బొబ్బిలి నుంచి మక్కువ రోడ్డు అభివృద్ధికి ప్రభుత్వ సహకారం కోసం వినతి...! నిమ్మలపాడు గ్రామంలో ఉన్న ప్రభుత్వ వసతి గృహం అభివృద్ధికి ప్రభుత్వ నిధులు మంజూరు చేయండి..! గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి బొబ్బిలి ఎమ్మెల్యే - బేబీనాయన వినతి...! విజయనగరం జిల్లా... బొబ్బిలి... బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గిరిజన శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి ని పార్వతిపురం మన్యం జిల్లా, సాలూరు లో వారి స్వగృహమందు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా, బొబ్బిలి నియోజకవర్గం నుంచి మక్కువ గ్రామానికి వెళ్లేందుకు ఉన్న రోడ్డు పూర్తిగా పాడయినందున, ఆ మార్గాన ప్రయాణించే ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరారు. అలానే, నిమ్మలపాడు గ్రామంలో ఉన్న ప్రభుత్వ వసతి గృహం శిథిలావస్థలో ఉందని, దాని అభివృద్ధికి ప్రభుత్వం తరుపున సహకరించాలని కోరారు. సుమారు 10 నుంచి 15 గ్రామాల విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించవచ్చు అని మంత్రి కి వివరించారు. వీటితో పాటు, పలు సమస్యలను కూడా గిరిజన శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే బేబీ నాయన వెంట టీడీపీ సీనియర్ నాయకులు అల్లాడ భాస్కర్రావు, బొబ్బిలి మండలం టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీలు వెన్నెల నాగరాజు మరియు శివ, నాగిరెడ్డి రామారావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
బొబ్బిలి నుంచి మక్కువ రోడ్డు అభివృద్ధికి ప్రభుత్వ సహకారం కోసం వినతి...! నిమ్మలపాడు గ్రామంలో ఉన్న ప్రభుత్వ వసతి గృహం అభివృద్ధికి ప్రభుత్వ నిధులు మంజూరు చేయండి..! గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి బొబ్బిలి ఎమ్మెల్యే - బేబీనాయన వినతి...! విజయనగరం జిల్లా... బొబ్బిలి... బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గిరిజన శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి ని పార్వతిపురం మన్యం జిల్లా, సాలూరు లో వారి
స్వగృహమందు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా, బొబ్బిలి నియోజకవర్గం నుంచి మక్కువ గ్రామానికి వెళ్లేందుకు ఉన్న రోడ్డు పూర్తిగా పాడయినందున, ఆ మార్గాన ప్రయాణించే ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరారు. అలానే, నిమ్మలపాడు గ్రామంలో ఉన్న ప్రభుత్వ వసతి గృహం శిథిలావస్థలో ఉందని, దాని అభివృద్ధికి ప్రభుత్వం తరుపున సహకరించాలని కోరారు. సుమారు 10 నుంచి 15
గ్రామాల విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించవచ్చు అని మంత్రి కి వివరించారు. వీటితో పాటు, పలు సమస్యలను కూడా గిరిజన శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే బేబీ నాయన వెంట టీడీపీ సీనియర్ నాయకులు అల్లాడ భాస్కర్రావు, బొబ్బిలి మండలం టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీలు వెన్నెల నాగరాజు మరియు శివ, నాగిరెడ్డి రామారావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
- చీపురుపల్లి మండలంలో బుధవారం ఎండ తీవ్రతకు అల్లాడిన ప్రజలకు మధ్యాహ్నం కురిసిన చిరుజల్లుల వర్షం ఉపశమనం కలిగించింది. మూడు రోజులుగా వర్షాలు లేకపోవడంతో వేడెక్కిన వాతావరణం చల్లబడింది. ఈ వర్షం వరి నారుమళ్లకు, అంతర పంటలకు ఎంతో ప్రయోజనకరమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. చీపురుపల్లి మండలంలో వర్షం1
- బొబ్బిలి పట్టణ ప్రజలకు శుభవార్త తెలిపిన ఎమ్మెల్యే బేబీనాయన.. పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్.. - వచ్చే నెలలో టెండరు ద్వారా పనులు ప్రారంభం. బొబ్బిలి పట్టణంలో *ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి* వరకు ఉన్న రోడ్డుకు గుంతలు ఏర్పడి, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అందరికీ విదితమే.. గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు ఎమ్మెల్యే అయిన తరువాత తాత్కాలికంగా గుంతలు పూడ్పించి, కొంతమేర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది.. గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ *పొంగూరు నారాయణ* గారు బొబ్బిలి పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ఈ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లగా, వారు సానుకూలంగా స్పందించి *రూ2.0 కోట్లు* మంజూరు చేశారు.. ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ పూర్తిచేసుకుని *టెండర్ల పిలుపుకు ఆమోదం లభించిందని*, యుద్ధప్రాతిపదికన టెండరు ప్రక్రియ పూర్తిచేసి రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు వీడియో సందేశం ద్వారా బొబ్బిలి పట్టణ ప్రజలకు తెలియజేశారు.1
- రాజాం :శ్రీ వెంకటశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జి ప్రక్కన సోలార్ హెచ్చరిక లైట్లు ఏర్పాటు రాజాం మండలం అంతకాపల్లి గ్రామం వెంకటేశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జ్ పక్కన హాంజరాంపేటకు చెందిన కొల్లి రాముఅనే యువకుడు తన సొంత డబ్బులతో సోలార్ హెచ్చరిక లైట్లును అమర్చారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరిగి ఎక్కువగా యువత మరణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ లైట్ల వల్లనైనా ప్రమాదాలు తగ్గుతాయని ఆశిస్తున్నానని పేర్కొన్న రాము చేసిన ఈ పనిని వాహనదారులు గ్రామస్తులు అభినందించారు.1
- రాజాం హాస్టల్ విద్యార్థినులతో రోడ్లపై డాన్సులు, చేయించిన వార్డెన్ రమాదేవి. రాజాం ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది, రాజాం సారది రోడ్ లో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలికలతో, బంధువులు పెళ్లి వేడుకల్లో డాన్స్ చేయించిన వార్డెన్ రమాదేవి.1
- విజయనగరం: బీసీల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.. విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీ నాయకులు, బీసీ వర్గాలపై జరిగిన దాడులు, అణచివేతలను గుర్తుచేస్తూ.. తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచిన బీసీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. బీసీల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యతతో పాటు బీసీ నాయకులకు సముచిత గౌరవం, ప్రాతినిధ్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.1
- డోలపేట లో శ్రీ కనక దుర్గ అమ్మ వారికి గాజులు దండలు సేవలో లీనమైన గ్రామ భక్తులు1
- శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ సందర్భంగా వెలిగిపోతున్న నెల్లిమర్ల నగరం నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి సెగిడి వీధి లో శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ 26-28వ తేదీ వరకు మూడు రోజులు నిర్వహించనున్నామని కనకదుర్గమ్మ ఆలయ కమిటీ బుధవారం తెలిపారు. నగరంలో ప్రధాన రహదారి, సెగిడివీధీలో లైటింగ్ తో నగరం మెరిసిపోతుంది. మొదటిరోజు మొయిద జంక్షన్లో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం,బంధువులు, స్నేహితులకు స్థానికులు విందు ఏర్పాట్లు చేశారు. గురువారం అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వనున్నామని చెప్పారు.1
- విజయనగరం: ధరలు పెరుగుదల నియంత్రించాలి ంచాలి: స్పెషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్.. విజయనగరం జిల్లా నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల ప్రభుత్వం, అధికారులు నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విజయనగరంలోని పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.1