సమాజంలో ప్రతి వృత్తికి ఒక విలువ ఉంటుంది. డాక్టర్ ప్రాణాన్ని కాపాడితే డబ్బులు తీసుకుంటాడు, ఇంజనీర్ ప్లాన్ వేస్తే ఫీజు అడుగుతాడు, ఒక కార్మికుడు కష్టపడితే కూలి అడుగుతాడు. వీరందరినీ గౌరవించే ఈ సమాజం, ఒక్క న్యాయవాది (లాయర్) విషయంలో మాత్రం వింత ధోరణిని ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా స్నేహితుల మధ్య ఒక లాయర్ పడే ఆవేదన వర్ణనాతీతం.ఉచితంగా ఇస్తేనే స్నేహం.. ఫీజు అడిగితే కమర్షియల్'? పూర్వపు స్నేహితుల మధ్య జరిగిన ఒక యదార్థ ఉదంతాన్ని పరిశీలిస్తే ఈ వివక్ష అర్థమవుతుంది. ఆ బ్యాచ్‌లోని ఒక లాయర్, తన స్నేహితులకు కష్టం వస్తే అర్ధరాత్రి కూడా పోలీస్ స్టేషన్లకు వెళ్లాడు. స్నేహితులకే కాకుండా వారు పంపిన పరిచయస్తులకు కూడా ఉచితంగా న్యాయ సలహాలు ఇచ్చాడు, కేసులు వాదించాడు. ఆస్తులకు సంబంధించి కేసులు వాదించాడు ఆస్తులు ఇప్పించాడు ఒక రూపాయి ఫీజు కూడా వారు ఇవ్వలేదు సలహా ఇవ్వడానికి ఖర్చవుతుందా? నా స్నేహితులే కదా అనే భావనతో వారందరికీ సహాయం చేస్తూ వచ్చాడు.కానీ కాలక్రమేణా అతనికి ఒక చేదు నిజం అర్థమైంది. అదే స్నేహితుల్లో ఒకరు కార్పెంటర్ అయితే పని చేసి మార్కెట్ రేటు కంటే ఎక్కువే తీసుకున్నాడు. ఎలక్ట్రీషియన్ గంట పనికి రోజు కూలి అడిగాడు. స్నేహితుడైన డాక్టర్ కూడా 'ఓపి' ఫీజు దగ్గర నుండి చికిత్స వరకు ప్రతి పైసా వసూలు చేశాడు. అక్కడ ఎవరికీ స్నేహం అడ్డం రాలేదు, అది వారి వృత్తిగా అందరూ గుర్తించారు.కానీ ఆ లాయర్ తన కుటుంబాన్ని పోషించు కోవడానికి, తన వృత్తికి విలువ ఇస్తూ నామమాత్రపు ఫీజు అడగడం మొదలు పెట్టగానే.. అదే స్నేహితుల బ్యాచ్ అతనికి 'కమర్షియల్' అనే ముద్ర వేసింది.చాలా మంది దృష్టిలో లాయర్‌కు ఖర్చు ఏముంది? కేవలం మాటలతోనే కదా పని అయిపోయేది అనే అపోహ ఉంది. కానీ వారు గమనించని నిజాలు కొన్ని ఉన్నాయి: ఆ మాటల వెనుక సంవత్సరాల తరబడి చదివిన చదువు, సంపాదించిన అనుభవం ఉంటుంది. ప్రతి కేసు వెనుక ఎంతో మేధోమథనం, నిద్రలేని రాత్రులు ఉంటాయి.లాయర్‌కు కూడా ఒక కుటుంబం ఉంటుంది, పిల్లల చదువులు ఉంటాయి. ఆ వృత్తి మీద వచ్చే ఆదాయమే ఆ కుటుంబానికి ఏకైక ఆధారం.మిగిలిన వృత్తుల వారు డబ్బు తీసుకుంటే అది సర్వీస్ ఛార్జ్ అవుతుంది, కానీ లాయర్ ఫీజు అడిగితే మాత్రం స్వార్థం ఎందుకు అవుతుంది? స్నేహాన్ని అడ్డం పెట్టుకుని వృత్తిని తక్కువ చేయడం ఎంతవరకు సమంజసం? ఏ వృత్తిలోనైనా శ్రమకు ప్రతిఫలం ఉంటుంది. ఒక కార్పెంటర్ శ్రమ చేతుల్లో ఉంటే, ఒక లాయర్ శ్రమ మేధస్సులో ఉంటుంది.వృత్తి ఏదైనా గౌరవం ఒక్కటే. ఒక లాయర్ తన సమయాన్ని, జ్ఞానాన్ని మీ కోసం వెచ్చిస్తున్నాడంటే, దానికి ప్రతిఫలం ఆశించడం అతని హక్కు, బాధ్యత కూడా. స్నేహాన్ని గౌరవించండి, కానీ వృత్తిని చులకన చేయకండి. లాయర్ కోర్టులో నల్ల కోటు వేసుకున్నంత మాత్రాన అతను యంత్రం కాదు.. అన్ని అవసరాలు, భావోద్వేగాలు ఉన్న ఒక సగటు మనిషి, ఒక తండ్రి, ఒక ఇంటి యజమాని అని గుర్తించాలి.

- శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమదాలవలస నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆమదాలవలస పట్టణంలోని అన్న క్యాంటీన్‌లో ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి, పెద్ద ఎత్తున ప్రజలకు ఉచిత భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన స్వయంగా భోజనం వడ్డిస్తూ సేవాభావాన్ని ప్రదర్శించారు. అన్న క్యాంటీన్‌కు వచ్చిన పేద ప్రజలు, కార్మికులు, వృద్ధులు, మహిళలకు స్వయంగా ఆహారం అందించి వారి మనసులను గెలుచుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజలతో కలిసి నిల్చొని భోజనం చేశారు సాధారణ ప్రజలతో కలిసి భోజనం చేయడం ద్వారా వారి అభిప్రాయాలు భోజనం నాణ్యత తెలుసుకున్నారు . ప్రజలతో మమేకమై మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా పేదలకు అండగా నిలబడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అన్న క్యాంటీన్లు పేదల ఆకలి తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం ద్వారా నాయకత్వం యొక్క నిజమైన విలువ వెలుగుచూస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో సేవాభావం పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు.4
- **“Wish you a blessed Akshaya Tritiya ✨ May prosperity and positivity fill your life. Choose comfort that stays with you every day. MGM Vests – Wear Prosperity.”**1
- విశాఖ గాజువాక సోనోవిజన్ 4వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది... జనరేటర్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటున్న సోనో విజన్ షోరూమ్ యాజమాన్యం. ఘటన స్థలాలనికి చేరుకున్న గాజువాక ఫైర్ ఇంజన్లు దట్టమైన పొగలు, మంటలు చెలరేగడంతో అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది... యాభై లక్షలు ఆస్థి నష్టం అంచనా వేసిన అధికారులు... అనాధికార నిర్మాణంలో ఎలక్ట్రికల్ గూడ్స్ స్టోరేజ్ చేయడంతో చెలరేగిన మంటలు... గాజువాకలో అనాదికార నిర్మాణాలకి జీవీఎంసీ, రాజకీయ నేతలు అనుమతులు ఇవ్వడంతో కనీసం ఫైర్ సేఫ్టీ లేని నిర్మాణాలలో మంటలు చెలరేగుతున్నాయి...4
- Post by Rai Narendra1
- రోడ్డు కోసం ఇబందులు పడుతున్న జన్నాల్ వజంగి గ్రామం దయచేసి రోడ్డు ఇస్తారని కోరుకుంటూనమం ధన్యవాదములు1
- manasuloni mata1
- రంపచోడవరం ఐటిడిఎలో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ 155 అర్జీలను స్వీకరించారు. గిరిజన ప్రాంత సమస్యలను నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాజవొమ్మంగిలో బస్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా, పెండింగ్ అర్జీలపై అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.1
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయంలో సోమవారం నాడు విశేషంగా పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది ఈ పూజల్లో భాగంగా దేవాలయ అర్చక స్వామి విధాతశ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో వారి శ్రీ చందనం అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు చందన సమర్పించి అక్షయ తృతీయ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ పూజల్లో భక్తులు భాగ్యశ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.4