logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*నేటి నుంచి ‘’సర్’’* - అభ్యంతరాల స్వీకరణ - ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సభలు - ముసాయిదా జాబితాపై క్యాంపెయిన్ - మిస్సింగ్ ఓటర్ల పేర్లను వివరించనున్న బీఎల్వోలు - తిరిగి చేర్పించడంపై అన్ని పార్టీల బీల్ఏల ఫోకస్ - కొత్త ఓటర్లగా చేరేందుకూ అక్కడే దరఖాస్తుకు చాన్స్ సూర్యాపేట సిటీ, ఆగస్టు 27 : రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి ముసాయిదా ఓటర్ల జాబితా పై గ్రామ, వార్డు సభలు ప్రారంభం కానున్నాయి, సర్ (ఎస్ఐఆర్) ప్రక్రియ ముగిసిన తర్వాత భారీ స్థాయిలో ఓటర్ల పేర్లు వివిధ కారణాలతో డిలీట్ అయిన నేపథ్యంలో వాటి గురించి ప్రజలకు వివరించడానికి ఈ సభలకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం శ్రీకారం చుట్టింది. ప్రతీ గ్రామం, అర్బన్ ప్రాంతాల్లోని ప్రతీ వార్డులో బూత్ లెవల్ ఆఫీసర్లు సభలు నిర్వహించి ఎవరి పేర్లు గల్లంతయ్యాయో వివరించనున్నారు. ప్రజల సమక్షంలోనే చదివి వినిపించి లోపాలను సరిదిద్దుకొవడానికి అవకాశం ఇవ్వనున్నారు. అందుబాటులోలేని, వలస వెళ్లిన, మరణించిన, డూప్లికేట్గా గుర్తించిన ఓటర్లతో కూడిన జాబితాలో వివరాలను వెల్లడించనున్నారు. ముసాయిదా జాబితాలో ఎవరేవరి పేర్లు ఉన్నాయో తెలుసుకొని అక్కడిక్కడే పరిష్కరించాలన్నది కమిషన్ ఉద్దేశం.

1 hr ago
user_YADLA VENUDHAR
YADLA VENUDHAR
Suryapet, Telangana•
1 hr ago
892e1898-6ee6-4ede-b79a-7114e41cc730

*నేటి నుంచి ‘’సర్’’* - అభ్యంతరాల స్వీకరణ - ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సభలు - ముసాయిదా జాబితాపై క్యాంపెయిన్ - మిస్సింగ్ ఓటర్ల పేర్లను వివరించనున్న బీఎల్వోలు - తిరిగి చేర్పించడంపై అన్ని పార్టీల బీల్ఏల ఫోకస్ - కొత్త ఓటర్లగా చేరేందుకూ అక్కడే దరఖాస్తుకు చాన్స్ సూర్యాపేట సిటీ, ఆగస్టు 27 : రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి ముసాయిదా ఓటర్ల జాబితా పై గ్రామ, వార్డు సభలు ప్రారంభం కానున్నాయి, సర్ (ఎస్ఐఆర్) ప్రక్రియ ముగిసిన తర్వాత భారీ స్థాయిలో ఓటర్ల పేర్లు వివిధ కారణాలతో డిలీట్ అయిన నేపథ్యంలో వాటి గురించి ప్రజలకు వివరించడానికి ఈ సభలకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం శ్రీకారం చుట్టింది. ప్రతీ గ్రామం, అర్బన్ ప్రాంతాల్లోని ప్రతీ వార్డులో బూత్ లెవల్ ఆఫీసర్లు సభలు నిర్వహించి ఎవరి పేర్లు గల్లంతయ్యాయో వివరించనున్నారు. ప్రజల సమక్షంలోనే చదివి వినిపించి లోపాలను సరిదిద్దుకొవడానికి అవకాశం ఇవ్వనున్నారు. అందుబాటులోలేని, వలస వెళ్లిన, మరణించిన, డూప్లికేట్గా గుర్తించిన ఓటర్లతో కూడిన జాబితాలో వివరాలను వెల్లడించనున్నారు. ముసాయిదా జాబితాలో ఎవరేవరి పేర్లు ఉన్నాయో తెలుసుకొని అక్కడిక్కడే పరిష్కరించాలన్నది కమిషన్ ఉద్దేశం.

