logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

1. పేదలు తప్ప రస్తాలు, కల్వర్టులు, పబ్లిక్ పర్పస్ స్థలాలలోని అక్రమ కట్టడాలు కనిపించలేదా కమిషనర్ గారు? 2. పట్టణంలోని 70 లేఔట్లలోని అక్రమ కట్టడాలను తొలగించగలరా? 3. రాజకీయ పలుకుబడి కలిగిన బడా బాబులకు ఓ న్యాయం? బలహీనులైన పేదలకు న్యాయమా? ఎస్ చంద్రశేఖర్ ప్రశ్న,జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ బద్వేలు , జూలై 31: రాజకీయ ఆర్థిక అంగ బలం కలిగిన బడా బాబులకు ఓ న్యాయం, బలహీనులైన పేదలకు ఓ న్యాయమా? సమాధానం చెప్పాలని మరియు మున్సిపాలిటీ లో సుమారు 70కి పైగా లేఅవుట్లలోని రస్తాలు కల్వర్టులు పబ్లిక్ పర్పస్ స్థలాలలో నిర్మించిన అక్రమ కట్టడాలను తక్షణమే తొలగించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం తమ పార్టీ కార్యాలయం నందు జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, బద్వేల్ మున్సిపాలిటీలో అధికారులు మారిన ప్రతిసారి తామేదో సాధించినట్లుగా కడుపు మాడ్చుకుని పేదవాడు నిర్మించుకున్న ఇండ్లను జెసిబి లతో కూలుస్తూ వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. అదే ఎన్జీవో స్థలాలలో 966, 967 లాంటి బద్వేలు సిద్ధవటం రోడ్డు ప్రధాన రహదారి పక్కనే ఉన్న 100 లింకుల రోడ్లను, మరియు గాంధీనగర్ కు వెళ్లే రోడ్డు, మున్సిపల్ కార్యాలయం వద్దనున్న ఐస్ క్రీమ్ పార్లర్ రోడ్డు మరియు మైదుకూరు రోడ్డు లోని పశువుల సంత దగ్గర, వీరారెడ్డి కాలేజీ దిగువన, మడకలవారిపల్లె హరిజనవాడ దగ్గర, పాలిటెక్నిక్ కాలేజీ ఎదురుగా, సిద్ధవటం రోడ్డు లోని లోతు వంకల కల్వర్టులను మరియు సుమో స్టాండ్ దగ్గర నుండి శివాలయం వరకు ఉన్న కాలువ మరియు భాకరాపేట చెరువు దగ్గర హిందూ స్మశానం ఎకరా పైబడి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడంలో, ఆ నిర్మాణాల జోలికి వెళ్లడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అదే రాజకీయ, ఆర్థిక బలం ఉన్న బడా బాబులు మాత్రం మున్సిపాలిటీ స్థలాలను ఆక్రమించుకుని నిర్మాణాలు చేసి పేదవాళ్లకు బాడుగలకు ఇచ్చుకొని లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుని మున్సిపాలిటీ కి రావాల్సిన ఆదాయాన్ని బొక్కేస్తుంటే వారిని మాత్రం చూసి చూడనట్లు వదిలి బలహీనుల ఇండ్లను కూల్చడానికి మాత్రం ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని ఇది మీకు సరి కాదని హితువు పలుకుతూ నిజంగా మున్సిపాలిటీ అభివృద్ధి పైన మీకు చిత్తశుద్ధి ఉంటే ఆక్రమణకు గురైన 70 కి పైగా లేఔట్ లోని రస్తాలు కల్వర్టులు పబ్లిక్ పర్ఫస్ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేసుకున్న వారికి మున్సిపాలిటీ అప్రూవల్ చేస్తూ ఇంటి పన్నులు వేసిన వారిపై చర్యలు తీసుకోగలరా అని ప్రశ్నించారు. గతంలో మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన నరసింహ రెడ్డికి, గోపవరం మండల తాసిల్దార్ త్రిభువన్ రెడ్డి గారికి ఆక్రమణలపై పూర్తి వివరాలు సమర్పించామని, ఆ సమాచారం మీ దగ్గర లేకపోతే మరొకసారి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాటన్నిటి పైన చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలను స్వాధీనం చేసుకొని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోగలరా అని ఘాటుగా ప్రశ్నించారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పేదల పట్ల తమకున్న అభిప్రాయాన్ని మార్చుకొని అందరి పట్ల సమాన భావాన్ని చూపాలని అప్పుడే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారని ఆయన హితువు పలికారు. ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ కార్యదర్శి పి చంద్రమోహన్ రాజు నియోజకవర్గ కమిటీ సభ్యులు సంజీవ రాయుడు, విజయరావు, జయరామరాజు, మహబూబ్ బాషా, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

5 hrs ago
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
5 hrs ago
bfced175-ace8-4b7c-9dfc-6f2d7601ad41

