Shuru
Apke Nagar Ki App…
ఎంబీబీఎస్ సీటు సాధించిన నవ్యశ్రీకి ఘనంగా సన్మానం అమ్మ నాన్న ఫౌండేషన్ చైర్మన్ ఆంజనేయులు లోకేశ్వరం: బాగాపూర్ గ్రామానికి చెందిన అర్ష ఇందిర–సాయన్న దంపతుల కుమార్తె అర్ష నవ్యశ్రీ ప్రభుత్వ పాఠశాలలో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఈ సందర్భంగా మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆమెను ఘనంగా సన్మానించారు. ఫౌండేషన్ చైర్మన్ యం. ఆంజనేయులు, విజయ డెయిరీ ఫీల్డ్ సూపర్‌వైజర్ దండే రమేష్ శాలువాతో సత్కరించారు. నవ్యశ్రీ భవిష్యత్తులో పేదలకు వైద్య సేవలందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇంద్రకరణ్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, భోజన్న తదితరులు పాల్గొన్నారు.
Choutolla Mohan
ఎంబీబీఎస్ సీటు సాధించిన నవ్యశ్రీకి ఘనంగా సన్మానం అమ్మ నాన్న ఫౌండేషన్ చైర్మన్ ఆంజనేయులు లోకేశ్వరం: బాగాపూర్ గ్రామానికి చెందిన అర్ష ఇందిర–సాయన్న దంపతుల కుమార్తె అర్ష నవ్యశ్రీ ప్రభుత్వ పాఠశాలలో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఈ సందర్భంగా మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆమెను ఘనంగా సన్మానించారు. ఫౌండేషన్ చైర్మన్ యం. ఆంజనేయులు, విజయ డెయిరీ ఫీల్డ్ సూపర్‌వైజర్ దండే రమేష్ శాలువాతో సత్కరించారు. నవ్యశ్రీ భవిష్యత్తులో పేదలకు వైద్య సేవలందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇంద్రకరణ్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, భోజన్న తదితరులు పాల్గొన్నారు.
More news from Telangana and nearby areas
- *కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చేసే ఆందోళన - పోరాటాలపై పెడుతున్న ఆంక్షలు-నిర్భంధాల ఖండిస్తున్నాం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు సామూహిక నిరసన దీక్షలు సందర్భంగా బొమ్మెనసురేష్ CITU జిల్లా ప్రధాన కార్యదర్శి*మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్మిక వర్గానికి అనేక హమీలు ఇచ్చి అమలు చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినప్పటికీ, కార్మిక వర్గానికి ఇచ్చిన హమీల అమలు పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. దీనితో కార్మిక వర్గం తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన -పోరాటాలు చేస్తుంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాటు వివిధ జిల్లాల్లో తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కనీసం ధర్నా చేసుకునేందుకు కూడా అనుమతిని నిరాకరిస్తున్నారు. ఇది సబబు కాదు, 2026 సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన అంగన్వాడీ, ఆశా రెండు సంఘాల "ఛలో హైదరాబాద్" పిలుపులను భగ్నం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ పడరాని పాట్లు పడింది. వివిధ జిల్లాల్లో నాయకులను ఇండ్ల వద్దే ముందు రోజు రాత్రే అరెస్టులు చేశారు. సిఐటియు రాష్ట్ర నాయకులను సైతం తెల్లవారిఝూము నుండే వేటాడారు, వందలాది మంది పోలీసులు తమ బలగాలతో వచ్చి అక్రమ ముందస్తు అరెస్ట్లకు పాల్పడుతున్నారు. పోలీసుల ఈ చర్యల మూలంగా ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా పనిచేస్తున్న సిఐటియు నాయకులను సంఘ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించడమే. రాష్ట్రంలో కొనసాగుతున్న నిర్భంధం, అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ సెప్టెంబర్ 16 జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరసన దీక్షలు చేయాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ముందు సామూహిక దీక్షలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో, *సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు క్లైమెంటు వెస్లీ,ఆశా వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు, పి సుజాత, జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రకళ సుగుణ, విజయ,నంద ఇంద్రమాల, మౌనిక, కోశాధికారి లక్ష్మి, అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షులు B.లలిత, జిల్లా ఉపాధ్యక్షులు కవిత, భాగ్య,కళ గంగామణి, వనజ,లావణ్య, మద్దతుగా, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తొడసo.శంభు* తదితరులు పాల్గొన్నారు,1
- ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన సర్పంచ్ వెంకటేష్ గౌడ్... నిర్మల్ జిల్లా // బాసర గుడిసె లేని బాసర నా కల.. ఆ కలను నిజం చేసే బాధ్యత నాది... సొంతింటి కలను కాంగ్రెస్ నిజం చేస్తుంది.. విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం : సర్పంచ్ వెంకటేష్ గౌడ్.... బాసర లోని గ్రామ పంచాయతీ భవనం లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించిన సర్పంచ్ వెంకటేష్ గౌడ్, స్థానిక నాయకులు..... ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఆందోళన చెందవద్దు...: *సర్పంచ్ వెంకటేష్ గౌడ్* పాల్గొన్న ఈవో ప్రసాద్ గౌడ్.. ఉపసర్పంచ్ సయ్యద్ అలీ, వార్డ్ మెంబర్ లు కృష్ణ, ఫసి, అన్నెల లక్ష్మణ్, ఏజాస్, సాయిలు, ఫారుక్, అశోక్, నాయకులు షానవాజ్...1
