Shuru
Apke Nagar Ki App…
కేశంపేట:పిచ్చి మొక్కల తొలగింపు… సురక్షితమైన రహదారి కేశంపేట మండలంలోని లేమామిడి–నిర్ధావెల్లి ప్రధాన రహదారిపై పెరిగిన పిచ్చి మొక్కలు వాహనదారులకు ప్రమాదంగా మారాయి. సమస్యను గుర్తించిన గ్రామ సర్పంచ్ సులోచన శీను, ఉప సర్పంచ్ ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో డోజర్ సహాయంతో మొక్కలను తొలగించారు. దీంతో రహదారి స్పష్టంగా మారి ప్రయాణం సురక్షితమైంది. సమస్యను పరిష్కరించినందుకు గ్రామస్తులు, వాహనదారులు సర్పంచ్‌కు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు గ్రామ నాయకులు పాల్గొన్నారు.
S M S R R
కేశంపేట:పిచ్చి మొక్కల తొలగింపు… సురక్షితమైన రహదారి కేశంపేట మండలంలోని లేమామిడి–నిర్ధావెల్లి ప్రధాన రహదారిపై పెరిగిన పిచ్చి మొక్కలు వాహనదారులకు ప్రమాదంగా మారాయి. సమస్యను గుర్తించిన గ్రామ సర్పంచ్ సులోచన శీను, ఉప సర్పంచ్ ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో డోజర్ సహాయంతో మొక్కలను తొలగించారు. దీంతో రహదారి స్పష్టంగా మారి ప్రయాణం సురక్షితమైంది. సమస్యను పరిష్కరించినందుకు గ్రామస్తులు, వాహనదారులు సర్పంచ్‌కు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు గ్రామ నాయకులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కాకునూరు గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండాల ప్రభను ఘనంగా నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో ప్రభను ఊరేగించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజామున వరకు అగ్నిగుండాల వద్ద ప్రత్యేక పూజలు కొనసాగనున్నది.అనంతరం నిప్పుకణుకలపై నడుస్తూ భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో, హారతులు, నాదస్వరాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో సాగాయి. గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.1
- హైదరాబాద్ :-వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో దారుణం ఓ మహిళను ఇంట్లో రెండూ కత్తులతో, పెట్రోల్ డబ్బాతో వచ్చి దారుణంగా హత్య చేసిన మహేష్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ హెచ్చరికలు జారీ చేసిన మహేష్ అనే వ్యక్తి పోలీసుల అదుపులో మహేష్ అనే వ్యక్తి తనకి మహిళా తో గతంలో పెళ్లి జరిగింది అని తను ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది అని మహేష్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం4
- మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనానికి ప్రయత్నం చేయగా బీఆర్ఎస్వి విద్యార్ధి విభాగం నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించిన పోలీసులు అరెస్ట్ అయినా బీఆర్ఎస్వి నేతలు జీడీ అనిల్, జంగయ్య, నాగారం ప్రశాంత్, రామ కృష్ణ, శ్రీకాంత్ ముదిరాజ్, దీరజ్,శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.1
- every day traffic jam in mir alam mandi road Request to sho mir chowk look into1
- పురుగుల అన్నం తినలేక పస్తులు ఉంటున్నాం....... - ఇదేమిటి అని అడిగితే బూతు మాటలతో ఎదురుదాడి...... - ఇట్లనే చేస్తే హాల్ టికెట్ ఇవ్వను ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి...... వెల్దండ: మండల కేంద్రాల్లోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలు వారం రోజుల నుండి ఉడికి ఉడకని పురువుల అన్నం తినలేక పస్తులు ఉంటున్నాం,బుధవారం హైదరాబాద్ -శ్రీశైలం ప్రధాన జాతీయ రహదారి పై బైఠాయించి ప్రిన్సిపాల్ డాం డాం అంటూ ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ స్వర్ణ రత్నం ను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.