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వైయస్ ఆనంద్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నివాళి పులివెందులలో వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే.ఆయన నివాసానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ చేరుకున్నారు. అనంతరం ఆయన మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
    1
    వైయస్  ఆనంద్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నివాళి
పులివెందులలో వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే.ఆయన నివాసానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ
చేరుకున్నారు. అనంతరం ఆయన మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించి ప్రగాఢ
సానుభూతి తెలియజేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • సీపీ శంఖబ్రత బాగ్చి కీలక చర్యలు..! ప్రధాని పర్యటనకు భారీ భద్రత..! విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. వీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకల నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. మూడు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు.. అవసరమైన ప్రాంతాల్లో వాహనాల మళ్లింపులు చేపట్టనున్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, క్రైమ్, ఏఆర్, హోంగార్డ్స్ విభాగాలకు చెందిన పోలీసు సిబ్బందిని భారీగా మోహరించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో గ్రీన్ కారిడార్, వీఐపీ పార్కింగ్, సభా ప్రాంగణ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆగస్టు 1 ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేయనున్నారు. అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ, గూడ్స్ వాహనాలను విశాఖ నగరంలోకి అనుమతించబోమని పోలీసులు తెలిపారు. సభకు వచ్చే ప్రజల కోసం ప్రత్యేక బస్సు మార్గాలు, పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వాహనదారులు పోలీసుల సూచనలు పాటించాలని, అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సీపీ శంఖబ్రత బాగ్చి విజ్ఞప్తి చేశారు.
    1
    సీపీ శంఖబ్రత బాగ్చి కీలక చర్యలు..!
ప్రధాని పర్యటనకు భారీ భద్రత..!
విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు.
వీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకల నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు.
మూడు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు.. అవసరమైన ప్రాంతాల్లో వాహనాల మళ్లింపులు చేపట్టనున్నారు.
ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, క్రైమ్, ఏఆర్, హోంగార్డ్స్ విభాగాలకు చెందిన పోలీసు సిబ్బందిని భారీగా మోహరించనున్నారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో గ్రీన్ కారిడార్, వీఐపీ పార్కింగ్, సభా ప్రాంగణ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఆగస్టు 1 ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేయనున్నారు.
అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ, గూడ్స్ వాహనాలను విశాఖ నగరంలోకి అనుమతించబోమని పోలీసులు తెలిపారు.
సభకు వచ్చే ప్రజల కోసం ప్రత్యేక బస్సు మార్గాలు, పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
వాహనదారులు పోలీసుల సూచనలు పాటించాలని, అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సీపీ శంఖబ్రత బాగ్చి విజ్ఞప్తి చేశారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కార్మికులు ఆర్డీవో కార్యాలయంలో ధర్నా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ స్కీం వర్కర్లకు,కార్మికులకు, కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో కార్మికులు పెద్ద ఎత్తున వచ్చి ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆవులయ్య మాట్లాడుతూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్, ఉద్యోగులకు కనీస వేతనం 26,000 కల్పించి, ఆరోగ్య భీమా కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మా న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టానికైనా వెనకాడ బొమని హెచ్చరించారు.
