*ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి... కరపత్రాలు పంచి హిందూ ఏక్తా యాత్రకు ఆహ్వానిస్తున్న కాషాయ శ్రేణులు ఎల్లుండి జరగబోయే హిందూ ఏక్తా యాత్రకు చకచకా ఏర్పాట్లు గతం కంటే ఘనంగా జోష్ నింపుందుకు సిద్ధమైన కేంద్ర మంత్రి బండి సంజయ్* *వినూత్న రీతిలో కళారూపాలు, సాంస్క్రుతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ఏక్తా యాత్ర* *పిల్లాపాపలతో ఏక్తా యాత్ర ర్యాలీని చూసేలా ఏర్పాట్లు చేస్తున్న కాషాయ దళం* *ఒక్కడితో మొదలై....హిందువులంతా సంఘటితమై.... * *16 ఏళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతున్న హిందూ ఏక్తా యాత్ర* *ఊరూవాడా కరపత్రాల పంపిణీ* *స్వయంగా గోడలపై పెయింటింగ్ వేస్తూ యాత్రకు ఆహ్వానిస్తున్న కాషాయ దళం* *రాజకీయాలకు అతీతంగా కొనసాగుతున్న హిందువులను సంఘటితం చేయడమే లక్ష్యం* *వివిధ కళారూపాలు, సాంస్క్రుతిక ప్రదర్శనలతో ఏటా ఆకట్టుకుంటున్న హిందూ ఏక్తా యాత్ర* *కరీంనగర్ పార్లమెంట్ తోపాటు రాష్ట్రం నలుమూలల నుండి యాత్రకు తరలివచ్చేందుకు సిద్ధమైన హిందుత్వ వాదులు* హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 12న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘హిందూ ఏక్తా యాత్ర’కు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. హిందువులందరినీ సంఘటితం చేయడమే లక్ష్యంగా ప్రతి ఏటా బాల గంగాధర్ తిలక్ గణేశ్ ఉత్సవాలను ప్రారంభించిన సంగతి తెలిసిదే. అదే స్పూర్తితో హిందువులందరినీ రాజకీయాలకు అతీతంగా సంఘటితం చేయాలనే లక్ష్యంతో సరిగ్గా 16 ఏళ్ల క్రితం బండి సంజయ్ కుమార్ గుప్పెడు మందితో కరీంనగర్ లో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ను ప్రారంభించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా గుప్పెడు మంది నుండి వందలుగా, వేలుగా హిందువులంతా తరలివచ్చి హిందూ ఏక్తా యాత్రలో పాల్గొంటున్నారు. ప్రతి ఏటా హిందూ ఏక్తా యాత్రకు వచ్చే హిందువుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత ఏడాది సైతం భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈసారి అంతకు మించి ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. *గతంకంటే మిన్నగా...* గతానికి భిన్నంగా ఈసారి ‘హిందూ ఏక్తా యాత్ర’కు రావాలంటూ కాషాయ శ్రేణులు, కార్పొరేటర్లు ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారు. కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. కాషాయ శ్రేణులు తమ తమ డివిజన్లలోని, కాలనీల్లోని గోడలపై ‘హిందూ ఏక్తా యాత్ర’కు తరలి రావాలంటూ స్వయంగా వాల్ పెయింటింగ్ రాశారు. సోషల్ మీడియా ద్వారా విస్త్రత ప్రచారం నిర్వహిస్తున్నారు. వేసవిలో ఇబ్బంది లేకుండా.... బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈనెల 12న సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ లోని వైశ్యా భవన్ నుండి ప్రారంభమయ్యే ఏక్తా యాత్ర కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు జనం ఉత్సాహం చూపుతుండటంతో వారికి ప్రత్యేకంగా రవాణా సదుపాయం కల్పించేందుకు కాషాయ శ్రేణులు సిద్ధమయ్యాయి. మరోవైపు ఎండాకాలం కావడంతో ఏక్తా యాత్రలో పాల్గొనే వారికి కాషాయ శ్రేణులు, హిందుత్వ వాదులు, వ్యాపారులు స్వచ్ఛందంగా మంచినీళ్లు, మజ్జిగ, ఇతర ఆహార పానియాలను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. *హిందూ ఏక్తా యాత్ర ఆరంభమయ్యేది ఇలా...* కరీంనగర్ లోని వైశ్య భవన్ నుండి 12న సాయంత్రం 4 గంటలకు హిందూ ఏక్తా యాత్ర ర్యాలీ ప్రారంభం కానుంది. ర్యాలీ ఆరంభంలోనే వైశ్యాభవన్ వద్ద హిందుత్వ వాదులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగిస్తారు. అనంతరం వైశ్యా భవన్ నుండి ప్రారంభమయ్యే ర్యాలీ రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, గంజ్, కమాన్ , వన్ టౌన్, వెంకటేశ్వర టెంపుల్, అమరవీరుల స్థూపం, జయశంకర్ సర్కిల్, రాజీవ్ చౌక్ మీదుగా తిరిగి వైశ్య భవన్ కు చేరుకుంటుంది. ఇక్కడే హిందూ ఏక్తా యాత్రను ముగిస్తారు. ఈ యాత్రకు కులాలను పక్కన పెట్టి హిందువులంతా రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల కార్యకర్తలంతా ఈ యాత్రకు హాజరవుతుండటం విశేషం. ముఖ్యంగా వివిధ కుల సంఘాల నాయకులంతా సంఘీభావం తెలిపారు. వీరితోపాటు వివిధ వ్రుత్తి సంఘాలు, ధార్మిక సంస్థలు, కళాకారులు, కార్మిక సంఘాల నాయకులు ఈ యాత్రలో పాల్గొనబోతోన్నాయి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ *ఆకట్టుకోనున్న కళారూపాలు, సాంస్క్రుతిక ప్రదర్శనలు* దాదాపు 6 గంటలపాటు కొనసాగే హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనే హిందుత్వ వాదులు, కరీంనగర్ పట్టణ ప్రజలను ఆకట్టుకునేలా వివిధ రూపాల్లో కళా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఇప్పటికే కేరళ నుండి హనుమంతుడు, హైదరాబాద్ నుండి శ్రీరాముడి విగ్రహాలను కరీంనగర్ కు తరలిస్తున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక వేషధారణలతో ఆకట్టుకునే కళాకారులను రప్పిస్తున్నారు. కేరళ నుండి డప్పు వాయిద్య కళాకారులు వస్తున్నారు. ప్రత్యేకంగా సిరిసిల్ల నుండి ప్రతి ఏటా ధ్వజాలు రాబోతున్నాయి. *జోష్ నింపేందుకు సిద్ధమైన కేంద్ర మంత్రి* *గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో ప్రజల్లో అయోమయం నెలకొన్న నేపథ్యంలో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ సందర్భంగా వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ హిందుత్వ వాదుల్లో జోష్ నింపేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సిద్ధమయ్యారు. ముఖ్యతో తనతోపాటు రాష్ట్రంలోని అనేక మంది హిందుత్వ వాదులపైనా, కుటుంబ సభ్యులపైనా లౌకిక వాద ముసుగులో కొనసాగుతున్న దాడులను ఎండగడుతూ హిందుత్వ వాదులందిరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే లక్షంగా హిందూ ఏక్తా యాత్రను కొనసాగించనున్నారు.
*ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి... కరపత్రాలు పంచి హిందూ ఏక్తా యాత్రకు ఆహ్వానిస్తున్న కాషాయ శ్రేణులు ఎల్లుండి జరగబోయే హిందూ ఏక్తా యాత్రకు చకచకా ఏర్పాట్లు గతం కంటే ఘనంగా జోష్ నింపుందుకు సిద్ధమైన కేంద్ర మంత్రి బండి సంజయ్* *వినూత్న రీతిలో కళారూపాలు, సాంస్క్రుతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ఏక్తా యాత్ర* *పిల్లాపాపలతో ఏక్తా యాత్ర ర్యాలీని చూసేలా ఏర్పాట్లు చేస్తున్న కాషాయ దళం* *ఒక్కడితో మొదలై....హిందువులంతా సంఘటితమై.... * *16 ఏళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతున్న హిందూ ఏక్తా యాత్ర* *ఊరూవాడా కరపత్రాల పంపిణీ* *స్వయంగా గోడలపై పెయింటింగ్ వేస్తూ యాత్రకు ఆహ్వానిస్తున్న కాషాయ దళం* *రాజకీయాలకు అతీతంగా కొనసాగుతున్న హిందువులను సంఘటితం చేయడమే లక్ష్యం* *వివిధ కళారూపాలు, సాంస్క్రుతిక ప్రదర్శనలతో ఏటా ఆకట్టుకుంటున్న హిందూ ఏక్తా యాత్ర* *కరీంనగర్ పార్లమెంట్ తోపాటు రాష్ట్రం నలుమూలల నుండి యాత్రకు తరలివచ్చేందుకు సిద్ధమైన హిందుత్వ వాదులు* హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 12న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘హిందూ ఏక్తా యాత్ర’కు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. హిందువులందరినీ సంఘటితం చేయడమే లక్ష్యంగా ప్రతి ఏటా బాల గంగాధర్ తిలక్ గణేశ్ ఉత్సవాలను ప్రారంభించిన సంగతి తెలిసిదే. అదే స్పూర్తితో హిందువులందరినీ రాజకీయాలకు అతీతంగా సంఘటితం చేయాలనే లక్ష్యంతో
సరిగ్గా 16 ఏళ్ల క్రితం బండి సంజయ్ కుమార్ గుప్పెడు మందితో కరీంనగర్ లో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ను ప్రారంభించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా గుప్పెడు మంది నుండి వందలుగా, వేలుగా హిందువులంతా తరలివచ్చి హిందూ ఏక్తా యాత్రలో పాల్గొంటున్నారు. ప్రతి ఏటా హిందూ ఏక్తా యాత్రకు వచ్చే హిందువుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత ఏడాది సైతం భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈసారి అంతకు మించి ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. *గతంకంటే మిన్నగా...* గతానికి భిన్నంగా ఈసారి ‘హిందూ ఏక్తా యాత్ర’కు రావాలంటూ కాషాయ శ్రేణులు, కార్పొరేటర్లు ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారు. కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. కాషాయ శ్రేణులు తమ తమ డివిజన్లలోని, కాలనీల్లోని గోడలపై ‘హిందూ ఏక్తా యాత్ర’కు తరలి రావాలంటూ స్వయంగా వాల్ పెయింటింగ్ రాశారు. సోషల్ మీడియా ద్వారా విస్త్రత ప్రచారం నిర్వహిస్తున్నారు. వేసవిలో ఇబ్బంది లేకుండా.... బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈనెల 12న సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ లోని వైశ్యా భవన్ నుండి ప్రారంభమయ్యే ఏక్తా యాత్ర కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు జనం
ఉత్సాహం చూపుతుండటంతో వారికి ప్రత్యేకంగా రవాణా సదుపాయం కల్పించేందుకు కాషాయ శ్రేణులు సిద్ధమయ్యాయి. మరోవైపు ఎండాకాలం కావడంతో ఏక్తా యాత్రలో పాల్గొనే వారికి కాషాయ శ్రేణులు, హిందుత్వ వాదులు, వ్యాపారులు స్వచ్ఛందంగా మంచినీళ్లు, మజ్జిగ, ఇతర ఆహార పానియాలను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. *హిందూ ఏక్తా యాత్ర ఆరంభమయ్యేది ఇలా...