logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మండలంలోని బొగ్గుడి వారి పల్లి పంచాయితీలోని మల్లెం వారి పల్లె గ్రామంలో నివాసముంటున్న మల్లెం పెద్ద పుల్లయ్య ఇంట్లో జరిగిన వివాహ వేడుకల్లో రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ ఆదివారం రాత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విందు కార్యక్రమంలో పాల్గొని గ్రామ యువతతో స్థానిక సమస్యలు, నూతనంగా నిర్మిస్తున్న సీతారాముల ఆలయ నిర్మాణం గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మల్లెం పెద్ద పుల్లయ్య కుటుంబ సభ్యులు అతికారి కృష్ణకు బాణసంచా పేల్చుతూ ఘనంగా స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. దీనిపై స్పందించిన అతికారి కృష్ణ, ప్రజల ఆప్యాయత, ప్రేమ ఎప్పటికీ మరవలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ప్రతినిధి డేరంగుల శ్రీకాంత్, జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, టీడీపీ రాజంపేట పార్లమెంట్ మాజీ ఉపాధ్యక్షులు పుత్తా రామచంద్రయ్య, మాజీ సింగల్ విండో అధ్యక్షులు సుధా మురళి, రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం యువజన విభాగం కార్యదర్శి అవ్వారు రవిశంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా (బాబీ), జనసేన పార్టీ సీనియర్ నేత చిన్న వెంకటయ్య, విజయ్ తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

1 hr ago
user_ఆకుల చంద్రమోహన్
ఆకుల చంద్రమోహన్
సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
1 hr ago
936f6ee0-c660-4f4f-aa8a-65a1d5d893a9

మండలంలోని బొగ్గుడి వారి పల్లి పంచాయితీలోని మల్లెం వారి పల్లె గ్రామంలో నివాసముంటున్న మల్లెం పెద్ద పుల్లయ్య ఇంట్లో జరిగిన వివాహ వేడుకల్లో రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ ఆదివారం రాత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విందు కార్యక్రమంలో పాల్గొని గ్రామ యువతతో స్థానిక సమస్యలు, నూతనంగా నిర్మిస్తున్న సీతారాముల ఆలయ నిర్మాణం గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మల్లెం పెద్ద పుల్లయ్య కుటుంబ సభ్యులు అతికారి కృష్ణకు బాణసంచా పేల్చుతూ ఘనంగా స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. దీనిపై స్పందించిన అతికారి కృష్ణ, ప్రజల ఆప్యాయత, ప్రేమ ఎప్పటికీ మరవలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ప్రతినిధి డేరంగుల శ్రీకాంత్, జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, టీడీపీ రాజంపేట పార్లమెంట్ మాజీ ఉపాధ్యక్షులు పుత్తా రామచంద్రయ్య, మాజీ సింగల్ విండో అధ్యక్షులు సుధా మురళి, రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం యువజన విభాగం కార్యదర్శి అవ్వారు రవిశంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా (బాబీ), జనసేన పార్టీ సీనియర్ నేత చిన్న వెంకటయ్య, విజయ్ తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మిత్రులందరికీ నమస్కారమండి. ARDV కంపెనీలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వర్క్ ఫ్రం హోం బిజినెస్ ఆపర్చునిటీ అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు పూర్తి వివరాల కొరకు మొబైల్ నెంబర్ 9666323500 నంబర్‌కు వాట్సప్ ద్వారా లేదా ఫోన్ కాల్ చేసి సంప్రదించగలరు. ధన్యవాదములు ఫ్రెండ్స్.
    1
    మిత్రులందరికీ నమస్కారమండి. ARDV కంపెనీలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వర్క్ ఫ్రం హోం బిజినెస్ ఆపర్చునిటీ అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు పూర్తి వివరాల కొరకు మొబైల్ నెంబర్ 9666323500 నంబర్‌కు వాట్సప్ ద్వారా లేదా ఫోన్ కాల్ చేసి సంప్రదించగలరు. ధన్యవాదములు ఫ్రెండ్స్.
