బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తాడూరి శ్రీనివాస్ నియామకం _డా. ఏఎస్ రావు నగర్ డివిజన్‌కు గర్వకారణమని నాయకుల అభినందనలు కాప్రా: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా (స్పోక్స్ పర్సన్) నియమితులైన తాడూరి శ్రీనివాస్‌కు స్థానిక నాయకులు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్‌కు చెందిన కమలానగర్ నివాసి తాడూరి శ్రీనివాస్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడిగా నిలిచారని పేర్కొన్నారు.ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర తొలి ఎంబీసీ చైర్మన్‌గా పనిచేసిన ఆయన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులవడం డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ ప్రజలకు గర్వకారణమని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మర్రి మోహన్ రెడ్డి, కె. రమేష్ యాదవ్, దొంతుల ప్రభాకర్, ఏనుగు సీతారాం రెడ్డి, వెంకన్న నాయక్, సుధాకర్, టి. మాధవరావు, డాక్టర్ వెంకటరమణాచారి, ప్రేమ్ గౌడ్, హరినాథ్ గౌడ్, ఏనుగు మంజుల, పుష్పలత, శ్రీకాంత్, శ్రీహరి, బద్దం సుధాకర్ రెడ్డి, జె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మర్రిగూడ బైపాస్ వద్ద మరియు స్థానిక డిఈఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు.. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరణ... అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి” – మంత్రి... కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు... అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణ...1
- నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డు అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారింది. గ్రామపంచాయతీలో సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చాల్సింది పోయి, డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ దహనం చేస్తున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సేగ్రిగేషన్ షెడ్డును వెంటనే వినియోగంలోకి తెచ్చి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని పెంచాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమ పై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచుమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్ళతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రావాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.1
- పత్రిక ప్రకటన తేది :14.04.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర లు పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.1
- More details to buy Watsup 8374614046 👆👆👆👆👆👆👆5
- నకిరేకల్ నియోజకవర్గం:- ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- జీతం పెంచాలని కోరినందుకు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ రాంప్రసాద్పై యజమానులు అనిల్రెడ్డి, బాలరాజు దాడికి పాల్పడ్డారు. దీనిని నిరసిస్తూ తోటి డ్రైవర్లు బస్సులు నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్పై దాడిని సీపీఐ నేత గడిపే మల్లేశం ఖండించారు. కార్మికులపై ఇలాంటి దాడులు సరికాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో హుస్నాబాద్ డిపో వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.1
- పత్రిక ప్రకటన తేది :14.04.2026 కామారెడ్డి జిల్లా, మంగళవారం ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవియఫ్) కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం జిల్లా కేంద్రంలోని కర్షక్ డిగ్రీ కళాశాలలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు నిరంతర రక్తదానం ఎంతో అవసరమని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంచుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన దాతలకు కలెక్టర్ స్వయంగా సర్టిఫికెట్‌లు హెల్మెట్లు అందజేశారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ విక్టర్,ఐవియఫ్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు1
- ఫుల్ డీటెయిల్స్ వీడియో In మై యూట్యూబ్ ఛానల్ id:cryancreations51911