logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

-ఆశ్రమ బాలికల పాఠశాలల పైన దృష్టి పెట్టని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి.. -సమస్య లతో సతమతమవుతున్న గిరిజన విద్యార్థులు.. కోట్లాది రూపాయలు నిధులు గిరిజన సంక్షేమ శాఖ కు కేటాయించినట్టు లెక్కలు చూపే పాలక ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో సంక్షోభం తప్ప గిరిజన సంక్షేమం ఎక్కడ కానరాదు అని ఆదివాసీ నవనిర్మాణ సేన జిల్లా అధ్యక్షులు ఎట్టి విద్యాసాగర్ ఆరోపించారు. వాజేడు మండల పరిధిలోని పెద్ద గొల్లగూడెం ఆశ్రమ బాలికల పాఠశాలను ఆదివాసీ నవనిర్మాణ సేన జిల్లా ,మండల నాయకులు మంగళ వారం సందర్శించారు. ఈ సందర్బంగా పాఠశాల విద్యార్థులతో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకున్నారు.అనంతరం విద్యాసాగర్ మాట్లాడుతూ మండల పరిధిలోని పెద్ద గొల్లగూడెం ఆశ్రమ బాలికల పాఠశాలలో ఉన్న విద్యార్థులు సమస్యల వలయంలో కొట్టు మీట్టాడు తున్నారని అయన మండిపడ్డారు.గిరిజన పిల్లలు చదువుతున్న పాఠశాలలో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు లేరని విద్యార్థులు చదువు అరాకోరగ ఉందని ఆదివాసీ పిల్లలపై ఇంత చిన్న చూపు ఎందుకని మండిపడ్డారు.అలాగే మరుగుదొడ్లు, మంచినీరు కూడా సరిగా లేవన్నారు. పాఠశాల చుట్టూ పిచ్చిమొక్కలు అడవిలాగా అల్లుకొని ఉన్నాయంన్నారు. వర్కర్స్ కూడా ముగ్గురే ఉన్నారని విద్యార్థులకు రక్షణగా వాచ్ మెన్ కూడా లేకపోవడంతో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గిరిజన విద్యార్థులు చదివే ఈ పాఠశాలకు సరైనా వసతులు పరిసరాల పరిశుభ్రత లేకపోవడం అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉందన్నారు. పాఠశాలలో ఆట స్థలం, ఆట వస్తువులు లేకపోవడం తో గిరిజన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఈ సమస్యలపై పలుమార్లు ఐటీడీ ఏ ప్రాజెక్ట్ అధికారికి , సంబంధిత అధికారులకు తెలియజేసిన సమస్యను పట్టించు కోకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. వందల కోట్ల రూపాయలు గిరిజన సంక్షేమానికి కేటాయిస్తున్నాం అని చెప్పే పాలక ప్రభుత్వం వాటిని ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. గిరిజన సంక్షేమ పాఠశాలల పైన పట్టింపు కరువు అవ్వడంతో విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నట్లు తెలియజేసారు. పెద్ద గొల్లగూడెం ఆశ్రమ బాలికల పాఠశాలకు ఉపాధ్యాయులను,వసతులు కల్పించే వరకు దశల వారి ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు వివరించారు. అవసరమైతే విద్యార్థులతో తల్లిదండ్రులతో భారీ ఎత్తున ఐటిడిఏ ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా సాగర్ హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో వాజేడు మండల ఆదివాసీ నవ నిర్మాణ సేన నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధి పాయం అజయ్, పీర్ల.రవిరాజు, కోరం మనోజ్ పాల్గొన్నారు.