    user_Kadiri Anjaneyulu
    Kadiri Anjaneyulu
    గండ్లపెంట, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, కూట‌మి నాయ‌కులు ఇన్నాళ్లు పోలీసుల‌ను అడ్డం పెట్టుకుని క‌క్షపూరిత రాజ‌కీయాలు చేశారని, ఇప్పుడు అదే పోలీసులు ప్ర‌భుత్వాన్ని అడ్డం పెట్టుకుని చెల‌రేగిపోతున్నారని తీవ్రంగా ఆరోపించారు. వ్య‌క్తిగ‌త స్వార్థ రాజ‌కీయాల కోసం వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసి వాడుకుంటే స‌మాజం ఎలా త‌యార‌వుతుందో చెప్ప‌డానికి కృష్ణలంక సీఐ నాగరాజు కార‌ణంగా జ‌రిగిన సాయికృష్ణ లాక‌ప్ డెత్‌, క్రాంతి కుమార్ ఆత్మ‌హ‌త్య దుర్ఘ‌ట‌న‌లే సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, అప్ర‌జాస్వామిక విధానాల‌ను ప్ర‌శ్నిస్తుంటే కూట‌మి నాయ‌కులు త‌ట్టుకోలేక‌పోతున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్ర‌శ్నించే గొంతుల‌ను నొక్క‌డానికి తెగ‌బ‌డుతున్నారని అప్పిరెడ్డి మండిపడ్డారు. అందులో భాగంగానే నెల్లూరులోని ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి చెందిన‌ విద్యాసంస్థ‌ల‌పై త‌నిఖీల పేరుతో దాడుల‌కు పూనుకున్నారని ఆయన వెల్లడించారు. డీఎస్సీ-2025 నిర్వ‌హ‌ణ‌లో జ‌రిగిన అక్ర‌మాలు, అవ‌కత‌వకలు, అలాగే తిరుమ‌ల ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వాడారనే ఆరోప‌ణలు చేసి ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కి లబ్ధి చేకూర్చారని ఆధారాల‌తో స‌హా నిరూపిస్తూ వైయస్ఆర్ సీపీ త‌ర‌ఫున చంద్ర‌శేఖర్ రెడ్డి బలంగా తన గొంతు వినిపించడంతో ప్ర‌భుత్వం ఇరుకున పడిందని అప్పిరెడ్డి వివరించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కూట‌మి ప్ర‌భుత్వానికి కంటిలో న‌లుసుగా మారినందుకే ఆయనపై క‌క్ష పెంచుకుందని కూడా ఆయన ఆరోపించారు.
    1
    ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, కూట‌మి నాయ‌కులు ఇన్నాళ్లు పోలీసుల‌ను అడ్డం పెట్టుకుని క‌క్షపూరిత రాజ‌కీయాలు చేశారని, ఇప్పుడు అదే పోలీసులు ప్ర‌భుత్వాన్ని అడ్డం పెట్టుకుని చెల‌రేగిపోతున్నారని తీవ్రంగా ఆరోపించారు. వ్య‌క్తిగ‌త స్వార్థ రాజ‌కీయాల కోసం వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసి వాడుకుంటే స‌మాజం ఎలా త‌యార‌వుతుందో చెప్ప‌డానికి కృష్ణలంక సీఐ నాగరాజు కార‌ణంగా జ‌రిగిన సాయికృష్ణ లాక‌ప్ డెత్‌, క్రాంతి కుమార్ ఆత్మ‌హ‌త్య దుర్ఘ‌ట‌న‌లే సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, అప్ర‌జాస్వామిక విధానాల‌ను ప్ర‌శ్నిస్తుంటే కూట‌మి నాయ‌కులు త‌ట్టుకోలేక‌పోతున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్ర‌శ్నించే గొంతుల‌ను నొక్క‌డానికి తెగ‌బ‌డుతున్నారని అప్పిరెడ్డి మండిపడ్డారు. అందులో భాగంగానే నెల్లూరులోని ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి చెందిన‌ విద్యాసంస్థ‌ల‌పై త‌నిఖీల పేరుతో దాడుల‌కు పూనుకున్నారని ఆయన వెల్లడించారు.

