Shuru
Apke Nagar Ki App…
మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో అందుబాటులోకి మూడో రైల్వే లైన్ మహబూబాబాద్ జిల్లా: కాజీపేట నుండి విజయవాడకు219 కిలోమీటర్ల రైల్వే మూడో లైన్ అందుబాటులోకి వచ్చింది.. నూతనంగా నిర్మించిన మూడో రైల్వే లైన్ పై రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి.. న్యూఢిల్లీ-చెన్నై మధ్య ఉన్న ఈ గ్రాండ్ ట్రంక్ లైన్ పై విపరీతమైన రైళ్ల రద్దీ ఉండడంతో ప్రస్తుతం ఉన్న రెండు రైల్వే ట్రాక్‌ల లైన్లు సరిపోకపోవడంతో మూడో లైన్ నిర్మాణ పనులను పదేళ్ల క్రితం ప్రారంభించింది .. ఇందులో మహబూబాబాద్ నుండి కాజీపేట సెక్షన్‌ల మధ్య ఉన్న పనులు ఈ పనులు పూర్తయ్యాయి. దీంతో మూడో లైన్‌పై నుంచి రైళ్ల రాకపోకలను కొనసాగించనున్నారు.. . ఇక రైళ్ల రాకపోకలు నిర్ణీత సమయంలో కొనసాగేందుకు అవకాశం ఉందని రైల్వేశాఖ భావిస్తోంది...
Mogulagani Mahendar Mogulagani Mahendar
మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో అందుబాటులోకి మూడో రైల్వే లైన్ మహబూబాబాద్ జిల్లా: కాజీపేట నుండి విజయవాడకు219 కిలోమీటర్ల రైల్వే మూడో లైన్ అందుబాటులోకి వచ్చింది.. నూతనంగా నిర్మించిన మూడో రైల్వే లైన్ పై రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి.. న్యూఢిల్లీ-చెన్నై మధ్య ఉన్న ఈ గ్రాండ్ ట్రంక్ లైన్ పై విపరీతమైన రైళ్ల రద్దీ ఉండడంతో ప్రస్తుతం ఉన్న రెండు రైల్వే ట్రాక్‌ల లైన్లు సరిపోకపోవడంతో మూడో లైన్ నిర్మాణ పనులను పదేళ్ల క్రితం ప్రారంభించింది .. ఇందులో మహబూబాబాద్ నుండి కాజీపేట సెక్షన్‌ల మధ్య ఉన్న పనులు ఈ పనులు పూర్తయ్యాయి. దీంతో మూడో లైన్‌పై నుంచి రైళ్ల రాకపోకలను కొనసాగించనున్నారు.. . ఇక రైళ్ల రాకపోకలు నిర్ణీత సమయంలో కొనసాగేందుకు అవకాశం ఉందని రైల్వేశాఖ భావిస్తోంది...