    1
    కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కార్మికులు ఆర్డీవో కార్యాలయంలో ధర్నా 
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ స్కీం వర్కర్లకు,కార్మికులకు, కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో కార్మికులు పెద్ద ఎత్తున వచ్చి ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆవులయ్య  మాట్లాడుతూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్, ఉద్యోగులకు కనీస వేతనం 26,000 కల్పించి, ఆరోగ్య భీమా కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మా న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టానికైనా వెనకాడ బొమని హెచ్చరించారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • అక్రమ మద్యం. ఇసుక అక్రమాలను అరికట్టాలి.. ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి. ముఖేష్ కుమార్ మీనా అక్రమ మద్యం, ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి: ముఖేష్ కుమార్ మీనా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎక్సైజ్), పరిశ్రమలు & వాణిజ్యం (గనులు) శాఖల ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మద్యం తయారీ, రవాణా, బహిరంగ మద్యపానాన్ని కట్టడి చేసి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇసుక సరఫరా సజావుగా ఉండేలా, ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మైనింగ్ లీజులు, ఖనిజ ఆదాయం, నాన్-వర్కింగ్ లీజులపై సమీక్ష నిర్వహించి పారదర్శకంగా పనులు చేపట్టాలని సూచించారు. వడ్డెర సహకార సంఘాలకు క్వారీ లీజుల కోసం గుర్తించిన భూములకు అవసరమైన అనుమతులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
    1
    అక్రమ మద్యం. ఇసుక అక్రమాలను అరికట్టాలి.. ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి. ముఖేష్ కుమార్ మీనా
అక్రమ మద్యం, ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి: ముఖేష్ కుమార్ మీనా
అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎక్సైజ్), పరిశ్రమలు & వాణిజ్యం (గనులు) శాఖల ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మద్యం తయారీ, రవాణా, బహిరంగ మద్యపానాన్ని కట్టడి చేసి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 
జిల్లాలో ఇసుక సరఫరా సజావుగా ఉండేలా, ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మైనింగ్ లీజులు, ఖనిజ ఆదాయం, నాన్-వర్కింగ్ లీజులపై సమీక్ష నిర్వహించి పారదర్శకంగా పనులు చేపట్టాలని సూచించారు. వడ్డెర సహకార సంఘాలకు క్వారీ లీజుల కోసం గుర్తించిన భూములకు అవసరమైన అనుమతులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
    user_V.V.NARAYANARAO
    V.V.NARAYANARAO
    పులిచెర్ల, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం డిప్యూటీ MRO శ్రీ గస్తీ నారాయణస్వామి గారి ఆత్మీయ పదవీ విరమణ మరియు సన్మాన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సోమల ప్రకాష్ నాయుడు గారు.. సోమల ప్రకాష్ నాయుడు గారు మాట్లాడుతూ డిప్యూటీ MRO నారాయణ స్వామి గారి గురించి ఆయన ముదిగుబ్బ మండలానికి చేసిన మంచి గురించి ప్రజలకు తెలియజేశారు... ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కిసాన్ మోర్చా నాయకులు పసుపులేటి వెంకటేష్ గారు పీవీ శివకుమార్ గారు దేశు నారాయణ గారు ఆర్వేటి గంగప్ప గారు నాగభూషణ గారు జనార్ధన గారు రాములు గారు
    2
    శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం డిప్యూటీ MRO శ్రీ గస్తీ నారాయణస్వామి గారి ఆత్మీయ పదవీ విరమణ మరియు సన్మాన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సోమల ప్రకాష్ నాయుడు గారు.. 
సోమల ప్రకాష్ నాయుడు గారు మాట్లాడుతూ
డిప్యూటీ MRO నారాయణ స్వామి గారి గురించి ఆయన ముదిగుబ్బ మండలానికి  చేసిన
మంచి గురించి ప్రజలకు తెలియజేశారు...
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కిసాన్ మోర్చా నాయకులు 
పసుపులేటి వెంకటేష్ గారు
పీవీ శివకుమార్ గారు 
దేశు నారాయణ గారు 
ఆర్వేటి గంగప్ప గారు 
నాగభూషణ గారు
జనార్ధన గారు 
రాములు గారు
    user_Pv sivakumar
    Pv sivakumar
    Photographer ముదిగుబ్బ, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • తిరుపతిలో బిర్యానీ ఫ్యాక్ట‌రీ రెస్టారెంట్ సీజ్‌ బైరాగిపట్టేడలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ చేసిన కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్.ట్రేడ్ లైసెన్స్ లేదు, ఫుడ్ సేఫ్టీ మేజర్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారన్న డాక్టర్ అన్వేష్ తిరుపతిలో బిర్యానీ ఫ్యాక్ట‌రీ రెస్టారెంట్ సీజ్‌ బైరాగిపట్టేడలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ చేసిన కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్.ట్రేడ్ లైసెన్స్ లేదు, ఫుడ్ సేఫ్టీ మేజర్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారన్న డాక్టర్ అన్వేష్
    1
    తిరుపతిలో బిర్యానీ ఫ్యాక్ట‌రీ రెస్టారెంట్ సీజ్‌

బైరాగిపట్టేడలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ చేసిన కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్.ట్రేడ్ లైసెన్స్ లేదు, ఫుడ్ సేఫ్టీ మేజర్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారన్న డాక్టర్ అన్వేష్

    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    7 hrs ago
  • కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి:సీపీఐ ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్ నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులలో పంటలు సాగు కావడంలేదని, కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పులివెందుల మండలంలోని బీడు భూములు, కాలువలను ఆయన సీపీఐ నాయకులతో కలిసి పరిశీలించారు. వర్షాభావ పరిస్థితులలో రైతుల బోరుబావుల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, రైతుల ఇబ్బందులను ప్రభుత్వం గమనించాలన్నారు.
