కరీంనగర్ లో రోడ్డెక్కిన 22ఏ బాధితులు...కలెక్టరేట్ ఎదుట మహాధర్నా....వారంరోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే కలెక్టరేట్ నుంచి సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టి ఆందోళన ఉదృతం చేస్తాం- ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరిక ఏళ్ల తరబడి పట్టాలు ఉండి నివాసాలు ఏర్పరచుకొని ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న భూములను సైతం నిషేధిత 22ఏ జాబితాలో చేర్చడంపై కరీంనగర్ లో బాధితులు ఆందోళనకు దిగారు. బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రేకుర్తి, విద్యానగర్ బాధితులు ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి మహా ధర్నా చేపట్టారు. ధర్నాలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ లు రవీందర్ రెడ్డి, అనిల్ గౌడ్, నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్ తోపాటు కార్పోరేట్మర్ లు పాల్గొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని రేకుర్తి, విద్యానగర్, హిందూపురి కాలనీ, కొత్తపల్లి, ఆరేపల్లి తో పాటు పలు కాలనీలకు చెందిన దాదాపు 1000 ఎకరాల పట్టా భూమిని నిషేధిత 22ఏ జాబితాలో చేర్చారని ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 వరకు ఎలాంటి ప్రాబ్లమ్ లేని పట్టా భూములను 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని కోరారు. 22ఏపై పొంతన లేని సమాధానం చెబుతున్న రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పట్టాలున్న భూములను 22a జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించనిచో కలెక్టరేట్ నుంచి సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టి ఆందోళన ఉదృతం చేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు.
కరీంనగర్ లో రోడ్డెక్కిన 22ఏ బాధితులు...కలెక్టరేట్ ఎదుట మహాధర్నా....వారంరోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే కలెక్టరేట్ నుంచి సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టి ఆందోళన ఉదృతం చేస్తాం- ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరిక ఏళ్ల తరబడి పట్టాలు ఉండి నివాసాలు ఏర్పరచుకొని ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న భూములను సైతం నిషేధిత 22ఏ జాబితాలో చేర్చడంపై కరీంనగర్ లో బాధితులు ఆందోళనకు దిగారు. బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రేకుర్తి, విద్యానగర్ బాధితులు ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి మహా ధర్నా చేపట్టారు. ధర్నాలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ
మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ లు రవీందర్ రెడ్డి, అనిల్ గౌడ్, నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్ తోపాటు కార్పోరేట్మర్ లు పాల్గొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని రేకుర్తి, విద్యానగర్, హిందూపురి కాలనీ, కొత్తపల్లి, ఆరేపల్లి తో పాటు పలు కాలనీలకు చెందిన దాదాపు 1000 ఎకరాల పట్టా భూమిని నిషేధిత 22ఏ జాబితాలో చేర్చారని ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 వరకు ఎలాంటి ప్రాబ్లమ్
లేని పట్టా భూములను 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని కోరారు. 22ఏపై పొంతన లేని సమాధానం చెబుతున్న రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పట్టాలున్న భూములను 22a జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించనిచో కలెక్టరేట్ నుంచి సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టి ఆందోళన ఉదృతం చేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు.
- జీవో నెంబర్ 97 వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల ఆవేదన..... "మేము డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పాలిటెక్నిక్ కాలేజ్ జిఒ నెంబర్ 97 తీసుకురావడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి జిఒ తీసుకొని వచ్చిన్లు, ఇప్పుడు మేము డిప్లొమా ఫైనల్ ఇయర్ లో ఉన్నాం. నెక్స్ట్ మరి మా ఫ్యూచర్ ఏంటిది? ఇప్పుడు మా పేరెంట్స్ మా మీద చాలా హోప్స్ తో ఉన్నారు. ఫైనల్ ఇయర్ అయిపోద్ది, తర్వాత బిటెక్ లలో మంచి కాలేజీలో సీటు కొట్టి, మంచిగా చదువుకొని, మంచి జాబ్స్ చేస్తారు, మంచిగా ఉంటారు, వాళ్ళ ఫ్యూచర్ మా ఫ్యూచర్ ఒక రేంజ్ లో ఊహించుకొని పెట్టుకున్నారు. సడన్ గా ఇంత పెద్ద జిఒ తెచ్చి, మా ఫ్యూచర్ ఎటూ కాకుండా... స్కిల్ ఇండియా అని చెప్పేసి అందులో మెర్జ్ చేసేస్తాం, నెక్స్ట్ మీరు లేబర్స్, మీరు బిటెక్ చేయొద్దు, ఇక్కడితోటే మీ ఫ్యూచర్ ఆపేయాలి స్టడీ అని చెప్పేసి చెప్పిర్లు. అంటే ఇలాంటి ఒక జిఒ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళది ప్లస్ ఏం తెలవకుండా వచ్చి డిప్లొమా చేద్దాం అని జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ కి అందరికీ ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క