డీఎస్సీ-2025 నిర్వ‌హ‌ణ‌లో జ‌రిగిన అక్ర‌మాలు, అవ‌కత‌వకలు, అలాగే తిరుమ‌ల ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వాడారనే ఆరోప‌ణలు చేసి ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కి లబ్ధి చేకూర్చారని ఆధారాల‌తో స‌హా నిరూపిస్తూ వైయస్ఆర్ సీపీ త‌ర‌ఫున చంద్ర‌శేఖర్ రెడ్డి బలంగా తన గొంతు వినిపించడంతో ప్ర‌భుత్వం ఇరుకున పడిందని అప్పిరెడ్డి వివరించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కూట‌మి ప్ర‌భుత్వానికి కంటిలో న‌లుసుగా మారినందుకే ఆయనపై క‌క్ష పెంచుకుందని కూడా ఆయన ఆరోపించారు.
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వైసిపిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి వాళ్లు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద మొదటి విడతగా రూ.7 వేలు రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నట్లు తెలిపారు. మొత్తం మూడు విడతల్లో రైతులకు రూ.20 వేలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి లబ్ధి చేకూర్చామని కూడా వెల్లడించారు. వైసిపి వాళ్లు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
    1
    గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వైసిపిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి వాళ్లు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద మొదటి విడతగా రూ.7 వేలు రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నట్లు తెలిపారు. మొత్తం మూడు విడతల్లో రైతులకు రూ.20 వేలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి లబ్ధి చేకూర్చామని కూడా వెల్లడించారు. వైసిపి వాళ్లు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • నంద్యాల జిల్లాలోని మహానంది మండల పరిధిలోని గాజులపల్లె గ్రామంలో గల రైతు సేవా కేంద్రంలో శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2026-27 మొదటి విడత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ, రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా, మండలంలోని మొత్తం 4,200 మంది రైతులకు ₹2.84 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. మండల వ్యవసాయ అధికారి నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిధుల పంపిణీ జరిగింది. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జనార్ధన్ రెడ్డి, మండల కన్వీనర్ కంచర్ల శివయ్య, మండల క్లస్టర్ ఇన్‌ఛార్జి నరాల చంద్రమౌళీశ్వర్ రెడ్డి, గోపవరం సొసైటీ చైర్మన్ గంగవరపు ఉమామహేశ్వర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మాజీ మండలాధ్యక్షుడు ఉల్లి మధు, నాయకులు శశికళ కొండారెడ్డి, లక్ష్మీనారాయణ, రవి స్వామి, హరి ప్రసాద్ రెడ్డి, కిరణ్ కుమార్ గౌడ్, నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
    1
    నంద్యాల జిల్లాలోని మహానంది మండల పరిధిలోని గాజులపల్లె గ్రామంలో గల రైతు సేవా కేంద్రంలో శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2026-27 మొదటి విడత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ, రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, మండలంలోని మొత్తం 4,200 మంది రైతులకు ₹2.84 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. మండల వ్యవసాయ అధికారి నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిధుల పంపిణీ జరిగింది. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జనార్ధన్ రెడ్డి, మండల కన్వీనర్ కంచర్ల శివయ్య, మండల క్లస్టర్ ఇన్‌ఛార్జి నరాల చంద్రమౌళీశ్వర్ రెడ్డి, గోపవరం సొసైటీ చైర్మన్ గంగవరపు ఉమామహేశ్వర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మాజీ మండలాధ్యక్షుడు ఉల్లి మధు, నాయకులు శశికళ కొండారెడ్డి, లక్ష్మీనారాయణ, రవి స్వామి, హరి ప్రసాద్ రెడ్డి, కిరణ్ కుమార్ గౌడ్, నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు వ్యవహారం జూన్ 21న రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజయవాడలోని సింగనగర్‌లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని తలపించడంతో పాటు, పోలీసు శాఖలోని