Shuru
Apke Nagar Ki App…
ఏగూరి చిన్న కావలి
Yeguri Chinna
ఏగూరి చిన్న కావలి
More news from Spsr Nellore and nearby areas
- నెల్లూరు నగరంలోని నేటి ఉదయం స్థానిక మద్రాస్ బస్టాండ్ సమీపంలో గల సుంకు జంగన్న నగర పాలక హై స్కూల్ నందు సంక్రాంతి భోగి కనుమ పండుగ ముందస్తు వేడుకలు విద్యార్థులతో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే క్రమంలో సృజనాత్మకతను వెలికి తీసే క్రమంలో రంగవల్లి పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 90 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. గెలుపొందిన వారికి ఐదు మందికి ప్రత్యేక బహుమతులు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు .పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహ బహుమతిని అందిస్తామని తెలిపారు. అదే క్రమంలో విద్యార్థులతో మేము సైతం అంటూ ఉపాధ్యాయులు కూడా రంగవల్లి పోటీలలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఉపాధ్యాయులు. ముందస్తు భోగి వేడుకలను కూడా విద్యార్థులతో కలిసి పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ కె అరవింద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమటం సుబ్బారావు రామ్మోహన్ సుబ్బరాజు మహేంద్ర ప్రభాకర్ అస్మా ప్రవీణ అరుణ తదితరులు విద్యార్థులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.3
- కాసినయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన శ్రీదేవి గత 6 సంవత్సరాలుగా పక్షవాతనికి గురై మంచానికి పరిమితమైంది.భర్త చనిపోవడం తో ఆమె రోడ్డున పడింది. విషయం తెలుసుకున్న మూలపల్లె టీచర్ చంద్రశేఖర్ ఆచారి ఆమె రూ.2లక్షల ఖర్చుతో ఇల్లు నిర్మించి మానవత్వం చాటుకున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన ఆమె ఇంటికి రంగులు వేయించాడు. ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ఆదుకుంటున్నారు. రెండు సంవత్సరాలుగా ఆమె చిన్న కుమారుడు చదువు కోసం ఖర్చు చేస్తున్నాడు.2
- విశాఖపట్నం గాజువాకలోని ఓం జ్యువలరీ షాపులో జరిగిన ఈ దొంగతనం ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. గాజువాక బి.సి. రోడ్డులోని ఓం జ్యువలరీ షాపులోకి ముగ్గురు మహిళలు కస్టమర్లలా వేషధారణలో వచ్చారు. నగలు చూపిస్తుండగా, షాపు యజమాని కళ్లు గప్పి అత్యంత చాకచక్యంగా బంగారు వస్తువులను తమ జడల్లో (కొప్పులో) దాచుకోవడానికి ప్రయత్నించారు. మహిళల ప్రవర్తనపై అనుమానం వచ్చిన షాపు యజమాని, సిబ్బంది వారిని నిశితంగా గమనించారు. వారు బంగారాన్ని జడలో పెట్టుకోవడం గమనించిన యజమాని వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. నిందితులను సోదా చేయగా దొంగిలించిన బంగారం బయటపడింది. పోలీసుల విచారణలో పట్టుబడిన మహిళలను ఈ క్రింది విధంగా గుర్తించారు: 1.-భోజ నాగమణి 2.-బోజగాని జ్ఞానమ్మ 3.-పొన్నా పద్మ సమాచారం అందుకున్న గాజువాక క్రైమ్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించే ప్రక్రియలో ఉన్నారు వీరు పాత నేరస్తులా? లేక ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి దొంగతనాలకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. షాపుల్లో సీసీటీవీ కెమెరాలు ఉండటం, యజమాని అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ఈ భారీ దొంగతనం విఫలమైంది. గాజువాక పరిసరాల్లోని వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.1
- Post by Bondhu Suresh1
- ఆసుపత్రిలో తండ్రి ప్రేమను చూపించిన హృదయవిదారక వీడియో. అనారోగ్యంతో ఉన్న తన కూతురిని సంతోషంగా ఉంచేందుకు తండ్రి నవ్వుతూ, ఆమెతో మాట్లాడుతూ పక్కనే ఉండే దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.1
- చంద్రగిరిలో జవాన్ సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కూడా లంచం అడుగుతున్న టీడీపీ నేతలు #STV9: రూ.2 లక్షలు ఇవ్వాలని.. లేకపోతే ఇల్లు కట్టుకోనివ్వమని స్థానిక టీడీపీ నేత బాలాజీ వార్నింగ్ #chandhragi1
- గుంటూరు జిల్లా/ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గురువారం సహకార సంఘాల సొసైటీ సీఈవోలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 2019 నుంచి ఉద్యోగాల్లో ఉన్నవారిని పర్మనెంట్ చేయాలని, మెడికల్ అలవెన్స్, గ్రాడ్యుటివ్ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని సంఘాల నాయకులు హెచ్చరించారు.1
- బద్వేల్ పట్టణంలో మున్సిపల్ రెవెన్యూ సిబ్బందితో కలసి పన్ను వసూలు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి హాజరయ్యారు. సత్వరమే పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. టాప్ 100 నుండి బకాయిదారుల జాబితా బహిరంగ ప్రదేశాల్లో కూడళ్లలో త్వరలో ప్రదర్శన చేస్తామన్నారు. ఏళ్ల తరబడి బకాయిలు ఉన్న పన్ను ఎగవేతదారులు తక్షణమే పన్నులు చెల్లించకపోతే వ్యాపార సముదాయాలు సీజ్ చేస్తామన్నారు.1