* కరీంనగర్ లోని వైశ్య భవన్ నుండి 12న సాయంత్రం 4 గంటలకు హిందూ ఏక్తా యాత్ర ర్యాలీ ప్రారంభం కానుంది. ర్యాలీ ఆరంభంలోనే వైశ్యాభవన్ వద్ద హిందుత్వ వాదులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగిస్తారు. అనంతరం వైశ్యా భవన్ నుండి ప్రారంభమయ్యే ర్యాలీ రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, గంజ్, కమాన్ , వన్ టౌన్, వెంకటేశ్వర టెంపుల్, అమరవీరుల స్థూపం, జయశంకర్ సర్కిల్, రాజీవ్ చౌక్ మీదుగా తిరిగి వైశ్య భవన్ కు చేరుకుంటుంది. ఇక్కడే హిందూ ఏక్తా యాత్రను ముగిస్తారు. ఈ యాత్రకు కులాలను పక్కన పెట్టి హిందువులంతా రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల కార్యకర్తలంతా ఈ యాత్రకు హాజరవుతుండటం విశేషం. ముఖ్యంగా వివిధ కుల సంఘాల నాయకులంతా సంఘీభావం తెలిపారు. వీరితోపాటు
వివిధ వ్రుత్తి సంఘాలు, ధార్మిక సంస్థలు, కళాకారులు, కార్మిక సంఘాల నాయకులు ఈ యాత్రలో పాల్గొనబోతోన్నాయి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ *ఆకట్టుకోనున్న కళారూపాలు, సాంస్క్రుతిక ప్రదర్శనలు* దాదాపు 6 గంటలపాటు కొనసాగే హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనే హిందుత్వ వాదులు, కరీంనగర్ పట్టణ ప్రజలను ఆకట్టుకునేలా వివిధ రూపాల్లో కళా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఇప్పటికే కేరళ నుండి హనుమంతుడు, హైదరాబాద్ నుండి శ్రీరాముడి విగ్రహాలను కరీంనగర్ కు తరలిస్తున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక వేషధారణలతో ఆకట్టుకునే కళాకారులను రప్పిస్తున్నారు. కేరళ నుండి డప్పు వాయిద్య కళాకారులు వస్తున్నారు. ప్రత్యేకంగా సిరిసిల్ల నుండి ప్రతి ఏటా ధ్వజాలు రాబోతున్నాయి. *జోష్ నింపేందుకు సిద్ధమైన కేంద్ర మంత్రి* *గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో ప్రజల్లో అయోమయం నెలకొన్న నేపథ్యంలో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ సందర్భంగా వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ హిందుత్వ వాదుల్లో జోష్ నింపేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సిద్ధమయ్యారు. ముఖ్యతో తనతోపాటు రాష్ట్రంలోని అనేక మంది హిందుత్వ వాదులపైనా, కుటుంబ సభ్యులపైనా లౌకిక వాద ముసుగులో కొనసాగుతున్న దాడులను ఎండగడుతూ హిందుత్వ వాదులందిరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే లక్షంగా హిందూ ఏక్తా యాత్రను కొనసాగించనున్నారు.
- మే 25,26న హైదారాబాద్ లో జరిగే తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. కళాకారులు శిక్షణ ద్వారా కళా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ అనుబంధమైన తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలు మే 25,26వ తేదీలలో రెండు రోజుల పాటు హైదారాబాద్ లో జరిగనున్నాయని ఆ మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ కళాకారులకు పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణా శిబిరం ఆదివారం ముగిసింది. కళాకారులకు పల్లె నర్సింహ పాటలు పాడటం, డప్పు కొట్టడం శిక్షణ ఇచ్చారు.శిక్షణ ముగింపు సందర్భంగా పల్లె నర్సింహ మాట్లాడుతూ దేశంలో ఎంతో మంది మేధావులు,రచయితలు,కవులు,కళాకారులు కలిసి ఇప్టా స్థాపించారని,కార్మిక,కర్షక,ప్రజా సమస్యలపై,వారి జీవనవిధానాలపై నిరంతరం అధ్యయనం చేస్తూ అనేక రచనలు చేస్తున్నారని,పాటలు వ్రాస్తున్నారన్నారు,కళాకారులు ఎంతో మంది ఉంటారు కానీ ప్రజా కళాకారులు కొంత మంది మాత్రమే ఉంటారని అలాంటి కళాకారులు నిత్యం ప్రజల బాధలను చూసి వాటిని ప్రపంచానికి తెలిజేసేందుకు పాటలు పాడుతుంటారని,కళ కాసుల కోసం కాదు ప్రజల కోసమని పాడే కళాకారులే ప్రజానాట్య మండలి వారని,అలాంటి కళాకారులు నిత్య విద్యార్థులుగా ఎన్నో విషయాలు తెలుసుకొని,పాటలు వ్రాస్తూ,పాడాలని అందుకు ఇలాంటి శిక్షణా శిబిరాలు ఉపయోగపడతాయని