Shuru
Apke Nagar Ki App…
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొనాయపల్లి గ్రామంలో అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ సొప్పరి ధనలక్ష్మి–రామకృష్ణ దంపతులు భూమిపూజ చేసి ప్రారంభించారు. గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడం, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ఈ పనులను చేపట్టినట్లు వారు తెలిపారు. గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా సర్పంచ్ దంపతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హనుమంత్ నాయక్, వార్డు సభ్యులు రంగు నర్సింహ, చిత్రమోని శ్రీలత రాజు, బర్కం రామకృష్ణతో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో అండర్ డ్రైనేజీ నిర్మాణం పూర్తయితే పారిశుద్ధ్య సమస్యలు తగ్గి ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.
S M S R R
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొనాయపల్లి గ్రామంలో అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ సొప్పరి ధనలక్ష్మి–రామకృష్ణ దంపతులు భూమిపూజ చేసి ప్రారంభించారు. గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడం, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ఈ పనులను చేపట్టినట్లు వారు తెలిపారు. గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా సర్పంచ్ దంపతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హనుమంత్ నాయక్, వార్డు సభ్యులు రంగు నర్సింహ, చిత్రమోని శ్రీలత రాజు, బర్కం రామకృష్ణతో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో అండర్ డ్రైనేజీ నిర్మాణం పూర్తయితే పారిశుద్ధ్య సమస్యలు తగ్గి ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.
More news from Hyderabad and nearby areas
- కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేస్తే భద్రాచలం కొట్టుకుపోతుందని ముఖ్యమంత్రి, మంత్రి మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ పెద్దల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెపల్లి దగ్గర 10 టీఎంసీల నీళ్ళు పోతుంటే అందులో నుండి కేవలం 2 టీఎంసీల నీళ్ళు మాత్రమే లిఫ్ట్ చేయమని తాము అడుగుతున్నామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ ముఖ్యమంత్రి, మంత్రి చెప్పినట్లే బ్యారేజ్ కొట్టుకుపోయినా కూడా, ఆ 2 టీఎంసీల నీళ్ళు కిందికి జారి ఆ పోయే నీళ్ళలోనే కలుస్తాయని ఆయన వివరించారు. దీనికి భద్రాచలం, 44 ఊర్లు ఎలా కొట్టుకుపోతాయంటూ ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.1
- జానకి అమ్మ చివరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జానకి అమ్మ, సింగర్ సునీత ఇద్దరూ కలిసి పాటలు పాడుతూ, ఎంతో సరదాగా గడిపారు. వీరిద్దరికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.1
- Post by Assalamualikumjj3
- సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో మాంగల్య షాపింగ్ మాల్‌ను సినీ నటి రాశి ఖన్నా ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నటి రాశి ఖన్నా విచ్చేయడంతో ఆమెను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అక్కడకు చేరుకున్న ఆమె అభిమానులకు అభివాదం చేయడమే కాకుండా, వారిని ఉత్సాహపరిచేందుకు వేదికపై స్టెప్పులు వేసి అలరించారు. ఈ సందర్భంగా ప్రియమైన నటితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడటంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఎంతో సందడి వాతావరణం నెలకొంది.2
- తెలంగాణ మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ బూతుల పర్వం లంకించుకున్నారు. కన్నెపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసినందుకు రిటైర్డ్ ఇంజనీర్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి తనకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. వీళ్ళని బొక్కలో వేయకపోవడమే తాను చేసిన తప్పని, తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.1
- నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని గౌరారం గ్రామంలో బొడ్రాయి పండుగ ఉత్సవాలు అత్యంత కన్నులపండువగా, ఘనంగా సాగాయి. ఈ వేడుకల సందర్భంగా ఉదయం నుంచే గ్రామ దేవతకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. వేపాకులు, పసుపు, కుంకుమలతో అలంకరించిన బోనాలతో మహిళలు బొడ్రాయి చుట్టూ తిరుగుతూ భక్తిపారవశ్యంలో మునిగితేలారు. ఊరు, వాడ అంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవాల్లో గ్రామ పెద్దలతో పాటు యువకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేస్తే భద్రాచలం కొట్టుకుపోతుందని ముఖ్యమంత్రి, మంత్రి మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, కన్నెపల్లి దగ్గర 10 టీఎంసీల నీళ్ళు పోతుంటే అందులో నుండి కేవలం 2 టీఎంసీల నీళ్ళు మాత్రమే లిఫ్ట్ చేయమని తాము అడుగుతున్నామని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ మూర్ఖులు చెప్పినట్లు బ్యారేజ్ కొట్టుకుపోయినా.. ఆ 2 టీఎంసీల నీళ్ళు కిందికి జారి ప్రవహించే నీళ్ళలోనే కలుస్తాయని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దీనికి భద్రాచలం, 44 ఊర్లు ఎలా కొట్టుకుపోతాయంటూ ఆయన "మూర్ఖుల్లారా" అని ప్రశ్నిస్తూ సీఎంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.1
- వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు, కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పేకాట స్థావరంపై దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు జరిపిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పేక ముక్కలతో పాటు రూ. 35,570 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లాలో పేకాట, జూదం వంటి ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై టాస్క్ ఫోర్స్ బృందం నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తుందని ఎస్పీ స్నేహ మెహ్రా స్పష్టం చేశారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.1