logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రైతుల సంక్షేమానికి అగ్రతాంబూలం ఇస్తూ ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి రాజీ పడడం లేదని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ స్పష్టం చేశారు. రైతుల పక్షపాత ప్రభుత్వమిదని ఆయన పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలం జలదంకి గ్రామంలో ఎమ్మెల్యే ముఖాముఖి నిర్వహించి రైతుల సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన నిధుల పంపిణీ కార్యక్రమంలో పల్నాడు జిల్లా లింగంగుంట్ల నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్లను జమ చేసిన కార్యక్రమాన్ని రైతులు వీక్షించారు. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, లింగంగుంట్ల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగాలను ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా రైతులు ప్రత్యక్షంగా చూశారు. రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లు ఉన్నా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. రైతులకు ప్రతి ఏడాది రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తామన్న హామీని నిలబెట్టుకుంటూ రెండో ఏడాది తొలి విడత నిధులను కూడా జమ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన 'నమ్మకం - అభివృద్ధి - సంక్షేమం'కు నిదర్శనమని, రాబోయే మూడేళ్లలో సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ విడతలో ఒక్కో రైతుకు అన్నదాత సుఖీభవ కింద రూ.5,000, పీఎం కిసాన్ కింద రూ.2,000 చొప్పున మొత్తం రూ.7,000 జమ అయ్యాయని వివరించారు. నెల్లూరు జిల్లాలో 1,77,545 మంది రైతులకు రూ.117.16 కోట్లు, ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో 45,275 మంది రైతులకు రూ.30 కోట్లు ఐదు లక్షల 20 వేల రూపాయలు లబ్ధి చేకూరిందని వెల్లడించారు. రైతులు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని ఆదాయాన్ని పెంచుకోవాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచించారు. అంతర్ పంటల వైపు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులను రైతులు అందిపుచ్చుకోవాలని, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని పెంచాలని, వరిపై అధికంగా ఆధారపడకుండా ఉద్యానవన, వాణిజ్య పంటలను సాగు చేయాలని అన్నారు. అంతర పంటల విధానం ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని, అగర్ వుడ్ వంటి వాణిజ్య పంటలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించి ఈ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. భవిష్యత్ తరాలకు నాణ్యమైన ఆహారం అందించేలా, అందరికీ ఆరోగ్య భద్రత కలిగేలా రైతులు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మెగా చెక్కును ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

4 hrs ago
user_నాగరాజు కర్రా
నాగరాజు కర్రా
కలిగిరి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago
d9a319b7-a692-4996-b65d-4a7a06e22fed

రైతుల సంక్షేమానికి అగ్రతాంబూలం ఇస్తూ ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి రాజీ పడడం లేదని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ స్పష్టం చేశారు. రైతుల పక్షపాత ప్రభుత్వమిదని ఆయన పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలం జలదంకి గ్రామంలో ఎమ్మెల్యే ముఖాముఖి నిర్వహించి రైతుల సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన నిధుల పంపిణీ కార్యక్రమంలో పల్నాడు జిల్లా లింగంగుంట్ల నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్లను జమ చేసిన కార్యక్రమాన్ని రైతులు వీక్షించారు. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, లింగంగుంట్ల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగాలను ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా రైతులు ప్రత్యక్షంగా చూశారు. రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లు ఉన్నా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. రైతులకు ప్రతి ఏడాది రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తామన్న హామీని నిలబెట్టుకుంటూ రెండో ఏడాది తొలి విడత నిధులను కూడా జమ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన 'నమ్మకం - అభివృద్ధి - సంక్షేమం'కు నిదర్శనమని, రాబోయే మూడేళ్లలో సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ

4f1e5382-ce64-4f69-ab26-17a0355c8d57

విడతలో ఒక్కో రైతుకు అన్నదాత సుఖీభవ కింద రూ.5,000, పీఎం కిసాన్ కింద రూ.2,000 చొప్పున మొత్తం రూ.7,000 జమ అయ్యాయని వివరించారు. నెల్లూరు జిల్లాలో 1,77,545 మంది రైతులకు రూ.117.16 కోట్లు, ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో 45,275 మంది రైతులకు రూ.30 కోట్లు ఐదు లక్షల 20 వేల రూపాయలు లబ్ధి చేకూరిందని వెల్లడించారు. రైతులు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని ఆదాయాన్ని పెంచుకోవాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచించారు. అంతర్ పంటల వైపు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులను రైతులు అందిపుచ్చుకోవాలని, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని పెంచాలని, వరిపై అధికంగా ఆధారపడకుండా ఉద్యానవన, వాణిజ్య పంటలను సాగు చేయాలని అన్నారు. అంతర పంటల విధానం ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని, అగర్ వుడ్ వంటి వాణిజ్య పంటలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించి ఈ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. భవిష్యత్ తరాలకు నాణ్యమైన ఆహారం అందించేలా, అందరికీ ఆరోగ్య భద్రత కలిగేలా రైతులు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మెగా చెక్కును ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వైయ‌స్సార్సీపీ రాష్ట్ర స‌మ‌న్వ‌య‌క‌ర్త స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి గారు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు కీలక దిశానిర్దేశం చేస్తూ, కూట‌మి ప్ర‌భుత్వ మోసాల‌ను, రెండేళ్ల చీక‌టి పాల‌న‌లో జ‌రుగుతున్న దారుణాల‌ను ప్ర‌జ‌ల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక వివిధ సామాజిక వ‌ర్గాలు, ముఖ్యంగా ర‌జకుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ, గ‌తంలో జ‌రిగిన త‌ప్పుల‌ను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే ప్ర‌భుత్వంలో పార్టీ కోసం బాధ్య‌తాయుతంగా ప‌నిచేసే ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు ఖ‌చ్చితంగా ప్రాధాన్య‌త ఉంటుంద‌ని, వారి వివ‌రాలు పార్టీ ద‌గ్గ‌ర ఉన్నాయని స్పష్టం చేశారు. పేద‌ల‌కు మేలు చేసి, ధ‌నిక, పేదల మ‌ధ్య తార‌త‌మ్యాల‌ను తగ్గించాలన్న తాప‌త్ర‌యంతో కష్టపడే మనస్తత్వం ఉన్న నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్ గారని స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి గారు ప్రశంసించారు. జ‌నం కోసం ఆలోచించినంత కాలం దేవుడి ఆశీస్సులు ఉంటాయ‌ని నమ్మి పార్టీని న‌డిపిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ గారిని జైలు గోడలు కూడా ఆపలేకపోయాయని ఆయన అన్నారు. గెలుపోట‌ముల‌ను ఒకేరకంగా స్వీకరించే గొప్ప ధైర్యం వైయ‌స్ జ‌గ‌న్ గారికి ఉందని, నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ రెండేళ్లలో ఆయన చేసిన పోరాటాలే దీనికి నిదర్శనమని చెప్పారు. విలువలు, విశ్వసనీయత ఉన్న నాయకుడు కాబట్టే ఆయన బయటకు వస్తే వేలల్లో, ల‌క్ష‌ల్లో జ‌నం వస్తున్నారని, సీట్లు ఇవ్వకపోయినా ఆయన స్పందిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్ర‌జ‌లు నమ్ముతున్నారని, ఆయన మాట మీదనే భరోసా ఉంచుతున్నారని వెల్లడించారు. మరోవైపు, చంద్ర‌బాబు పోలీసుల‌ను త‌న కోసం ప‌నిచేసే కిరాయి సైన్యంలా వాడుకుంటున్నందువల్లే రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జ‌రుగుతున్నాయని స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి గారు తీవ్రంగా ఆరోపించారు. చేసింది చెప్పుకుని ఎన్నిక‌ల్లో గెలవలేక పోలీసుల‌తో దౌర్జన్యాలు చేయించి రాజంపేట, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక‌ల్లో గెలిచారని విమర్శించారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్క‌టీ అమ‌లు కాలేదని, బాండ్ల మీద సంత‌కాలు చేసి మ‌రీ చంద్ర‌బాబు అన్నివ‌ర్గాల‌కు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. తన మోసాల‌ను ప్ర‌జ‌లు మర్చిపోతారనే ధీమాతో ఆయన ఉన్నారని, ఎన్నిక‌ల ముందు చెప్పిన మాటల‌కు, అధికారంలోకి వ‌చ్చాక చేసే పనుల‌కు పొంత‌నే ఉండదని ఎత్తి చూపారు. ప్రశ్నించే గొంతులు నొక్క‌డానికి ఫేస్‌బుక్ ఆఫీసుల‌కే పోలీసుల‌తో ఫిర్యాదులు చేయించి అకౌంట్లు బ్లాక్ చేయిస్తున్నారని, రెండేళ్లుగా పాల‌న కాకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే సాగుతోందని ధ్వజమెత్తారు. అబ‌ద్ధపు వాంగ్మూలాల‌తో అక్ర‌మ కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారని, ప్రజా సమస్యలపై స్పందించకుండా, ఆరోపణలకు సమాధానం చెప్పకుండా కేవలం వైయ‌స్ జ‌గ‌న్ గారి కుటుంబాన్ని తిట్టి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడమే వారి పనిగా పెట్టుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆక్షేపించారు. రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ అధికార కూట‌మిని ప్రతిఘటించాలని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. పార్టీ కోసం క్షేత్ర‌స్థాయిలో స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయాలని, కూట‌మి ప్ర‌భుత్వ మోసాల‌ను లెక్క‌ల‌తో తిప్పికొట్ట‌డానికి వీలుగా ప్ర‌తిఒక్క‌రూ స‌న్న‌ద్ధం కావాలని ఆయన సూచించారు. ఎస్ఐఆర్ విష‌యంలో వార్డు స్థాయి నుంచి అప్ర‌మ‌త్తంగా ప‌నిచేయాలని కూడా ఆయన ఆదేశించారు.
    1
    వైయ‌స్సార్సీపీ రాష్ట్ర స‌మ‌న్వ‌య‌క‌ర్త స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి గారు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు కీలక దిశానిర్దేశం చేస్తూ, కూట‌మి ప్ర‌భుత్వ మోసాల‌ను, రెండేళ్ల చీక‌టి పాల‌న‌లో జ‌రుగుతున్న దారుణాల‌ను ప్ర‌జ‌ల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక వివిధ సామాజిక వ‌ర్గాలు, ముఖ్యంగా ర‌జకుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ, గ‌తంలో జ‌రిగిన త‌ప్పుల‌ను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే ప్ర‌భుత్వంలో పార్టీ కోసం బాధ్య‌తాయుతంగా ప‌నిచేసే ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు ఖ‌చ్చితంగా ప్రాధాన్య‌త ఉంటుంద‌ని, వారి వివ‌రాలు పార్టీ ద‌గ్గ‌ర ఉన్నాయని స్పష్టం చేశారు.

