logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

స్థానిక శ్రీ వై.ఎన్. కళాశాలలో గత 30 సంవత్సరాలుగా భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసిన పరిం రామకృష్ణ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ అందే రామ్ సతీష్ మాట్లాడుతూ, రామకృష్ణ గారితో తన పరిచయం తక్కువైనప్పటికీ, ప్లాటినం జూబ్లీ సమయంలో ఆయన పనిని చూశానని పేర్కొన్నారు. చాలా నిబద్ధతతో, ఎక్కడా తేడా రాకుండా చక్కగా ఆయనకు అప్పగించిన పనిని చేశారని, నెమ్మదస్తునిగా, పరిమితంగా మాట్లాడే చక్కని అధ్యాపకునిగా పేరు సంపాదించారని కొనియాడారు. అప్పగించిన అన్ని పనులను చక్కగా నిర్వర్తించే వారని, ఇటువంటి సీనియర్ అధ్యాపకులు పదవీ విరమణ చేయడం కళాశాలకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. నిబంధనలు పాటించాలి కాబట్టి ఆయన వెళ్లవలసి వస్తుందని, ఆయన పదవీ విరమణ జీవితం సాఫీగా సాగాలని ఆకాంక్షించారు. పరిం రామకృష్ణ గారు మాట్లాడుతూ, తాను ఇదే కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశానని తెలిపారు. పి.జి. పూర్తయ్యాక, అన్ ఎయిడెడ్ అధ్యాపకునిగా ఈ కళాశాలలో చేరానని, డా. చినమిల్లి సత్యనారాయణ రావు గారి దయతో, ఆశీస్సులతో తన ఉద్యోగం పర్మినెంట్ అయ్యి, ఎయిడెడ్ అధ్యాపకునిగా మారి కళాశాలకు ఇన్ని సంవత్సరాలుగా సేవలందించేందుకు తోడ్పడిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదములు తెలియజేశారు. పదవీ విరమణ సందర్భంగా రామకృష్ణ గారిని శాలువా కప్పి, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ బాడీ మెంబర్ డాక్టర్ కోసూరి వర్మ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతపల్లి కనకారావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సి.ఎస్. రంగారావు బెజవాడ వెంకటరత్నం, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అందే రామకృష్ణ, తదితర అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

7 hrs ago
user_Sidanivenugopal
Sidanivenugopal
Paan shop నరసాపురం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
7 hrs ago
38ea941b-1d49-43e7-9d15-ca036e6f3f0e

స్థానిక శ్రీ వై.ఎన్. కళాశాలలో గత 30 సంవత్సరాలుగా భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసిన పరిం రామకృష్ణ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ అందే రామ్ సతీష్ మాట్లాడుతూ, రామకృష్ణ గారితో తన పరిచయం తక్కువైనప్పటికీ, ప్లాటినం జూబ్లీ సమయంలో ఆయన పనిని చూశానని పేర్కొన్నారు. చాలా నిబద్ధతతో, ఎక్కడా తేడా రాకుండా చక్కగా ఆయనకు అప్పగించిన పనిని చేశారని, నెమ్మదస్తునిగా, పరిమితంగా మాట్లాడే చక్కని అధ్యాపకునిగా పేరు సంపాదించారని కొనియాడారు. అప్పగించిన అన్ని పనులను చక్కగా నిర్వర్తించే వారని, ఇటువంటి సీనియర్ అధ్యాపకులు పదవీ విరమణ చేయడం కళాశాలకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. నిబంధనలు పాటించాలి కాబట్టి ఆయన వెళ్లవలసి వస్తుందని, ఆయన పదవీ విరమణ జీవితం సాఫీగా సాగాలని ఆకాంక్షించారు. పరిం రామకృష్ణ గారు మాట్లాడుతూ, తాను ఇదే కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశానని తెలిపారు. పి.జి. పూర్తయ్యాక, అన్ ఎయిడెడ్ అధ్యాపకునిగా ఈ కళాశాలలో చేరానని, డా. చినమిల్లి సత్యనారాయణ రావు గారి దయతో, ఆశీస్సులతో తన ఉద్యోగం పర్మినెంట్ అయ్యి, ఎయిడెడ్ అధ్యాపకునిగా మారి కళాశాలకు ఇన్ని సంవత్సరాలుగా సేవలందించేందుకు తోడ్పడిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదములు తెలియజేశారు. పదవీ విరమణ సందర్భంగా రామకృష్ణ గారిని శాలువా కప్పి, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ బాడీ మెంబర్ డాక్టర్ కోసూరి వర్మ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతపల్లి కనకారావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సి.ఎస్. రంగారావు బెజవాడ వెంకటరత్నం, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అందే రామకృష్ణ, తదితర అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

