logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సమర్థవంతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం దివ్యాంగులకు మోటరైజ్డ్ వాహనాలు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. ప్రెస్ రిలీజ్ తేదీ: 16.04.2026 మల్లంపల్లి మండలం. ములుగు జిల్లా. ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని , పదవ తరగతి విద్యార్ధులతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని, దివ్యాంగుల విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాలు అందించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు 99 రోజుల 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా, గురువారం మల్లంపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన 'మండల సభ' కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు, పథకాల ప్రయోజనాల గురించి లబ్ధిదారులు స్వయంగా వారి మాటలలోనే అందరికీ తెలియజేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం విద్య, సామాజిక భద్రత, మహిళల ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మరిన్ని నూతన సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతుందని స్పష్టం చేశారు. గతంలో కేవలం హైస్కూల్ పదో తరగతి విద్యార్థులకే మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేవారని, ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. హైస్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు, ఉదయం పూట అల్పాహారం కూడా అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. దివ్యాంగులకు చేయూతను అందించాలనే లక్ష్యంతో ఇంటర్మీడియట్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు, వారి సౌకర్యార్థం మోటరైజ్డ్ వాహనాలను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం' అనే నూతన పథకాన్ని ప్రవేశపెడుతుందని వెల్లడించారు. రైతులు కేవలం వరిపైనే ఆధారపడకుండా, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఇతర పంటల సాగు వైపు దృష్టి సారించాలని, దీనివల్ల ఎరువుల వినియోగం తగ్గి భూసారం పెరుగుతుందని వివరించారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, రైతులు కూడా దీనిపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ఆయిల్ పామ్ సాగు చేయడం ద్వారా ఎకరానికి 40 వేల రూపాయల సబ్సిడీ అందిస్తుందని, ఒక్కసారి సాగు చేస్తే మొదటి దిగుబడి నుంచి 30 సంవత్సరాల వరకు స్థిరంగా, నికరంగా ఆదాయం వస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ మొక్కల మధ్య ఖాళీ స్థలంలో అంతర పంటలుగా పప్పు దినుసులను కూడా సేద్యం చేసుకోవచ్చని, దానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని వివరించారు. ఇంచర్ల గ్రామ శివారులో ఎర్రి గట్టమ్మ వద్ద పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ దశలో ఉందని, దీని ద్వారా 300 మందికి ఉపాధి అవకాశాలు కలగడంతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ సేద్యం చేసిన రైతులు స్థానికంగానే తమ పంటను విక్రయించుకోవచ్చని పేర్కొన్నారు. నూతన పథకాల ద్వారా విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ స్పష్టం చేశారు. మల్లంపల్లి మండలంలో నూతన మార్కెట్ యార్డ్, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం మరియు పలు అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డి ఆర్ డి ఓ కృపాకర్ , ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి , ఎంపీఓ, తాసిల్దార్, మండల స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

9 hrs ago
user_Chunchu Ramesh
Chunchu Ramesh
Insurance Agent ములుగు, ములుగు, తెలంగాణ•
9 hrs ago
ecd57935-b968-458d-a8be-aaac3eac63e2

సమర్థవంతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం దివ్యాంగులకు మోటరైజ్డ్ వాహనాలు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. ప్రెస్ రిలీజ్ తేదీ: 16.04.2026 మల్లంపల్లి మండలం. ములుగు జిల్లా. ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని , పదవ తరగతి విద్యార్ధులతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని, దివ్యాంగుల విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాలు అందించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు 99 రోజుల 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా, గురువారం మల్లంపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన 'మండల సభ' కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు, పథకాల ప్రయోజనాల గురించి లబ్ధిదారులు స్వయంగా వారి మాటలలోనే అందరికీ తెలియజేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం విద్య, సామాజిక భద్రత, మహిళల ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మరిన్ని నూతన సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతుందని స్పష్టం చేశారు. గతంలో కేవలం హైస్కూల్ పదో తరగతి విద్యార్థులకే మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేవారని, ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. హైస్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు, ఉదయం పూట అల్పాహారం కూడా అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. దివ్యాంగులకు చేయూతను అందించాలనే లక్ష్యంతో ఇంటర్మీడియట్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు, వారి సౌకర్యార్థం మోటరైజ్డ్ వాహనాలను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం'

3d7e32ea-0576-4144-8adb-639499a6d1d6