1 hr ago
user_Timothy Pastor Gattipally
Timothy Pastor Gattipally
వాజేడు, ములుగు, తెలంగాణ•
1 hr ago
3fbea64b-ffe8-403b-8155-c5e8e6d712fb

-ఆశ్రమ బాలికల పాఠశాలల పైన దృష్టి పెట్టని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి.. -సమస్య లతో సతమతమవుతున్న గిరిజన విద్యార్థులు.. కోట్లాది రూపాయలు నిధులు గిరిజన సంక్షేమ శాఖ కు కేటాయించినట్టు లెక్కలు చూపే పాలక ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో సంక్షోభం తప్ప గిరిజన సంక్షేమం ఎక్కడ కానరాదు అని ఆదివాసీ నవనిర్మాణ సేన జిల్లా అధ్యక్షులు ఎట్టి విద్యాసాగర్ ఆరోపించారు. వాజేడు మండల పరిధిలోని పెద్ద గొల్లగూడెం ఆశ్రమ బాలికల పాఠశాలను ఆదివాసీ నవనిర్మాణ సేన జిల్లా ,మండల నాయకులు మంగళ వారం సందర్శించారు. ఈ సందర్బంగా పాఠశాల విద్యార్థులతో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకున్నారు.అనంతరం విద్యాసాగర్ మాట్లాడుతూ మండల పరిధిలోని పెద్ద గొల్లగూడెం ఆశ్రమ బాలికల పాఠశాలలో ఉన్న విద్యార్థులు సమస్యల వలయంలో కొట్టు మీట్టాడు తున్నారని అయన మండిపడ్డారు.గిరిజన పిల్లలు చదువుతున్న పాఠశాలలో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు లేరని విద్యార్థులు చదువు అరాకోరగ ఉందని ఆదివాసీ పిల్లలపై ఇంత చిన్న చూపు ఎందుకని మండిపడ్డారు.అలాగే మరుగుదొడ్లు, మంచినీరు కూడా సరిగా లేవన్నారు. పాఠశాల చుట్టూ పిచ్చిమొక్కలు అడవిలాగా అల్లుకొని ఉన్నాయంన్నారు. వర్కర్స్ కూడా ముగ్గురే ఉన్నారని విద్యార్థులకు రక్షణగా వాచ్ మెన్

2afd25da-2891-441d-a390-e55b4e288e7d

కూడా లేకపోవడంతో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గిరిజన విద్యార్థులు చదివే ఈ పాఠశాలకు సరైనా వసతులు పరిసరాల పరిశుభ్రత లేకపోవడం అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉందన్నారు. పాఠశాలలో ఆట స్థలం, ఆట వస్తువులు లేకపోవడం తో గిరిజన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఈ సమస్యలపై పలుమార్లు ఐటీడీ ఏ ప్రాజెక్ట్ అధికారికి , సంబంధిత అధికారులకు తెలియజేసిన సమస్యను పట్టించు కోకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. వందల కోట్ల రూపాయలు గిరిజన సంక్షేమానికి కేటాయిస్తున్నాం అని చెప్పే పాలక ప్రభుత్వం వాటిని ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. గిరిజన సంక్షేమ పాఠశాలల పైన పట్టింపు కరువు అవ్వడంతో విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నట్లు తెలియజేసారు. పెద్ద గొల్లగూడెం ఆశ్రమ బాలికల పాఠశాలకు ఉపాధ్యాయులను,వసతులు కల్పించే వరకు దశల వారి ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు వివరించారు. అవసరమైతే విద్యార్థులతో తల్లిదండ్రులతో భారీ ఎత్తున ఐటిడిఏ ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా సాగర్ హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో వాజేడు మండల ఆదివాసీ నవ నిర్మాణ సేన నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధి పాయం అజయ్, పీర్ల.రవిరాజు, కోరం మనోజ్ పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో పాడిపశులకు అడ్డాగా మారిన పల్లె ప్రకృతి వనం -------------------------------- యాంకర్: ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం పరిస్థితి దయనీయాంగామారింది. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నదే ఈ పథకం ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బండారుపల్లి గ్రామంలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రజలకు ఉపయోగపడాల్సిన పల్లె ప్రకృతి వనం పశువులకు అడ్డాగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఈ పల్లె ప్రకృతి వనం నిర్వహణను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తూన్నారు. ఈ పల్లె ప్రకృతి వనం ప్రస్తుతం పాడిపశువులకు మరియు మందుబాబులకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని గ్రామస్తులు తెలిపారు
    2
    ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో పాడిపశులకు అడ్డాగా మారిన పల్లె ప్రకృతి వనం 
--------------------------------
యాంకర్:
ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం పరిస్థితి దయనీయాంగామారింది. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నదే ఈ పథకం ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బండారుపల్లి గ్రామంలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రజలకు ఉపయోగపడాల్సిన పల్లె ప్రకృతి వనం పశువులకు అడ్డాగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఈ పల్లె ప్రకృతి వనం నిర్వహణను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తూన్నారు. ఈ పల్లె ప్రకృతి వనం ప్రస్తుతం పాడిపశువులకు మరియు మందుబాబులకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని గ్రామస్తులు తెలిపారు
    user_Sai tej
    Sai tej
    Local News Reporter ములుగు, ములుగు, తెలంగాణ•
    12 hrs ago
  • నాయి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి................. MLG: ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జంపాల రవీందర్ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. జిల్లా రెండో మహాసభ సందర్భంగా నాయి బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్షౌరవృత్తిలోకి ఇతర కులాల రాకను నిరోధించాలని, దేవాలయాలు, జాతరల్లో తలనీలాల ఆదాయంలో వృత్తిదారులకు వాటా కల్పించాలని డిమాండ్ చేశారు.