More news from Andhra Pradesh and nearby areas
  • 😭🙏
    1
    😭🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    2 hrs ago
  • పిఠాపురం పట్టణంలోని అత్యంత పురాతనమైన కుంతీ మాధవ స్వామివారి దేవస్థానం పుష్కరిణిని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ‘మన ఊరు-మన బాధ్యత’ స్వచ్ఛంద సేవా సంస్థ స్వాగతించింది. దశాబ్ద కాలంగా సరైన పర్యవేక్షణ లేక చెత్తాచెదారంతో నిండి, డంపింగ్ యార్డ్‌గా మారిన ఈ పవిత్ర పుష్కరిణి ప్రక్షాళనకు ప్రభుత్వం పూనుకోవడంపై సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తూ స్వామివారి అభిషేకం కోసం నీటిని సేకరించే ఈ పుష్కరిణి గత దశాబ్ద కాలంగా సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల చుట్టుపక్కల నివాసితులు మరియు ఇతరులు చెత్తాచెదారంతో నింపివేశారని సంస్థ పేర్కొంది. ఈ విషయంలో గతంలో అనేకసార్లు అధికారులకు విన్నవించినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ పుష్కరిణిని ప్రక్షాళన చేసేందుకు పూనుకోవడం అభినందనీయమని సంస్థ ప్రతినిధులు కొండేపూడి శంకరరావు మరియు అల్లవరపు నగేష్ పేర్కొన్నారు. ఈ చొరవ తీసుకున్న పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ నామ కనకారావుకి మరియు వారి సిబ్బందికి ‘మన ఊరు-మన బాధ్యత’ సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. అదే సమయంలో, పుష్కరిణి ఆధునీకరణకు సంబంధించి సంస్థ సభ్యులు ఒక కీలక అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పుష్కరిణి పనులను దేవదాయ ధర్మదాయ శాఖ నిధులతోనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ సాధారణ నిధులను దీనికి వినియోగించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రజాధనాన్ని ఇతర అభివృద్ధి పనులకు కేటాయించాలని వారు కోరారు. త్వరితగతిన ఈ పనులను పూర్తి చేసి, పుష్కరిణిని యథావిధిగా పవిత్రంగా తీర్చిదిద్ది, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ‘మన ఊరు-మన బాధ్యత’ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది.
    1
    పిఠాపురం పట్టణంలోని అత్యంత పురాతనమైన కుంతీ మాధవ స్వామివారి దేవస్థానం పుష్కరిణిని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ‘మన ఊరు-మన బాధ్యత’ స్వచ్ఛంద సేవా సంస్థ స్వాగతించింది. దశాబ్ద కాలంగా సరైన పర్యవేక్షణ లేక చెత్తాచెదారంతో నిండి, డంపింగ్ యార్డ్‌గా మారిన ఈ పవిత్ర పుష్కరిణి ప్రక్షాళనకు ప్రభుత్వం పూనుకోవడంపై సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తూ స్వామివారి అభిషేకం కోసం నీటిని సేకరించే ఈ పుష్కరిణి గత దశాబ్ద కాలంగా సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల చుట్టుపక్కల నివాసితులు మరియు ఇతరులు చెత్తాచెదారంతో నింపివేశారని సంస్థ పేర్కొంది. ఈ విషయంలో గతంలో అనేకసార్లు అధికారులకు విన్నవించినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ పుష్కరిణిని ప్రక్షాళన చేసేందుకు పూనుకోవడం అభినందనీయమని సంస్థ ప్రతినిధులు కొండేపూడి శంకరరావు మరియు అల్లవరపు నగేష్ పేర్కొన్నారు.