క్రమశిక్షణ, చట్టాల అమలు, అధికారుల బాధ్యతలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు సింగనగర్ ప్రాంతంలోని ఓ కానిస్టేబుల్ నివాసంలో తలదాచుకున్నారనే ప్రచారం ఉదయం నుంచే జోరందుకుంది, ఈ సమాచారం వెలుగులోకి రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉండగా, కృష్ణలంక ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు సీఐ నాగరాజును అరెస్ట్ చేయవద్దంటూ ఆందోళన వ్యక్తం చేయడం మరింత చర్చకు దారితీసింది. వారు నాగరాజుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, పూర్తి విచారణ జరిపిన తర్వాతే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తూ కనిపించడంతో పరిస్థితి రాజకీయ రంగు పులుముకున్నట్టుగా మారింది. అయితే, ఈ పరిణామాలపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చట్టాలను అమలు చేయాల్సిన పోలీసు అధికారులే చట్టపరమైన ప్రక్రియలకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తూ, సాధారణ ప్రజలకు ఒక విధానం, అధికారులకు మరో విధానమా అని నిలదీస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాజీ అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని, కానీ చట్టపరమైన ప్రక్రియలను ప్రభావితం చేసేలా నిరసనలు, ఒత్తిళ్లు తీసుకురావడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పోలీసు శాఖలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై విచారణ పూర్తయ్యే వరకు చట్టం తన పని తాను చేసుకునే అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. సీఐ నాగరాజుకు మద్దతుగా కొందరు వీధుల్లోకి రావడం, అరెస్ట్ చేయొద్దంటూ డిమాండ్ చేయడం పట్ల సామాజిక మాధ్యమాల్లో కూడా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి, చట్టం ముందు అందరూ సమానమే అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ప్రత్యేక రక్షణ ఎందుకు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, సీఐ నాగరాజుపై వచ్చిన ఆరోపణలపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, విచారణ ఏ దశలో ఉంది, తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న అంశాలపై ఆసక్తి కొనసాగుతోంది. మీడియా ముందు అధికారికంగా వివరాలు వెల్లడిస్తారా? లేక విచారణ అనంతరం మాత్రమే చర్యలు ప్రకటిస్తారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. పోలీసు శాఖలో పనిచేసే అధికారిపై ఆరోపణలు వచ్చినప్పుడు, చట్టపరమైన ప్రక్రియలు పారదర్శకంగా సాగాలని, ఎవరి ఒత్తిళ్లకూ లొంగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. చట్టాలను అమలు చేసే వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరగాలంటే, బాధ్యులపై చట్టం ముందు సమానత్వం కనిపించాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు.
    1
    ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు వ్యవహారం జూన్ 21న రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజయవాడలోని సింగనగర్‌లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని తలపించడంతో పాటు, పోలీసు శాఖలోని క్రమశిక్షణ, చట్టాల అమలు, అధికారుల బాధ్యతలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు సింగనగర్ ప్రాంతంలోని ఓ కానిస్టేబుల్ నివాసంలో తలదాచుకున్నారనే ప్రచారం ఉదయం నుంచే జోరందుకుంది, ఈ సమాచారం వెలుగులోకి రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఇదిలా ఉండగా, కృష్ణలంక ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు సీఐ నాగరాజును అరెస్ట్ చేయవద్దంటూ ఆందోళన వ్యక్తం చేయడం మరింత చర్చకు దారితీసింది. వారు నాగరాజుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, పూర్తి విచారణ జరిపిన తర్వాతే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తూ కనిపించడంతో పరిస్థితి రాజకీయ రంగు పులుముకున్నట్టుగా మారింది. అయితే, ఈ పరిణామాలపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చట్టాలను అమలు చేయాల్సిన పోలీసు అధికారులే చట్టపరమైన ప్రక్రియలకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తూ, సాధారణ ప్రజలకు ఒక విధానం, అధికారులకు మరో విధానమా అని నిలదీస్తున్నారు.

