అనంతపురంలో కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు అనంతపురం జిల్లా కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో వచ్చిన బెదిరింపు మెయిల్‌ను రిపీట్ చేస్తూ అదే వివరాలతో ఇమెయిల్ పంపినట్లు సమాచారం.సమాచారం అందుకున్న వెంటనే కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో పూర్తి స్థాయి తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వస్తువులు ఏవీ లభించలేదని పోలీసులు తెలిపారు.కోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసి, ప్రవేశాల వద్ద కఠిన తనిఖీలు నిర్వహిస్తున్నారు. రిపీట్ మెయిల్ ఎక్కడి నుంచి పంపారన్న దానిపై సైబర్ నిపుణులు దర్యాప్తు ప్రారంభించారు. గత మెయిల్‌తో సంబంధం ఉందా అనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు.వరుస బెదిరింపులతో న్యాయవాదులు, సిబ్బంది, ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

- ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీని ఆశ్రయించాలని ATP ఏసీబీ CI పి.హమీద్ ఖాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల ప్రజలు అవినీతి రహిత సమాజం కోసం సహకరించాలని కోరారు. బాధితులు నేరుగా అనంతపురం పట్టణం ఏసీబీ కార్యాలయానికి రావచ్చు లేదా 14400 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.1
- శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టులో బాంబు కలకలం కోర్టు కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చిన జ్యుడిషియల్ కోర్టు సిబ్బంది,కక్షిదారులు జిల్లా కోర్టు ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల 5 నిముషాల కు 12 ఆర్డి ఎక్స్ బాంబులు పేలుతుంది అనే మెయిల్ సమాచారం వచ్చినట్లు తెలిపిన కోర్టు అధికారులు. అయితే సమయం గడచిపోవడంతో ఉత్తిదేనని ఊపిరి పీల్చుకున్న అధికారులు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.3
- శ్రీశైలం మల్లన్నను టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.మడకశిర నుంచి ఇరుముడితో వెళ్లి శ్రీశైలం మల్లన్నకు మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం స్వామి వారిని కుటుంబ సమేతంగా వేద పండితులచే ఆశీర్వచనాలు అందుకున్నారు.1
- ఆదోనిలో జరిగే చత్రపతి శివాజీ జయంతి వేడుకలకు ఈ నెల 19వ తేదీన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ పరిరక్షణ సమితి నాయకులు చీకోటి ప్రవీణ్ హాజరవుతున్నట్లు తెలిపారు.1
- కడప అల్లాహ్ 23 24 251
- పాములపాడు లో కులాంతర వివాహం చేసిన ఎమ్మార్పీఎస్ మరియు మాల మహానాడు నాయకులు కోటా ప్రభాకర్ మాదిగ, నల్లమల్ల అబ్రహం మాల నంద్యాల జిల్లా ఎమ్ ఎస్ పి అధికార ప్రతినిధి మరియు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఇన్చార్జి కోట ప్రభాకర్ మాదిగారు మరియు మాల మహానాడు జాతీయ నాయకులు నల్లమల్ల అబ్రహం మాల గార్ల సమక్షంలో పాములపాడు మండల కేంద్రం చౌడమ్మ గుడి దగ్గర ఎరుకల కులానికి చెందిన దినారి రామకృష్ణ కొడుకు వేణుగోపాల్ నందికొట్కూరు మారుతి నగర్ కు చెందినటువంటి ఓనమాల లక్ష్మీదేవి కుమార్తె శ్రావణి ఇద్దరు గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరి 13వ తారీకు అబ్బాయి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో ఈ విషయం తెలుసుకున్న పెద్దలు కులాలు వేరు కావడంతో ఇరుకుటుంబంలో కొంతవరకు ఘర్షణ వాతావరణం నెలకొంది. అమ్మాయి అబ్బాయికి కొన్ని రోజులు కౌన్సెలింగ్కు పంపించారు. అయినా మేము ఒకరికి ఒకరు ఇష్టపడ్డాం మేం కలిసే ఉంటాం అని చెప్పడంతో అమ్మాయి అబ్బాయి ఇద్దరు మేజర్లు కావడంతో రెండు కులాల పెద్దల తో మాట్లాడి వారికి కులాంతర వివాహాన్ని జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు , జడల శ్రీనివాసులు మాదిగారు, మిడుతూరు మండల ఇంచార్జ్ భూపనుపాడు సతీష్ మాదిగ గారు, మిడుతూరు మండలం ఎమ్మెస్పీ అధ్యక్షులు గోపాల వెంకటరమణ గారు, పాములపాడు మండలం ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు కనకం మరిస్వామి గారు చవిటి వెంకటరమణ మరియు ఎరుకల సంఘం కుల పెద్దలు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది.5
- మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG1
- తమ ప్రభుత్వం ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదిగా భావిస్తుందని మంత్రి సత్యకుమార్ అన్నారు.ఆళ్లగడ్డ, వాయల్పాడు, కొవ్వూరు, కోవూరులలో 50 పడకల ఆస్పత్రులను 100 పడకలకు మార్చాలని సభ్యులు కోరగా మంత్రి రిప్లై ఇచ్చారు. 'కొత్త పాలసీ రూపొందిస్తున్నాం. 50 పడకల కన్నా తక్కువ ఉన్న ఆస్పత్రులను 61 నియోజకవర్గాల్లో గుర్తించాం. ఆయా నియోజకవర్గాల్లో పీపీపీ కింద 100 పడకల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తాం' అని తెలిపారు1