నర్సింహ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో కళాకారులు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,జానపద,యక్షగాన,బుర్ర కథ,ఒగ్గు కథ, వీధి బాగోత కళారుల బ్రతుకులు చాలా దుర్భరంగా ఉన్నాయని ప్రభుత్వం వారిని గుర్తించాలని,అన్ని రంగాల కళాకారులను గుర్తించినవారికి గుర్తింపు కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నర్సింహ కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల కష్ట,సుఖాలను పాటల రూపంలో బయటకు తెచ్చి ఎంతో మందిని మెప్పించే అత్యంత బలమైన ఆయుధం పాట అని,గాయకుడు నాయకుడు అవుతాడు. కానీ నాయకుడు గాయకుడు కావడం చాలా కష్టమన్నారు. ఏ పోరాటాలు,ఉద్యమాలు,బహిరంగ సభలు విజయవంతం కావాలన్నా కళాకారులు ఉండాల్సిందేనని, కళాకారులగా తయారయ్యే వారికి తోడ్పాటు అందించడం కోసం సిపిఐ జిల్లా సమితి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు. ఈ శిక్షణా శిబిరం కార్యక్రమంలో ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కవ్వంపల్లి స్వామి, మాజీ జడ్పీటీసీ అందె స్వామి,ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి దుడ్డేల సమ్మయ్య,,ఉమ్మడి జిల్లా కళాకారులు లెనిన్,వరకోలు సదానందం,కోమల, సరిత,రమ, ఏ.రాజయ్య,విజయ్, తిరుపతి,లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు2
- పెద్దపల్లి జిల్లాలో పది రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు వంశీ మృతదేహం ఎక్లాస్ పూర్ వద్ద లభ్యం...హత్య చేసి శవం దొరకకుండా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బంధువులు ఆందోళన పెద్దపల్లి జిల్లాలో పది రోజుల క్రితం అదృశ్యమైన రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన యువకుడు జూల వంశీ మృతదేహం మంథని మండలం ఎక్లాస్ పూర్ శివారులోని గాడుల గండి వద్ద లభించింది. హత్యచేసి ఎక్లాస్ పూర్ గాడుదుల గండి గుట్ట వద్ద లోయలో మృతదేహాన్ని పడేశాని బందువులు ఆందోళనకు దిగారు. రోడ్డు పై బైఠాయించి ధర్నా చేశారు. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యం కావడంతో మృతుని కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని పదిరోజుల నుండి పోలీసులు మృతదేహాన్ని గుర్తించకపోవడంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో పోలీసుల పురోగతి లేకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 30 నుండి వంశీ కనబడకుండా పోవడంతో మూడు రోజులు అనంతరం కుటుంబ సభ్యుల గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంఘటన స్థలానికి గోదావరిఖని ఏసిపి మడత రమేష్ చేరుకుని జూల వంశీ హత్య కేసులో ఓ మహిళతోపాటు ముగ్గురిని గుర్తించామని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శవాన్ని దొరకనీయకుండా దాచి పెట్టే ప్రయత్నం చేసిన కేసుతో పాటు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.1
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రధాని మోడీ సభలో చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును వెంటనే ఆమోదించాలని కోరారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.1
- చీర్లవంచ గ్రామ బీజేపీ నాయకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలివెళ్లారు. జాతీయ నాయకుడి ప్రసంగాన్ని వినేందుకు వారు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.1
- జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.1
- వరంగల్ నగరంలోని ఏకశిలా పరపతి సంఘం కార్యాలయం ఎదుట ఆదివారం సభ్యులు ఆందోళన చేపట్టారు. సంఘం ఆదాయం, ఖర్చులు, సభ్యుల చందాల వివరాలు పారదర్శకంగా వెల్లడించడం లేదని వారు ఆరోపించారు. సమస్యను పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని సభ్యులు హెచ్చరించారు.1