ఈ సందర్భంగా పలువురు మాజీ అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని, కానీ చట్టపరమైన ప్రక్రియలను ప్రభావితం చేసేలా నిరసనలు, ఒత్తిళ్లు తీసుకురావడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పోలీసు శాఖలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై విచారణ పూర్తయ్యే వరకు చట్టం తన పని తాను చేసుకునే అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. సీఐ నాగరాజుకు మద్దతుగా కొందరు వీధుల్లోకి రావడం, అరెస్ట్ చేయొద్దంటూ డిమాండ్ చేయడం పట్ల సామాజిక మాధ్యమాల్లో కూడా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి, చట్టం ముందు అందరూ సమానమే అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ప్రత్యేక రక్షణ ఎందుకు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, సీఐ నాగరాజుపై వచ్చిన ఆరోపణలపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, విచారణ ఏ దశలో ఉంది, తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న అంశాలపై ఆసక్తి కొనసాగుతోంది. మీడియా ముందు అధికారికంగా వివరాలు వెల్లడిస్తారా? లేక విచారణ అనంతరం మాత్రమే చర్యలు ప్రకటిస్తారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. పోలీసు శాఖలో పనిచేసే అధికారిపై ఆరోపణలు వచ్చినప్పుడు, చట్టపరమైన ప్రక్రియలు పారదర్శకంగా సాగాలని, ఎవరి ఒత్తిళ్లకూ లొంగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. చట్టాలను అమలు చేసే వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరగాలంటే, బాధ్యులపై చట్టం ముందు సమానత్వం కనిపించాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు, బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ బృందం, హెచ్‌ఎం, మరియు పిటి సాంబశివారెడ్డి యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఇందులో విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానంద చారి మాట్లాడుతూ, యోగా, ధ్యానం, నడక వల్లనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులకు ఈ సాధనలే నివారణ మార్గాలని ఆయన ఉద్ఘాటించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం, నడకను అలవర్చుకొని, తమ విలువైన సమయంలో రోజుకు కనీసం రెండు గంటలైనా వీటికి కేటాయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యోగా, ధ్యానం, నడకల విశిష్టతను బ్రహ్మానంద చారి వివరించారు. పిటి సాంబశివారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు తమ హెచ్‌ఎం మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు యోగా నేర్పుతున్నామని తెలిపారు. మనిషి శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే యోగా ఎంతో అవసరం అని ఆయన వివరించారు.
    1
    రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు, బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ బృందం, హెచ్‌ఎం, మరియు పిటి సాంబశివారెడ్డి యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఇందులో విద్యార్థులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానంద చారి మాట్లాడుతూ, యోగా, ధ్యానం, నడక వల్లనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులకు ఈ సాధనలే నివారణ మార్గాలని ఆయన ఉద్ఘాటించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం, నడకను అలవర్చుకొని, తమ విలువైన సమయంలో రోజుకు కనీసం రెండు గంటలైనా వీటికి కేటాయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యోగా, ధ్యానం, నడకల విశిష్టతను బ్రహ్మానంద చారి వివరించారు.

పిటి సాంబశివారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు తమ హెచ్‌ఎం మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు యోగా నేర్పుతున్నామని తెలిపారు. మనిషి శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే యోగా ఎంతో అవసరం అని ఆయన వివరించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసి రెడ్డి ప్రజలకు ప్రతి రోజూ యోగా సాధన చేయాలని సూచించారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, ఆయన పట్టణంలోని వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని హాకీ మైదానం మరియు ఇందిరమ్మ రాణితోపు పార్కులలో యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు వెంకట్రాంరెడ్డి మరియు ఓం ప్రకాశ్ యోగా ప్రాముఖ్యతను వివరించారు. వారు యోగాసనాలు చేయించడంతో పాటు, ప్రాణాయామం కూడా చేయించారు.
    1
    కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసి రెడ్డి ప్రజలకు ప్రతి రోజూ యోగా సాధన చేయాలని సూచించారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, ఆయన పట్టణంలోని వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని హాకీ మైదానం మరియు ఇందిరమ్మ రాణితోపు పార్కులలో యోగాసనాలు వేశారు.

ఈ కార్యక్రమంలో యోగా గురువులు వెంకట్రాంరెడ్డి మరియు ఓం ప్రకాశ్ యోగా ప్రాముఖ్యతను వివరించారు. వారు యోగాసనాలు చేయించడంతో పాటు, ప్రాణాయామం కూడా చేయించారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొంది, నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన నియోజకవర్గంలోని చక్రాయపేట మండలం అద్దాలమర్రి గ్రామంలో జరిగింది. మృతి చెందిన వారిలో 18 ఏళ్ల జయవర్ధన్ రెడ్డి, 16 ఏళ్ల రాజా వర్ధన్ రెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ములు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలకు అక్రమ ఇసుక తవ్వకాలే ప్రధాన కారణమని పలువురు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాల వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.
    1
    కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొంది, నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన నియోజకవర్గంలోని చక్రాయపేట మండలం అద్దాలమర్రి గ్రామంలో జరిగింది. మృతి చెందిన వారిలో 18 ఏళ్ల జయవర్ధన్ రెడ్డి, 16 ఏళ్ల రాజా వర్ధన్ రెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ములు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

ఈ మరణాలకు అక్రమ ఇసుక తవ్వకాలే ప్రధాన కారణమని పలువురు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాల వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.