అనే నూతన పథకాన్ని ప్రవేశపెడుతుందని వెల్లడించారు. రైతులు కేవలం వరిపైనే ఆధారపడకుండా, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఇతర పంటల సాగు వైపు దృష్టి సారించాలని, దీనివల్ల ఎరువుల వినియోగం తగ్గి భూసారం పెరుగుతుందని వివరించారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, రైతులు కూడా దీనిపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ఆయిల్ పామ్ సాగు చేయడం ద్వారా ఎకరానికి 40 వేల రూపాయల సబ్సిడీ అందిస్తుందని, ఒక్కసారి సాగు చేస్తే మొదటి దిగుబడి నుంచి 30 సంవత్సరాల వరకు స్థిరంగా, నికరంగా ఆదాయం వస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ మొక్కల మధ్య ఖాళీ స్థలంలో అంతర పంటలుగా పప్పు దినుసులను కూడా సేద్యం చేసుకోవచ్చని, దానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని వివరించారు. ఇంచర్ల గ్రామ శివారులో ఎర్రి గట్టమ్మ వద్ద పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ దశలో ఉందని, దీని ద్వారా 300 మందికి ఉపాధి అవకాశాలు కలగడంతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ సేద్యం చేసిన రైతులు స్థానికంగానే తమ పంటను విక్రయించుకోవచ్చని పేర్కొన్నారు. నూతన పథకాల ద్వారా విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ స్పష్టం చేశారు. మల్లంపల్లి మండలంలో నూతన మార్కెట్ యార్డ్, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం మరియు పలు అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డి ఆర్ డి ఓ కృపాకర్ , ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి , ఎంపీఓ, తాసిల్దార్, మండల స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విభాగం ఉక్కుపాదం మోపింది. విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ ఆదేశాల మేరకు అధికారులు ఏకకాలంలో పలు కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన, జీఎస్‌టీ ఎగవేత, పాన్ కార్డుల దుర్వినియోగం వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న మధ్యవర్తుల ప్రమేయంపై అధికారులు దృష్టి సారించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిర్దేశించిన ఫీజుల వసూలులో పారదర్శకత, స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో లోపాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. కార్యాలయాల్లో అనధికారిక వ్యక్తుల జోక్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనసాగుతాయని ఆయన వెల్లడించారు.
    4
    రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విభాగం ఉక్కుపాదం మోపింది. విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ ఆదేశాల మేరకు అధికారులు ఏకకాలంలో పలు కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన, జీఎస్‌టీ ఎగవేత, పాన్ కార్డుల దుర్వినియోగం వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు.
ప్రధానంగా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న మధ్యవర్తుల ప్రమేయంపై అధికారులు దృష్టి సారించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిర్దేశించిన ఫీజుల వసూలులో పారదర్శకత, స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో లోపాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. కార్యాలయాల్లో అనధికారిక వ్యక్తుల జోక్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనసాగుతాయని ఆయన వెల్లడించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • బెజ్జంకి మండలంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల సభ గురువారం ముగిసింది. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ గేయాన్ని ఆలపించగా, అనంతరం మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, భువన చేయూత, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల అమలు తీరును అధికారులు వివరించారు. గ్రామ స్థాయిలో సమస్యలు, పరిష్కారాలపై సర్పంచులు, అధికారులు చర్చించారు. అంగన్వాడి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి భావన నాగరాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
    1
    బెజ్జంకి మండలంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల సభ గురువారం ముగిసింది. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ గేయాన్ని ఆలపించగా, అనంతరం మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, భువన చేయూత, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల అమలు తీరును అధికారులు వివరించారు.
గ్రామ స్థాయిలో సమస్యలు, పరిష్కారాలపై సర్పంచులు, అధికారులు చర్చించారు. అంగన్వాడి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి భావన నాగరాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    6 hrs ago
  • Post by నీరటి మహేందర్
    1
    Post by నీరటి మహేందర్
    user_నీరటి మహేందర్
    నీరటి మహేందర్
    మద్దూర్, సిద్దిపేట, తెలంగాణ•
    8 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 13వ తేదీన హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న కూనలక్ష్మిని గమనించిన గడీల రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై జల్సాలకు డబ్బులు సరిపోనందున ఎలా అయినా డబ్బులు సంపాదించాలనుకుని కొంత కాలం నుండి రాజీవ్ నగర్ లో ఇంటిలో లక్ష్మీ ఒక్కతే ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయలు నగదు, రెండు చీరలు, బ్యాంకు పాసుబుక్కులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ లు తీసుకెళ్లినట్లు చెవులకు ఉన్న బంగారు పుల్లలు తీయడానికి ప్రయత్నించగా అవి రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో రెండు చెవులను కత్తిరించి ఇంటికి తీసుకుపోయి అవి కడిగే ప్రయత్నం చేయగా ఆ బంగారు పోగులు పడిపోయాయని తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర రెండు చీరలు బ్యాంకు పాసుబుక్కులు రాజీవ్ ఆరోగ్యశ్రీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్లు 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 13వ తేదీన హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న కూనలక్ష్మిని గమనించిన గడీల రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై జల్సాలకు డబ్బులు సరిపోనందున ఎలా అయినా డబ్బులు సంపాదించాలనుకుని కొంత కాలం నుండి రాజీవ్ నగర్ లో ఇంటిలో లక్ష్మీ ఒక్కతే ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయలు నగదు, రెండు చీరలు, బ్యాంకు పాసుబుక్కులు, రాజీవ్  ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ లు  తీసుకెళ్లినట్లు చెవులకు ఉన్న బంగారు పుల్లలు తీయడానికి ప్రయత్నించగా అవి రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో రెండు చెవులను కత్తిరించి ఇంటికి తీసుకుపోయి అవి కడిగే ప్రయత్నం చేయగా ఆ బంగారు పోగులు పడిపోయాయని తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర రెండు చీరలు బ్యాంకు పాసుబుక్కులు రాజీవ్ ఆరోగ్యశ్రీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్లు 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజులపాటు అగ్నిమాపక అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సహకారంతో గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బి ఎస్ లత హాజరై, ఈ రక్తదాన శిభిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్. లత, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కొమురవెల్లి వేణుగోపాల్, జగిత్యాల, ధర్మపురి అగ్నిమాపక కేంద్రం అధికారులు కృష్ణ కాంత్, శ్రీకాంత్ సంబంధిత శాఖ ఉద్యోగులు, సిబ్బంది, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డా. రాణి, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్లతో మాట్లాడుతూ...రక్తదానం పట్ల ఇలాంటి అపోహలు అనుమానాలు అక్కరలేదని ప్రతి ఒక్కరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. అలాగే, అగ్నిప్రమాదాలు మరియు ఇతర విపత్తులు సంభావించిన సందర్భంలో క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని ఆస్తులు, ప్రాణాలు కాపాడడంలో ముందుండేది అగ్నిమాపక సిబ్బందిదే ప్రధానపాత్ర అనీ, వారిని ముందుకు నడిపించే అధికారులే అసలైన రియల్ హీరోస్ అన్నారు.  అనంతరం, అగ్నిమాపక శాఖలో అమరులైన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు. కాగా ఈ రక్తదాన శిభిరంలో జిల్లా అధికారి సైదులుతో పాటుగా 30 మంది అగ్నిమాపక అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు.
    4
    అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజులపాటు అగ్నిమాపక అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సహకారంతో గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బి ఎస్ లత హాజరై, ఈ రక్తదాన శిభిరాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్. లత, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కొమురవెల్లి వేణుగోపాల్, జగిత్యాల, ధర్మపురి అగ్నిమాపక కేంద్రం అధికారులు కృష్ణ కాంత్, శ్రీకాంత్ సంబంధిత శాఖ ఉద్యోగులు, సిబ్బంది, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డా. రాణి, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్లతో మాట్లాడుతూ...రక్తదానం పట్ల ఇలాంటి అపోహలు అనుమానాలు అక్కరలేదని ప్రతి ఒక్కరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు.
అలాగే, అగ్నిప్రమాదాలు మరియు ఇతర విపత్తులు సంభావించిన సందర్భంలో క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని ఆస్తులు, ప్రాణాలు కాపాడడంలో ముందుండేది అగ్నిమాపక సిబ్బందిదే ప్రధానపాత్ర అనీ, వారిని ముందుకు నడిపించే అధికారులే అసలైన రియల్ హీరోస్ అన్నారు. 
అనంతరం, అగ్నిమాపక శాఖలో అమరులైన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు.
కాగా ఈ రక్తదాన శిభిరంలో జిల్లా అధికారి సైదులుతో పాటుగా 30 మంది అగ్నిమాపక అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • ​నకిరేకల్: నియోజకవర్గంలో అధికారుల ఏకపక్ష వైఖరి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న అడ్డగోలు దోపిడీపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ​రాజకీయ ఏజెంట్లతో రైతులకు ఉరితాడు ​గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐకేపీ, పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ఎంతో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని చిరుమర్తి లింగయ్య గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించి, రైతుల రక్తాన్ని తాగుతోందని విమర్శించారు. వారి స్వార్థం కోసం రైతుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ​అంకెల్లో దోపిడీ.. క్వింటాకు 7 కేజీల నష్టం! ​ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాలను ఆయన లెక్కలతో సహా వివరించారు: ​అదనపు తూకం: గతంలో బస్తాకు 40 కేజీలు ఉంటే, ఇప్పుడు బలవంతంగా 42 కేజీలు తూకం వేయిస్తూ క్వింటాకు 5 కేజీల పంటను అదనంగా లాగేసుకుంటున్నారు. ​రిజిస్టర్ల మాయాజాలం: కొన్ని చోట్ల బస్తాకు 37 కేజీలు తూకం వేసి, రికార్డుల్లో మాత్రం 35 కేజీలే రాస్తున్నారని.. ఇలా క్వింటాకు మరో కేజీ, అంటే మొత్తంగా 7 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. ​అధికారులకు హెచ్చరిక: "చట్టం తన పని తాను చేస్తుంది" ​ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి, కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడంపై మండిపడ్డారు. "అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా మారకండి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించారు. ​పోలీసుల వేధింపులు.. కలెక్టరేట్ ముట్టడికి పిలుపు ​చిన్న చిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు రాక, కరెంటు లేక రైతులు అల్లాడుతున్నారని.. తక్షణమే అదనపు తూకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ​పాల్గొన్న నాయకులు: ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ మరియు కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ గొర్ల వీరు, మాజీ కౌన్సిలర్లు పల్లె విజయ్ గుర్రం గణేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ​నకిరేకల్: నియోజకవర్గంలో అధికారుల ఏకపక్ష వైఖరి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న అడ్డగోలు దోపిడీపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
​రాజకీయ ఏజెంట్లతో రైతులకు ఉరితాడు
​గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐకేపీ, పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ఎంతో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని చిరుమర్తి లింగయ్య గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించి, రైతుల రక్తాన్ని తాగుతోందని విమర్శించారు. వారి స్వార్థం కోసం రైతుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు.
