయక మండపాల ఏర్పాటు, వేడుకల నిర్వహణకు ముందుగా బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నుండి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, అందరూ సహకరించి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- మంగనూరులో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు బిజినేపల్లి: మండలంలోని మంగనూరు గ్రామంలో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ఒకరికొకరు రక్షణ సూత్రాలు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ‘నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష, మనమంతా దేశానికి రక్ష’ అంటూ విద్యార్థులు దేశభక్తిని చాటారు. అనంతరం మహాత్మా పూలే, అంబేద్కర్‌లకు జైకొడుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కొండయ్య, సభ్యులు వెంకటయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు1
- ఆరాధన మహోత్సవములు 29, 30, 31 నాడు జరుగును. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ | భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ॥ జోగుళాంబ గద్వాల జిల్లా, తెలంగాణ జగద్గురు శ్రీమన్ మధ్వాచార్య మూల మహా సంస్థానము మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి 355 వ ఆరాధన మహోత్సవములు శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి పరమపూజ్య 1008 వ శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీ పాదులవారి ఆజ్ఞానుసారముగా సమస్త భగవద్భక్తులకు ఆహ్వానం. స్థానిక శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠం, షేరేల్లివీధి యందుశ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవములు ఈ నెల 29, 30, 31. తారీకు వరకు విశేషంగా నిర్వహించబడును శ్రీ రాఘవేంద్రస్వామి మఠం|| దుర్వాది ధ్వాంతరవయే వైష్ణవేందీవరేందవే ।శ్రీ రాఘవేంద్ర గురవే నమః అత్యంత దయాలవే ॥. శ్రీ రాఘవేంద్రస్వామి వారు సశరీరముగా బృందావన ప్రవేశము చేసి నేటికి 355 సం||లు అయినది. ఇప్పటికి కూడ భక్తుల సర్వాభీష్టములు తీర్చుతూ భక్తుల పాలిటి కలియుగ కల్పతరువు కామధేనువై విరాజిల్లుచున్నారు. కావున సమస్త భగవద్ భక్తులు శ్రీ స్వామి వారి ఆరాధనా మహోత్సవములందు పాల్గొని తను, మన, ధనములతో సేవలు గావించి తీర్థప్రసాదములు స్వీకరించి, శ్రీ స్వామి విశేషానుగ్రహమునకు పాత్రులు కాగలరని ప్రార్ధన.శ్రీ శేషదాస మరియు శ్రీ రాఘవేంద్ర భజనమండలీ గద్వాల వారిచే భజన కార్యక్రమములు.తేది 26-08-2026 బుధవారము ఉ॥ 9-00 గం॥లకు ఋగ్వేద నిత్య నూతన ఉపాకర్మతేది 28-08-2026 శుక్రవారము10-00యజుర్వేద నిత్యనూతన ఉపాకర్మసామూహిక శ్రీ సత్యనారాయణస్వామి పూజసా॥ 6-00 గం॥లకుగోపూజ, ధ్వజారోహణం, లక్ష్మీపూజ,ధాన్యపూజ మొ॥నవి జరుగును.తేది 29-08-2026 నుండి 31-08-2026 వరకు జరుగు రోజువారి కార్యక్రమములుఉ॥5-00 గం॥లకు,ఉ 8-00 గంలకు10-30,ఉ॥ 11-00 గం॥లకుఉ॥ 11-30 గం॥లకుమ॥ 12-30 గం॥లకుసుప్రభాతం, నిర్మాల్య విసర్జనంమహా పంచామృత అభిషేకంప్రహ్లాదుల వారి పాదుపూజ, అష్టోత్తర పారాయణం సహితంతులసీ అర్చనఅలంకార సేవహస్తోదకం తీర్థప్రసాదముల వితరణ,29-08-2026సా|| 7-00 గం||లకు రథోత్సవము30-08-2026సా|| 7-00 గం||లకు రథోత్సవము31-08-2026 | 09 పురవీధులగుండా ప్రహ్లాదరాయల రధోత్సవ కార్యక్రమము జరుగును.2
- రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి1
