logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీచేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద... వరంగల్ జిల్లా, ఆగష్టు 26: రాయపర్తి లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పల్లె దవాఖానా లో వ్యాధి నిరోధక టీకా లు చిన్నారులకు వేస్తున్న తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలోని మందుల నిల్వలను తనిఖీ చేసి, గడువు తీరిన మందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మందులను సురక్షితంగా భద్రపరిచే తీరును పరిశీలించారు. ల్యాబొరేటరీ లో మందుల నిలువ, ఇతర వైద్య సామగ్రి గురించి ల్యాబ్ ఇన్‌చార్జిని అడిగి తెలుసుకున్నారు. ల్యాబొరేటరీని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ల్యాబ్ ఇన్‌చార్జిని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో కూడా పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందులు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రానికి సమస్యలతో వచ్చిన పీషెట్స్ తో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి మాటల్లో ఆసుపత్రి లో అందుతున్న వైద్య సేవల గురించి వారి మాటల్లో తెలుసుకున్నారు. ఈ ఆకస్మిక తనిఖీలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రకాష్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్, సంబంధిత గ్రామ సర్పంచ్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

1 day ago
user_Venkatgoud kallepu
Venkatgoud kallepu
Press advisory రైపర్తి, వరంగల్, తెలంగాణ•
1 day ago
1e854fad-d6e6-44c6-8aea-5adfd28a22c9

ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీచేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద... వరంగల్ జిల్లా, ఆగష్టు 26: రాయపర్తి లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పల్లె దవాఖానా లో వ్యాధి నిరోధక టీకా లు చిన్నారులకు వేస్తున్న తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలోని మందుల నిల్వలను తనిఖీ చేసి, గడువు తీరిన మందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మందులను సురక్షితంగా భద్రపరిచే తీరును పరిశీలించారు. ల్యాబొరేటరీ లో మందుల నిలువ, ఇతర వైద్య సామగ్రి గురించి ల్యాబ్ ఇన్‌చార్జిని అడిగి తెలుసుకున్నారు. ల్యాబొరేటరీని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ల్యాబ్ ఇన్‌చార్జిని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో కూడా పరిశుభ్రంగా ఉండేలా

41068e5b-a6c3-4081-815b-ddaa8f5819bd

చూడాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందులు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రానికి సమస్యలతో వచ్చిన పీషెట్స్ తో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి మాటల్లో ఆసుపత్రి లో అందుతున్న వైద్య సేవల గురించి వారి మాటల్లో తెలుసుకున్నారు. ఈ ఆకస్మిక తనిఖీలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రకాష్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్, సంబంధిత గ్రామ సర్పంచ్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.
    1
    నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.
    user_Reporter Gaddam Kiran
    Reporter Gaddam Kiran
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    22 hrs ago
  • సోదరభావానికి, ఆధ్యాత్మిక రక్షణకు ప్రతీక రాఖీ పండుగ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి పవిత్రమైన రక్షాబంధన్ రాఖీ పండుగ సందర్బంగా హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మకుమారీల ప్రతినిధులు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీ సోదరీమణులు ఆయనకు మిఠాయిలు తినిపించి, ఈశ్వరీయ ఆశీస్సులు అందించారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షాబంధన్ అనేది కేవలం అన్నాచెల్లెళ్ల అనురాగానికి సూచిక మాత్రమే కాదు, సమాజంలో సోదరభావాన్ని, పరస్పర రక్షణ భావనను పెంపొందించే అత్యంత పవిత్రమైన పండుగని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు రక్షణగా నిలవాలని, ప్రేమాభిమానాలతో జీవించాలని ఈ పండుగ మనకు సందేశాన్నిస్తుందని అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకంగా కొనియాడారు. సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంలో, మానసిక ప్రశాంతతను అందించడంలో బ్రహ్మకుమారీ సంస్థ పాత్ర ప్రశంసనీయమని తెలిపారు. మానవత్వ విలువలు, శాంతి, సద్భావన వ్యాప్తికి ఈ సంస్థ చేస్తున్న కృషి సమాజానికి ఎంతో అవసరం అని వెల్లడించారు. తన వద్దకు వచ్చి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీ ప్రతినిధులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
    2
    సోదరభావానికి, ఆధ్యాత్మిక రక్షణకు ప్రతీక రాఖీ పండుగ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
పవిత్రమైన రక్షాబంధన్ రాఖీ పండుగ సందర్బంగా హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మకుమారీల ప్రతినిధులు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీ సోదరీమణులు ఆయనకు మిఠాయిలు తినిపించి, ఈశ్వరీయ ఆశీస్సులు అందించారు.
అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షాబంధన్ అనేది కేవలం అన్నాచెల్లెళ్ల అనురాగానికి సూచిక మాత్రమే కాదు, సమాజంలో సోదరభావాన్ని, పరస్పర రక్షణ భావనను పెంపొందించే అత్యంత పవిత్రమైన పండుగని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు రక్షణగా నిలవాలని, ప్రేమాభిమానాలతో జీవించాలని ఈ పండుగ మనకు సందేశాన్నిస్తుందని అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకంగా కొనియాడారు. సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంలో, మానసిక ప్రశాంతతను అందించడంలో బ్రహ్మకుమారీ సంస్థ పాత్ర ప్రశంసనీయమని తెలిపారు. మానవత్వ విలువలు, శాంతి, సద్భావన వ్యాప్తికి ఈ సంస్థ చేస్తున్న కృషి సమాజానికి ఎంతో అవసరం అని వెల్లడించారు. తన వద్దకు వచ్చి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీ ప్రతినిధులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
    user_Kumar Pasunuri
    Kumar Pasunuri
    Local News Reporter Ghanpur (Station), Jangoan•
    4 hrs ago
  • హనుమకొండలో హరీశ్‌రావు అరెస్ట్.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్‌ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
    1
    హనుమకొండలో హరీశ్‌రావు అరెస్ట్.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత
హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్‌ స్తంభించింది.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్‌ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • గ్రానెట్ లారీ బోల్తా మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తా పడటంతో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ కావడం వలన కొడకండ్ల పెద్దవంగర మండలాల్లోని పలు గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో గ్రామ పంచాయతీలు గ్రామ ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోగలరని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.
    1
    గ్రానెట్ లారీ బోల్తా మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్
జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తా పడటంతో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ కావడం వలన కొడకండ్ల పెద్దవంగర మండలాల్లోని పలు గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో గ్రామ పంచాయతీలు గ్రామ ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోగలరని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    12 hrs ago
  • ఆరు నెలల్లో రహదారుల పనులు పూర్తి చేయాలి : మంత్రి సీతక్క MLG: ములుగు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. గురువారం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. రహదారుల పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించే అధికారులు, గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    1
    ఆరు నెలల్లో రహదారుల పనులు పూర్తి చేయాలి
: మంత్రి సీతక్క
MLG: ములుగు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. గురువారం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. రహదారుల పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించే అధికారులు, గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    user_MAHI
    MAHI
    ములుగు, ములుగు, తెలంగాణ•
    4 hrs ago
  • ములుగు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల మహాధర్నా: 6 పెండింగ్ DAలు, OPS అమలుకు డిమాండ్ ​ములుగు:దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో గురువారం ములుగు నూతన కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీ ఎత్తున ‘మహాధర్నా’ నిర్వహించారు. ​ఈ ధర్నాలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా రెండు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లారు: ​6 పెండింగ్ DAల విడుదల: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన 6 బకాయి డియర్నెస్ అలవెన్సులను (DA) ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే మంజూరు చేయాలి. ​OPS పునరుద్ధరణ: ఉద్యోగుల భవిష్యత్తుకు నష్టం కలిగిస్తున్న సీపీఎస్ (CPS) విధానాన్ని స్వస్తి పలికి, పాత పింఛన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి. ​ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. నిరసన అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అధికారులకు అందజేశారు. ​ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ ముఖ్య నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
    2
    ములుగు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల మహాధర్నా: 6 పెండింగ్ DAలు, OPS అమలుకు డిమాండ్
​ములుగు:దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో గురువారం ములుగు నూతన కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీ ఎత్తున ‘మహాధర్నా’ నిర్వహించారు.
