విజయవాడ సెక్రటేరియట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ సొల్లా బొజ్జి రెడ్డి గారు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని ఈ రోజు కలిశారు. ఈ సందర్భంగా **కొత్త జిల్లా ఏర్పడిన నేపథ్యంలో రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిని 200 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలని** చైర్మన్ గారు మంత్రిని కోరారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న రూములు, పడకలు సరిపోక రోగులు మరియు వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొత్త జిల్లా అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రి మౌలిక వసతులను విస్తరించాల్సిన అవసరం ఉందని వివరించారు. అలాగే ఆసుపత్రిలో **CT స్కాన్, కార్డియాక్‌కు సంబంధించిన అధునాతన వైద్య పరికరాలు, బ్లడ్ బ్యాంక్** తదితర అత్యవసర వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రంపచోడవరంలో **నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని**, చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. గిరిజన సంక్షేమ హాస్టళ్లలో అవసరమైన **ANM పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు, రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే మంజూరైన పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని** చైర్మన్ గారు కోరారు. ఆసుపత్రి సేవలను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన బడ్జెట్‌ను, అదనపు పోస్టులను పెంచాలని కూడా విజ్ఞప్తి చేశారు. చైర్మన్ గారు చేసిన విజ్ఞప్తులపై గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు **సానుకూలంగా స్పందించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు
విజయవాడ సెక్రటేరియట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ సొల్లా బొజ్జి రెడ్డి గారు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని ఈ రోజు కలిశారు. ఈ సందర్భంగా **కొత్త జిల్లా ఏర్పడిన నేపథ్యంలో రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిని 200 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలని** చైర్మన్ గారు మంత్రిని కోరారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న రూములు, పడకలు సరిపోక రోగులు మరియు వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొత్త జిల్లా అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రి మౌలిక వసతులను విస్తరించాల్సిన అవసరం ఉందని వివరించారు. అలాగే ఆసుపత్రిలో **CT స్కాన్, కార్డియాక్‌కు సంబంధించిన అధునాతన వైద్య పరికరాలు, బ్లడ్ బ్యాంక్** తదితర అత్యవసర వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రంపచోడవరంలో **నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని**, చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. గిరిజన సంక్షేమ హాస్టళ్లలో అవసరమైన **ANM పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు, రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే మంజూరైన పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని** చైర్మన్ గారు కోరారు. ఆసుపత్రి సేవలను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన బడ్జెట్‌ను, అదనపు పోస్టులను పెంచాలని కూడా విజ్ఞప్తి చేశారు. చైర్మన్ గారు చేసిన విజ్ఞప్తులపై గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు **సానుకూలంగా స్పందించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు
- కొత్త సూరవరంలో ఘనంగా ప్రారంభమైన పరదేశమ్మ తల్లి జాతర మహోత్సవా లు కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో 41 జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర మహోత్సవంలో భాగంగా 11 రోజులు దీక్ష అనంతరం మాల ధారణ ధరించిన భక్తులు ఇరుముడులు కట్టుకొని ఎస్. అన్నవరం గ్రామమంతా గిరి ప్రదక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు యువత, పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం అమ్మవారి ఆలయం వద్ద గురు స్వామి చోడిశెట్టి కన్నా ప్రకాష్ ఆధ్వర్యంలో మాల విసర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ బుధవారం నాడు రాత్రి అమ్మవారి జాతర కార్యక్రమం ఘనంగా జరుగుతుందని తెలిపారు.1
- సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా 116 వ జయంతి వేడుకలు అనకాపల్లి:స్థానిక సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షు లు బల్లా నాగభూషణం ఆధ్వర్యంలో పట్టణం లో గల కన్యకాపరమేశ్వరి దేవాలయం జంక్షన్ లో గల భారతరత్న మదర్ థెరిస్సా విగ్రహం వద్ద మదర్ థెరిస్సా 116 వ జయంతి వేడుకల ను ఘనముగా నిర్వహించా రు. ఈ కార్యక్రమం లో సంస్థ అధ్యక్షులు బల్లా నాగభూష ణము మదర్ థెరిస్సా విగ్ర హానికి జ్యోతి వెలిగించి పూలమాల వేసి ఘనముగా నివాళి లర్పించారు.