దుర్శేడ్ వద్ద రాజీవ్ రహదారిపై పోలీసులు అరైవ్ అలైవ్... మానవహారంతో రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రతిజ్ఞ రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మండలం దుర్శేడ్ వద్ద రాజీవ్ రహదారిపై మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. కరీంనగర్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీబ్రా క్రాసింగ్ లైన్స్ ని పునరుద్ధరించి, రోడ్డు ను ఎలా క్రాస్ చేయాలో చూపించారు. ఈ కార్యక్రమంలో సిఐ నిరంజన్ రెడ్డి ఎస్ఐ లక్ష్మారెడ్డి, పలువురు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమని, హెల్మెట్ , సీట్ బెల్ట్ ధరించకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ , మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం , అపసవ్య మార్గాల్లో ప్రయాణించడం , ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం ముఖ్య కారణాలుగా తెలిపారు. జిల్లాలో గతేడాది 200 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని, అందులో ద్విచక్ర వాహనదారులే ఎక్కువని తెలిపారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం మరణాలకు ప్రధాన కారణాలన్నారు. పోలీసుల చర్యల వల్ల ప్రమాదాల రేటు 17 శాతం తగ్గిందని, ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి ప్రభుత్వం 25 వేల బహుమతి ఇస్తుందని తెలిపారు.
దుర్శేడ్ వద్ద రాజీవ్ రహదారిపై పోలీసులు అరైవ్ అలైవ్... మానవహారంతో రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రతిజ్ఞ రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మండలం దుర్శేడ్ వద్ద రాజీవ్ రహదారిపై మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. కరీంనగర్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో
రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీబ్రా క్రాసింగ్ లైన్స్ ని పునరుద్ధరించి, రోడ్డు ను ఎలా క్రాస్ చేయాలో చూపించారు. ఈ కార్యక్రమంలో సిఐ నిరంజన్ రెడ్డి ఎస్ఐ లక్ష్మారెడ్డి, పలువురు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమని, హెల్మెట్ ,
సీట్ బెల్ట్ ధరించకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ , మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం , అపసవ్య మార్గాల్లో ప్రయాణించడం , ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం ముఖ్య కారణాలుగా తెలిపారు. జిల్లాలో గతేడాది 200 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని, అందులో ద్విచక్ర వాహనదారులే
ఎక్కువని తెలిపారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం మరణాలకు ప్రధాన కారణాలన్నారు. పోలీసుల చర్యల వల్ల ప్రమాదాల రేటు 17 శాతం తగ్గిందని, ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి ప్రభుత్వం 25 వేల బహుమతి ఇస్తుందని తెలిపారు.
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ ఏఈ 50 వేలు లంచం తీసుకుంటూ ఏసిబి కి చిక్కారు. హుజురాబాద్ ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద సివిల్ వర్క్ సంబంధించి ఎంబి రికార్డు చేసేందుకు కాంట్రాక్టర్ కు నుంచి 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం డబ్బులను సీజ్ చేసి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఏఈ సుధాకర్ రెడ్డిని అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. లంచం ఇవ్వడం తీసుకోవడం నేరమని, ఎవరైన లంచం అడిగితే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు2
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమ పై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచుమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్ళతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రావాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.1
- ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మకు బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలల దూడపై చిరుత దాడి చేసి చంపినట్లుగా చిరుత అడుగుల ఆధారంగా వేటాడిన తీరుతో నిర్ధారించారు.మండలంలోని శివారు ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివారు ప్రాంతాల్లో పశువులను కట్టేయరాదని అటవీ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారి మోహన్ లాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.1
- అగ్నిమాపక వారోత్సవాల్లో బాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేతన్న చౌక్ వద్ద అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిమాన్స్టెస్టసన్ కార్యక్రమాన్ని నిర్వహించగా నీటితో పాలు రకాల విన్యాసాలను చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ అధికారి నరేందర్ మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అలాగే విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వారిని స్మరించుకుంటూ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు.3
