Shuru
Apke Nagar Ki App…
రాఖీ పండగ వేళ విషాదం.. నిద్రలోనే పారిశుద్ధ్య కార్మికుడి మృతి రాఖీ పండగ వేళ విషాదం.. నిద్రలోనే పారిశుద్ధ్య కార్మికుడి మృతి చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు పోతరాజు పోచయ్య గుండెపోటుతో మృతిచెందారు. గతంలో మండల కేంద్రంలో ట్రాన్స్‌కో అసిస్టెంట్ లైన్‌మెన్‌గా పనిచేసిన పోచయ్య ప్రస్తుతం జంగరాయి గ్రామపంచాయతీలో కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాత్రి భోజనం అనంతరం నిద్రించిన పోచయ్యకు నిద్రలోనే గుండెపోటు రావడంతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాఖీ పండగ రోజున ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో జంగరాయిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోచయ్య మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Sraya
రాఖీ పండగ వేళ విషాదం.. నిద్రలోనే పారిశుద్ధ్య కార్మికుడి మృతి రాఖీ పండగ వేళ విషాదం.. నిద్రలోనే పారిశుద్ధ్య కార్మికుడి మృతి చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు పోతరాజు పోచయ్య గుండెపోటుతో మృతిచెందారు. గతంలో మండల కేంద్రంలో ట్రాన్స్‌కో అసిస్టెంట్ లైన్‌మెన్‌గా పనిచేసిన పోచయ్య ప్రస్తుతం జంగరాయి గ్రామపంచాయతీలో కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాత్రి భోజనం అనంతరం నిద్రించిన పోచయ్యకు నిద్రలోనే గుండెపోటు రావడంతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాఖీ పండగ రోజున ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో జంగరాయిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోచయ్య మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
More news from తెలంగాణ and nearby areas
- జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో మహోత్సవంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ప్రత్యేక హోమం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో పోచమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.1
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాఖీ కట్టిన బండ కార్తీక చంద్రారెడ్డి. రక్షాబంధన్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక చంద్రారెడ్డి, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి రాఖీ కట్టారు. కిషన్ రెడ్డి నివాసంలో ఆయనను కలిసి చేతికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావుకు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ లకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు ఆమెకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందజేశారు.3
- హైదరాబాద్ లో రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టాను సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టాను సీఎం మనవడికి, అల్లుడికి కూడా రాఖీ కట్టా పండగ వాతవరణంలో నేను ఎలాంటి కామెంట్స్ చేయను - మంత్రి కొండా సురేఖ1
- Kanpur Police Ko Salaam! Jashn-e-Miladunnabi Mein Aman, Insaniyat Aur Zimmedari Ki Ban Gayi Misaal ❤️🇮🇳 #KanpurPolice #Kanpur #JashneMiladunnabi #Miladunnabi #PoliceKoSalaam #AmanKiMisaal #Insaniyat #PoliceDuty #KanpurNews #UPPolice #AmanAurBhaiChara #HaqKiAwaz #TwentyFourNews #GroundReport #KanpurPoliceZindabad #UnityInDiversity #Hindustan #AmanAurShanti Kanpur Police Ko Salaam! Jashn-e-Miladunnabi Mein Aman, Insaniyat Aur Zimmedari Ki Ban Gayi Misaal ❤️🇮🇳 #KanpurPolice #Kanpur #JashneMiladunnabi #Miladunnabi #PoliceKoSalaam #AmanKiMisaal #Insaniyat #PoliceDuty #KanpurNews #UPPolice #AmanAurBhaiChara #HaqKiAwaz #TwentyFourNews #GroundReport #KanpurPoliceZindabad #UnityInDiversity #Hindustan #AmanAurShanti1
- మారుతినగర్ లో దాదాపు పది లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ప్రారంభం మారుతి నగర్ లో దాదాపు 10 లక్షల రూపాయల వ్యయం తో ఓపెన్ జిమ్ ను మాజీ కార్పొరేటర్ శ్రవణ్ కాలనీ వాసులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా శ్రవణ్ మాట్లాడుతూ సామాగ్రిని జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు సూచించారు. ఆరోగ్యమే మహా భాగ్యమని, అందరు ఈ సదుపాయాన్ని వాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో కాలనీవాసులు జైకృష్ణ, ఆనంద్, శంకర్, అంజి, శ్రవణ్,, అనిల్, బాలరాజ్, బాబు తదితరులు పాల్గొన్నారు.1
- రాఖీ పౌర్ణమి సందర్భంగా అభిమానం, ప్రేమతో రాఖీలు కట్టిన సోదరీమణులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక, ఇలాంటి పండుగను అందరూ ప్రేమ, అభిమానాలతో జరుపుకోవాలి. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. #rakshabandhan #rakhi1
- తూప్రాన్ పట్టణంలోని శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సంతోషిమాత జయంతి ఉత్సవాలు తూప్రాన్ పట్టణంలోని శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సంతోషిమాత జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపకులు సోమయాజుల రవీంద్రశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి, చతుష్షష్టి ఉపచార పూజలు, రక్షాబంధన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కొడిప్యాక అన్నపూర్ణ, నారాయణగుప్త దంపతులతో పాటు పలువురు భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.1
- రాఖీ పండుగ రోజు రక్తమోడుతున్నా.. బిడ్డ ఆకలి తీర్చిన తల్లి మమకారం రాఖీ పండుగ రోజున బంధువులకు రాఖీలు కట్టేందుకు బయలుదేరిన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం విషాదంలోకి నెట్టింది. హత్నూర మండలం చందాపూర్‌కు చెందిన కుటుంబం చిలిపిచేడ్ చౌరస్తా వద్దకు చేరుకోగానే బైక్‌కు కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడింది. ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలై రక్తస్రావమైనప్పటికీ.. ఒడిలో ఉన్న చిన్నారి ఆకలిని మాత్రం ఆమె పట్టించుకోకుండా ఉండలేకపోయింది. గాయాల బాధను భరిస్తూనే బిడ్డకు పాలు ఇచ్చింది. రక్తమోడుతున్న స్థితిలోనూ బిడ్డ ఆకలి తీర్చిన ఆ తల్లి మమకారం అక్కడున్న వారిని కదిలించింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. రాఖీ పండుగ వేళ చోటుచేసుకున్న ఈ ఘటన కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపింది.1