పేద‌ల‌కు మేలు చేసి, ధ‌నిక, పేదల మ‌ధ్య తార‌త‌మ్యాల‌ను తగ్గించాలన్న తాప‌త్ర‌యంతో కష్టపడే మనస్తత్వం ఉన్న నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్ గారని స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి గారు ప్రశంసించారు. జ‌నం కోసం ఆలోచించినంత కాలం దేవుడి ఆశీస్సులు ఉంటాయ‌ని నమ్మి పార్టీని న‌డిపిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ గారిని జైలు గోడలు కూడా ఆపలేకపోయాయని ఆయన అన్నారు. గెలుపోట‌ముల‌ను ఒకేరకంగా స్వీకరించే గొప్ప ధైర్యం వైయ‌స్ జ‌గ‌న్ గారికి ఉందని, నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ రెండేళ్లలో ఆయన చేసిన పోరాటాలే దీనికి నిదర్శనమని చెప్పారు. విలువలు, విశ్వసనీయత ఉన్న నాయకుడు కాబట్టే ఆయన బయటకు వస్తే వేలల్లో, ల‌క్ష‌ల్లో జ‌నం వస్తున్నారని, సీట్లు ఇవ్వకపోయినా ఆయన స్పందిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్ర‌జ‌లు నమ్ముతున్నారని, ఆయన మాట మీదనే భరోసా ఉంచుతున్నారని వెల్లడించారు.