​ఈ ధర్నాలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా రెండు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లారు:
​6 పెండింగ్ DAల విడుదల: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన 6 బకాయి డియర్నెస్ అలవెన్సులను (DA) ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే మంజూరు చేయాలి.
​OPS పునరుద్ధరణ: ఉద్యోగుల భవిష్యత్తుకు నష్టం కలిగిస్తున్న సీపీఎస్ (CPS) విధానాన్ని స్వస్తి పలికి, పాత పింఛన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి.
​ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. నిరసన అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అధికారులకు అందజేశారు.
​ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ ముఖ్య నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
    user_Karunya
    Karunya
    ములుగు, ములుగు, తెలంగాణ•
    6 hrs ago
  • మరి చెట్టుకు మర్రి కల్లు.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అరుదైన సంఘటన. కల్లు తాగడానికి చెట్టును చూడడానికి భయపడుతున్న జనం... బయ్యారం మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27... మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహాశీల్డార్ కార్యాలయం సమీపంలో ని చిన్నాల కుంట చెరువు వద్ద మర్రి చెట్టు వేరు నుండి కళ్ళు రావడం చూసి గీత కార్మికుడు నాలుగైదు రోజుల నుండి దానిని పరిశీలించగా ప్రధాన వేరు నుండి మర్రి కళ్ళు రావడానికి చూసి ఆశ్చర్యానికి లోనై వేరుకు గీత కత్తితో గీతలు పెట్టి కల్లు లొట్టిని కట్టారు. లొట్టిలో కళ్ళు పడటం చూసి పలువురు మర్రి కల్లు తాగేందుకు క్యూలు కడుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పలువురు ఆ చెట్టును చూడటానికి వెళుతున్నారు. దీనిపై గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం మర్రిచెట్టు పక్కనే గండు పెద్ద వెంకన్న వ్యవసాయ బావి పాడుబడి పూడిక తో ఉండడంతో ఏలిననో ప్రభావంతోతన వారి సాగు పొలానికి నీరు సరిపోక పోవడంతో తన బావిని ప్రోక్లిన్ సహాయంతో పూడిక పనులు చేశారు . పూడిక తీస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న మర్రి పెద్ద వేరు తెగి పోవడం వల్ల, వేరు నుంచి మూడు నాలుగు రోజులుగా మర్రి కల్లు జాలు వారడం చూశానని తెలిపాడు.మర్రికల్లును తీసి విక్రయిస్తున్నట్లు గీత కార్మికుడు తెలిపాడు.
    1
    మరి చెట్టుకు మర్రి కల్లు.. 
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అరుదైన సంఘటన. 
కల్లు తాగడానికి చెట్టును చూడడానికి భయపడుతున్న జనం... 
బయ్యారం మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27... 
