Shuru
Apke Nagar Ki App…
రేపు జరగనున్న గౌరవ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ Satya Kumar Y గారి జన్మదిన కార్యక్రమాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లు, భద్రతా చర్యలను DSP జగన్నాథ్ రావు గారు మరియు మంత్రి గారి నియోజకవర్గ ఇంచార్జ్ Harish Babu గారు పరిశీలించారు. కార్యక్రమానికి విచ్చేయనున్న అభిమానులు, కార్యకర్తలు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బోజన వసతి,భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వసతులు తదితర అంశాలపై అధికారులతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
పీవీ శివకుమార్
రేపు జరగనున్న గౌరవ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ Satya Kumar Y గారి జన్మదిన కార్యక్రమాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లు, భద్రతా చర్యలను DSP జగన్నాథ్ రావు గారు మరియు మంత్రి గారి నియోజకవర్గ ఇంచార్జ్ Harish Babu గారు పరిశీలించారు. కార్యక్రమానికి విచ్చేయనున్న అభిమానులు, కార్యకర్తలు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బోజన వసతి,భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వసతులు తదితర అంశాలపై అధికారులతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- వినాయక చవితి వేళ పుంగనూరులో వర్షం పుంగనూరు మండలం, అన్నమయ్య జిల్లా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా పుంగనూరులో వర్షం కురవడంతో ప్రజల్లో ఆనందం నెలకొంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా, సాయంత్రం వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. వినాయకుడి పండుగ వేళ వర్షం కురవడం శుభసూచకంగా భావిస్తూ భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షంతో పుంగనూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. వినాయక చవితి వేళ పుంగనూరులో వర్షం పుంగనూరు మండలం, అన్నమయ్య జిల్లా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా పుంగనూరులో వర్షం కురవడంతో ప్రజల్లో ఆనందం నెలకొంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా, సాయంత్రం వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. వినాయకుడి పండుగ వేళ వర్షం కురవడం శుభసూచకంగా భావిస్తూ భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షంతో పుంగనూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.1
- పుంగనూరులో ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పుంగనూరు, అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో ఈరోజు ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు, గుండె పరీక్షలు, కంటి పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రజల ఆరోగ్యమే మా ట్రస్ట్ లక్ష్యమని, ఇలాంటి ఉచిత శిబిరాలను ప్రతి నెలా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధు ల్యాబ్ టెక్నీషియన్ ఝాన్సీ రాణి, ఫార్మాసిస్ట్ స్రవంతి, బాల గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేసి, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.3
- రాయదుర్గంలో అందర్నీ ఆకట్టుకున్న స్కూలుకు వెళ్తున్న గణనాథుడి ప్రతిమ రాయదుర్గం పట్టణంలో నిన్నటి దినం వివిధ ఆకృతులలో గణనాథులు కొలువు తీరాయి. అందులో భాగంగానే రైల్వే స్టేషన్ సమీపాన వరసిద్ధి వినాయక గ్రూప్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక గణనాథుడు అందరినీ ఆకట్టుకున్నాడు. వీపుకి బ్యాగు తగిలించుకొని, యూనిఫామ్ దుస్తులు ధరించి చేతిలో వాటర్ బాటిల్ ధరించిన గణనాథుడు అందరిని ఆకట్టుకున్నారు. ప్రతి ఏటా ఏదో ఒక ప్రత్యేక విధానంలో గణనాథులను వరసిద్ధి వినాయక సంఘం సభ్యులు గణనాధులను కొలువు తీరుస్తున్నారు.1