More news from తెలంగాణ and nearby areas
- 🔥 రాపత్రి నగర్‌లో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక అన్నదానం.. భారీగా తరలివచ్చిన భక్తులు! 🙏 రాపత్రి నగర్‌లో శ్రీ సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. వినాయకుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. భక్తి, సేవాభావంతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.1
- ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే! ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,050, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.8,800, కొత్త పత్తి ధర రూ.8,850 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి రూ.50, కొత్త పత్తి ధర రూ.161 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర, పాత పత్తి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతుందని తెలిపారు.1
- కరెంట్ తీగలు తగిలి ట్రాక్టర్ దగ్ధం సంబేపల్లి మండలం మోటాకట్ల గ్రామం కాకరపల్లి సమీపంలో ట్రాక్టర్‌లో కరెంట్ తీగలు తగిలి ట్రాక్టర్ దగ్ధం సంబేపల్లి మండలం మోటాకట్ల గ్రామం కాకరపల్లి సమీపంలో ట్రాక్టర్‌లో తరలిస్తున్న పశువుల మేతకు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ట్రాక్టర్ ఇంజన్‌తో సహా పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.1
- 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని చచ్చినా.. బతికినా ఇక్కడి నుంచి కదిలేది లేదని ఖమ్మం శ్రీనివాస్ నగర్ భూ నిర్వాసిత బాధితురాలు వాపోయింది 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని చచ్చినా.. బతికినా ఇక్కడి నుంచి కదిలేది లేదని ఖమ్మం శ్రీనివాస్ నగర్ భూ నిర్వాసిత బాధితురాలు వాపోయింది. ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉండి ఏం లాభమని, పేదలను ఏడిపిస్తున్నారని.. వాళ్లు బాగుపడరని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడుంటున్న ఇళ్లను కూల్చివేస్తే తాము ఎక్కడికి పోవాలని చెప్పింది. తమకు న్యాయం జరిగే వరకూ కదిలేది లేదని పేర్కొన్నారు.1
- బూర్గంపహాడ్: దయ్యం పట్టిందని వృద్ధురాలికి చిత్రహింసలు.. బూర్గంపాడు మండలంలోని జింకలగూడెంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి దయ్యం పట్టిందని కొందరు ఆమెను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసినట్లు స్థానికులు తెలిపారు. బాధితురాలిని చెట్టుకు ఎక్కించి కిందకి జారకుండా మేకులు కొట్టి, ఆపై ఆమెను తాడుతో కొట్టారని పేర్కొన్నారు. ఈ ఘటన రెండు నెలల క్రితం జరగగా సోమవారం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.1
- నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రాంతాన్ని విమోచనం చేసిన కృషిలో మన ప్రియతమ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర అమోఘమని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కొనియాడారు: వంగవీటి1
- ఖమ్మం మమత హాస్పిటల్లో జరిగిన డాక్టర్ జగదీశ్ సంస్మరణ సభలో డాక్టర్ చైతన్య భావోద్వేగానికి గురయ్యారు ఖమ్మం మమత హాస్పిటల్లో జరిగిన డాక్టర్ జగదీశ్ సంస్మరణ సభలో డాక్టర్ చైతన్య భావోద్వేగానికి గురయ్యారు. చివరిసారిగా ఓ పేషెంట్కు చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటూ, ఆయన మందుల ఖర్చును కూడా తానే భరిస్తానని జగదీశ్ చెప్పారని తెలిపారు. ఎంతోమంది పేదలకు సహాయం చేశారని, రోజుకు 3–4 సర్జరీలు చేసేవారని పేర్కొన్నారు. అలాంటి డాక్టర్ మళ్లీ పుట్టరని, ఆయన లేని లోటు తీరనిదని కన్నీటిపర్యంతమయ్యారు.1
- శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా 2014 నుండి కేంద్రం ప్రభుత్వ అవార్డులు ప్రకటించిన విషయంలో క్షేత్రస్థాయిలో అనేక సేవలు చేసిన వారికే గుర్తింపు ఇచ్చి అవార్డులు ప్రకటించిన విషయం చాలా గొప్ప విషయంగా చెప్పారు: వంగవీటి1
- “చేతబడి అనుమానంతో వృద్ధురాలికి చిత్రహింసలు..! చెట్టుకు ఎక్కించి మేకులు కొట్టారా?” భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెంలో కలకలం రేపుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌కే శకినాబి అనే వృద్ధ మహిళపై చేతబడి అనుమానంతో చిత్రహింసలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికంగా ప్రచారం జరుగుతున్న వివరాల ప్రకారం.. బాధితురాలిని చెట్టుకు ఎక్కించి, మేకులు కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. అసలు వృద్ధ మహిళను ఎవరు, ఎందుకు హింసించారు? చేతబడి అనుమానానికి కారణమేంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మూఢనమ్మకాల పేరుతో ఒక వృద్ధ మహిళపై ఇలాంటి దాడి జరిగిందనే ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే బాధితురాలికి రక్షణ కల్పించి, ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఆరోపణలను పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. పూర్తి వివరాలు, అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.1