మాట్లాడుతూ పురుగుల అన్నం పెడుతూ, అడిగితే పురుగులను తీసేసి తినండి అంటున్నారని, సమస్య ఎవరికైన చెప్పిన మమ్మల్ని టార్గెట్ చేసేవారని తెలిపారు. ప్రతి నెల విద్యార్థుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసుకునేదని, ఎందుకు మేడం అంటే పాఠశాల లో మౌలిక వసతుల కోసమని చెప్పేది కానీ ఆ డబ్బులతో ఏమీ చేయకుండా సొంతంగా ఖర్చులకు ఉపయోగించుకునేదని తెలిపారు. ఫెస్టివల్ పార్టీ కానీ, ఫ్రెషర్ పార్టీ కానీ ప్రిన్సిపల్ మైక్ లోనే దుర్భాషలాడేదని, పురుగుల అన్నం తిని అస్వస్థతకు గురవుతున్నామని, మా ఆరోగ్యాలతో ప్రిన్సిపల్ చెలగాటం ఆడుతున్నారని,ఈ ప్రిన్సిపల్ మాకొద్దని, వెంటనే ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తేనే మేము పాఠశాల వెళ్తామన్నారు. ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని కార్తీక్ కుమార్, గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, ఎస్సై కురుమూర్తి హామీ ఇచ్చారు. ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని దళిత సంఘాలు ఆగ్రహం.......... పురుగుల అన్నం తినలేక గురుకుల పాఠశాల విద్యార్థినీలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్న ప్రిన్సిపాల్ ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నారని దళిత సంఘాల నాయకులు జంగిలి నిరంజన్, పోలే అశోక్, జంగిలి ఆనంద్, సామెల్, కొయ్యల పుల్లయ్య, గోరటి సుధాకర్, గోరటి సంజీవ, జంగిల్ ప్రవీణ్, ఏకుల వెంకటేష్, దుళ్ల పెద్దయ్య లతో పాటు మరి కొంతమంది నాయకులు ఆగ్రం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల చెందిన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకుంటున్నారని, వారికి పురుగుల అన్నం ఎట్లా పెడతారని, ప్రిన్సిపల్ వెంటనే సస్పెండ్ చేసి సర్వీస్ రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ అలీ, పంచాయతీ కార్యదర్శి గిరి, ఆయా ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు.6
- నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పురుగుల భోజనం పెడుతున్నారని శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థిను లు ఆందోళన చేస్తుండగా నలుగురు విద్యార్థినులకు అస్వస్థత.. ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపుపాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా పురుగుల అన్నం పెడుతున్నారని.. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ విద్యార్థినులతో చర్చలు జరిపిన ఎమ్మార్వో, పోలీసులు1
- నస్కల్ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తా... """"""""""""""""""""''''""""""""""""""""""""" పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ""'''''''''''""""""""""""""""'''''''""""""""""" కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా కట్టుబడి ఉంటాం అని తెలిపిన 1వ వార్డు అభ్యర్థి అక్కమ్మ కుమారుడు కుర్వ బాల్ రాజ్. పరిగి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సమయానికి చేరుకోలేకపోయామని,అందువల్లే ప్రమాణ స్వీకారం మిస్ అయ్యిందని ఒకటో వార్డు అభ్యర్థి అక్కమ్మ కుమారుడు తెలిపారు.ఈ విషయాన్ని ఎమ్మెల్యే సమక్షంలో వెల్లడించారు.అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందని, దీనిపై అపోహలు వద్దని ఆయన స్పష్టం చేశారు.చిన్న తప్పిదం వల్లే ఈ గొడవ చోటుచేసుకుందని అక్కమ్మ కుమారుడు తెలిపారు.తాము ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే కి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తామని, ఎలాంటి అపోహలు అవసరం లేదని పేర్కొన్నారు.నస్కల్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.1
- కేశంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని కొందరు అనుమతి లేకుండా జేసీబీతో చెట్లు తొలగించారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన వనాన్ని ధ్వంసం చేయడం చట్టవిరుద్ధమని, అధికారులకు సమాచారం ఇవ్వకుండానే పనులు జరిపారని తెలిపారు. ఘటనపై పంచాయతీ కార్యదర్శి బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.1