logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం కించుమండ పంచాయతీలో పర్యటించిన రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కిడారి శ్రావణ్ కుమార్, అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ పార్లమెంట్ కోశాధికారి వంతల నాగేశ్వరరావును ఆయన నివాసంలో పరామర్శించారు. గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నాగేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స కొనసాగించి త్వరగా కోలుకోవాలని శ్రావణ్ కుమార్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావుకు ధైర్యం చెబుతూ, అవసరమైతే అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

5 hrs ago
user_Rc Tv Telugu
Rc Tv Telugu
పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago
ebde8328-a17b-49dd-ae6d-b99bd4a3db28

అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం కించుమండ పంచాయతీలో పర్యటించిన రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కిడారి శ్రావణ్ కుమార్, అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ పార్లమెంట్ కోశాధికారి వంతల నాగేశ్వరరావును ఆయన నివాసంలో పరామర్శించారు. గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నాగేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స కొనసాగించి త్వరగా కోలుకోవాలని శ్రావణ్ కుమార్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావుకు ధైర్యం చెబుతూ, అవసరమైతే అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామంలోని రహదారుల దుస్థితిపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి రోడ్లు ఏమాత్రం బాగోలేవని, వీటిని ఎవరూ గుర్తించడం లేదని, అసలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ దారుల గుండా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కింద పడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఎవరిలోనూ చలనం లేదని, తాము చెప్పాల్సింది చెప్పేశామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.
    2
    అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామంలోని రహదారుల దుస్థితిపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి రోడ్లు ఏమాత్రం బాగోలేవని, వీటిని ఎవరూ గుర్తించడం లేదని, అసలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ దారుల గుండా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కింద పడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఎవరిలోనూ చలనం లేదని, తాము చెప్పాల్సింది చెప్పేశామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.
    user_Killo chandu
    Killo chandu
    చింతపల్లి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలోని సచివాలయం వద్ద సీపీఎం పార్టీ నాయకులు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను తక్షణమే మరో నెల రోజుల పాటు పొడిగించాలని, అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ, సిబ్బంది కొరత మరియు అధికారులపై ఉన్న పని ఒత్తిడి కారణంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో వేగంగా సాగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉండటం మరియు రైతులు పనుల నిమిత్తం బయటకు వెళ్లడం వల్ల వెరిఫికేషన్ ఫారాలు సకాలంలో అందడం లేదని, దీనివల్ల బీఎల్వోలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 78 శాతం మ్యాపింగ్ మాత్రమే పూర్తయిందని, వలస వెళ్లిన ఓటర్లు మరియు కొత్తగా వివాహమైన మహిళలు ధ్రువపత్రాలు సమర్పించడంలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగియడానికి కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో, గడువు పొడిగించని పక్షంలో జిల్లాలో లక్షన్నర నుండి రెండు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కొమరాడ మండల సచివాలయంలో 11 మంది సిబ్బందికి గాను ప్రస్తుతం ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారని, ఇంజినీరింగ్ అసిస్టెంట్, మహిళా పోలీసు, సర్వేయర్, ఏఎన్‌ఎం వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల పనితీరుపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల సంఘం మరియు ప్రభుత్వం వెంటనే స్పందించి గడువును పెంచాలని సీపీఎం కోరింది.
    1
    పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలోని సచివాలయం వద్ద సీపీఎం పార్టీ నాయకులు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను తక్షణమే మరో నెల రోజుల పాటు పొడిగించాలని, అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ, సిబ్బంది కొరత మరియు అధికారులపై ఉన్న పని ఒత్తిడి కారణంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో వేగంగా సాగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉండటం మరియు రైతులు పనుల నిమిత్తం బయటకు వెళ్లడం వల్ల వెరిఫికేషన్ ఫారాలు సకాలంలో అందడం లేదని, దీనివల్ల బీఎల్వోలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 78 శాతం మ్యాపింగ్ మాత్రమే పూర్తయిందని, వలస వెళ్లిన ఓటర్లు మరియు కొత్తగా వివాహమైన మహిళలు ధ్రువపత్రాలు సమర్పించడంలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు.

ప్రస్తుతం ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగియడానికి కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో, గడువు పొడిగించని పక్షంలో జిల్లాలో లక్షన్నర నుండి రెండు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కొమరాడ మండల సచివాలయంలో 11 మంది సిబ్బందికి గాను ప్రస్తుతం ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారని, ఇంజినీరింగ్ అసిస్టెంట్, మహిళా పోలీసు, సర్వేయర్, ఏఎన్‌ఎం వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల పనితీరుపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల సంఘం మరియు ప్రభుత్వం వెంటనే స్పందించి గడువును పెంచాలని సీపీఎం కోరింది.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని శ్రీమతి ఎస్. జానకి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు తన గాన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన ఎస్. జానకి గారు సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైయస్ జగన్ కొనియాడారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి, భారతీయ సంగీత చరిత్రలో ఆమె ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని పేర్కొన్నారు. తన స్వరంతో ఎన్నో తరాలను అలరించిన ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ఎస్. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించిన వైయస్ జగన్, ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు మరియు సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
    1
    భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని శ్రీమతి ఎస్. జానకి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.

దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు తన గాన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన ఎస్. జానకి గారు సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైయస్ జగన్ కొనియాడారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి, భారతీయ సంగీత చరిత్రలో ఆమె ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని పేర్కొన్నారు. తన స్వరంతో ఎన్నో తరాలను అలరించిన ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.

ఎస్. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించిన వైయస్ జగన్, ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు మరియు సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
    user_Y.S.RAJ KUMAR PATNAIK
    Y.S.RAJ KUMAR PATNAIK
    Marketing Executive మహారాణిపేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    5 hrs ago
  • గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల అభివృద్ధి పేరుతో భారీ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఆరోపించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, పరిశ్రమల స్థాపన నెపంతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీశారని విమర్శించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు స్పష్టంగా గుర్తించారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తూ, స్థానిక యువతకు ఉద్యోగాలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పరిశ్రమల ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించడం, ఉపాధి సృష్టించడం మరియు ప్రాంతీయ సమతుల్యతను కాపాడటంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు.
    1
    గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల అభివృద్ధి పేరుతో భారీ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఆరోపించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, పరిశ్రమల స్థాపన నెపంతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీశారని విమర్శించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు స్పష్టంగా గుర్తించారని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తూ, స్థానిక యువతకు ఉద్యోగాలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పరిశ్రమల ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించడం, ఉపాధి సృష్టించడం మరియు ప్రాంతీయ సమతుల్యతను కాపాడటంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు.
    user_Apsv9 News channel
    Apsv9 News channel
    Media company Yeleswaram, Kakinada•
    16 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    3 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.