- శ్రీగిరి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి పాల కావడి సమర్పించిన భక్తులు.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పాల కావడి సేవ, పల్లకి సేవ, హారతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నయ్య గురుస్వామి మాట్లాడుతూ.. పాల కావడి స్వామివారికి సమర్పించడంతో ఆరోగ్యం బాగుంటుందని అదేవిధంగా వివాహలు, సంతానం లేని వారికి వారి కోరికలు నెరవేరుతాయని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.1
- నిర్మల్ జిల్ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం ముధోల్ కేజీబీవీను (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మల్ జిల్లా: *విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం ముధోల్ కేజీబీవీను (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బందికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు అన్ని పూటల మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతి పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని తరగతులకు సంబంధించిన సిలబస్ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలన్నారు. ప్రతిరోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో తరగతులకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. పదవ తరగతి విద్యార్థుల బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం వారిని సిద్ధం చేయాలన్నారు. పదవ తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడి, ఇప్పటివరకు పూర్తయిన సిలబస్, రోజువారిగా అందిస్తున్న భోజనం, వసతి, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గణితం సబ్జెక్టుకు సంబంధించి పలు లెక్కలను బోర్డుపై విద్యార్థులతో చేయించి, లెక్కలు చేసిన విద్యార్థులను అభినందించి, పెన్నులను బహుమతులుగా ఇచ్చారు. బోర్డు పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు. ఏ సబ్జెక్టులో అయినా ఎటువంటి సందేహాలు ఉన్న వెంటనే సంబంధిత ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమీపంలో నిర్మాణం చివరి దశకు చేరుకున్న పాఠశాల భవంతిని కలెక్టర్ పరిశీలించారు. మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి భవనాన్ని వినియోగానికి తేవాలని తెలిపారు. ఈ తనిఖీలో డీఈవో భోజన్న, తహసిల్దార్ శ్రీలత, ఎంపీడీవో లవ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.2
- 34 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో ఉన్న సీనియర్ మహిళా నేత లొంగుబాటు నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన సీపీఐ మావోయిస్టు పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు నిక్కా శశీల అలియాస్ రాజి పోలీసుల ఎదుట లొంగిపోయారు. 57 ఏళ్ల నిక్కా శశీల 1992లో పీపుల్స్ వార్‌లో చేరి.. 34 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. డివిజన్ కమిటీ సభ్యురాలిగా పనిచేసిన ఆమె.. అనారోగ్య సమస్యల కారణంగా మావోయిస్టు పార్టీని వీడి సాధారణ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. లొంగిపోయిన శశీలకు ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల చెక్‌తో పాటు 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మిగిలిన మావోయిస్టు కేడర్లు కూడా హింసా మార్గాన్ని వీడి లొంగిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.1
- *రిమ్స్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆకస్మిక సందర్శన* *రిమ్స్ లో అందజేస్తున్న మధ్యాహ్న భోజన పరిశీలన* *నాణ్యమైన వైద్యంతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలి* *రిమ్స్ డైరెక్టర్ కు అనిల్ జాదవ్ పలు సూచనలు* *ఆదిలాబాద్ పట్టణంలో గల రిమ్స్ ఆసుపత్రిని బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో అందజేస్తున్న వైద్యంతో పాటు ఆహారాన్ని పరిశీలించారు. స్థానిక రోగుల సహాయకులతో మాట్లాడుతూ ఆహార నాణ్యత గురించి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గుడిహత్నూర్ మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన పైటనే విట్ఠల్ గారిని పరామర్శించి వారి ఆరోగ్య బాగోగులు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన వైద్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ జేసింగ్ రాథోడ్ ను ఆదేశించారు. వీరి వెంట తిరుమల గౌడ్, రవి నాయక్, రాథోడ్ భీంరావ్, దేవేందర్ రెడ్డి, భూమన్న, సుజీల్ తదితరులు ఉన్నారు*3
- రిమ్స్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన బోథ్ MLA అనిల్ జాదవ్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని బోథ్ MLA అనిల్ జాదవ్ బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులను కలిసి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఆదేశించారు.3
- వాడవాడలా కొలువు తీరిన గణనాథులు.. భక్తుల ప్రత్యేక పూజలు.. నిర్మల్ పట్టణంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది. వాడవాడలా చిన్న పెద్ద అంతా కలిసి భారీ గణనాథులను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మండపాలను విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. అనంతరం భక్తులు వినాయకునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ప్రజలందరూ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.1