Shuru
Apke Nagar Ki App…
కోట్ పల్లి: మండల కేంద్రం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాఖీ పండుగ వేడుకలు వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండల కేంద్రంలో గురువారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో PM SHRI కార్యక్రమంలో భాగంగా రాఖీ పండుగ కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారి చంద్రప్ప ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకొని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగిందన్నారు విద్యార్థుల్లో సోదరభావం, ప్రేమ, ఆత్మీయతలను పెంపొందిండం జరిగిందని వారు పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో మోహన్ నరసింహారెడ్డి, తిరుమలయ్య,మల్లేశం అంజయ్య, యాస్మిన్ బేగం, శివప్రసాద్. . శ్యామయ్య.ఫాతిమా బేగం, వెంకటేష్, శ్రీనివాస్, శ్యామయ్య, తదితరులు పాల్గొన్నారు.
B, PRAVEEN KUMAR
కోట్ పల్లి: మండల కేంద్రం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాఖీ పండుగ వేడుకలు వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండల కేంద్రంలో గురువారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో PM SHRI కార్యక్రమంలో భాగంగా రాఖీ పండుగ కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారి చంద్రప్ప ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకొని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగిందన్నారు విద్యార్థుల్లో సోదరభావం, ప్రేమ, ఆత్మీయతలను పెంపొందిండం జరిగిందని వారు పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో మోహన్ నరసింహారెడ్డి, తిరుమలయ్య,మల్లేశం అంజయ్య, యాస్మిన్ బేగం, శివప్రసాద్. . శ్యామయ్య.ఫాతిమా బేగం, వెంకటేష్, శ్రీనివాస్, శ్యామయ్య, తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- తీన్మార్ మల్లన్న సర్జికల్ స్ట్రైక్ లో మేడ్చల్ మల్కాజ్గిరి గురించి ప్రస్తావన1
- శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- “ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపణ యూరియా కోసం వెళ్లిన రైతులకు అదనపు ఎరువుల భారం తప్పడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుక్ చేసుకున్న యూరియాతో పాటు మరో ఎరువును తప్పనిసరిగా కొనుగోలు చేయాలని డీలర్లు ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిప్పలతుర్తిలో ఓ దుకాణదారుడు రైతులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలిపారు. అంతేకాకుండా, “ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. రైతుల ఫిర్యాదులపై వ్యవసాయ శాఖ డీఏ, ఎంఓలు స్పందించారు. యూరియాతో పాటు ఇతర ఎరువులను బలవంతంగా అంటగట్టడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- *కోర్టు పరిధిలో భూమి..! కబ్జాలోకి ఎలా వచ్చింది.?* *ఈదులనాగులపల్లిలో సర్వే నంబర్లు 134, 135పై రైతుల ఆందోళన* *తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం చేస్తారంటున్న రైతులు* *కోర్టు పరిధిలో ఉన్న భూములలొ జేసీబీలతో రోడ్డు పనులు ఎలా చేస్తారు* *రియల్ వ్యాపారుల పనులను అడ్డుకున్న గ్రామస్తులు* *అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రైతుల ప్రశ్న* *తహసీల్దార్‌కు ఫిర్యాదు.. కలెక్టర్‌ను కలవనున్న గ్రామస్తులు* *భూముల రక్షణ కొరకు కార్యాచరణ కమిటీ ఏర్పాటు* *రోడ్డు పనులకు అనుమతులు ఎవరు అనుమతులు ఇచ్చారు* *కోర్టు వివాదం నడుస్తుండగానే పనులెలా సాగిస్తారు* తమ భూములు తమకు దక్కేవరకు పోరాటం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామ రైతులు స్పష్టం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం, ఈదులనాగులపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 134, 135లోని భూములపై వివాదం కొనసాగుతోంది. తమ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థాన పరిధిలో ఉండగానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడం రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు చేపట్టేందుకు అనుమతి ఎవరు ఇచ్చారు? అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారులు జేసీబీలతో భూమి చుట్టూ మట్టి రోడ్డు వేస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అప్పటికే కొంత దూరం వరకు మట్టి రోడ్డు వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కోర్టులో వివాదం కొనసాగుతున్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు, రోడ్డు పనులు, ఇతర మార్పులు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రైతులు ఆర్‌సీ పురం తహసీల్దార్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఆమె ఇది తన పరిధిలోకి రాదని తప్పించుకున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు జరుగుతున్న అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, భూముల రికార్డులు, కోర్టు కేసు వివరాలను పరిశీలించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. వివాదాస్పద భూములను పరిరక్షించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యను జిల్లా స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. భూముల పరి రక్షణ కోసం కార్యచరణ కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి పోరాట కార్యక్రమాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్న భూమిలో రియల్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడంపై అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోర్టు పరిధిలోని భూములలో రోడ్డు పనులు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? రికార్డులను పరిశీలించకుండానే పనులు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమి హద్దులు, రికార్డులు, కోర్టు కేసు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే తమ భూమి తమకు దక్కేవరకు పోరాటం తీవ్ర తరం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.3
- ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి: కవిత ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తుందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ పదవులను పక్క రాష్ట్రం వారికి ఇవ్వడాన్ని మరియు మన ఉద్యమకారులను దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. తెలంగాణ బ్రాహ్మణులకు గౌరవం దక్కాల్సిందే, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్‌లను తక్షణమే తొలగించాలన్నారు.1
- పాలిటెక్నిక్ కళాశాలలపై జీవో 97 రద్దు చేయాలి విద్యార్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: డా. రామచంద్రరావు హైదరాబాద్: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ ఎడ్యుకేషనల్ వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97పై విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవో అమలు వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలుగుతుందని, తమకు అన్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీవో 97ను పునఃసమీక్షించి రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా. రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.1
- మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునేందుకు లబ్ధిదారులు చౌకధరల దుకాణాల వద్ద బారులు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునేందుకు లబ్ధిదారులు చౌకధరల దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో రేషన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. మరోవైపు సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొందరు డీలర్లు టోకెన్ల విధానాన్ని అనుసరిస్తూ లబ్ధిదారులకు బియ్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. మూడు నెలల కోటా కావడంతో రేషన్ దుకాణాల వద్ద రద్దీ మరింత పెరిగింది. సర్వర్ సమస్యను త్వరగా పరిష్కరించి, అందరికీ ఇబ్బందులు లేకుండా బియ్యం పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.1
- రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ చేశారని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాం చందర్ రావు ఆరోపించారు. జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై లాఠీచార్జీలు, కేసులు పెట్టడం సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్టైఫండ్లు, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిందని, విశ్వవిద్యాలయాలు, పాఠశాలల్లోనూ సమస్యలు ఉన్నాయని విమర్శించారు. విద్యార్థులను కలవకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. బైట్...రాం చందర్ రావు4