కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, • ట్రాఫిక్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి – జిల్లా ఎస్పీ కామారెడ్డి పట్టణంలోని ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ భవనానికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి, ప్రజలకు మరింత అనుకూలంగా నవీకరించిన ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు ఈరోజు ప్రారంభించారు. పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహన రద్దీ, ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను మరింత మెరుగుపరిచారు. ఈ సందర్భంగా కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రశేఖర్ గౌడ్ ని జిల్లా ఎస్పీ స్వయంగా ఆయన విధి నిర్వహణ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. ట్రాఫిక్ నిర్వహణలో క్రమశిక్షణ, ప్రజలతో మర్యాదపూర్వక వ్యవహారం, వేగవంతమైన స్పందనతో విధులు నిర్వహించాలని సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలో పెరుగుతున్న వాహన రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌కు అవసరమైన పోలీసు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. రహదారులపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజలకు సురక్షితమైన ప్రయాణ వాతావరణం కల్పించడం పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు చట్టాలను అమలు చేయడమే కాకుండా ప్రజలకు సేవలందించే బాధ్యతను కూడా నిర్వర్తించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య కేంద్రాలు మరియు ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలకు రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుందని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా ప్రయాణించడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్ ను ఉల్లంఘించడం వంటి చర్యలు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు గుర్తులు, పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ట్రాఫిక్ క్రమశిక్షణతోనే ప్రమాదాలను తగ్గించి సురక్షిత సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు. "ట్రాఫిక్ నియమాలు పాటించడం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాదు... మీ కుటుంబం కోసం, మీ ప్రాణాల కోసం తీసుకునే ఉత్తమ నిర్ణయం. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలి." అని జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ శ్రీ మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ శ్రీ నరహరి, ట్రాఫిక్ ఎస్‌ఐ శ్రీ చంద్రశేఖర్ గౌడ్, కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీసు అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- పట్నం సోదరులను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ల మాతృమూర్తి పట్నం రుక్కమ్మ ఇటీవల పరమపదించిన నేపథ్యంలో, మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి షాబాద్‌లోని వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా దివంగత రుక్కమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దివంగత రుక్కమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్తించారు. అనంతరం పట్నం మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి మనుమడు పట్నం అవినాష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికీ మనో ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.1
- జపాన్‌కు డ్రైవర్ల శిక్షణపై భాగస్వామ్యం దిశగా అడుగులు బద్దెనపల్లి ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు జపాన్‌కు నైపుణ్యమైన భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లను తీర్చిదిద్దే లక్ష్యంతో హనా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు సంస్థ ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో ఐటిడీఆర్ సైట్ విజిట్ నిర్వహించారు.ఇట్టి పర్యవేక్షణ సంస్థ సీఈఓ సయూరి మత్సునో తెలంగాణ ఐఏఎస్ అధికారి హరి ప్రసాద్‌కు ఆదేశానుసారం , పర్య వేక్షించారు. డ్రైవింగ్ శిక్షణ విధానం, మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, మొత్తం శిక్షణ వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే, భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పరస్పర సహకారంపై చర్చించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పరచు కోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇట్టి పర్యవేక్షణ లో జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ ఐటీడీఆర్ ప్రిన్సిపాల్ దొరయ్ మురుగన్ పాల్గొన్నారు.1
- భారీ వర్షంతో తడిసిముద్దైన బాన్సువాడ లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన బాన్సువాడ పట్టణంలో శనివారం కురిసిన భారీ వర్షంతో జనజీవనం కొంతసేపు అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని కాలనీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. కొంతకాలంగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. వ్యవసాయ పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మున్సిపల్ అధికారులు సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వర్షపు నీటితో నిండిన ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.2
- ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక తనిఖీ.. పారిశుధ్యంపై అధికారుల ఆదేశాలు చిన్నశంకరంపేట మండల కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్య పరిస్థితులను ప్రత్యేక అధికారి డాక్టర్ వెంకటయ్య శనివారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీలో ఆసుపత్రి పరిసరాల్లో శుభ్రత ప్రమాణాలు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రి ఆవరణను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ రోగులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని సిబ్బందికి సూచించారు. లోపాలపై సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని తెలిపారు. ఈ తనిఖీలో ఎంపీడీవో దామోదర్ పాల్గొన్నారు.1
- బోధన్ ఉర్సు మహోత్సవాల్లో పాల్గొన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని హజ్రత్ షా జలాల్ బుఖారీ (రహ్.) 675వ ఉర్సు మహోత్సవాల్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. పాల్గొన్నారు. దర్గా వద్ద చాదర్ సమర్పించి, గులాబీ పూలతో నివాళులర్పించిన కమిషనర్... రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా నిర్వాహకులు పోలీస్ కమిషనర్‌కు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, ఎస్‌హెచ్‌వో వెంకట్ నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్ అలీ, దర్గా కార్యదర్శి ముక్తాదారు, మత పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1
- నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన బిల్లుల చెల్లింపులలో దాదాపు కోటి 70 లక్షల అవినీతి జరిగిందని కలెక్టర్ కి బీజేపీ కౌన్సిలర్ ల పిర్యాదు కామారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పడిన పాలకవర్గం అనంతరం జరిగిన బిల్లుల చెల్లింపులో అవకతవకలు జరిగాయని, ఈ విషయంలో అధికారులతో పాటు పాలకవర్గంలోని కొంత మంది చేతి వాటం చూయించారని వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కలిసి పిర్యాదు చేయటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్ లు మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో నూతన పాలక వర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కామారెడ్డి మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 5,92,91,364 ఖర్చు కాగా అందులో 75 బిల్లులు 1,13,14566 రూపాయల చెల్లింపు విషయంలో, అంతే కాకుండా SDRF సంబంధించిన 71,28,937 రూపాయలు ఖర్చు కా అందులో 5 బిల్లులకు గాను 59,86,353 రూపాయలు చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగినట్టుగా అనుమానం అందని వీటి విషయంలో సరియైన విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై, వాటి వెనక ఉన్న ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కోరడం జరిగిందని, ఈ విషయంలో సరియైన స్పందన రాకపోతే విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కి పిర్యాదు చేస్తామని అన్నారు.1
- ఇంజనీరింగ్ విద్యార్థులకు రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి..* ఓట్ల కోసం విద్యార్థులకు మాయమాటలు చెప్పి ,గెలిచి గద్దనెక్కిన తర్వాత విద్యార్థుల ఆత్మగౌరాన్ని దెబ్బతీస్తున్నాడు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి విద్యార్థులను అవమానించడం బాధాకరం.. *తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థులను "క్రిమినల్స్", "వేస్ట్" అని అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని బస్టాండ్ దగ్గర బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం చేయడం జరిగింది..* *ఈ సందర్భంగా జిల్లా యువమోర్చ అధ్యక్షుడు నంది వేణు మాట్లాడుతూ..* తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులను "క్రిమినల్స్", "వేస్ట్" అని సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా యువ మోర్చా తీవ్రంగా ఖండిస్తోంది. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి వారిని ఈ విధంగా సంబోధించడం విద్యార్థులను, వారి కష్టాన్ని తీవ్రంగా అవమానించడమే అవుతుందని అన్నారు.. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. వేల కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటీవల ఇంజినీరింగ్ పూర్తయిన విద్యార్థులకు కనీసం ఉద్యోగ దరఖాస్తులు నింపడం కూడా రాదని హేళన చేసిన ముఖ్యమంత్రి, ఇప్పుడు ఏకంగా వారిని "క్రిమినల్స్", "వేస్ట్" అంటూ నోరుపారేసుకోవడం వారి అహంకార పూరిత వైఖరికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం చూస్తుంటే—రాష్ట్రంలో విద్యార్థులు ఎవరూ ఉన్నత చదువులు చదవకూడదని, ప్రతి ఒక్కరూ నిరక్షరాస్యులుగానే ఉండిపోవాలని వారు కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. నిరుద్యోగ భృతి 4,000 వేలు, యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సంపూర్ణంగా విఫలమైన ఈ ప్రభుత్వం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థులపైనే ఇటువంటి నిందలు వేయడం దురదృష్టకరం అని కాంగ్రెస్ ప్రభుత్వ ఈ విద్యార్థి వ్యతిరేక విధానాలను, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను భారతీయ జనతా యువ మోర్చా పెద్ద ఎత్తున ఉద్యమించి ఎండగడుతుందని అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సంతోష్ రెడ్డి ,బిజెపి నాయకులు, రజినీకాంత్,భూమేష్ యాదవ్,సందీప్, చిరంజీవి, అశోక్ ,బిజెవైఎం నాయకులు అరుణ్,రాజు, సందీప్, సాయి, ప్రణయ్ తదితరులు ఉన్నారు..1