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహాశీల్డార్  కార్యాలయం సమీపంలో ని చిన్నాల కుంట చెరువు  వద్ద మర్రి చెట్టు వేరు నుండి కళ్ళు రావడం చూసి గీత కార్మికుడు నాలుగైదు రోజుల నుండి దానిని పరిశీలించగా ప్రధాన వేరు నుండి మర్రి కళ్ళు రావడానికి చూసి ఆశ్చర్యానికి లోనై వేరుకు గీత కత్తితో గీతలు పెట్టి కల్లు లొట్టిని కట్టారు. లొట్టిలో కళ్ళు పడటం చూసి పలువురు మర్రి కల్లు తాగేందుకు క్యూలు కడుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పలువురు ఆ చెట్టును చూడటానికి వెళుతున్నారు. దీనిపై గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం మర్రిచెట్టు పక్కనే గండు పెద్ద  వెంకన్న వ్యవసాయ బావి పాడుబడి  పూడిక తో ఉండడంతో  ఏలిననో ప్రభావంతోతన వారి సాగు పొలానికి  నీరు సరిపోక పోవడంతో  తన  బావిని ప్రోక్లిన్ సహాయంతో పూడిక పనులు చేశారు . పూడిక తీస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న మర్రి  పెద్ద వేరు తెగి పోవడం  వల్ల, వేరు  నుంచి మూడు నాలుగు రోజులుగా  మర్రి కల్లు జాలు వారడం చూశానని తెలిపాడు.మర్రికల్లును తీసి విక్రయిస్తున్నట్లు గీత కార్మికుడు తెలిపాడు.
    user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • అధికారం కోల్పోయామనే అక్కసుతో బిఆర్ఎస్ నాయకులు నీచస్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం - కడియం శ్రీహరి 10ఏళ్ల పాలనలో తెలంగాణ వనరులను దోచుకున్న బిఆర్ఎస్ కు, మొదటి నుండి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీకి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై 20లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంబొత్సవం చేసి, 10లక్షల సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. 2కోట్ల 26లక్షలతో నిర్మించిన 33/11కేవి సబ్ స్టేషన్ ను ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రారంభించిన శిలాఫలకాన్ని సబ్ స్టేషన్ వద్ద ఆవిష్కరించారు. అలాగే గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభింంచడంతో పాటు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి 6మాట్లాడుతూ..... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ ఫండ్లో ఉన్న 1400కోట్లు అక్రమంగా వచ్చినదే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను దోచుకున్న బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీకి తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు సాగరం గ్రామానికి మొట్ట మొదటగా బిటీ రోడ్డు, వాటర్ ట్యాంక్ కట్టించింది కడియం శ్రీహరి అని తెలిపారు. మధ్యలో 20ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎం చేశారో మీకే తెలుసని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రెండున్నర ఏళ్లలోనే ఒక్క సాగరం గ్రామానికే దాదాపు 10కోట్ల అభివృద్ధి పనులకు మంజూరు తీసుకువచ్చానని వెల్లడించారు. 2కోట్ల 26లక్షలతో 33/11కేవి సబ్ స్టేషన్ నిర్మాణం, గ్రామంలో 2కోట్ల 50లక్షలతో పలు అభివృద్ధి పనులు, గర్నేపల్లి నుండి సాగరం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 50లక్షలు, సాగరం క్రాస్ నుండి వడ్డెరగూడెం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 75లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. 6నెలలలో ఈ రెండు రోడ్ల పనులు పూర్తి చేయిస్తానని పేర్కొన్నారు. సాగరం గ్రామానికి కాకతీయుల కాలం నాటి దంసా చెరువు ఉందన్నారు. 30ఏళ్ల క్రితం మంత్రిగా ఉన్నప్పుడు కోటి రూపాయలతో దంసా చెరువు కట్టను మరమ్మత్తు చేయించానని మధ్యలో వచ్చిన ఎమ్మెల్యేలు కనీసం అటువైపు కూడా చూడలేదని అన్నారు. దంసా చెరువులో 365రోజులు నీళ్లు ఉండే విధంగా ఉప్పుగల్ నుండి పాలకుర్తి వెళ్లే కెనాల్ పై షేటర్ నిర్మాణం చేయించి దంసా చెరువు కింద ఉన్న పూర్తి ఆయకట్టుకు రెండు పంటలకు సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. తాగుడు, తినుడు, పదవులు, పథకాలు అమ్ముకునే వారిని ఎన్నుకుంటే ఎలా ఉంటుందో గత 15ఏళ్లలో మీరే చూసారని మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికే సిగ్గు పడే పరిస్థితులు ఉండేవని కాబట్టి నిజాయితీగా ఉంటూ పని చేసే వారిని ఎన్నుకుంటేనే గ్రామం అయినా నియోజకవర్గం అయినా అభివృద్ధి చెందుతుందని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటికాయల మమత చైతన్య కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల ఐలయ్య, మాజీ సర్పంచ్ ఇన్నారెడ్డి, సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    1
    అధికారం కోల్పోయామనే అక్కసుతో బిఆర్ఎస్ నాయకులు నీచస్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం - కడియం శ్రీహరి
10ఏళ్ల పాలనలో తెలంగాణ వనరులను దోచుకున్న బిఆర్ఎస్ కు, మొదటి నుండి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీకి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై 20లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంబొత్సవం చేసి, 10లక్షల సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. 2కోట్ల 26లక్షలతో నిర్మించిన 33/11కేవి సబ్ స్టేషన్ ను ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రారంభించిన శిలాఫలకాన్ని సబ్ స్టేషన్ వద్ద ఆవిష్కరించారు. అలాగే గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభింంచడంతో పాటు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు.
