ఫ్రైడే డ్రై డే కార్యక్రమాల ద్వారా సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్. అయోధ్య పురం గ్రామంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం. మహబూబాబాద్ జిల్లా (గూడూరు) జూలై 31... ఫ్రైడే డ్రై డే కార్యక్రమాల ద్వారా సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్ అన్నారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ గూడూరు మండలంలోని అయోధ్య పురంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమమును తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలో గల అన్ని ప్రాథమిక కేంద్ర పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించి, లార్వాలను తొలగిస్తూ, ఇంటి పరిసరాల్లో గల కూలర్ లలో నీరు, కొబ్బరి చిప్పలు, రోళ్ళు, నీటి తొట్టిలు, నీరు నిల్వ ప్రాంతాలలో దోమలు పుట్టకుండా లార్వాలను తొలగించాలని, ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని, దోమలు కుట్టకుండా ఇంటి ద్వారలకు, కిటికీలకు, మెష్ డోర్లను అమర్చుకోవాలని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా తీసుకోవాల్సిందిగా అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా జిల్లాలో గల సూపర్వైజర్లకు, ఏఎన్ఎంలకు,ఆశలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల వైద్యాధికారి డాక్టర్ పవన్ కుమార్, సూపర్వైజర్, ఆశాలు పాల్గొన్నారు.

- జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.1
- హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుకై మహబూబాబాద్ లో సంతకాల సేకరణ. మహబూబాబాద్ జిల్లా జులై 31 హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని హమాలి సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబాబాద్ పట్టణ హమాలీ సంఘం ఆధ్వర్యంలో మార్కెట్‌లోని కాటన్ కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ కార్మికుల నుంచి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరికుంట్ల నాగన్న పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, 50 సంవత్సరాలు దాటిన ప్రతి హమాలీ కార్మికుడికి నెలకు రూ.6,000 పెన్షన్ అందించాలని కోరారు. అలాగే ప్రతి హమాలీ కార్మికుడికి రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, విధి నిర్వహణలో కార్మికుడు మరణిస్తే ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అసెంబ్లీలో కూడా చర్చించకుండా కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. ఇప్పటికే హమాలీ కార్మికులు పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఆగస్టు 13న తహసీల్దార్ కార్యాలయం ఎదుట, ఆగస్టు 24న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా హమాలీ కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బత్తుల వెంకన్న, బానోత్ రవి, హేమ, వీరన్న, రవి, రాము, చంద్రయ్య, వీరు, రమేష్, బాలు, రామారావు, రాములు, శ్రీను, చందు, నవీన్, కృష్ణ, మోహన్‌రావు, వెంకన్న, చారి, హరి, బిట్టు, సూర్య, లక్ష్మణ్, సేవ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.1
- పెట్రోల్ బంకులో కల్తీ కలకలం.. పెట్రోల్‌లో నీరు అంటూ వాహనదారుల ఆందోళన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి పెట్రోల్ బంకులో పెట్రోల్‌లో నీరు కలుస్తోందని వాహనదారులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే తరహా ఘటన ఇప్పటికే పలుమార్లు చోటుచేసుకోవడంతో అనేక వాహనాలు చెడిపోయాయని ఆరోపించారు. అయినప్పటికీ తూనికలు, కొలతల శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. వెంటనే తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేశారు.1
- నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం. పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది భౌతికఖాయానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు.కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు.శోకసంద్రంలో మునిగిపోయిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలు. కొనసాగుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర.1
- మోత్కూర్ పాటిమట్ల ఎక్స్ రోడ్డులో 6 బెల్ట్ షాపులపై ఏకకాలంలో తనిఖీలు – భారీగా అక్రమ మద్యం స్వాధీనం1
- మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన.. మహబూబాబాద్‌లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.1
- కే సముద్రం కల్వల గ్రామ శివారు గాంధీ నగర్ లో విషాదం. బావిలో పడి మహిళా అనుమానాస్పద మృతి మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా కేసముద్రము మండలం కల్వల గ్రామ శివారు గాంధీనగర్ లో విషాదం . ఉదయాన్నే పత్తిచేను కలుపు తీసిన మహిళ బానోత్ వెన్నెల (22)బావిలో పడి అనుమానస్పద మృతి . కాలుజారి బావిలో పడింద లేదా ఎవరైనా కావాలనే హత్య చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్న పోలిసులు ..... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....3