ఈ చొరవ తీసుకున్న పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ నామ కనకారావుకి మరియు వారి సిబ్బందికి ‘మన ఊరు-మన బాధ్యత’ సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. అదే సమయంలో, పుష్కరిణి ఆధునీకరణకు సంబంధించి సంస్థ సభ్యులు ఒక కీలక అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పుష్కరిణి పనులను దేవదాయ ధర్మదాయ శాఖ నిధులతోనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ సాధారణ నిధులను దీనికి వినియోగించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రజాధనాన్ని ఇతర అభివృద్ధి పనులకు కేటాయించాలని వారు కోరారు.

త్వరితగతిన ఈ పనులను పూర్తి చేసి, పుష్కరిణిని యథావిధిగా పవిత్రంగా తీర్చిదిద్ది, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ‘మన ఊరు-మన బాధ్యత’ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం రంపచోడవరం ఎస్టీ కమిషన్ క్యాంపు కార్యాలయంలో గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా, మారుమూల గ్రామాల్లోని మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి తదితర సమస్యలను అధికారులతో సమన్వయం చేసుకుని, నిబంధనల ప్రకారం పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలైన మంటూర్, మడిపల్లి ప్రాంతాలకు చెందిన బాధితులు తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు, భూమికి బదులు భూమి ఇవ్వాలని కోరుతూ కమిషన్‌కు దరఖాస్తులు సమర్పించారు. ఎస్టీ కమిషన్ సభ్యులతో పాటు ఇతర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తామని పునరుద్ఘాటించారు.
    1
    రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం రంపచోడవరం ఎస్టీ కమిషన్ క్యాంపు కార్యాలయంలో గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా, మారుమూల గ్రామాల్లోని మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి తదితర సమస్యలను అధికారులతో సమన్వయం చేసుకుని, నిబంధనల ప్రకారం పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలైన మంటూర్, మడిపల్లి ప్రాంతాలకు చెందిన బాధితులు తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు, భూమికి బదులు భూమి ఇవ్వాలని కోరుతూ కమిషన్‌కు దరఖాస్తులు సమర్పించారు. ఎస్టీ కమిషన్ సభ్యులతో పాటు ఇతర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తామని పునరుద్ఘాటించారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • సత్తుపల్లి పట్టణంలోని 18వ వార్డులో ఉన్న డాల్ఫిన్స్ స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన స్విమ్మింగ్ పోటీల విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఈ కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    2
    సత్తుపల్లి పట్టణంలోని 18వ వార్డులో ఉన్న డాల్ఫిన్స్ స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన స్విమ్మింగ్ పోటీల విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఈ కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • Post by SHOT NEWS
    1
    Post by SHOT NEWS
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    7 hrs ago
  • 😭
    1
    😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    2 hrs ago
  • కామారెడ్డి జిల్లాలోని మగ్దుంపూర్‌లో చంద్ర గౌడ్ అనే వ్యక్తి షర్ట్ జేబులో ఉన్న సామ్ సంగ్ ఫోన్ ఎండ వేడికి ఒక్కసారిగా పేలిపోయింది. అతను వెంటనే అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. వేసవిలో ఎండల తీవ్రతతో ఫోన్లు వేడెక్కి పేలిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, నిపుణులు ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.
    1
    కామారెడ్డి జిల్లాలోని మగ్దుంపూర్‌లో చంద్ర గౌడ్ అనే వ్యక్తి షర్ట్ జేబులో ఉన్న సామ్ సంగ్ ఫోన్ ఎండ వేడికి ఒక్కసారిగా పేలిపోయింది. అతను వెంటనే అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు.

వేసవిలో ఎండల తీవ్రతతో ఫోన్లు వేడెక్కి పేలిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, నిపుణులు ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    Guntur, Andhra Pradesh•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.