సత్తుపల్లి సబ్ జైలులో ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహణ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో శనివారం సత్తుపల్లి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, ఆరవ అదనపు జిల్లా జడ్జి మారగని శ్రీనివాస్ సత్తుపల్లి సబ్‌జైలులో ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షణికావేశంలో తప్పులు చేసి జైలుకు రావద్దని, మంచి ఆలోచనలతో నేరాలకు దూరంగా ఉండి సమాజంలో మంచి వ్యక్తిగా, బాధ్యతాయుతంగా జీవించాలని సూచించారు. అలాగే మండల న్యాయ సేవా సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సహాయం, న్యాయ విజ్ఞాన సదస్సులు, లోక్ అదాలత్ సేవల గురించి వివరించారు. పోక్సో చట్టం, ఎన్‌డీపీఎస్ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ తదితర చట్టాలపై ఖైదీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, ఆరవ అదనపు జిల్లా జడ్జి మారగని శ్రీనివాస్, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.కె. మీరా ఖాసిం సాహెబ్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ బి. మారేశ్వరరావు, జె.వి. నరేంద్ర, బి. వెంకట్రావు, సబ్ జైలు సూపరింటెండెంట్ కుటుంబరావు, కోర్టు సిబ్బంది, జైలు సిబ్బంది పాల్గొన్నారు.
సత్తుపల్లి సబ్ జైలులో ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహణ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో శనివారం సత్తుపల్లి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, ఆరవ అదనపు జిల్లా జడ్జి మారగని శ్రీనివాస్ సత్తుపల్లి సబ్‌జైలులో ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షణికావేశంలో తప్పులు చేసి జైలుకు రావద్దని, మంచి ఆలోచనలతో నేరాలకు దూరంగా ఉండి సమాజంలో మంచి వ్యక్తిగా, బాధ్యతాయుతంగా జీవించాలని సూచించారు. అలాగే మండల న్యాయ సేవా సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సహాయం, న్యాయ విజ్ఞాన సదస్సులు, లోక్ అదాలత్ సేవల గురించి వివరించారు. పోక్సో చట్టం, ఎన్‌డీపీఎస్ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ తదితర చట్టాలపై ఖైదీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, ఆరవ అదనపు జిల్లా జడ్జి మారగని శ్రీనివాస్, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.కె. మీరా ఖాసిం సాహెబ్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ బి. మారేశ్వరరావు, జె.వి. నరేంద్ర, బి. వెంకట్రావు, సబ్ జైలు సూపరింటెండెంట్ కుటుంబరావు, కోర్టు సిబ్బంది, జైలు సిబ్బంది పాల్గొన్నారు.
- వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.1
- భద్రాచలం గోదావరిలో శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనం...... భద్రాచలం: ఏడాది పాటు పూజలు నిర్వహించిన శ్రీరామకోటి పుస్తకాలను గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మేరకు శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్‌రావు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి శ్రీరామకోటి పుస్తకాలను గోదావరిలో నిమజ్జనం చేశారు.1
- భారీ పెట్టుబడి మోసం కేసును ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ప్రధాన నిందితుడి అరెస్టు.. నేరార్జిత ఆస్తులుగా గుర్తించిన 35 వాహనాలు స్వాధీనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం.134/2026 కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్‌ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35 వాహనాలు, ఇతర చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వివరాలను వెల్లడించడం జరిగింది. భార్పాటీ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నిందితుడు తాను భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డ్స్‌లో లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నానని, తనతో భాగస్వామిగా ఉంటే కాంట్రాక్ట్ పనులు ఇప్పించి అధిక లాభాలు అందిస్తానని నమ్మబలికి పలువురు బాధితుల నుంచి సుమారు రూ.52 కోట్ల మేర పెట్టుబడుల పేరుతో మోసపూరితంగా డబ్బులు సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాధితుల విశ్వాసాన్ని పొందేందుకు నకిలీ భాగస్వామ్య ఒప్పందాలు, తప్పుడు పత్రాలు రూపొందించి, లాభాల్లో 4 శాతం వాటా ఇస్తామని హామీలు ఇచ్చి మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని తెలిపారు. అలాగే బీకే నాయుడు అండ్ కో., రాజేశ్వరి ట్రావెల్స్ పేర్లతో సంస్థలను నిర్వహిస్తూ ఈ మోసపూరిత కార్యకలాపాలు సాగించినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలు, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ ఆధారంగా నిందితుడిని కేరళ రాష్ట్రంలోని పాలా ప్రాంతంలో అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై జిల్లాకు తీసుకువచ్చి పోలీసు కస్టడీలో విచారించినట్లు తెలిపారు. విచారణలో భాగంగా నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 6 బస్సులు, ఒక వాటర్ ట్యాంకర్ లారీ, 3 ట్రాక్టర్లు, 2 వ్యవసాయ పరికరాలు, 7 కార్లు, 14 ద్విచక్ర వాహనాలు, 2 ట్రైలర్లు కలిపి మొత్తం 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా బాధితుల నుంచి మోసపూరితంగా సేకరించిన డబ్బుతో భద్రాచలంలోని రాజీవ్‌నగర్ కాలనీలో ఒక మూడు అంతస్తుల భవనం, ఒక ప్లాట్ కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, సంబంధిత పత్రాల పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. మరిన్ని బాధితులను గుర్తించడం, నేరార్జిత ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకోవడం, పూర్తి మనీ ట్రైల్‌ను వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అధిక లాభాలు వస్తాయని, తక్కువ సమయంలో పెట్టుబడికి రెట్టింపు లేదా భారీ రాబడులు వస్తాయని చెప్పే వ్యక్తులు లేదా సంస్థలను గుడ్డిగా నమ్మి డబ్బులు పెట్టవద్దని ప్రజలకు సూచించారు. ఆకర్షణీయమైన హామీలు, నకిలీ పత్రాలు, తప్పుడు ఒప్పందాలతో మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనుమానాస్పద పెట్టుబడి పథకాలపై సమాచారం తెలిసినా లేదా మోసానికి గురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల అప్రమత్తతతోనే ఇటువంటి ఆర్థిక నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన లక్ష్మీదేవిపల్లి పోలీసు సిబ్బందిని, జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు .1
- భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికల థింసా నృత్యం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది ఆ సంస్థ ప్రతినిధుల నుంచి గిన్నిస్ అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అందుకుని థింసా నృత్యంలో పాల్గొన్నారు...1
- ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే పాయం సారపాక: గోదావరి వరదల నేపథ్యంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం సారపాక ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బూర్గంపాడులో 28, సారపాకలో 55 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, సర్పంచ్ బాధితులకు అండగా ఉంటున్నారని అన్నారు. గోదావరి 56 అడుగులకు చేరిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.1
- మొరాకో-స్పెయిన్ సరిహద్దులో వలస సంక్షోభం తీవ్రం. 57 మంది మృతి. 🔹 వలసదారులను చట్టబద్ధం చేస్తారనే ఆశతో మొరాకో నుంచి భారీగా స్పెయిన్‌లోకి ప్రవేశం 🔹 కేవలం 24 గంటల్లోనే సుమారు 60 వేల మంది దేశంలోకి వచ్చినట్లు స్పెయిన్ అధికారులు వెల్లడి 🔹 సరిహద్దు దాటే ప్రయత్నాల్లో 57 మంది మృతి 🔹 వలసదారులు-భద్రతా బలగాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు 🔹 పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని పెడ్రో సాంచెజ్ తెలిపారు1