    1
    నాయి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి.................
MLG: ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జంపాల రవీందర్ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. జిల్లా రెండో మహాసభ సందర్భంగా నాయి బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్షౌరవృత్తిలోకి ఇతర కులాల రాకను నిరోధించాలని, దేవాలయాలు, జాతరల్లో తలనీలాల ఆదాయంలో వృత్తిదారులకు వాటా కల్పించాలని డిమాండ్ చేశారు.
    user_Karunya
    Karunya
    ములుగు, ములుగు, తెలంగాణ•
    12 hrs ago
  • రైతులకు ఇకపై సులభతరంగా డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు........ రైతులకు పొలాల్లో పంటలపై మందుల పిచికారీని మరింత సులభతరం చేసేందుకు మన అగ్రిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో సమర్థవంతమైన డ్రోన్ స్ప్రేయింగ్ అందుబాటులోకి వచ్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రే చేసుకోవడంతో రైతుల సమయం, శ్రమ ఆదా అవుతాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. డ్రోన్ స్ప్రేయింగ్ బుకింగ్ కోసం 8977495065 నంబర్‌ను సంప్రదించవచ్చు అని అన్నారు.
    1
    రైతులకు ఇకపై సులభతరంగా డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు........
రైతులకు పొలాల్లో పంటలపై మందుల పిచికారీని మరింత సులభతరం చేసేందుకు మన అగ్రిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో సమర్థవంతమైన డ్రోన్ స్ప్రేయింగ్  అందుబాటులోకి వచ్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రే చేసుకోవడంతో రైతుల సమయం, శ్రమ ఆదా అవుతాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
డ్రోన్ స్ప్రేయింగ్ బుకింగ్ కోసం 8977495065 నంబర్‌ను సంప్రదించవచ్చు అని అన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • ఇన్స్టా లవ్... ఆపై పెద్దలను ఒప్పించి పెళ్లి...భార్యను చూసి భర్త షాక్...!! గుజరాత్ లో ఓ యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో సుమారు 10 నెలల పాటు ఫోన్‌లోనే వారి రొమాన్స్ సాగింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి ఆ నవవధువు భర్తకు ఎప్పుడూ దూరంగానే ఉంటూ వచ్చింది. ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వధువు ముఖంపై ఉన్న ముసుగు తొలగించి అసలు నిజం బయటపెట్టడంతో ఖాకీలు సైతం అవాక్కయ్యారు. ముసుగు వెనుక ఉన్నది వధువు కాదని, స్వయంగా ఓ అబ్బాయని పెళ్లి కోసం ఈ వేషధారణ వేసినట్లు తేలింది. ఈ వింత ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
    1
    ఇన్స్టా లవ్... ఆపై పెద్దలను ఒప్పించి పెళ్లి...భార్యను చూసి భర్త షాక్...!!
గుజరాత్ లో ఓ యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో సుమారు 10 నెలల పాటు ఫోన్‌లోనే వారి  రొమాన్స్ సాగింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.
అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి ఆ నవవధువు భర్తకు ఎప్పుడూ దూరంగానే ఉంటూ వచ్చింది. ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వధువు ముఖంపై ఉన్న ముసుగు తొలగించి అసలు నిజం బయటపెట్టడంతో ఖాకీలు సైతం అవాక్కయ్యారు. ముసుగు వెనుక ఉన్నది వధువు కాదని, స్వయంగా ఓ అబ్బాయని పెళ్లి కోసం ఈ వేషధారణ వేసినట్లు తేలింది. ఈ వింత ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    6 hrs ago
  • భద్రాచలం: గరుడ ఆకారంలో గణనాథుడు.. ఆకట్టుకుంటున్న అలంకరణ భద్రాచలం బస్టాండ్ ఎదురుగా అశోక్‌నగర్ కాలనీలో గరుడ పక్షి ఆకారంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రంగురంగుల లైట్లతో ప్రత్యేక డెకరేషన్‌ చేసి మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ‘భద్రాద్రి కా మహారాజ్’ పేరుతో మూడో ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. విగ్రహం, డెకరేషన్‌కు సుమారు రూ.14 లక్షలు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు
    1
    భద్రాచలం: గరుడ ఆకారంలో గణనాథుడు.. ఆకట్టుకుంటున్న అలంకరణ
భద్రాచలం బస్టాండ్ ఎదురుగా అశోక్‌నగర్ కాలనీలో గరుడ పక్షి ఆకారంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రంగురంగుల లైట్లతో ప్రత్యేక డెకరేషన్‌ చేసి మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ‘భద్రాద్రి కా మహారాజ్’ పేరుతో మూడో ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. విగ్రహం, డెకరేషన్‌కు సుమారు రూ.14 లక్షలు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు
    user_JAI TEJ
    JAI TEJ
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    10 hrs ago
  • ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ *మామిడి మొక్కల నర్సరీతో ఉపాధి బాట.. భరద్వాజ రాంబాబు విజయగాథ** మామిడి సాగులో నాణ్యమైన మొక్కే.. మంచి దిగుబడికి తొలి అడుగు. ఈ సూత్రాన్ని నమ్మిన ఓ రైతు.. కేవలం ఒక ఎకరంతో ప్రారంభించిన మామిడి నర్సరీని నేడు ఏకంగా 30 ఎకరాలకు విస్తరించారు. నాణ్యమైన మామిడి అంటుమొక్కలను తయారు చేస్తూ.. వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన భరద్వాజ రాంబాబు.. సాగులోనే కాదు.. నర్సరీ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నర్సరీలో మొక్కల తయారీ.. అంటుకట్టే విధానం.. మార్కెట్ డిమాండ్.. రైతులకు అందిస్తున్న సేవలు మామిడి నర్సరీలో మొక్క తయారీ ప్రక్రియ ఎంతో జాగ్రత్తగా సాగుతుంది. ముందుగా నాణ్యమైన మామిడి టెంకలను సేకరించి.. వాటితో నారు పెంచుతారు. మొలకెత్తిన మొక్కలను ప్రత్యేక బ్యాగుల్లోకి మార్చి.. సుమారు రెండున్నర నెలల పాటు పెంచుతారు. అనంతరం అంటుకట్టేందుకు మొక్కలను సిద్ధం చేస్తారు. మంచి దిగుబడినిచ్చే మామిడి చెట్ల నుంచి సయాన్ స్టిక్స్‌ను సేకరించి.. స్పాట్ కటింగ్ పద్ధతిలో అంటుకడతారు. అనుభవజ్ఞులైన గ్రాఫ్టర్లు అత్యంత నైపుణ్యంతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒక్కో గ్రాఫ్టర్ రోజుకు సుమారు 400 నుంచి 700 మొక్కలకు అంటుకట్టే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. అంటుకట్టిన మొక్కల్లో సుమారు 12 రోజులకు చిగుర్లు రావడం ప్రారంభమవుతుంది. సరైన సంరక్షణతో ఏడాది కాలంలో మొక్కలు ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. మొక్క నాణ్యత.. రకం.. పెరుగుదలను బట్టి ఒక్కో అంటుమొక్కను రూ.120 నుంచి రూ.130 వరకు విక్రయిస్తున్నారు. 1989లో కేవలం ఒక ఎకరంతో ప్రారంభమైన అవీవ్ నర్సరీ.. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ నేడు 30 ఎకరాలకు విస్తరించింది. నర్సరీలో ప్రతిరోజూ సుమారు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో స్థానికంగా పెద్ద సంఖ్యలో కుటుంబాలకు నిరంతర ఉపాధి లభిస్తోంది.
    1
    ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ

ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ
*మామిడి మొక్కల నర్సరీతో ఉపాధి బాట.. భరద్వాజ రాంబాబు విజయగాథ**
మామిడి సాగులో నాణ్యమైన మొక్కే.. మంచి దిగుబడికి తొలి అడుగు. ఈ సూత్రాన్ని నమ్మిన ఓ రైతు.. కేవలం ఒక ఎకరంతో ప్రారంభించిన మామిడి నర్సరీని నేడు ఏకంగా 30 ఎకరాలకు విస్తరించారు. నాణ్యమైన మామిడి అంటుమొక్కలను తయారు చేస్తూ.. వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన భరద్వాజ రాంబాబు.. సాగులోనే కాదు.. నర్సరీ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నర్సరీలో మొక్కల తయారీ.. అంటుకట్టే విధానం.. మార్కెట్ డిమాండ్.. రైతులకు అందిస్తున్న సేవలు 
మామిడి నర్సరీలో మొక్క తయారీ ప్రక్రియ ఎంతో జాగ్రత్తగా సాగుతుంది. ముందుగా నాణ్యమైన మామిడి టెంకలను సేకరించి.. వాటితో నారు పెంచుతారు. మొలకెత్తిన మొక్కలను ప్రత్యేక బ్యాగుల్లోకి మార్చి.. సుమారు రెండున్నర నెలల పాటు పెంచుతారు. అనంతరం అంటుకట్టేందుకు మొక్కలను సిద్ధం చేస్తారు.