- వరంగల్ జిల్లా:వర్ధన్నపేట: మండలం ల్యాబర్తి గ్రామంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ZPHS, MPPS పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామ వీధుల గుండా నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. అనంతరం జంక్షన్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి గ్రామస్తులతో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ రోడ్డు నియమాలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, సీటు బెల్ట్ వినియోగం, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగం ప్రమాదకరమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- జగిత్యాల : జగిత్యాల నుండే కెసిఆర్ జైత్ర యాత్ర మొదలుకానుంది, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్ అధికారంలోకి రావడమొక్కటే మార్గం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి పోవాలి.. కెసిఆర్ రావాలి.. కెసిఆర్ పాలనే బాగుండే అనే భావన ప్రజల్లోనుండి వచ్చిందనీ, కేసీఆర్ తో ప్రయాణం కొత్త అనుభూతి అన్నారు. జగిత్యాల పట్టణంలోని జెడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ హరిచరన్ రావు స్వగృహం విద్యానగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి...మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావా వసంత, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ శ్రీమతి విజయలక్ష్మి, రాయికల్ మున్సిపల్ చైర్మన్ కే. రవీందర్, స్థానిక నాయకులు వి. పురుషోతం రావు, వెంకట రావు, ధర్మాజిపేట్ వెంకటేశ్వర్ రావు, పట్టణ బి ఆర్ ఎస్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు తదితర బీ ఆర్ ఎస్ నాయకులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీ ఆర్ ఎస్ పార్టీ లోకి రావడం అదృష్టమనీ, మనస్పూర్తిగా పార్టీలోకి స్వాగతిస్తున్నామన్నారు. నిస్వార్ధంగా సేవ చేసే నాయకులు, నిబద్ధతగల నాయకులు జీవన్ రెడ్డి కి అందరం సహకరిస్తాంమనీ,..పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆయనకు తోడుంటామన్నారు.. జీవన్ రెడ్డి రాకతో బీ ఆర్ ఎస్ కు కొండంత అండగా దొరికింది. ప్రజల పక్షాన నిలబడే నాయకుడు జీవన్ రెడ్డి అని అన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్ తో ప్రయాణం రాజకీయంగా నూతన అధ్యాయం అనీ..అభిమానులు, నాయకులు, కార్యకర్తలందరి సహకారంతో ముందుకు సాగుదాం అన్నారు. కేసీఆర్ తో అనుబంధం ఈనాటిది కాదు.. తెలంగాణ ఉద్యమ సారధిగా పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం కెసిఆర్ దశాబ్దకాలం కృషిచేశారు. రైతు బిడ్డగా రైతు సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టారు. గోదావరి నదీ జలాలను సద్వినియోగం చేసుకోవాలని దిగువన మేడిగడ్డ వద్ద 300 టీ ఎం సి ల నీటి లభ్యత ఉంటుందని బ్యారేజీల నిర్మాణం చేపట్టారు.నీటి వనరులతో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల్లో పంజాబ్, హర్యానాతో పోటీ పడుతున్నాం. ఎస్ ఎల్ బి సి నిర్మాణ దశలో కుంగి పోయి కార్మికులు మృతి చెందినా, వారిశవాలుసైతం వెలికి తీయకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారు....కానీ, మేడిగడ్డ పునర్నిర్మాణం చేపట్టకుండా కేసీఆర్ ను దోషిగా చూపే ప్రయత్నంలో భాగంగా బ్యారేజ్ ల మరమతులు చేపట్ట లేదని విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవడం సంతోషం.. కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలనేది ప్రజల్లో వచ్చిన ఆలోచన.. కెసిఆర్ ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మీ 50 వేల నుండి లక్షకు పెంచారు. కేసీఆర్ 10 వేలు పెట్టుబడి సాయం ఇచ్చారు. కాంగ్రెస్ 15 వేలు అని చెప్పి అసలుకే మోసం వచ్చింది. కరువు వస్తె రేవంత్ రెడ్డి బాధ్యులు అవుతారు. బోర్నపల్లి వంతెన కు కేసీఆర్ 70 కోట్లు మంజూరు చేశారు.కేసీఆర్ కు రుణపడి ఉంటా..2
- సీఎం రేవంత్ రెడ్డి పై మాజీమంత్రి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని, బ్యాండ్ వాగన్ గా కోనసాగలేనని బయటకు వచ్చానని స్పష్టం చేశారు. జగిత్యాలలో మీడియాతో జీవన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి సూచనల మేరకే కాంగ్రెస్ అధిష్టానం నడుస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో తాను చేయడం ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ను దోషిగా చూపే ప్రయత్నం చేశారని విమర్శించారు.పదవులు కావాలి అనుకుంటే నీ దగ్గర పడిగాపులు కాసేవాన్ని....కానీ పదవులు శాశ్వతం కాదనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి సూచించారు. ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు చూశానని, రేవంత్ నువ్వు ఎమ్ చూసావో నాకు తెలియదన్నారు. కెసిఆర్ నా వయసును గౌరవిస్తాడని, నన్ను అన్న అని పిలుస్తాడని, కెసిఆర్ కు ప్రజలంటే గౌరవం, నీలాగా కాదని అన్నారు. కేసీఆర్ పై విధానపరమైన విమర్శ చేశానే తప్ప వ్యక్తిగతంగా తాను ఏనాడు ఎవ్వరిని విమర్శించలేదన్నారు. పార్టీ సూచన తో ప్రభుత్వం నడువాలి కానీ, తెలంగాణ లో ప్రభుత్వ సూచన తో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని విమర్శించారు. పిల్లిని లోపల వేసి కొడితే తిరుగపడుద్దని జీవన్ రెడ్డి అన్నారు.1