ఒక్కరూ సీపీఆర్ శిక్షణ తీసుకుని ఉంటే అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడే అవకాశం సీపీఆర్ నేర్చుకోండి ప్రాణాలను కాపాడండి ప్రతి ఒక్కరూ సీపీఆర్ శిక్షణ తీసుకుని ఉంటే అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడే అవకాశం మన చేతుల్లోనే ఉంటుందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా మేనేజింగ్ కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ కేవీ రమణ,కోశాధికారి డాక్టర్ జి మహాలక్ష్మి అన్నారు. శనివారం స్థానిక రెడ్ క్రాస్ భవనంలో ది పిఎంపి అసోసియేషన్ కోరుకొండ సభ్యులకు బేసిక్ ఫస్ట్ ఎయిడ్ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కేవీ రమణ మాట్లాడుతూ ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత రుగ్మతలతో ప్రాణాలు కోల్పోతున్న వారిని చూస్తున్నామని, అలా గుండె నొప్పి వచ్చిన సమయంలో అంబులెన్స్ వచ్చి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళే లోపు ఆ బాధితుడిని రక్షించుటకు చేసే ప్రధమ చికిత్సే సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిసాసిటేషన్) అని, గుండెపోటు వచ్చిన వ్యక్తి శ్వాస తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఈ నేపథ్యంలో గుండె,మెదడుకు,మిగిలిన అవయవాలకు రక్తప్రసరణ కొనసాగించేందుకు ఛాతీపై ఒత్తిడి తెచ్చి ప్రాణలను రక్షించేదే సీపీఆర్ ప్రక్రియ అని ,ముఖ్యంగా పల్లెల్లో ప్రధమ చికిత్స అందించే పీఎంపీలు సీపీఆర్ పై శిక్షణ పొంది ఉండాలని పేర్కొన్నారు. డాక్టర్ జి మహాలక్ష్మి మాట్లాడుతూ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా సీపీఆర్ పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని,దీనిని వివిధ సంస్థలకు సంబంధించిన సిబ్బందికి శిక్షణ ను ఇవ్వడం జరుగుతుందని, ఇది వైద్యులు, వైద్య సిబ్బందే కాదు. సాధారణ ప్రజలు కూడా సీపీఆర్ నేర్చుకుని ఆపదలో ఉన్నవారిని కాపడవచ్చని అన్నారు.దీనికి గాను శిక్షణ పొందిన వారికి ధృవీకరణ పత్రం అందిస్తున్నామని తెలిపారు. ఎమ్సీ సభ్యులు బి పద్మావతి మాట్లాడుతూ సేవే లక్ష్యంగా సాగుతున్న శిక్షణ కార్యక్రమం చాలా ఉపయోగకరమైనదని అన్నారు.శిక్షణ పొందిన వారు సీపీఆర్ చేయడం వలన బాధితులకు మేలు జరుగుతుందని అన్నారు.పీఎంపీ జిల్లా అధ్యక్షులు ఎమ్సీ సభ్యులు బళ్ళా శ్రీనివాసరావు,బోను రామకృష్ణ, కోరుకొండ మండల అధ్యక్షులు కుంచే వినోద్,కార్యదర్శి ఎస్ భాస్కర్, కోశాధికారి బీహెచ్ శివకుమార్,ట్రైనర్ గోపాలకృష్ణ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

- సాగునీటి సద్వినియోగం,సైబర్ మోసాలు, యువత భద్రతపై పోలీసుల ప్రత్యేక దిశానిర్దేశం పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలోని రామాలయం సెంటర్ వద్ద శుక్రవారం సాయంత్రం పోలీసులు మరియు గ్రామ ప్రజల సమక్షంలో ఒక ప్రత్యేక ప్రజా అవగాహన సదస్సు నిర్వహించారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ)జి. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సుకు స్థానిక రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ విశేష చొరవతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల గొల్లప్రోలు ప్రాంత రైతులకు పుష్కర కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేసిన విషయాన్ని సీఐ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైతులు ఎటువంటి పరస్పర విభేదాలకు తావు ఇవ్వకుండా అందరూ సఖ్యతతో మెలుకువలు పాటిస్తూ నీటిని సద్వినియోగం చేసుకోవాలని,పంటల సాగును విజయవంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అమ్మ ఒడి పథకం నిధులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్న తరుణంలో ప్రజలు సైబర్ నేరగాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ ద్వారా నకిలీ లింకులు పంపి ఓటిపిలు లేదా బ్యాంకు ఖాతా వివరాలు అడిగే మోసాల బారిన పడకుండా ఉండాలని,ఎవరికీ వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని స్పష్టం చేశారు. నేటి యువత మొబైల్ ఫోన్లకు బానిస కావడం,వ్యసనాలకు లోనవుతుండటం తీవ్ర ఆందోళనకరమని సీఐ ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచాలని వారి స్నేహితులు మరియు దైనందిన కార్యకలాపాలను గమనిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. అక్రమ కార్యకలాపాల నిర్మూలనలో పోలీసులకు సహకారం అందించి గ్రామాల్లో గంజాయి విక్రయాలు,నాటు సారా తయారీ లేదా అమ్మకాలు, మరియు పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని భరోసా కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని సీఐ సూచించారు. వాహనాలను రోడ్లపై ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని కాబట్టి అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.1
- 🙏🙏1
- Post by Adimlamganash1
- ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటింటికి ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో శనివారం నాడు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని వృద్ధులు మహిళలు వారి యొక్క సమస్యలను చెప్పిన వెంటనే ఎమ్మెల్యే స్థానిక అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.1
- వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.1
- భద్రాచలం గోదావరిలో శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనం...... భద్రాచలం: ఏడాది పాటు పూజలు నిర్వహించిన శ్రీరామకోటి పుస్తకాలను గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మేరకు శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్‌రావు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి శ్రీరామకోటి పుస్తకాలను గోదావరిలో నిమజ్జనం చేశారు.1
- 🙏🙏1
- మొరాకో-స్పెయిన్ సరిహద్దులో వలస సంక్షోభం తీవ్రం. 57 మంది మృతి. 🔹 వలసదారులను చట్టబద్ధం చేస్తారనే ఆశతో మొరాకో నుంచి భారీగా స్పెయిన్‌లోకి ప్రవేశం 🔹 కేవలం 24 గంటల్లోనే సుమారు 60 వేల మంది దేశంలోకి వచ్చినట్లు స్పెయిన్ అధికారులు వెల్లడి 🔹 సరిహద్దు దాటే ప్రయత్నాల్లో 57 మంది మృతి 🔹 వలసదారులు-భద్రతా బలగాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు 🔹 పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని పెడ్రో సాంచెజ్ తెలిపారు1