- చిన్నకడబూరులో శివాలయ దేవాలయంకు వైభవంగా నూతన ధ్వజస్తంభం మహోత్సవం వేడుకలు పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో ఉన్న శ్రీ అంజినేయ స్వామి దేవాలయం పక్కన ఉన్న శివాలయ దేవాలయంకు నూతన ధ్వజస్తంభంను బుధవారం వైభవంగా జరిగింది.ఈ నూతన ద్వజస్థంభ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ధనుర్లగ్న శుభ ముహూర్తమున పండితులు వేద మంత్రాలు పఠిస్తుండంగా ఆలయ ధర్మకర్త గౌళ్ళ నల్లారెడ్డి ఆధ్వర్యంలో మరియు ఆలయ,గ్రామ పెద్దల సమక్షంలో అశేష భక్తవాహిణి నడుమ కన్నుల పండుగగా జరిగిందని ఆలయ ,కమిటీ పెద్దలు బుధవారం తెలిపారు.ప్రత్యేకంగా హోమం ద్వారా శివాలయ దేవాలయం నందు భ్రమరాంబిక,గణపతి,కుమారస్వామి, విగ్రహాలకు అలాగే ధ్వజస్తంభ ప్రతిష్టాపన ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది.అనంతరం టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి ప్రత్యేకంగా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలను గౌరవించారు.వేద పండితులు ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవముకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.హోమం కాల్చిన అనంతరం శివాలయ దేవాలయముకు నూతనంగా ఏర్పాటు చేసిన నూతన ధ్వజ స్తంభ ప్రతిష్టాపనకు వచ్చిన భక్తాదులు ప్రత్యేక పూజలు గావించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మీసేవ ఆంజనేయులు, మల్లికార్జున,ఆలయ పెద్దలు గౌళ్ళ నల్లారెడ్డి,తయాన్న,నారాయణస్వామి,ముత్తన్న,కోడిగుడ్ల లక్ష్మన్న, వీరారెడ్డి,ఎల్లన్న ,గిడ్డయ్య,సొసైటీ డైరెక్టర్ యం.జి నరసన్న,కోస్గి డైరెక్టర్ కలగట్ల లక్ష్మన్న,బుసిరెడ్డి, జనసేన నాయకులు మహదేవ, గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు,శివాలయం స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.2
- మానససరోవర యాత్రికులకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా పరామర్శ..! మానససరోవర యాత్రకు వెళ్లిన ఆదోనికి చెందిన శ్రీ రఘునాథ్ శాస్త్రి, భాస్కర్ శాస్త్రి కుటుంబ సభ్యులతో సహా నలుగురు హిమాలయాల్లో చిక్కుకున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నట్లు వారు ఎమ్మెల్యేకు తెలిపారు. వారిని సురక్షితంగా ఆదోనికి తీసుకురావడానికి అవసరమైన తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.1
- తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ భారతరత్న మదర్ థెరిస్సా 116వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆమె మార్గంలో నడిచి సేవాకార్యక్రమాలలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ ముదిరాజ్, రేమండ్ హార్ ఉడ్, నరేష్, డెంజిల్, ప్రభు, ఆంథోనీ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.1
- నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీరు అవసరాల కోసం నీటిని విడుదల చేసిన అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు అధికారులు తాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేశారు. ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకుని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. గత కొంతకాలంగా నీళ్లు రాక ఎడమ కాలువ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడగా తాజాగా నీటిని విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.1
- *బస్సు-కంటైనర్ - "ఢీ"* *6గురు మృతి* *20 మందికి తీవ్ర గాయాలు* *దొరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం* రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు మృతి *ఏలూరు వెళ్తున్న* బస్సుకు ఘోర ప్రమాదం..దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.2
- *హైదరాబాద్- విజయవాడ హైవేపై ఘోర బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి* హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.1