మిగిలింది. ఇలాంటి ఒక క్వశ్చన్ మార్క్ తెచ్చే ముందు అందరూ ఒకసారి స్టూడెంట్స్ ని అడగడమైనా లేదా అని అంటే ఒక మీటింగ్ పెట్టి ఇలాంటిది చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక మీటింగ్ పెట్టి అందరికీ చెప్పి చేసి ఉంటే బాగుండు. కానీ ఆల్రెడీ ఇలాంటిది ఆంధ్రాలో చేసి, ఢిల్లీలో చేసి వాళ్ళు ఫెయిల్ అయ్యి వాళ్ళు రిటర్న్ బ్యాక్ తీసుకున్నాక కూడా మన తెలంగాణలో తెచ్చిలని అంటే అసలు మాట్లాడే లెక్కపోతున్నాం ఈ జిఒ గురించి. ఫస్ట్ ఇలాంటి తెచ్చిన జిఒ ని రిటర్న్ బ్యాక్ తీసుకొని, మెర్జ్ చేయకుండా డిప్లొమా కంటిన్యూ చేసి బిటెక్ మమ్మల్ని చేసేటట్టు మాకు ఒక ప్రూఫ్, ఒక జిఒ ఇదెట్లా పాస్ చేసిండో మేము డిప్లొమా చేయాలి, మళ్ళా డిప్లొమా తర్వాత బిటెక్ కూడా చేయాలి అని చెప్పేసి ఒక జిఒ ని పాస్ చేయమని చెప్పేసి మా అందరి స్టూడెంట్స్ నుంచి ఇదొక రిక్వెస్ట్ గా అడుగుతున్నాం."1
- *మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి* *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* *ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ* *చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన* అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.4
- కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు టెక్స్టైల్ , పవర్లూమ్ పరిశ్రమ అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలి వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి పవర్లూమ్ పరిశ్రమకు 10 HP ల వరకు ఉచిత విద్యుత్ అందించాలి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలి ఆదివారం సీఐటీయూ టెక్స్టైల్ & పవర్లూమ్ జాతీయ సమావేశాలు సిరిసిల్లలోని గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఐటీయూ- ఆల్ ఇండియా కార్యదర్శి కరుమలయన్ , మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు లు మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మంది కార్మికులకు ఉపాధిని కల్పిస్తూ ఆదాయాన్ని అందిస్తున్న టెక్స్టైల్ పవర్లూమ్ పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు సరిపడా నిధులు కేటాయించకుండా కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తూ మరోవైపు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్రంలో పవర్లూమ్ పరిశ్రమకు ప్రధాన కేంద్రమైన సిరిసిల్లలో కార్మికులకు సంబంధించిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు టెక్స్టైల్ పవర్ లూమ్ పరిశ్రమల అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని , వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని , పవర్లూమ్ పరిశ్రమకు 10 HP ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని , వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో సిఐటియు టెక్స్టైల్ ఆల్ ఇండియా కమిటీ , తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని కార్మికులందరూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో CITU - తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ , ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ , సిఐటియు ఆల్ ఇండియా టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీలోని వివిధ రాష్ట్రాల నాయకులు చంద్రన్ , సునీల్ చౌహన్ , అశోకన్ , పెరుమాళ్ , తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళి , సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు సోమన్న , సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , కార్యదర్శి కోడం రమణ సిఐటియు జిల్లా నాయకులు , పవర్లూమ్ అనుబంధ యూనియన్ల నాయకులు ,వివిధ ప్రజా సంఘాల నాయకులు , పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులు , ఆసాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు*2
- *తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన💥* వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన ఆలేరు నుండి పోటీ చేస్తున్నా అని స్పష్టం చేసిన మల్లన్న *తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన💥* వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన ఆలేరు నుండి పోటీ చేస్తున్నా అని స్పష్టం చేసిన మల్లన్న🔥1
- ఆటపాటలతో సంస్కృతిని చాటిన లంబాడీలు:బంజారా సంస్కృతికి ప్రతీక ‘తీజ్’: జనగామలో ఘనంగా శోభాయాత్ర జనగామ: జిల్లా కేంద్రంలో మాజీ కౌన్సిలర్ వాంకుడోత్ అనిత నివాసం వద్ద తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన బంజారా తీజ్ ఉత్సవాలు నిమజ్జన వేడుకతో ఘనంగా ముగిశాయి. అనిత నివాసం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర అంబేద్కర్ చౌరస్తా మీదుగా బతుకమ్మ కుంట వరకు సాగింది. బంజారా మహిళలు, యువత, ఉద్యోగులు, ప్రజలు సంప్రదాయ వేషధారణలతో ఆటపాటలు, నృత్యాలు చేస్తూ పెద్ద ఎత్తున తరలిరావడంతో జనగామ పురవీధులు బంజారా జనసంద్రంగా మారాయి. ఈ కార్యక్రమంలో కుసుంబాయి తండా సర్పంచ్ కొర్ర స్వరూప రాజేందర్ నాయక్‌తో పాటు పలువురు బంజారా నాయకులు, ప్రజాప్రతినిధులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలు, సంస్కృతిని కాపాడుకోవాలని, మేరామాయాడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.1
- తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుండే పోటీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజవర్గం నుండి పోటీ చేస్తున్నా అని సంచలన ప్రకటన చేసిన తీన్మార్ మల్లన్న.1
- ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం...అత్యధికంగా గట్టుదుద్దెనపల్లి లో 5.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. అత్యధికంగా మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి లో 5.83 సెంటీమీటర్లు, గంభీరావుపేటలో 4.45 సెంటీమీటర్ వర్షపాతం నమోదు అయింది. ముసురులా వర్షం పడడంతో జనజీవనం స్తంభించిపోయింది. శ్రావణ సోమవారంతో వేములవాడలో వర్షంలో తడుస్తూ భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ, కోడె మొక్కులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతుంది. లోయర్ మానేర్ డ్యామ్ కు స్వల్పంగా ఇన్ ఫ్లో ఔట్ ప్లో 242 క్యూసెక్కులు ఉంది. ఎల్ఎండి పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిలువ 10.95 టిఎంసీలు ఉంది. మిడ్ మానేర్ కు ఇన్ ఫ్లో 613 క్యూసెక్కులు ఉండగా ఔట్ ప్లో 127 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 27.55 టిఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిలువ 20.15 టిఎంసీలు ఉంది. ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టుకు స్వల్పంగా వరద పెరిగింది. ఇన్ ఫ్లో 393 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 2 టిఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిలువ 1.95 టిఎంసీలు ఉంది. అటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు వరద క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 6 వేలకు పైగా క్యూసెక్కుల వరద ఎల్లంపల్లి కి వచ్చి చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి.2
- జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సాంకేతిక విద్యను ప్రైవేటీకరించేందుకు దోహదపడే జీవో నంబర్ 97ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన ఆయన, విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... దశాబ్దాలుగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు దిక్సూచిగా ఉన్న పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పేరుతో పిపిపి (PPP) నమూనా కిందకు తెచ్చి కార్పొరేట్ రంగానికి కట్టబెట్టే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. దీనివల్ల నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యకూ, ఇంజనీరింగ్ కోర్సులకూ దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. పాలిటెక్నిక్ వ్యవస్థను యథావిధిగా కొనసాగిస్తూ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, లేనిపక్షంలో వారి తరఫున క్షేత్రస్థాయిలో, అసెంబ్లీలో పెద్ద ఎత్తున పోరాడతామని హెచ్చరించారు.2
- ఒక వెయ్యి ముగ్గురు సీనియర్ సిటిజన్ మహిళలకు చీరలను పంపిణీ చేయడం ద్వారా ఓం మౌజయః విశ్వ మహిళా సేవా సమితి పేరు వరల్డ్ రికార్డ్స్ ఇండియా బుక్ లో నమోదయింది. ఒక వెయ్యి ముగ్గురు సీనియర్ సిటిజన్ మహిళలకు చీరలను పంపిణీ చేయడం ద్వారా ఓం మౌజయః విశ్వ మహిళా సేవా సమితి పేరు వరల్డ్ రికార్డ్స్ ఇండియా బుక్ లో నమోదయింది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామ శివారులోని ఓం మౌజయః ఆశ్రమంలో శ్రావణ మాస ఏకాదశి సందర్భంగా వసుధైక కుటుంబ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. 13 వ వార్షికోత్సవం సందర్బంగా సహస్ర కుంకుమార్చన, సహస్ర కలశ అర్చన, సహస్త్ర దీపారాధన, శక్తిపీఠం మహామాత ర్యాలీ, శ్రీ ప్రభు పల్లకి, ఉచిత అన్నదానం లడ్డు ప్రసాదము వితరణ తదితర కార్యక్రమాలు కన్నుల పండగగా జరిగాయి. అంతేకాకుండా, 50 సంవత్సరాలు పైబడిన 1003 మంది మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంకు వరల్డ్ రికార్డ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. ఇంత పెద్ద ఎత్తున సీనియర్ సిటిజన్ మహిళలకు సేవాభావంతో చీరలను పంపిణీ చేయడం అనేది గొప్ప విషయమని కొనియాడారు. శ్రీ మాశ్రీ పరమో మహా గురూజీ ద్వారా స్థాపించబడిన సంస్థ ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండటం అభినందనీయమన్నారు. పెద్ద ఎత్తున మహిళలకు చీరలు పంపిణీ చేయడం ద్వారా విశ్వ మహిళా సేవా సమితి వారు రికార్డు నెలకొల్పారని, వారి పేరు తమ వరల్డ్ రికార్డ్స్ ఇండియా లో నమోదయినట్లు తెలుపుతూ సర్టిఫికెట్ ప్రధానం చేశారు. కరీంనగర్, సిరిసిల్ల వరంగల్ నిజామాబాద్ విజయవాడ వరంగల్ జిల్లాల నలు మూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.4