- జన్నారం మండలంలో కల్లాల్లోనే కన్నీరు: కవ్వాల్ రైతుకు తప్పని తిప్పలు! అది జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలోని ఒక ధాన్యం కల్లం. అక్కడ పసుపు వర్ణంలో మెరుస్తున్న ధాన్యం కుప్పలు రైతు కష్టానికి నిదర్శనం. కానీ, దురదృష్టవశాత్తూ ఆ కష్టం ఇప్పుడు రైతు నోటి దాకా రావడం లేదు.. పశువుల నోటి పాలవుతోంది! నెల గడిచినా కదలని కొనుగోళ్లు పంట కోసి నెల రోజులు గడుస్తున్నా, కొనుగోలు కేంద్రాల గడప దాటి ఒక్క గింజ కూడా బయటకు వెళ్లడం లేదు. "అధికారులు వస్తారు.. కొంటారు.." అనే ఆశతో రైతులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కానీ, ఇటు అధికారుల పట్టింపులేమి, అటు పెరుగుతున్న వడ్డీల భారం రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రైతు కష్టాన్ని 'మేస్తున్న' పశువులు ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. రైతులు ఆరబోసిన వడ్లను, మొక్కజొన్నను పశువులు యధేచ్ఛగా తినేస్తున్నాయి. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. రక్షణ లేని పంట: బర్లు, ఎడ్ల మందలు కల్లాలపై పడి ధాన్యాన్ని నాశనం చేస్తున్నాయి. వాటిని అదిలించే ఓపిక లేక, తోలే దిక్కు లేక రైతులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారు. ప్రకృతి కన్నుగీటితే అంతే: ఒకవైపు పశువుల బెడద, మరోవైపు అకాల వర్షాల భయం. ఒక్క వాన పడితే నెలల కష్టం బురదపాలవుతుందని రైతులు వణికిపోతున్నారు. మిత్తి భారంతో కుదేలు "అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాం.. ఇప్పుడు వడ్లు అమ్మకపోతే అసలు సంగతి పక్కన పెడితే, మిత్తి (వడ్డీ) కట్టడానికే మా ఆస్తులు అమ్ముకోవాలి" అని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చినా కాసుల గలగలలు లేక కవ్వాల్ గ్రామంలో రైతు ఇళ్లు వెలవెలబోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా, తక్షణమే కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి.2
- *పరేడ్ గ్రౌండ్ లో బండి సంజయ్ మేనియా బండి సంజయ్ వేదికపైకి రాగానే దద్దరిల్లిన పరేడ్ గ్రౌండ్* *జై శ్రీరాం నినాదాలతో మారుమోగిన పరేడ్ గ్రౌండ్* *సంజయ్ ప్రసంగానికి కార్యకర్తలు ఫిదా* పరేడ్ గ్రౌండ్ లో ఇద్దరు నేతలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఒకరు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాగా.. ఇంకొకరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్ కు రాకకు 45 నిమిషాల ముందే బండి సంజయ్ పరేడ్ గ్రౌండ్ కు విచ్చేశారు. అప్పటికే పరేడ్ మైదానమంతా పూర్తిగా జన సంద్రమైంది. వేదికపై మహామహులంతా ఉన్నారు. బండి సంజయ్ సభా వేదికపై రాగానే ఒక్కసారిగా సభలోని వేలాది మంది కార్యకర్తల్లో ఒక్కసారిగా జోష్ నెలకొంది. ఈలలు, కేరింతలు, చప్పట్లతో విజిల్స్ వేస్తూ జై మోదీ.. జై బండి అంటూ నినదాలు చేయడంలో పరేడ్ మైదానమంతా మారుమోగిపోయింది. ఇక బండి సంజయ్ ప్రసంగం సైతం కార్యకర్తలను ఆకట్టుకుంది. జై శ్రీరాం నినాదంవల్ల తెలంగాణకు డబ్బులు రావడమే కాదు, కాంగ్రెస్, బీఆర్ఎస్ గుండెల్లో రాళ్లు పడుతున్నాయంటూ చేసిన వ్యాఖ్యలతో పరేడ్ మైదానం మరోసారి దద్దరిల్లింది. నేను ఏనాడు బీజేపీకి తలవంపులు తేను... మీ తాటాకు చప్పళ్లకు భయపడేటోడిని కాదు. భయపెడితే భయపడటానికి మీ ఫాంహౌజ్ లో ఎలుకను కాదు.. అయ్యపేరు చెప్పి, ఆస్తులకు కూడగట్టుకునేటోడిని కాదు. ధర్మం కోసం పనిచేసే కాషాయ కార్యకర్తను. కాషాయ జెండా మోస్తున్న మోదీ సైనికుడిని.’’అంటూ చేసిన ప్రసంగంతో పరేడ్ మైదానమంతా పులకించిపోయింది.1