More news from Telangana and nearby areas
  • *చేతులు లేకపోతేనేం.. అన్నపై ప్రేమ ఉందిగా!* *- అందరినీ ఆకర్షిస్తున్న వీడియో. *సూర్యాపేట సిటీ ఆగస్టు 26: అన్నాచెల్లెళ్ల ప్రేమకు అవధులు ఉండవు. తోబుట్టువుల మధ్య ఉండే పవిత్ర బంధం అమూల్యమైనది. ఆ ఆప్యాయతను గుర్తుచేస్తూ ఓ చిట్టితల్లి అన్నపై చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోదరుడికి రాఖీ కట్టాలనే తపన ముందు ఆమె అంగవైకల్యం ఓడిపోయింది. చేతులు లేకపోయినా రాఖీ కట్టడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఆపై కాలితోనే అతనికి బొట్టు పెట్టి, స్వీట్ తినిపించింది. అన్న ఇచ్చిన డబ్బు తీసుకొని ఆశీర్వాదం అందుకుంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
    1
    *చేతులు లేకపోతేనేం.. అన్నపై ప్రేమ ఉందిగా!*

*- అందరినీ ఆకర్షిస్తున్న వీడియో. 

*సూర్యాపేట సిటీ ఆగస్టు 26:
అన్నాచెల్లెళ్ల ప్రేమకు అవధులు ఉండవు. తోబుట్టువుల మధ్య ఉండే పవిత్ర బంధం అమూల్యమైనది. ఆ ఆప్యాయతను గుర్తుచేస్తూ ఓ చిట్టితల్లి అన్నపై చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోదరుడికి రాఖీ కట్టాలనే తపన ముందు ఆమె అంగవైకల్యం ఓడిపోయింది. చేతులు లేకపోయినా రాఖీ కట్టడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఆపై కాలితోనే అతనికి బొట్టు పెట్టి, స్వీట్ తినిపించింది. అన్న ఇచ్చిన డబ్బు తీసుకొని ఆశీర్వాదం అందుకుంది..
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
    user_YADLA VENUDHAR
    YADLA VENUDHAR
    Suryapet, Telangana•
    14 hrs ago
  • పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గం: నార్కెట్‌పల్లి మండలం చౌడంపల్లి గ్రామానికి చెందిన చెరుకుపల్లి మారయ్య గారి కుమారుడి వివాహ వేడుకకు నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే నార్కెట్‌పల్లి పట్టణానికి చెందిన జక్కంపూడి సత్యనారాయణ గారి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నార్కెట్‌పల్లి పట్టణానికి చెందిన బైరగొని రవి గౌడ్ గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వివాహ బంధంతో ఒక్కటైన నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని చిరుమర్తి లింగయ్య గారు ఆకాంక్షించారు.
    4
    పలు వివాహ  వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్ నియోజకవర్గం: నార్కెట్‌పల్లి మండలం చౌడంపల్లి గ్రామానికి చెందిన చెరుకుపల్లి మారయ్య గారి కుమారుడి వివాహ వేడుకకు నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అలాగే నార్కెట్‌పల్లి పట్టణానికి చెందిన జక్కంపూడి సత్యనారాయణ గారి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా నార్కెట్‌పల్లి పట్టణానికి చెందిన బైరగొని రవి గౌడ్ గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా వివాహ బంధంతో ఒక్కటైన నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని చిరుమర్తి లింగయ్య గారు ఆకాంక్షించారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    13 hrs ago
  • పాడే పైనే రాఖీ కట్టి కన్నీరు మున్నీరుగా విలపించిన సోదరి మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో రాఖీ పండుగకు రెండు రోజుల ముందు కంటతడి పెట్టించిన హృదయ విధారక ఘటన... కురవి మండల కేంద్రానికి చెందిన మోటపోతుల రమేష్ అనే ముప్పై ఆరు సంవత్సరాల యువకుడు అనారోగ్యంతో మృతిచెందాడు.. అంతిమయాత్ర సాగుతున్న క్రమంలో దింపుడుకల్లం వద్ద అతని మృతదేహాన్ని చూసి రమేష్ అక్క గుండెలు అవిసేలా రోదించింది.., రెండు రోజులయితే రాఖీ కడుదాం అనుకున్న తమ్ముడా.., ఇంతలోనే మమ్మల్ని వదిలి వెల్లిపోయావా అంటూ గుండెలు బాదుకుని రోదించింది.. ఆనందంగా జరుపుకోవాల్సిన రక్షాబంధనం వేడుక అంతిమయాత్రలో జరగడం.., తమ్ముడి మృతదేహానికి రాఖీ కడుతూ ఆ..అక్క బోరున విలపించడం అక్కడ ఉన్నవారందరినీ కంటతడి పెట్టించింది.. మోటపోతుల రమేష్ తండ్రి పదిరోజులు క్రితం మరణించగా అతని దశదినకర్మ ఈ..రోజు చేయాల్సి ఉండగా నిన్న రమేష్ మరణించాడు.., గతంలో ఇతని తమ్ముడు కూడా అనారోగ్యంతోనే మృతి చెందడంతో ఆ.. కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయని అంతిమయాత్రలో పాల్గొన్న బందువులు, ప్రజలు కన్నీటితో గుర్తు చేసుకున్నారు..
