logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రమాదాలలో ప్రాణనష్టాన్ని తగ్గించడమే లక్ష్యం.* *రోడ్డుపై బాధ్యతగా వెళ్లండి - క్షేమంగా ఇంటికి తిరిగి రండి* *రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాలను నివారించండి.* *230 మంది ఆటో, టాక్సీ, లారీ, కార్ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలు.* *నిష్ణాతులైన వైద్యులచే కంటి పరీక్షల నిర్వహణ *పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా, మార్చ్ 31 :- *.* *30 డ్రైవర్లకు ఉచితంగా కంటి అద్దాల అందజేత.* *"అరైవ్ అలైవ్" లో భాగంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ తో ప్రమాదాలను అరికట్టవచ్చు.* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.* జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర డిజిపి డి శివధర్ రెడ్డి గారిచే ప్రారంభించబడిన "అరైవ్ అలైవ్" కార్యక్రమం సందర్భంగా ఈరోజు మధ్యానం ఉట్నూర్ మండల కేంద్రంలోని హెచ్కేజిఎన్ గార్డెన్ లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ, లారీ, కార్ డ్రైవర్లకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డిఫెన్సివ్ డ్రైవింగ్ తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ వాహన నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల లో ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు. మంచి కంటి చూపుతో ప్రమాదాల నివారణ సాధ్యం అని తెలిపారు. ఆటోలలో ఇలాంటి అసంఘిక కార్యకలాపాలు చేయవద్దని, డ్రైవర్లకు ఎలాంటి అనుమానం ఉన్న వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం చేరవేయాలని తెలిపారు. ఈ ఉచిత కంటి పరీక్ష లో బోథ్ చెందిన 230 మంది ఆటో, టాక్సీ, లారీ డ్రైవర్లు పాల్గొన్నట్లు తెలిపారు. వీరందరికీ నిష్ణాతుడైన కంటి వైద్యులు డాక్టర్ సంధ్య పుష్కర్ ఆప్తమాలజీ, వైద్య పరీక్షలను నిర్వహించినట్లు, జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా పరీక్షలను పరిశీలించి, నిరుపేద 30 మంది డ్రైవర్లకు ఉచితంగా కంటి అద్దాలను ఇచ్చారు. శస్త్ర చికిత్సలు అవసరం ఉన్నవారికి ఆదిలాబాద్ పట్టణంలో ఉచితంగా వైద్య సేవలు అందించనునట్లు తెలిపారు. ముఖ్యంగా ఆటోలలో టాక్సీలలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, గంజాయి మాదకద్ర వ్యాలు లాంటి వాటివి తరలకుండా, నిషేధిత పదార్థాలను, వస్తువులను, వాటిని రవాణా చేయకుండా ఉండాలని తెలిపారు. డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఉట్నూర్ సీఐ ఎం ప్రసాద్, ఎస్ఐ జి విజయ్, ఇంద్రవెల్లి ఎస్ఐ ఈ సాయన్న, నార్నూర్ ఎస్సై శ్రీ సాయి, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పోలీసు డాక్టర్ శాంతరాజ్, ఆటో డ్రైవర్లు, పాఠశాల విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

6 hrs ago
user_M.RAJKIRAN REDDY
M.RAJKIRAN REDDY
Adilabad Rural, Telangana•
6 hrs ago
093f7177-172b-415a-8387-2b3875484b3a

ప్రమాదాలలో ప్రాణనష్టాన్ని తగ్గించడమే లక్ష్యం.* *రోడ్డుపై బాధ్యతగా వెళ్లండి - క్షేమంగా ఇంటికి తిరిగి రండి* *రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాలను నివారించండి.* *230 మంది ఆటో, టాక్సీ, లారీ, కార్ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలు.* *నిష్ణాతులైన వైద్యులచే కంటి పరీక్షల నిర్వహణ *పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా, మార్చ్ 31 :- *.* *30 డ్రైవర్లకు ఉచితంగా కంటి అద్దాల అందజేత.* *"అరైవ్ అలైవ్" లో భాగంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ తో ప్రమాదాలను అరికట్టవచ్చు.* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.* జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర డిజిపి డి శివధర్ రెడ్డి గారిచే ప్రారంభించబడిన "అరైవ్ అలైవ్" కార్యక్రమం సందర్భంగా ఈరోజు మధ్యానం ఉట్నూర్ మండల కేంద్రంలోని హెచ్కేజిఎన్ గార్డెన్ లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ, లారీ, కార్ డ్రైవర్లకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డిఫెన్సివ్ డ్రైవింగ్ తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ వాహన నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల లో ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు. మంచి కంటి చూపుతో ప్రమాదాల నివారణ సాధ్యం అని