    1
    కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి:సీపీఐ ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు 
ఎల్ నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులలో పంటలు సాగు కావడంలేదని, కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పులివెందుల మండలంలోని బీడు భూములు, కాలువలను ఆయన సీపీఐ నాయకులతో కలిసి పరిశీలించారు. వర్షాభావ పరిస్థితులలో రైతుల బోరుబావుల్లో భూగర్భ జలాలు
అడుగంటుతున్నాయని, రైతుల ఇబ్బందులను ప్రభుత్వం
గమనించాలన్నారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • భవిష్యవాణి పేరుతో మా ఊరి ప్రజలను మోసం చేస్తున్నారు: గ్రామస్తులు భవిష్య వాణి పేరుతో తమ గ్రామంలో ఓ వ్యక్తి ప్రజల నుంచి రూ 5 నుంచి 10 వేల వరకు వసూలు చేస్తున్నాడని యాదమరి మండలం, జంగాలపల్లి గ్రామస్తులు శుక్రవారం ఆరోపించారు. 'దేవుడి పేరుతో మాయ మాటలు చెప్పి నగదు తీసుకుంటున్నాడు. ప్రజలు ఇలాంటి మాయమాటలకు మోసపోకూడదని సదరు వ్యక్తిని ప్రశ్నిస్తే నా వద్ద లక్ష మంది ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు, మీపైనే నెగిటివ్ ప్రచారం చేస్తా అని బెదిరించినట్లు తమ దృష్టికి వచ్చింది' అని స్థానికులు తెలియజేశారు.
    1
    భవిష్యవాణి పేరుతో మా ఊరి ప్రజలను  మోసం చేస్తున్నారు: గ్రామస్తులు
భవిష్య వాణి పేరుతో తమ గ్రామంలో ఓ వ్యక్తి ప్రజల నుంచి రూ 5 నుంచి 10 వేల వరకు వసూలు చేస్తున్నాడని యాదమరి మండలం, జంగాలపల్లి గ్రామస్తులు శుక్రవారం ఆరోపించారు. 'దేవుడి పేరుతో మాయ మాటలు చెప్పి నగదు తీసుకుంటున్నాడు. ప్రజలు ఇలాంటి మాయమాటలకు మోసపోకూడదని  సదరు వ్యక్తిని ప్రశ్నిస్తే నా వద్ద లక్ష మంది ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు, మీపైనే నెగిటివ్ ప్రచారం చేస్తా అని బెదిరించినట్లు తమ దృష్టికి వచ్చింది' అని స్థానికులు తెలియజేశారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • పుంగనూరు లో దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు ర్యాలీ.. అన్నమయ్య జిల్లా. పుంగనూరు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 వ తేదీ నుండీ ఈ రోజు అంగ 31 వ తేదీ వరకు దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు అందరూ పెన్ డౌన్ కార్యక్రమాలు చేస్తున్నాము. చివరి రోజు అయిన ఈ రోజు పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12.30. లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండీ గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నా ము. కనుక మీరు ఈ కార్యక్రమములో పాల్గొని మాకు సహకరించగలరు. నమస్కారములతో.... పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం. పుంగనూరు......
    2
    పుంగనూరు లో  దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు ర్యాలీ..
అన్నమయ్య జిల్లా. పుంగనూరు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 వ తేదీ నుండీ ఈ రోజు అంగ 31 వ తేదీ వరకు దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు అందరూ పెన్ డౌన్ కార్యక్రమాలు చేస్తున్నాము. చివరి రోజు అయిన ఈ రోజు పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12.30. లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండీ గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నా ము.  
కనుక మీరు ఈ కార్యక్రమములో పాల్గొని మాకు సహకరించగలరు.
నమస్కారములతో....
పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం.
పుంగనూరు......
    user_S Reddy Raghavendra Raju
    S Reddy Raghavendra Raju
    Photographer Punganur, Chittoor•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.