విద్యా ర్థులకు, పాదచారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా బల్లా నాగభూషణం మాట్లాడు తూ మదర్ థెరిస్సా గారు భారతదేశమునకు చేసిన సేవలు ఎన్నటికీ మరచి పోలేనివని వారు మన దేశము లో నిరుపేదలకు, కుష్ఠు రోగులకు,క్షయ వ్యాధి గ్రస్తులకు, క్షత గాత్రులకు, తన ఫౌండేషన్ ద్వారా అశేషమైన సేవలను అందించిన మహనీయ వ్యక్తియని, అటువంటి మహనీయ సేవామూర్తి చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం వారి శత జయంతి ని పురష్కరించు కొని అత్యుత్తమ భారత రత్న పురస్కారాన్ని ఇచ్చి గౌరవించిందని, అలాగే వారి సేవలకు గాను రామన్ మెగ సేసే అవార్డు, ప్రపంచం నోబెల్ బహుమతీ వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్న సేవా మూర్తి యని, ప్రార్ధించే పెదవులక న్నా సాయం చేసే చేతులు మిన్న అన్న ఆశయ స్ఫూర్తి తో తన జీవితమంతా అన్నార్థుల, అభాగ్యుల సేవల కే అంకితం చేశారని అటువంటి గొప్ప మహనీ య వ్యక్తి 116 వ జన్మదినం సందర్భముగా వారికి ఘన నివాళులు అర్పించుకోవడం ఎంతో గర్వముగా సంతోష ముగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దార్థ అసోసియేషన్ కార్యదర్శి వినకోట నీలేష్ గుప్తా, సహాయ కార్యదర్శులు రొబ్బి మల్లేశ్వరరావు, బల్లా శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు అయ్యగారి వెంకటరమణ మూర్తి, పొట్టి శ్రీరాములు భవన్ చైర్మన్ పిరాట్ల నరసింహ మూర్తి, జె. ఎం. జె. స్కూల్ స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్దులు, ఉపాధ్యాయులు పాల్గొన్నా రు.1
- రోలుగుంటలో మంచినీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన ర్యాలీ.... రోలుగుంట, ఆగస్టు 26: ఫ్లోరైడ్ ప్రభావిత రోలుగుంటలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ దళిత, గిరిజన, పేద మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో ర్యాలీ నిర్వహించారు. వరాహ నదిలో ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. కాలనీలకు తక్షణం ట్యాంకర్ల ద్వారా నీరందించాలని, సీఎస్‌ఆర్, డీఎఫ్‌ఎం నిధులతో శాశ్వత మంచినీటి పథకం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. సీపీఎం నాయకులు కె.గోవిందరావు, వి.నూకరత్నం, వి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.4
- *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II1
- నెల్లిమర్ల మండలం వల్లూరు మర్డర్ కేసు లో ఇద్దరు అరెస్టు నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామంలో కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో సిరిగుడి అప్పలనారాయణ, అతని కుమారుడు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.6 వేల ట్రాక్టర్ కిరాయి డబ్బుల విషయమై వివాదం జరగగా, శ్రీను కర్రతో రామారావు తలపై దాడి చేయడంతో మృతి చెందినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదైన 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు.1
- విజయనగరం: బీసీల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.. విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీ నాయకులు, బీసీ వర్గాలపై జరిగిన దాడులు, అణచివేతలను గుర్తుచేస్తూ.. తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచిన బీసీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. బీసీల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యతతో పాటు బీసీ నాయకులకు సముచిత గౌరవం, ప్రాతినిధ్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.1
- శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ సందర్భంగా వెలిగిపోతున్న నెల్లిమర్ల నగరం నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి సెగిడి వీధి లో శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ 26-28వ తేదీ వరకు మూడు రోజులు నిర్వహించనున్నామని కనకదుర్గమ్మ ఆలయ కమిటీ బుధవారం తెలిపారు. నగరంలో ప్రధాన రహదారి, సెగిడివీధీలో లైటింగ్ తో నగరం మెరిసిపోతుంది. మొదటిరోజు మొయిద జంక్షన్లో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం,బంధువులు, స్నేహితులకు స్థానికులు విందు ఏర్పాట్లు చేశారు. గురువారం అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వనున్నామని చెప్పారు.1
- ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ సేవలు ప్రారంభం-తుమ్మపాలలో కొత్త వెలుగులు అనకాపల్లి:సామాజిక సేవే పరమావధిగా, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూతనందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనకాపల్లి జిల్లాలోని తుమ్మపాల గ్రామంలో నూతనంగా ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ ముఖ్య నేత ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం వి ఆర్) చేతుల మీదుగా పూజా కార్యక్రమం చేసి ఈ సేవా సంస్థ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు ( ఎం వి ఆర్) మాట్లాడుతూ... సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు, అకస్మాత్తుగా ఆపదల్లో చిక్కుకున్న బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఎవరికైనా ఏ చిన్న కష్టం వచ్చినా, విద్య, వైద్యం, లేదా మరేదైనా ఆపద ఎదురైనా సరే నిరభ్యంతరంగా ట్రస్ట్ వద్దకు వచ్చి సంప్రదించవచ్చు. మా పరిధి మేరకు ప్రతి ఒక్కరికీ కొండంత అండగా ఉంటామని ఆయన ప్రజలకు ఘనంగా భరోసా నిచ్చారు.సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ఆరంభమైన ఈ ట్రస్ట్ కార్యకలాపాలు సీఈవో బలరామ్, సి పీఆర్‌ఓ బోస్, ట్రస్ట్ మెంబర్ విష్ణువర్ధన్ ల సమర్థవంతమైన సారథ్యంలో నిరంతరం కొనసాగనున్నాయన్నారు. ఈ సేవా కార్యక్రమానికి అనకాపల్లి ఇన్‌చార్జ్ గైపూరి రాజుతో పాటు ఎం వి ఆర్ యువసేన సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ మద్దతు తెలిపారు. మానవత్వమే ప్రాతిపదికగా సేవారంగంలోకి అడుగుపెట్టిన ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ నిర్వాహకులను తుమ్మపాల గ్రామస్తులు, ప్రజాప్రతి నిధులు హృదయపూర్వకంగా అభినందించారు. సంప్రదించవలసిన నెంబర్లు 08924. 2378964