0f7ed44d-61e5-42fd-b312-88eeb4eafa25

తెలిపారు. ఆటోలలో ఇలాంటి అసంఘిక కార్యకలాపాలు చేయవద్దని, డ్రైవర్లకు ఎలాంటి అనుమానం ఉన్న వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం చేరవేయాలని తెలిపారు. ఈ ఉచిత కంటి పరీక్ష లో బోథ్ చెందిన 230 మంది ఆటో, టాక్సీ, లారీ డ్రైవర్లు పాల్గొన్నట్లు తెలిపారు. వీరందరికీ నిష్ణాతుడైన కంటి వైద్యులు డాక్టర్ సంధ్య పుష్కర్ ఆప్తమాలజీ, వైద్య పరీక్షలను నిర్వహించినట్లు, జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా పరీక్షలను పరిశీలించి, నిరుపేద 30 మంది డ్రైవర్లకు ఉచితంగా కంటి అద్దాలను ఇచ్చారు. శస్త్ర చికిత్సలు అవసరం ఉన్నవారికి ఆదిలాబాద్ పట్టణంలో ఉచితంగా వైద్య సేవలు అందించనునట్లు తెలిపారు. ముఖ్యంగా ఆటోలలో టాక్సీలలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, గంజాయి మాదకద్ర వ్యాలు లాంటి వాటివి తరలకుండా, నిషేధిత పదార్థాలను, వస్తువులను, వాటిని రవాణా చేయకుండా ఉండాలని తెలిపారు. డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఉట్నూర్ సీఐ ఎం ప్రసాద్, ఎస్ఐ జి విజయ్, ఇంద్రవెల్లి ఎస్ఐ ఈ సాయన్న, నార్నూర్ ఎస్సై శ్రీ సాయి, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పోలీసు డాక్టర్ శాంతరాజ్, ఆటో డ్రైవర్లు, పాఠశాల విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • ఉన్నది మొత్తం రెండు పాములు కనిపించాయి ఒకటి ప్రాణాలతో తప్పించుకుంది మరొకటి చనిపోయింది,తప్పించుకున్న పాము సుమారుగా ఇదే సైజ్ ఉండచ్చు అని అంచనా అటు వైపు చేను పనులకు వెళ్ళే వారు ,చెరువులో చేపలు పట్టేవారు జాగ్రత్తగా ఉండటం మంచిది
    1
    ఉన్నది మొత్తం రెండు పాములు కనిపించాయి ఒకటి ప్రాణాలతో తప్పించుకుంది మరొకటి చనిపోయింది,తప్పించుకున్న పాము సుమారుగా ఇదే సైజ్ ఉండచ్చు అని అంచనా అటు వైపు చేను పనులకు వెళ్ళే వారు ,చెరువులో చేపలు పట్టేవారు జాగ్రత్తగా ఉండటం మంచిది
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    5 hrs ago
  • నేరడిగొండ మండలంలోని బొందిడి గ్రామానికి చెందిన ఆడే రమేష్ (టీచర్) పదవి విరమణ సందర్భంగా ఆయన నివాసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ హాజరై టీచర్ రమేష్ ని శాలువాతో సన్మానించి వారి సేవలను ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.
    1
    నేరడిగొండ మండలంలోని బొందిడి గ్రామానికి చెందిన ఆడే రమేష్ (టీచర్) పదవి విరమణ సందర్భంగా ఆయన నివాసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ హాజరై టీచర్ రమేష్ ని శాలువాతో సన్మానించి వారి సేవలను ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Neradigonda, Adilabad•
    7 hrs ago
  • లక్షెట్టిపేటలో హనుమాన్ శోభాయాత్ర నేత్రపర్వంగా జరుగుతోంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం రాత్రి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయం నుండి హనుమాన్ భక్తులు, ప్రజలు హనుమాన్ ఫ్లెక్సీని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తి గీతాలు ఆలపించారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు.
    1
    లక్షెట్టిపేటలో హనుమాన్ శోభాయాత్ర నేత్రపర్వంగా జరుగుతోంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం రాత్రి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయం నుండి హనుమాన్ భక్తులు, ప్రజలు హనుమాన్ ఫ్లెక్సీని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తి గీతాలు ఆలపించారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • తెలంగాణ : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్య తండాకు చెందిన బోడ స్రవంతి, ప్రవీణ్ దంపతులు హైదరాబాదులో బతుకుతెరువు కోసం వెళ్లి, కూకట్పల్లిలో ఇద్దరు పిల్లలను చంపి, స్రవంతి ఆత్మహత్య చేసుకున్న ఘటనతో మృతురాలి స్వగ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. భర్త వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ, భర్త ఇంటిని, ఫర్నిచర్‌ను తగలబెట్టారు.