మంచి దిగుబడినిచ్చే మామిడి చెట్ల నుంచి సయాన్ స్టిక్స్‌ను సేకరించి.. స్పాట్ కటింగ్ పద్ధతిలో అంటుకడతారు. అనుభవజ్ఞులైన గ్రాఫ్టర్లు అత్యంత నైపుణ్యంతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒక్కో గ్రాఫ్టర్ రోజుకు సుమారు 400 నుంచి 700 మొక్కలకు అంటుకట్టే ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
అంటుకట్టిన మొక్కల్లో సుమారు 12 రోజులకు చిగుర్లు రావడం ప్రారంభమవుతుంది. సరైన సంరక్షణతో ఏడాది కాలంలో మొక్కలు ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. మొక్క నాణ్యత.. రకం.. పెరుగుదలను బట్టి ఒక్కో అంటుమొక్కను రూ.120 నుంచి రూ.130 వరకు విక్రయిస్తున్నారు.
1989లో కేవలం ఒక ఎకరంతో ప్రారంభమైన అవీవ్ నర్సరీ.. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ నేడు 30 ఎకరాలకు విస్తరించింది. నర్సరీలో ప్రతిరోజూ సుమారు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో స్థానికంగా పెద్ద సంఖ్యలో కుటుంబాలకు నిరంతర ఉపాధి లభిస్తోంది.
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    Local News Reporter ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    16 hrs ago
  • గిర్నిబావి: ఎంజేపీ గురుకుల పాఠశాలలో రెండో రోజు గణపతి పూజ కార్యక్రమం... గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు చేసి గణపతి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
    1
    గిర్నిబావి: ఎంజేపీ గురుకుల పాఠశాలలో రెండో రోజు గణపతి పూజ కార్యక్రమం...
గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు చేసి గణపతి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • హైదరాబాద్‌లో దారునా హత్యా సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గోదావ *లైవ్ మర్డర్ వీడియో..!* హైదరాబాద్‌లో ఇదీ లా అండ్ ఆర్డర్ దుస్థితి హత్యతో నగరంలో భయాందోళనలు ఇద్దరు రౌడీషీటర్ల మధ్య నెలకొన్న వివాదం కారణంగానే హత్య ప్రాణ స్నేహితుడినే దారుణంగా హత్య నాగోల్ బండ్లగూడలో పాత కక్షల నేపథ్యంలోనే మహమ్మద్ నహీమ్‌ను దారుణంగా హత్య చేసిన మహేష్ హైదరాబాద్‌ - నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌ నగర్‌ చౌరస్తా సమీపంలో ఖమ్మం ఇల్లెందుకి చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ దారుణ హత్య ఇల్లందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు బండ్లగూడ సహభావన అపార్ట్‌మెంట్లో నివాసముంటున్న మహమ్మద్ నహీమ్ సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా వీరిద్దరి మధ్య ఘర్షన ముఠా కక్షలే హత్యకు కారణంగా గుర్తింపు ఇద్దరిపైనా ఇప్పటికే పలు హత్య కేసులు, ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్లు నిందితులు మహేష్ అండ్ టీం కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్న నాగోల్ పోలీసులు
    1
    హైదరాబాద్‌లో దారునా హత్యా  సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో  గోదావ
*లైవ్ మర్డర్ వీడియో..!* 
హైదరాబాద్‌లో ఇదీ లా అండ్ ఆర్డర్ దుస్థితి
హత్యతో నగరంలో భయాందోళనలు
ఇద్దరు రౌడీషీటర్ల మధ్య నెలకొన్న వివాదం కారణంగానే హత్య
ప్రాణ స్నేహితుడినే దారుణంగా హత్య
నాగోల్ బండ్లగూడలో పాత కక్షల నేపథ్యంలోనే మహమ్మద్ నహీమ్‌ను దారుణంగా హత్య చేసిన మహేష్
హైదరాబాద్‌ - నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌ నగర్‌ చౌరస్తా సమీపంలో ఖమ్మం ఇల్లెందుకి చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ దారుణ హత్య
ఇల్లందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు
బండ్లగూడ సహభావన అపార్ట్‌మెంట్లో నివాసముంటున్న మహమ్మద్ నహీమ్
సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా వీరిద్దరి మధ్య ఘర్షన ముఠా కక్షలే హత్యకు కారణంగా గుర్తింపు
ఇద్దరిపైనా ఇప్పటికే పలు హత్య కేసులు, ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్లు
నిందితులు మహేష్ అండ్ టీం కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్న నాగోల్ పోలీసులు
    user_Prabhakarrao s
    Prabhakarrao s
    Insurance Agent బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.