Shuru
Apke Nagar Ki App…
తనకల్లు మండల పరిధిలోని హత్య కేసు కు సంబంధించిన నేరస్తులను కాలినడకన సబ్ జైలుకు తరలించారు. తనకల్లు మండల పోలీస్ స్టేషన్ గేట్ ఎదుట జరిగిన హత్యకు సంబంధించిన హంతకులను రిమాండ్ విధించడంతో స్థానిక పట్టణంలోని వేమారెడ్డి సర్కిల్ నుండి సబ్ జైలుకు నడిపించుకుంటూ రిమాండ్ కు పంపించారు. డీఎస్పీ శివ నారాయణస్వామి గ్రామీణ సర్కిల్ సిఐ నాగేంద్ర పాల్గొన్నారు.
Srivartha news
తనకల్లు మండల పరిధిలోని హత్య కేసు కు సంబంధించిన నేరస్తులను కాలినడకన సబ్ జైలుకు తరలించారు. తనకల్లు మండల పోలీస్ స్టేషన్ గేట్ ఎదుట జరిగిన హత్యకు సంబంధించిన హంతకులను రిమాండ్ విధించడంతో స్థానిక పట్టణంలోని వేమారెడ్డి సర్కిల్ నుండి సబ్ జైలుకు నడిపించుకుంటూ రిమాండ్ కు పంపించారు. డీఎస్పీ శివ నారాయణస్వామి గ్రామీణ సర్కిల్ సిఐ నాగేంద్ర పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు... సంక్రాంతి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి ... ధర్మవరం డిఎస్పి.. శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం పోలీస్ డివిజన్ ప్రజలకు తెలియజేయడమేమనగా రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడైనా కోడిపందాలు, టెంకాయ ఆటలు తదితర జూదాలు నిర్వహించిన పాల్గొన్న ప్రోత్సహించిన అటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ గారు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆటోల ద్వారా మైకు ప్రచారం నిర్వహిస్తూ, రాబోవు సంక్రాంతి పండుగను సందర్భంగా ప్రజలకు కోడి పందాలు, టెంకాయ ఆట వంటి జూదల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన చేపట్టారు. డిఎస్పి గారు మాట్లాడుతూ, కోడి పందాలు టెంకాయ ఆటలు వంటి వాటికి దూరంగా ఉండాలని కోడిపందాలు ఎక్కడైనా జరుగుతున్నట్టు తెలిస్తే అటువంటి వారిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కోడిపందాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డి.ఎస్.పి గారు సూచించారు. సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా జరుపుకోవాలని, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.1
- వి.ఎస్.ఎన్ విద్యాసంస్థల ముందస్తు సంక్రాంతి సంబరాలు పీలేరు జనవరి 8 : స్థానిక పీలేరు పట్టణంలో సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసే వి.ఎస్.ఎన్ విద్యా సంస్థలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా ఎంతో ఘనంగా నిర్వహించారు. మొదటగా వి.ఎస్.ఎన్ విద్యాసంస్థల అధినేత్రి వి.మాధవి విద్యార్థిని, విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాల గురించి భోగి,సంక్రాంతి మరియు కనుమ పండుగల ఆవశ్యకత, గొప్పతనాన్ని గురించి వివరించారు. తదుపరి విద్యార్థిని, విద్యార్థులకు మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఆటలు పోటీలు నిర్వహించారు. విద్యార్థినులకు రంగోళి, ఖోఖో పోటీలు మరియు విద్యార్థులకు గాలి పతంగులు, కబడ్డి, క్రికెట్ వంటి ఆటల పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, పాల్గొన్నారు. చివరగా వి.ఎస్.ఎన్ ఒలంపియాడ్ ప్రిన్సిపాల్ సురేష్ పండుగలను విద్యార్థులకు భోగి, సంక్రాంతి మరియు కనుమ కుటుంబ సభ్యులు మరియు బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలి అని కుటుంబ విలువలు గురించి తెలిపి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాములు అందురు విద్యార్థులలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.1