    1
    తెలంగాణ : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్య తండాకు చెందిన బోడ స్రవంతి, ప్రవీణ్ దంపతులు హైదరాబాదులో బతుకుతెరువు కోసం వెళ్లి, కూకట్పల్లిలో ఇద్దరు పిల్లలను చంపి, స్రవంతి ఆత్మహత్య చేసుకున్న ఘటనతో మృతురాలి స్వగ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. భర్త వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ, భర్త ఇంటిని, ఫర్నిచర్‌ను తగలబెట్టారు.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    4 hrs ago
  • Post by Solanke Ravi
    4
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    6 hrs ago
  • కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సీపీఎం నేతలు అంతర్జాతీయ ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, యుద్ధం వెంటనే ఆపి శాంతి చర్చలు ప్రారంభించాలని కోరారు. యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారత్ వంటి దేశాలు దౌత్యపరంగా జోక్యం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
    2
    కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సీపీఎం నేతలు అంతర్జాతీయ ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, యుద్ధం వెంటనే ఆపి శాంతి చర్చలు ప్రారంభించాలని కోరారు. యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారత్ వంటి దేశాలు దౌత్యపరంగా జోక్యం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • *సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్,వాహనాలకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరి* కోరుట్ల మార్చి 31 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం పట్టణంలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads” కార్యక్రమంలో భాగంగా సోమవారం కొరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో కొరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలకు చెందిన లారీ, ఐచర్ ఇతర భారీ వాహనాల డ్రైవర్లు, యజమానుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ట్రాఫిక్ నియమాలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాముఖ్యత, రహదారి భద్రతపై మార్గదర్శకాలు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “Arrive Alive” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. రాత్రి సమయంలో వాహనాలను రోడ్డు పక్కన నిలిపే సందర్భాల్లో రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని, తద్వారా ఇతర వాహనదారులకు వాహనాలు స్పష్టంగా కనిపించి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అధిక ప్రకాశం ఉన్న ఎల్ఈడి లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తాయని, వాటిని నియంత్రణలో వినియోగించాలని సూచించారు. అలాగే అధిక లోడ్‌తో లారీలు, ఐచర్ వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా లారీలు, వ్యాన్ వాహనాలకు రేడియం స్టిక్కర్లను అతికించి డ్రైవర్లకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, ఎంవిఐ శ్రీనివాస్ తదితరులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్, కొరుట్ల ఎస్సైలు చిరంజీవి, రామచంద్రం, మెట్‌పల్లి ఎస్సై కిరణ్, మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి, కథలాపూర్ ఎస్సై రవికిరణ్, అలాగే లారీ, వ్యాన్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు, యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
    4
    *సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్,వాహనాలకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరి*
కోరుట్ల మార్చి 31 ప్రజా ముద్ర న్యూస్ 
కోరుట్ల నియోజకవర్గం పట్టణంలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads” కార్యక్రమంలో భాగంగా సోమవారం కొరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో కొరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలకు చెందిన లారీ, ఐచర్  ఇతర భారీ వాహనాల డ్రైవర్లు, యజమానుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ట్రాఫిక్ నియమాలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాముఖ్యత, రహదారి భద్రతపై మార్గదర్శకాలు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “Arrive Alive” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. రాత్రి సమయంలో వాహనాలను రోడ్డు పక్కన నిలిపే సందర్భాల్లో రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని, తద్వారా ఇతర వాహనదారులకు వాహనాలు స్పష్టంగా కనిపించి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అధిక ప్రకాశం ఉన్న ఎల్ఈడి లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తాయని, వాటిని నియంత్రణలో వినియోగించాలని సూచించారు. అలాగే అధిక లోడ్‌తో లారీలు, ఐచర్ వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా లారీలు, వ్యాన్ వాహనాలకు రేడియం స్టిక్కర్లను అతికించి డ్రైవర్లకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, ఎంవిఐ శ్రీనివాస్ తదితరులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్, కొరుట్ల ఎస్సైలు చిరంజీవి, రామచంద్రం, మెట్‌పల్లి ఎస్సై కిరణ్, మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి, కథలాపూర్ ఎస్సై రవికిరణ్, అలాగే లారీ, వ్యాన్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు, యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
    user_దయా మదన్
    దయా మదన్
    Metpalli, Jagitial•
    16 hrs ago
  • చండీయాగాన్నికీ భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి హోమం కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యగలరని పిలుపునిస్తున్న చండీ యాగం నిర్వాహకులు శ్రీ కృష్ణ స్వామి గారు... పాత ఉట్నూర్ 16వ వార్డు సభ్యులు టెకం.రేఖ
    2
    చండీయాగాన్నికీ భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి హోమం కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యగలరని పిలుపునిస్తున్న చండీ యాగం నిర్వాహకులు శ్రీ కృష్ణ స్వామి గారు... పాత ఉట్నూర్ 16వ వార్డు  సభ్యులు టెకం.రేఖ
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.