*ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శనగల కొనుగోళ్లు ప్రారంభం* - 15 రోజుల లోపు రైతులకు నగదు చెల్లింపులు - వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి *అమరావతి, ఫిబ్రవరి 17:* రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయం & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ అనుమతితో రబి సీజన్ 2025-26 లో పండించిన శనగలను NAFED, NCCFల ద్వారా 94,500 మెట్రిక్ టన్నుల శెనగల కొనుగోళ్లకు ధర మద్దతు పథకం (PSS) అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుండి మంగళవారం ఆదేశాలు అందాయని, నేటి నుంచి CM APP ద్వారా అన్ని జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఉన్న DLPCలు కొనుగోళ్లను పర్యవేక్షిస్తాయని, అవసరమైన మార్గదర్శకాలను ఇప్పటికే జారీ చేసినట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, లీగల్ మెట్రాలజీ, మార్కెటింగ్, ఏపీ మార్క్‌ఫెడ్, సివిల్ సప్లైస్ తదితర శాఖల సమన్వయంతో రైతు సేవా కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతాయని తెలిపారు. PACS, FPOలు, స్వయం సహాయక సంఘాలు వంటి విశ్వసనీయ ఉప-ఏజెన్సీలను రంగంలోకి దింపి పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సీజన్‌లో సుమారు 3.25 లక్షల హెక్టార్లలో శనగల సాగు జరిగిందని, దాదాపు 3.77 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉన్నట్లు మంత్రి వివరించారు. రైతులు తమ ఉత్పత్తిని సమీప RSKలలో నమోదు చేసుకోవాలని, CM APP ద్వారా షెడ్యూల్ ప్రకారం కొనుగోళ్లు చేపడతామని తెలిపారు. కొనుగోలు చేసిన శనగలను CWC/SWC గోదాముల్లో నిల్వ చేస్తామని, రైతులకు చెల్లింపులు 15 రోజుల లోపు నేరుగా అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. *జారీ చేసిన వారు: పిఆర్వో - వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రివర్యుల కార్యాలయం*

- *TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పం కొలువుదీరింది.* కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఒక అభిమాని ఈ అద్భుత శిల్పాన్ని రూపొందించారు. గులాబీ రంగులో మెరుస్తున్న ఈ కళాఖండం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ అభివృద్ధిలో ఆయన పాత్రను స్మరిస్తూ రూపొందించిన ఈ సైకత చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.1
- గుంటూరు కోదండ రామయ్య నగర్ 4వ లైన్ మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై మంగళవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా మెటల్ రోడ్డుపై తేలిన రాళ్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్న మున్సిపల్ అధికారులు, ఇక్కడ మాత్రం బడ్జెట్ లేదంటూ కాలయాపన చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు1
- బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా *ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,* జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- మచిలీపట్నం పోతేపల్లి గ్రామంలో జిల్లా కోర్టు ఉద్యోగి అర్జా లక్ష్మీ ఇంట్లో గ్యాస్ లీకేజ్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.7 లక్షల నష్టం వాటిల్లగా కుటుంబం ప్రాణాలతో బయటపడింది. బాధితులకు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ నిత్యావసర వస్తువులు, బియ్యం, బట్టలు, వంట సామాగ్రి, రూ.5,000 నగదు అందజేశారు. ప్రభుత్వం అగ్ని బాధితులకు పక్కా ఇల్లు, ఆర్థిక సాయం కల్పించాలని ఆయన కోరారు.1
- Post by ఉంగరాల కార్తీక్1
- బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్లో రోడ్డుకి ప్రక్కల ఆక్రమించి వ్యాపారాలు పెట్టుకున్న వారి ఆక్రమణలను మంత్రి కోమటిరెడ్డి తెల్లవారుజామున సిబ్బందితో కలిసి తొలగించారు. ఫుట్పాత్ ద్వారా ట్రాఫిక్ సమస్య ఉందని వెంటనే తొలగించేశారు.1
- బిస్మిల్లా హోటల్ లక్ష్మీపురం ఫుడ్ కమిషనర్ రైడ్ చేసిన హోటల్ ఈరోజు ఫుల్ రష్ గా సాగుతోంది హోటల్ సీజ్ చేయలేదా మరి ఆరోజు అంత హడావుడి చేశారు పబ్లిసిటీ కోసమా కమిషనర్ గారు సమాధానం చెప్పాలి1