​అంకెల్లో దోపిడీ.. క్వింటాకు 7 కేజీల నష్టం!
​ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాలను ఆయన లెక్కలతో సహా వివరించారు:
​అదనపు తూకం: గతంలో బస్తాకు 40 కేజీలు ఉంటే, ఇప్పుడు బలవంతంగా 42 కేజీలు తూకం వేయిస్తూ క్వింటాకు 5 కేజీల పంటను అదనంగా లాగేసుకుంటున్నారు.
​రిజిస్టర్ల మాయాజాలం: కొన్ని చోట్ల బస్తాకు 37 కేజీలు తూకం వేసి, రికార్డుల్లో మాత్రం 35 కేజీలే రాస్తున్నారని.. ఇలా క్వింటాకు మరో కేజీ, అంటే మొత్తంగా 7 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు.
​అధికారులకు హెచ్చరిక: "చట్టం తన పని తాను చేస్తుంది"
​ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి, కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడంపై మండిపడ్డారు. "అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా మారకండి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించారు.
​పోలీసుల వేధింపులు.. కలెక్టరేట్ ముట్టడికి పిలుపు
​చిన్న చిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు రాక, కరెంటు లేక రైతులు అల్లాడుతున్నారని.. తక్షణమే అదనపు తూకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు.
​పాల్గొన్న నాయకులు:
ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ మరియు కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ గొర్ల వీరు, మాజీ కౌన్సిలర్లు పల్లె విజయ్ గుర్రం గణేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_PRK
    PRK
    Local News Reporter కేతేపల్లి, నల్గొండ, తెలంగాణ•
    9 hrs ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక అధికారి మల్లేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.సమావేశంలో సీఎం సందేశం వినిపించగా, మండలంలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను అధికారులు వెల్లడించారు.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక అధికారి మల్లేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.సమావేశంలో సీఎం సందేశం వినిపించగా, మండలంలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను అధికారులు వెల్లడించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • సిరిసిల్ల లో ఇసుక స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎమ్మార్వో పై దాడి కి యత్నించారు. సిరిసిల్ల లో తహశిల్దార్ మహేశ్‌పై ఇసుక స్మగ్లర్లు ట్రాక్టర్ తోలో దాడికి యత్నించారు. ట్రాక్టర్ డ్రైవర్ శివరాత్రి శివాజీ పరార్ అయ్యారు. ప్రమాదం నుంచి తృటిలో తహశీల్దార్ తప్పించుకున్నారు. పోలీసులకు తహశిల్దార్ ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ట్రాక్టర్ ను సీజ్ చేసి ఎమ్మార్వో కు రాశారు.
    2
    సిరిసిల్ల లో ఇసుక స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎమ్మార్వో పై దాడి కి యత్నించారు. సిరిసిల్ల లో తహశిల్దార్ మహేశ్‌పై ఇసుక స్మగ్లర్లు ట్రాక్టర్ తోలో  దాడికి యత్నించారు. ట్రాక్టర్ డ్రైవర్ శివరాత్రి శివాజీ పరార్ అయ్యారు. ప్రమాదం నుంచి తృటిలో తహశీల్దార్ తప్పించుకున్నారు.
పోలీసులకు తహశిల్దార్ ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ట్రాక్టర్ ను సీజ్ చేసి ఎమ్మార్వో కు రాశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    9 hrs ago
  • Post by నీరటి మహేందర్
    1
    Post by నీరటి మహేందర్
    user_నీరటి మహేందర్
    నీరటి మహేందర్
    మద్దూర్, సిద్దిపేట, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.