- మండల సర్వేయర్ పై పోలీసులకు ఫిర్యాదు. పలమనేరు జనవరి 9 (ప్రజా ప్రతిభ) : అంబేద్కర్ భవన స్థలాన్ని సర్వే చేయకుండానే చేసినట్లు తప్పుడు ఎండార్స్ ఇచ్చిన గంగవరం మండల సర్వేర్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పలమనేర్ నియోజకవర్గం అంబేద్కర్ భవనాల అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం గంగవరం అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు డి.వి. మునిరత్నం, ఎం. శ్రీనివాసులు,మణి, మహేష్, రెడ్డి ప్రసాద్, హరి మాట్లాడుతూ నెల రోజుల క్రితం అంబేద్కర్ భవన స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించిన శ్రీలంక శరణార్థులకు అంబేద్కర్ వాదులకు వాగ్వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కరించాలని కోరుతూ మండల తహసిల్దార్ కు విన్నవించామన్నారు. వారు నిర్లక్ష్యం చేయడంతో16--12---25 వ తేదీన జిల్లా కలెక్టరేట్లో జరిగే పి జి ఆర్ ఎస్ లో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు. ఆ ఫిర్యాదు మేరకు జనవరి 6వ తేదీ వివాదంలో ఉన్న అంబేద్కర్ భవన స్థలాన్ని సర్వే చేయడానికి వస్తున్నామని వాట్సాప్ ద్వారా మండల సర్వేర్ నోటీసు పంపించారని వివరించారు. ఆరోజు సాయంత్రం వరకు దళిత, బహుజన నాయకులు అధికారులు వస్తారని పడిగాపులు కాసినా ఎవరు రాకపోవడంతో నిరాశతో వెనుతిరిగామన్నారు. ఇప్పటివరకు సర్వేనెంబర్ 314 స్థలం సబ్ డివిజన్ కాకపోయినా మండల సర్వే314/3 గా సబ్ డివిజన్ అయినట్లు క్రియేట్ చేసి మాకు పంపిన ఎండార్స్ లో పంపారని ఆరోపించారు. 31----12---2025 వతేది మేము పి జి ఆర్ ఎస్ లో నమోదు చేసుకొన్న ఫిర్యాదు మేరకు అధికారులు వచ్చి సమస్య పరిష్కరించినట్లుగా తప్పుడు ఎండార్స్ ఇచ్చి అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. దళితులు పట్ల అధికారులకు, అగ్రవర్ణాలకు వివక్ష ఉన్నదనే విషయం నగ్నమెరిగిన సత్యం అని ,అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగ అవకాశం పొందిన అధికారులు కూడా అంబేద్కర్ కోసం కేటాయించిన స్థలం విషయములో వివక్ష చూపుతూ తప్పుడు సమాచారం ఇవ్వడం చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు. మండల సర్వేయర్ దళితులు పట్ల చూపుతున్న వ్యవహార శైలిని ఎండగడుతూ అతనిపైన చర్యలు తీసుకోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ను కోరారు, ఈ కార్యక్రమంలో దళిత, బహుజన నాయకులు పాల్గొన్నారు1
- బద్వేల్ నియోజకవర్గం లో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని AP మీడియా ఫెడరేషన్ నియోజవర్గ అధ్యక్షుడు క్రిష్ణ కిషోర్ ఆధ్వర్యంలో బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు,మీడియా ప్రతినిధులకు ఏవైనా సమావేశాలు పెట్టుకోవాలంటే ఇబ్బందికరంగా ఉందని ప్రెస్ క్లబ్ కోసం స్థలం కేటాయించాలని తమ దృష్టికి తీసుకువచ్చారని ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.1
- చంద్రగిరిలో జవాన్ సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కూడా లంచం అడుగుతున్న టీడీపీ నేతలు #STV9: రూ.2 లక్షలు ఇవ్వాలని.. లేకపోతే ఇల్లు కట్టుకోనివ్వమని స్థానిక టీడీపీ నేత బాలాజీ వార్నింగ్ #chandhragi1
- Post by Bondhu Suresh1
- ఇచ్చిన డబ్బులు అడిగితే అక్రమ కేసు లేనా1
- కాసినయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన శ్రీదేవి గత 6 సంవత్సరాలుగా పక్షవాతనికి గురై మంచానికి పరిమితమైంది.భర్త చనిపోవడం తో ఆమె రోడ్డున పడింది. విషయం తెలుసుకున్న మూలపల్లె టీచర్ చంద్రశేఖర్ ఆచారి ఆమె రూ.2లక్షల ఖర్చుతో ఇల్లు నిర్మించి మానవత్వం చాటుకున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన ఆమె ఇంటికి రంగులు వేయించాడు. ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ఆదుకుంటున్నారు. రెండు సంవత్సరాలుగా ఆమె చిన్న కుమారుడు చదువు కోసం ఖర్చు చేస్తున్నాడు.2