అనంతరం  ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి 6మాట్లాడుతూ..... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ ఫండ్లో ఉన్న 1400కోట్లు అక్రమంగా వచ్చినదే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను దోచుకున్న బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీకి తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు సాగరం గ్రామానికి మొట్ట మొదటగా బిటీ రోడ్డు, వాటర్ ట్యాంక్ కట్టించింది కడియం శ్రీహరి అని తెలిపారు. మధ్యలో 20ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎం చేశారో మీకే తెలుసని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రెండున్నర ఏళ్లలోనే ఒక్క సాగరం గ్రామానికే దాదాపు 10కోట్ల అభివృద్ధి పనులకు మంజూరు తీసుకువచ్చానని వెల్లడించారు. 2కోట్ల 26లక్షలతో 33/11కేవి సబ్ స్టేషన్ నిర్మాణం, గ్రామంలో 2కోట్ల 50లక్షలతో పలు అభివృద్ధి పనులు, గర్నేపల్లి నుండి సాగరం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 50లక్షలు, సాగరం క్రాస్ నుండి వడ్డెరగూడెం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 75లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. 6నెలలలో ఈ రెండు రోడ్ల పనులు పూర్తి చేయిస్తానని పేర్కొన్నారు. సాగరం గ్రామానికి కాకతీయుల కాలం నాటి దంసా చెరువు ఉందన్నారు. 30ఏళ్ల క్రితం మంత్రిగా ఉన్నప్పుడు కోటి రూపాయలతో దంసా చెరువు కట్టను మరమ్మత్తు చేయించానని మధ్యలో వచ్చిన ఎమ్మెల్యేలు కనీసం అటువైపు కూడా చూడలేదని అన్నారు. దంసా చెరువులో 365రోజులు నీళ్లు ఉండే విధంగా ఉప్పుగల్ నుండి పాలకుర్తి వెళ్లే కెనాల్ పై షేటర్ నిర్మాణం చేయించి దంసా చెరువు కింద ఉన్న పూర్తి ఆయకట్టుకు రెండు పంటలకు సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. తాగుడు, తినుడు, పదవులు, పథకాలు అమ్ముకునే వారిని ఎన్నుకుంటే ఎలా ఉంటుందో గత 15ఏళ్లలో మీరే చూసారని మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికే సిగ్గు పడే పరిస్థితులు ఉండేవని కాబట్టి నిజాయితీగా ఉంటూ పని చేసే వారిని ఎన్నుకుంటేనే గ్రామం అయినా నియోజకవర్గం అయినా అభివృద్ధి చెందుతుందని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటికాయల మమత చైతన్య కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల ఐలయ్య, మాజీ సర్పంచ్ ఇన్నారెడ్డి, సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    user_Kumar Pasunuri
    Kumar Pasunuri
    Local News Reporter Ghanpur (Station), Jangoan•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.