- ఆర్టీసీ బస్టాండ్ వినాయక ఆలయంలో వైభవంగా చవితి ఉత్సవాలు. బద్వేలు, సెప్టెంబర్ 15: ఆర్టీసీ బస్టాండ్ వద్ద వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ ఆవరణంలో వినాయక చవితి ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. వినాయకుని ఊరేగింపు, అనంతరం శ్రీకృష్ణ కోలాటం మాస్టర్ వెంకీ బృందం ఆధ్వర్యంలో కోలాటం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.1
- పుంగనూరు లో భారీగా గణనాధుడిని కొలువుదిచారు సోమవారం పండితులు పూజలు చేశారు పుంగనూరు లో భారీగా గణనాధుడిని కొలువుదిచారు సోమవారం పండితులు పూజలు చేశారు1
- వేపచీరల తో మొక్కులు తీర్చుకున్న భక్తులు..ఘనంగా ప్రారంభం అయిన వేడుకలు రాయదుర్గం పట్టణం మధు సినిమా థియేటర్ సమీపాన వెలసిన మహిమాన్విత దుగ్గిలమ్మ జాతర వేడుకలు వైభవంగా ప్రారంభం అయ్యాయి.ఉదయం నాలుగు గంటల నుండే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు.వేపాచీరలతో భక్తులు పెద్ద ఎత్తున వారి వారి మొక్కులను తీర్చుకున్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అర్బన్ సీఐ దేవానంద్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చింది.1
- పుంగనూరు లో వాన, తొలకరి చినుకులు పడగానే మురిసి పోయిన భూమాత.. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావం తాండవిస్తున్న సమయంలో ఈరోజు సాయంత్రం తొలకరి చినుకులు భూమిని ప్రేమతో ముద్దాడినట్టు వర్షం కురిసింది అప్పటివరకు వేడిమికి తట్టుకోలేక ఉన్న ప్రజలు ఒక్కసారిగా వర్షం పడటంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది కొన్ని నెలల నుంచి వర్షం పడక పచ్చని పొలాలు ఎండిపోయి బీడు భూములుగా మారిపోవడంతో రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు కురిసిన వర్షానికి రైతులకు కూడా కాస్త ఊరటనిచ్చింది.1
- చౌడేపల్లి మండలం – ఏ.కొత్తకోట వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏ.కొత్తకోటలోని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. నా వార్తను మరింత ఆకర్షణీయంగా రాయండి ఆలయ పూజా వివరాలను స్పష్టంగా విస్తరించండి చౌడేపల్లి మండలం – ఏ.కొత్తకోట వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏ.కొత్తకోటలోని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. నా వార్తను మరింత ఆకర్షణీయంగా రాయండి ఆలయ పూజా వివరాలను స్పష్టంగా విస్తరించండి1
- *సెల్ఫీ వీడియో కలకలం* *గడ్డి మందు తాగుతూ..* *వేధింపులు తట్టుకోలేక మీడియా ప్రతినిధి ఆత్మహత్యాయత్నం* *కుటుంబ సభ్యుల ఫిర్యాదు* *బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీని ఆశ్రయించిన కుటుంబం* పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఓ మీడియా ప్రతినిధి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రైమ్9 న్యూస్ రిపోర్టర్ పోలిశెట్టి సత్యనారాయణ (చంటి) గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చుట్టుపక్కల రైతులు గమనించి ఆయనను తొలుత నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆక్వా సాగులో నష్టాల కారణంగా అప్పులపాలైన సత్యనారాయణ, అనంతరం అప్పులు తీర్చినప్పటికీ కొందరు వడ్డీ వ్యాపారులతో కలిసి సహచర మీడియా ప్రతినిధులు తనను వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రెస్‌మీట్లకు వెళ్లిన సందర్భాల్లో అవమానాలకు గురిచేశారని, సత్యనారాయణను పిలిస్తే తాము ప్రెస్‌మీట్లకు రామని కొందరు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సత్యనారాయణ భార్య, పిల్లలు, అన్న సుబ్రహ్మణ్యం నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి సత్యనారాయణే ప్రధాన ఆధారమని, ఆయనకు ఏదైనా జరిగితే కుటుంబం రోడ్డున పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై టీవీ 9 మారుతి, టీవీ 5 సందీప్, ఐ న్యూస్ రాజేష్, సాక్షి పత్రిక కేతినేడి రంగపై కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని కోరుతూ...ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డీఎస్పీని కోరారు.3