శ్రీనగర్ కాలనీలో వినాయక చవితి వేడుకలు: ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ దంపతులు జగిత్యాల పట్టణ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో వినాయక చవితి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి మండపంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ - రాధిక దంపతులు, స్థానిక కౌన్సిలర్ ప్రశాంత్ రావు గారితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. మండపానికి విచ్చేసిన ఎమ్మెల్యే దంపతులకు మరియు కౌన్సిలర్‌కు నిర్వాహకులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలు జగిత్యాల పట్టణ ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి ఇంట సుఖశాంతులు, ఆయురారోగ్యాలు నిండాలని ఆకాంక్షించారు. భక్తులందరూ భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ నిర్వాహకులు, భక్తులు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
శ్రీనగర్ కాలనీలో వినాయక చవితి వేడుకలు: ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ దంపతులు జగిత్యాల పట్టణ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో వినాయక చవితి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి మండపంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ - రాధిక దంపతులు, స్థానిక కౌన్సిలర్ ప్రశాంత్ రావు గారితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. మండపానికి విచ్చేసిన ఎమ్మెల్యే దంపతులకు మరియు కౌన్సిలర్‌కు నిర్వాహకులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలు జగిత్యాల పట్టణ ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి ఇంట సుఖశాంతులు, ఆయురారోగ్యాలు నిండాలని ఆకాంక్షించారు. భక్తులందరూ భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ నిర్వాహకులు, భక్తులు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
- మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని బిఆర్ఎస్ నాయకుడి వినతి జన్నారంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాల ముందు మురుగు నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ నాయకులు సాయికిరణ్ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జన్నారంలో ప్రతి మంగళవారం వారసంత జరుగుతుందన్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుకు ఇరువైపులా మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తుందన్నారు. దీంతో చిరు వ్యాపారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, నీరు నిలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.1
- జన్నారం మండలంలోని వినాయక ఉత్సవాలపై పోలీసుల దిశానిర్దేశం జన్నారం: వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా, స్నేహపూర్వక వాతావరణంలో జరిగేలా జన్నారం పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. మండలంలోని ఉత్సవ నిర్వాహకులు, కమిటీ సభ్యులతో పోలీసులు సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. వినాయక మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జన ఊరేగింపుల వరకు ప్రతి దశలో నిబంధనలు పాటించాలని సూచించారు. డీజేలు, లౌడ్‌స్పీకర్ల వినియోగం, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు, విద్యుత్ తీగలు–అగ్ని ప్రమాదాల నివారణపై నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఇతర మతాల మనోభావాలను గౌరవిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వివాదాలకు దారితీసే చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. మండపాల వద్ద అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినా, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు, ఉత్సవ కమిటీల సహకారంతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వేడుకలు విజయవంతం చేయాలని పోలీసులు పిలుపునిచ్చారు.1
- విశ్వేశ్వరయ్య ఆశయ సాధనే ఇంజనీర్లకు నివాళి గ్రంధాలయ చైర్మన్ సత్తు మల్లేశం అన్నారు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఇంజనీర్స్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. చదువు కేవలం ఉద్యోగానికే పరిమితం కాకుండా, సమాజంలోని సమస్యలను పరిష్కరించే సాధనంగా మారాలని విశ్వేశ్వరయ్య నమ్మారన్నారు. నీటిపారుదల, రోడ్లు, నిర్మాణ రంగాల్లో ఆయన అందించిన సేవలు దేశానికే ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.3
- కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ కు అమెరికాలో అపురూపమైన స్వాగతం పలికిన పూర్వ విద్యార్థులు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో కిమ్స్ విద్యాసంస్థల ఛైర్మెన్ డా. పేర్యాల రవిందర్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఇండియా నుంచి అమెరికా టెక్సాస్ లోని డల్లాస్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్ళిన ఆయనకు టెక్సాస్ రాష్ట్రంలో కిమ్స్ పూర్వ విద్యార్థులు అయిన గుడి విష్ణువర్ధన్ రెడ్డి, మరియు YSRCP ఇంచార్జ్ నాయకులు రమణారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డా.పి. రవీందర్ రావు ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరందరూ కలిసి మెలిసి ఉండాలని, అమెరికా అభి వృద్ధితో పాటు మన దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అదే విధంగా మన భారత దేశానికి ఏదో ఒక విధంగా 'సేవలందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నా తల్లి దండ్రులను మరియు కన్న తల్లిలాంటి మన మాతృ దేశాన్ని మరువకుండా సాధ్యమైనంత మేరకు సేవలు అందించాలని కోరారు. ఈ రెండు దేశాల అభివృద్ధి మీలాంటి యువత మీదనే ఆధారపడి ఉన్నందున కష్టపడి ఇష్టంగా మనస్ఫూర్తిగా సేవలందించాలని చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ పూర్వ అధ్యాపకులు బత్తిని గంగాధర్, బి.ఆర్. ఎస్ పార్టీ సభ్యులు సూర్యపుకాష్, వేల్బురి అజయ్, శ్రీకాంత్ రెడ్డి, కొండూరి సుమన్, ముప్పాల శరత్ ఫైనాన్సియల్ అడ్వైజర్, శరత్ రెడ్డి దేశీ చౌరస్తా పౌండE శేషావతారం, సునీల్ బ్రిస్టా రెస్టారెంటు, చెన్నోజ్వల ఆదిత్స బ్రిస్టా రెస్టారెంట్ పౌండర్, అజయ్ కలువాల ప్రముఖ పారిశ్రామిక వెత్త, మరియు 250 కి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు.1
- వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ రాజన్న ఆలయం నుంచి రాజన్న ప్రసాదంగా సన్న, చిన్నకారు రైతులకు కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నేడు 500 కోడెలను రైతులకు పంపిణీ చేస్తున్నాం.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేసి కోడెలను అందిస్తున్నాం.గతంలో కోడెలను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిజమైన రైతులకు రాజన్న ప్రసాదంగా అందిస్తున్నాం. రైతులు కోడెలను రాజన్న ప్రసాదంగా భావించి సొంతింటి బిడ్డల్లా సంరక్షించాలి. కోడెలను రైతుల పేరుతో తీసుకుని అక్రమంగా తరలిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.కోడెల ఆరోగ్య పరిరక్షణ కోసం దేవస్థానం పరిధిలోనే ప్రత్యేక వెటర్నరీ డాక్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.వారం నుంచి పది రోజుల్లో వైద్యుడిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అనారోగ్యానికి గురైన కోడెలను ఇతర వాటి నుంచి వేరు చేసి చికిత్స అందించేందుకు ఒక ఎకరం స్థలాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించారు.పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కోడెలకు టీకాలు, వైద్యం, నాణ్యమైన పోషకాహారం, దాణా అందిస్తున్నాం. పలు మరవని చిన్న కోడెలను మొక్కుగా సమర్పించవద్దు. ఆరోగ్యంగా, ఎదిగిన కోడెలను మాత్రమే స్వామివారికి సమర్పించాలి.దూర ప్రాంతాల నుంచి చిన్న కోడెలను వాహనాల్లో తీసుకురావడం వల్ల ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.జెర్సీ కోడెలకు స్థానిక వాతావరణం అనుకూలించక పోవడంతో సమస్యలు వస్తున్నాయి. వీలైనంత వరకు దేశీ జాతి, ఆరోగ్యకరమైన కోడెలను సమర్పించాలని భక్తులను కోరుతున్నాం.రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, వసతులు, మొక్కు బడులకు సంబంధించిన ఏర్పాట్లు మెరుగుపరుస్తున్నాం.శ్రావణ మాసంలోని ఒక సోమవారం 13 వేలకుపైగా కోడె మొక్కు టికెట్లు విక్రయమయ్యాయి.మొక్కుబడి టికెట్ల ద్వారా రూ.54 లక్షల ఆదాయం వచ్చింది.వేములవాడలో 45 ఎకరాల్లో అధునాతన గోశాల ఏర్పాటు చేసేందుకు స్థలం గుర్తించాం. గోశాల ఏర్పాటును త్వరితగతిన ముందుకు తీసుకెళ్తాం.రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులతో పనులు కొనసాగుతున్నాయి.ఆలయ అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యాలు, కోడెల సంరక్షణ, వైద్య సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం.భక్తుల విశ్వాసానికి, మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.రాజన్న ఆశీస్సులతో రైతులు ఆర్థికంగా ఎదగాలి.3
- వినాయక చవితి పూజలో పాల్గొన్న చందుర్తి మాజీ జెడ్పిటిసి నాగం కుమార్ వినాయక చవితి పూజలో పాల్గొన్న చందుర్తి మాజీ జెడ్పిటిసి నాగం కుమార్1
- ఇంజనీర్లు పాత్ర కీలకం. ఇంజినీర్లను లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం సౌజన్యంతో సత్కరించిన రామగుండం మేయర్ మహంకాళి స్వామి రామగుండం పునర్నిర్మాణంలో ఇంజనీర్లు పోషిస్తున్న పాత్ర కీలకమని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఇంజనీర్స్ డే పురస్కరించుకొని మంగళ వారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఇంజినీర్లను లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం సౌజన్యంతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఇంజనీరింగ్ సిబ్బంది శక్తి కి మించి శ్రమిస్తూ అభివృద్దిలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారని ఆయన కొనియాడారు. ప్రస్తుత ఇంజినీర్లు చిత్త శుద్దితో సేవలందిస్తూ నాణ్యత లో ఏ మాత్రం రాజీ పడకుండా మన్నికగా సుదీర్ఘ కాలం నిలిచి ఉండేలా రోడ్లు , కాలువల నిర్మాణం చేపడుతున్నారని అభినందించారు. రామగుండం నగరాన్ని అధ్భుతoగా తీర్చి దిద్దాలనే స్థానిక ఎం ఎల్ ఎ లక్ష్యానికి అనుగుణంగా ఇదే ఒరవడి కొనసాగిస్తూ ఇంజనీర్లు పని చేసి పాలవర్గానికి మంచి పేరు తీసుకు రావాలని ఆశిస్తున్నామని అన్నారు. అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాంతి స్వరూప్ , ఎ ఇ లు మీర్ , తేజస్విని , సౌమ్య , మనోజ్ , అన్వేష్ , నవీన్ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు నవీన్ , అశోక్ , కళ్యాణ్ , శ్రావణ్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ సత్కారం అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి కజంపురం రాజేందర్ తో పాటు , నగర పాలక సంస్థ కార్పొరేటర్లు గట్ల రమేష్ , వడ్లూరి రవి , కొలని కవిత , బాలసాని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.1
- లక్షెట్టిపేటలో కొలువుదీరిన గణనాథులు, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు లక్షెట్టిపేట పట్టణంతో పాటు అన్ని గ్రామాలలో కొలువుదీరిన గణనాథులు, భక్తుల ప్రత్యేక పూజలను అందుకుంటున్నాయి. వినాయక చవితి కావడంతో లక్షెట్టిపేట మున్సిపాలిటీతో పాటు మండలంలోని వెంకట్రావుపేట, బలరావ్ పేట, రామారావు పేట, కొత్తూరు,, కొత్త కొమ్ముగూడెం, పాత కొమ్ముగూడెం తదితర గ్రామాలలో వినాయక మండపాలను ఏర్పాటు చేసి గణనాధులను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా వేద పండితులు, భక్తులు గణనాధులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.1