ముఖ్య మంత్రి పర్యటనకు సర్వం సిద్ధం... ఏర్పాట్లు పర్యవేక్షించిన అధికారులు... ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పరిశీలన.... మండపేట న్యూస్; మండపేట నియోజక వర్గం రాయవరం వెదురుపాక గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో గురువారం ఏర్పాట్లు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పరిశీలించారు. సీఎం పర్యటన కు సర్వం సిద్ధం చేశారు.పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జనవరి 9వ తేదీన మండపేట నియోజక వర్గంలోని రాయవరం మండలం, రాయవరం గ్రామంలో నిర్వహించనున్న కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హోదాలో జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ , ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త పెందుర్తి వెంకటేష్ ఉదయం నుంచి వెదురుపాక గ్రామంలో క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహించి ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, మండపేట నియోజకవర్గ శాసన సభ్యులు వేగుళ్ల జోగేశ్వర రావు, అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, జన సేన ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ, ఎంపీ హరీష్ మధుర్,ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వీఐపీ–సామాన్య ప్రజల రాకపోకల మార్గాలు, వాహనాల పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు తదితర అంశాలను క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలించారు. సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. గురువారం రాయవరం మండలం వెదురుపాక గ్రామంలో సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్, సీఎం ప్రయాణించే రూట్ మ్యాప్ తదితర అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. భద్రతా చర్యల దృష్ట్యా ముందస్తు ప్రణాళికల అమలుపై సమీక్ష జరిపారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా, మెడికల్ క్యాంపులు, రహదారి మరమ్మతులు తదితర ఏర్పాట్లను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, డిజిటల్ స్క్రీన్, ప్రత్యక్ష ప్రసారం, మీడియా గ్యాలరీ, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.ఇదే సందర్భంగా పట్టాదారు పాసు పుస్తకాల డిస్ట్రిబ్యూటర్ల ఈ కైవైసి ప్రక్రియలో జిల్లా వ్యాప్తంగా పురోగతిని సమీక్షించారు. దేవరపల్లిలో 1275 ఖాతాలకు గాను 799, కడియంలో 4555 ఖాతాలకు 2709, సీతానగరంలో 662 ఖాతాలకు 384, మండపేట మండలంలో 8926 ఖాతాలకు 4228, ఉండ్రాజవరం మండలంలో 4003 ఖాతాలకు 1879, కోరుకొండలో 2435 ఖాతాలకు 1118, నల్లజర్లలో 2101 ఖాతాలకు 952, కపిలేశ్వరపురంలో 15298 ఖాతాలకు 6593, బిక్కవోలులో 14121 ఖాతాలకు 5672, రాజమహేంద్రవరం రూరల్‌లో 970 ఖాతాలకు 387, నిడదవోలులో 7033 ఖాతాలకు 2754, చాగల్లులో 2593 ఖాతాలకు 1014, గోకవరంలో 1882 ఖాతాలకు 696, కొవ్వూరులో 3944 ఖాతాలకు 1441, గోపాలపురంలో 2120 ఖాతాలకు 759, తాళ్లపూడిలో 2983 ఖాతాలకు 1032, పెరవలిలో 2856 ఖాతాలకు 889, రంగంపేటలో 12185 ఖాతాలకు 3251, అనపర్తిలో 9051 ఖాతాలకు 2258, రాయవరంలో 17687 ఖాతాలకు 2750, రాజానగరం మండలంలో 1,28,488 ఖాతాలకు గాను 3087 ఈ కేవైసి పూర్తయ్యాయి. మిగిలిన ఖాతాల ప్రక్రియను వేగవంతం చేయాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు, పోలీసు, రెవెన్యూ, ఆర్ అండ్ బి, అగ్నిమాపక, రవాణా, సర్వే, ఆర్‌డబ్ల్యుఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Nandikolla Rajuమండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్🙏11 hrs ago
- వేట్లపాలెం: న్యూ మెన్ సొసైటీ సేవా కార్యక్రమం పెద్దాపురంసామర్లకోట: జనవరి 09 పెద్దాపురం నియోజకవర్గం, సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామం బేతాళ స్వామి గుడి ప్రాంగణంలో న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో గౌతమీ నేత్రాలయం అనుబంధ సంస్థ శ్రీ చరణ్ కంటి ఆసుపత్రి (జగ్గంపేట) వారి సహకారంతో ఈ నెల 5వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఆ శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న గ్రామీణ ప్రజల్లో కళ్లజోళ్ళు అవసరం ఉన్న వారిని గుర్తించి, వారికి అందుబాటు ధరలో నాణ్యమైన కళ్లజోళ్ళు అందించే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 40 మందికి తక్కువ ధరకు కళ్లజోళ్ళు అందించడంతో పాటు అవసరమైన వారికి కంటి చుక్కల మందులు కూడా అందించారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రజలకు కంటి సంరక్షణ సేవలను సులభంగా అందించడం, అధిక ఖర్చు లేకుండా చూపు సమస్యలకు పరిష్కారం అందించడమేనని నిర్వాహకులు తెలిపారు. వచ్చిన వారికి అవసరమైన సదుపాయాలను న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ తరఫున నిడిగట్ల రత్న శేఖర్, పలివేల బద్రి సమన్వయంతో అందించారు. ఈ సేవా కార్యక్రమం గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని గ్రామ పెద్దలు, ప్రజలు అభిప్రాయపడి, సేవాభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ వారిని హృదయపూర్వకంగా అభినందించారు.4
- 🙏🙏1
- फिल्मी हीरो बनने की सनक: युवती को इंप्रेस करने के लिए रची नकली एक्सीडेंट की साजिश, दो युवक गिरफ्तार1
- మోటివేషన్ ఈ రోజుల్లో డబ్బుకే విలువ1
- Post by Ni2
- గుంటూరు/గుంటూరు సిటీ వైసీపీ లీగల్ సెల్ స్టేట్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన పోలూరి వెంకటరెడ్డిని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఘనంగా సత్కరించారు. కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులను న్యాయపరంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలని, పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. 2029లో జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని వెంకటరెడ్డి స్పష్టం చేశారు.1
- సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎస్సీ లకు కేటాయించాలి.లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పల్నాడు జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్,1
- 🙏🙏1