    1
    పాడే పైనే రాఖీ కట్టి కన్నీరు మున్నీరుగా విలపించిన సోదరి 
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో రాఖీ పండుగకు రెండు రోజుల ముందు కంటతడి పెట్టించిన హృదయ విధారక ఘటన...
కురవి మండల కేంద్రానికి చెందిన మోటపోతుల రమేష్ అనే ముప్పై ఆరు సంవత్సరాల యువకుడు అనారోగ్యంతో మృతిచెందాడు..
అంతిమయాత్ర సాగుతున్న క్రమంలో దింపుడుకల్లం వద్ద అతని మృతదేహాన్ని చూసి రమేష్ అక్క గుండెలు అవిసేలా రోదించింది.., రెండు రోజులయితే రాఖీ కడుదాం అనుకున్న తమ్ముడా.., ఇంతలోనే మమ్మల్ని వదిలి వెల్లిపోయావా అంటూ గుండెలు బాదుకుని రోదించింది.. 
ఆనందంగా జరుపుకోవాల్సిన రక్షాబంధనం వేడుక అంతిమయాత్రలో జరగడం.., తమ్ముడి మృతదేహానికి రాఖీ కడుతూ ఆ..అక్క బోరున విలపించడం అక్కడ ఉన్నవారందరినీ కంటతడి పెట్టించింది..
మోటపోతుల రమేష్ తండ్రి పదిరోజులు క్రితం మరణించగా అతని దశదినకర్మ ఈ..రోజు చేయాల్సి ఉండగా నిన్న రమేష్ మరణించాడు.., గతంలో ఇతని తమ్ముడు కూడా అనారోగ్యంతోనే మృతి చెందడంతో ఆ.. కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయని అంతిమయాత్రలో పాల్గొన్న బందువులు, ప్రజలు కన్నీటితో గుర్తు చేసుకున్నారు..
    user_కిరణ్ చెల్లమల్ల
    కిరణ్ చెల్లమల్ల
    మరిపెడ, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • చౌటుప్పల్ లో భారీగా నిలిచిన ట్రాఫిక్.. వాహనదారుల ఇబ్బందులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల పొడవున నిలిచిన వాహనాలు, మధ్యలోనే ఇరుక్కుపోయిన రెండు అంబులెన్సులు .. అంబులెన్సులు కు సైతం దొరకని దారి. ..
    1
    చౌటుప్పల్ లో భారీగా నిలిచిన ట్రాఫిక్.. వాహనదారుల ఇబ్బందులు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో భారీగా ట్రాఫిక్ జామ్..  కిలోమీటర్ల పొడవున నిలిచిన వాహనాలు, మధ్యలోనే ఇరుక్కుపోయిన రెండు అంబులెన్సులు .. అంబులెన్సులు కు సైతం దొరకని దారి. ..
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    12 hrs ago
  • తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో పాఠశాల భవన నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో పాఠశాల భవన నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య,వైద్యానికి పెద్దపీట వేశామన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో టెక్నీకల్ విద్య కోసం ఒక ATC ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందిస్తుందని ఆయన తెలిపారు.రెండున్నర సంవత్సరాల్లో డ్వాక్రా మహిళలకు 63 వేల కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు.వచ్చే నెల నుంచి అర్హులైన వారికి పెన్షన్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు..
    1
    తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో పాఠశాల భవన నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో పాఠశాల భవన నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య,వైద్యానికి పెద్దపీట వేశామన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో  టెక్నీకల్ విద్య కోసం ఒక ATC ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందిస్తుందని ఆయన తెలిపారు.రెండున్నర సంవత్సరాల్లో డ్వాక్రా మహిళలకు 63 వేల కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు.వచ్చే నెల నుంచి అర్హులైన వారికి పెన్షన్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు..
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    11 min ago
  • నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీరు అవసరాల కోసం నీటిని విడుదల చేసిన అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు అధికారులు తాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేశారు. ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకుని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. గత కొంతకాలంగా నీళ్లు రాక ఎడమ కాలువ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడగా తాజాగా నీటిని విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    1
    నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీరు అవసరాల కోసం నీటిని విడుదల చేసిన అధికారులు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు అధికారులు తాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేశారు.
ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకుని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. గత కొంతకాలంగా నీళ్లు రాక ఎడమ కాలువ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడగా తాజాగా నీటిని విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    user_T Shankar Public News Reporter
    T Shankar Public News Reporter
    రిపోర్టర్ Kanagal, Nalgonda•
    20 hrs ago
  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు రక్షా బంధన్ పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బ్రహ్మకుమారి సోదరీమణులు ప్రేమాభిమానాలతో రాఖీలు కట్టారు. రఘునాథపాలెంలో స్వామి నారాయణ గురుకులానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఆయనను బ్రహ్మకుమారీలు కలిసి సోదరభావాన్ని చాటుకున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవం మరియు సోదరభావాన్ని పెంపొందించే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.
    1
    వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు

రక్షా బంధన్ పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బ్రహ్మకుమారి సోదరీమణులు ప్రేమాభిమానాలతో రాఖీలు కట్టారు. రఘునాథపాలెంలో స్వామి నారాయణ గురుకులానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఆయనను బ్రహ్మకుమారీలు కలిసి సోదరభావాన్ని చాటుకున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవం మరియు సోదరభావాన్ని పెంపొందించే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • *నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల* *-తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన అధికారులు. సూర్యాపేట సిటీ:: *నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల* తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అధికారులు బుధవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకొని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. కొంతకాలంగా కాలువలో నీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నీటి విడుదలతో ఉపశమనం లభించింది. దీంతో పరివాహక ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
    1
    *నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల*

*-తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన అధికారులు.

సూర్యాపేట సిటీ::
*నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల*
తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అధికారులు బుధవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకొని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. కొంతకాలంగా కాలువలో నీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నీటి విడుదలతో ఉపశమనం లభించింది. దీంతో పరివాహక ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
    user_YADLA VENUDHAR
    YADLA VENUDHAR
    Suryapet, Telangana•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.