Shuru
Apke Nagar Ki App…
4 కాళ్లు.. 4 చేతులతో శిశువు జననం, వైరల్ అవుతున్న వీడియో మధ్యప్రదేశ్‌లోని లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు. అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్‌లో జబల్‌పూర్‌కు తరలించారు.
Shareef pasha
4 కాళ్లు.. 4 చేతులతో శిశువు జననం, వైరల్ అవుతున్న వీడియో మధ్యప్రదేశ్‌లోని లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు. అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్‌లో జబల్‌పూర్‌కు తరలించారు.
More news from తెలంగాణ and nearby areas
- గ్రానెట్ లారీ బోల్తా మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తా పడటంతో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ కావడం వలన కొడకండ్ల పెద్దవంగర మండలాల్లోని పలు గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో గ్రామ పంచాయతీలు గ్రామ ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోగలరని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.1
- బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నేతలపై స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్న 1,400 కోట్లు అక్రమంగా వచ్చినవే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో జరిగిన సంఘటన వీడియోలో నేనే ఉన్నానని బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తున్నారన్నారు.1
- హనుమకొండలో హరీశ్‌రావు అరెస్ట్.. బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.1
- మరి చెట్టుకు మర్రి కల్లు.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అరుదైన సంఘటన. కల్లు తాగడానికి చెట్టును చూడడానికి భయపడుతున్న జనం... బయ్యారం మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27... మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహాశీల్డార్ కార్యాలయం సమీపంలో ని చిన్నాల కుంట చెరువు వద్ద మర్రి చెట్టు వేరు నుండి కళ్ళు రావడం చూసి గీత కార్మికుడు నాలుగైదు రోజుల నుండి దానిని పరిశీలించగా ప్రధాన వేరు నుండి మర్రి కళ్ళు రావడానికి చూసి ఆశ్చర్యానికి లోనై వేరుకు గీత కత్తితో గీతలు పెట్టి కల్లు లొట్టిని కట్టారు. లొట్టిలో కళ్ళు పడటం చూసి పలువురు మర్రి కల్లు తాగేందుకు క్యూలు కడుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పలువురు ఆ చెట్టును చూడటానికి వెళుతున్నారు. దీనిపై గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం మర్రిచెట్టు పక్కనే గండు పెద్ద వెంకన్న వ్యవసాయ బావి పాడుబడి పూడిక తో ఉండడంతో ఏలిననో ప్రభావంతోతన వారి సాగు పొలానికి నీరు సరిపోక పోవడంతో తన బావిని ప్రోక్లిన్ సహాయంతో పూడిక పనులు చేశారు . పూడిక తీస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న మర్రి పెద్ద వేరు తెగి పోవడం వల్ల, వేరు నుంచి మూడు నాలుగు రోజులుగా మర్రి కల్లు జాలు వారడం చూశానని తెలిపాడు.మర్రికల్లును తీసి విక్రయిస్తున్నట్లు గీత కార్మికుడు తెలిపాడు.1
- వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం............. ఉమ్మడి వరంగల్ హనుమకొండ జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. గురువారం వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లిన సంఘటన లో మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. భీమదేవరపల్లి మండలం రాంనగర్ శివారులో జరిగిన ఈ విషాద సంఘటనలో హుస్నాబాద్ మండలం పోతారం లో జరిగిన వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందనీ ఈ సంఘటనలో ఏలూరి రాధా (61) అక్కడికక్కడే మృతి చెందగా వీరారెడ్డి,కిరణ్,రవీందర్ రెడ్డి అనే మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి నట్లు, వీరంతా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.1
- నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.1
- హైదరాబాద్ మహాధర్నాలో వైద్య ఆరోగ్య ఉద్యోగుల గర్జ తెలంగాణ ఉద్యోగ జేఏసీ హైదరాబాద్ మహాధర్నాలో వైద్య ఆరోగ్య ఉద్యోగుల గర్జన తెలంగాణ ఉద్యోగ జేఏసీ (TGEJAC) పిలుపు మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన మహాధర్నాలో మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని అన్ని సంఘాల నాయకులు, వైద్యులు, వైద్య ఆరోగ్య ఉద్యోగులు భారీగా పాల్గొని తమ ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా TGO Doctors Forum & TMPHDA అధ్యక్షులు డాక్టర్ కత్తి జనార్దన్ మాట్లాడుతూ: 🔴 2వ PRCను వెంటనే అమలు చేయాలి 🔴 6 పెండింగ్ DAలను విడుదల చేయాలి 🔴 OPSను పునరుద్ధరించాలి 🔴 పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలి 🔴 EHSలోని లోటుపాట్లను పరిష్కరించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో, *TGEJAC చైర్మన్ మారం జగదీష్ అన్నగారు, జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాస్ అన్నగారి నాయకత్వంలో సెప్టెంబర్ 10న “చలో హైదరాబాద్”* కార్యక్రమాన్ని నిర్వహించి, లక్షలాది ఉద్యోగులతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. 🤝 మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంట్ ఐక్య గళం ఈ మహాధర్నాలో వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. డా. కిరణ్ మాదాల డా. వెంకట్ యాదవ్ శ్రీనివాస్ కొప్పునమోని శ్రీనివాస్ మెంగా సుజాత రాథోడ్ దేవిక రొక్కం బత్తిని సుదర్శన్ గౌడ్ డా. రవికుమార్ ✊🏻 ఐక్యంగా నిలబడదాం… హక్కులు సాధించుకుందాం ,జై TGEJAC✊🏻1
- మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హౌస్ అరెస్ట్ వరంగల్ జిల్లాలో జీవో 97 రద్దు చేయాలని నిరసనలు తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు గురువారం వరంగల్ కి వెళ్తున్న హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.1