మరోవైపు, చంద్ర‌బాబు పోలీసుల‌ను త‌న కోసం ప‌నిచేసే కిరాయి సైన్యంలా వాడుకుంటున్నందువల్లే రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జ‌రుగుతున్నాయని స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి గారు తీవ్రంగా ఆరోపించారు. చేసింది చెప్పుకుని ఎన్నిక‌ల్లో గెలవలేక పోలీసుల‌తో దౌర్జన్యాలు చేయించి రాజంపేట, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక‌ల్లో గెలిచారని విమర్శించారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్క‌టీ అమ‌లు కాలేదని, బాండ్ల మీద సంత‌కాలు చేసి మ‌రీ చంద్ర‌బాబు అన్నివ‌ర్గాల‌కు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. తన మోసాల‌ను ప్ర‌జ‌లు మర్చిపోతారనే ధీమాతో ఆయన ఉన్నారని, ఎన్నిక‌ల ముందు చెప్పిన మాటల‌కు, అధికారంలోకి వ‌చ్చాక చేసే పనుల‌కు పొంత‌నే ఉండదని ఎత్తి చూపారు. ప్రశ్నించే గొంతులు నొక్క‌డానికి ఫేస్‌బుక్ ఆఫీసుల‌కే పోలీసుల‌తో ఫిర్యాదులు చేయించి అకౌంట్లు బ్లాక్ చేయిస్తున్నారని, రెండేళ్లుగా పాల‌న కాకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే సాగుతోందని ధ్వజమెత్తారు. అబ‌ద్ధపు వాంగ్మూలాల‌తో అక్ర‌మ కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారని, ప్రజా సమస్యలపై స్పందించకుండా, ఆరోపణలకు సమాధానం చెప్పకుండా కేవలం వైయ‌స్ జ‌గ‌న్ గారి కుటుంబాన్ని తిట్టి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడమే వారి పనిగా పెట్టుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆక్షేపించారు.

రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ అధికార కూట‌మిని ప్రతిఘటించాలని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. పార్టీ కోసం క్షేత్ర‌స్థాయిలో స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయాలని, కూట‌మి ప్ర‌భుత్వ మోసాల‌ను లెక్క‌ల‌తో తిప్పికొట్ట‌డానికి వీలుగా ప్ర‌తిఒక్క‌రూ స‌న్న‌ద్ధం కావాలని ఆయన సూచించారు. ఎస్ఐఆర్ విష‌యంలో వార్డు స్థాయి నుంచి అప్ర‌మ‌త్తంగా ప‌నిచేయాలని కూడా ఆయన ఆదేశించారు.
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులు గంజాయి రహిత సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో శుక్రవారం స్థానిక మున్సిపల్ నెహ్రూ మైదానంలో మత్తుబాబులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ డిఎస్పి భక్తవత్సలం మాట్లాడుతూ, మొదటిసారి తప్పు చేసిన వారికి క్షమాపణ ఉంటుందని, అయితే రెండోసారి అదే తప్పు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కౌన్సిలింగ్‌లో పాల్గొన్న మత్తుబాబులతో తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులు ప్రమాణం చేయించారు. దీనితో పాటు, వైద్యులు 300 మందికి గంజాయి రాపిడో టెస్టులు నిర్వహించగా, ఈ టెస్టుల్లో ఇరువురికి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు.
    1
    తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులు గంజాయి రహిత సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో శుక్రవారం స్థానిక మున్సిపల్ నెహ్రూ మైదానంలో మత్తుబాబులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ డిఎస్పి భక్తవత్సలం మాట్లాడుతూ, మొదటిసారి తప్పు చేసిన వారికి క్షమాపణ ఉంటుందని, అయితే రెండోసారి అదే తప్పు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఈ కౌన్సిలింగ్‌లో పాల్గొన్న మత్తుబాబులతో తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులు ప్రమాణం చేయించారు. దీనితో పాటు, వైద్యులు 300 మందికి గంజాయి రాపిడో టెస్టులు నిర్వహించగా, ఈ టెస్టుల్లో ఇరువురికి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    17 hrs ago
  • కూటమి ప్రభుత్వం రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపడుతుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య స్పష్టం చేశారు. నందికొట్కూరులో జరిగిన రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయసూర్య, 'పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ' పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి ₹20 వేల చొప్పున మూడు విడతలుగా ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేశారు. రైతుల కోసం వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన మరోసారి పేర్కొన్నారు.
    1
    కూటమి ప్రభుత్వం రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపడుతుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య స్పష్టం చేశారు. నందికొట్కూరులో జరిగిన రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయసూర్య, 'పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ' పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి ₹20 వేల చొప్పున మూడు విడతలుగా ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేశారు. రైతుల కోసం వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన మరోసారి పేర్కొన్నారు.
    user_Romanti Romeo
    Romanti Romeo
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • నంద్యాల కోర్టులో జూలై 11న జరగనున్న మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మనరాజా సూచించారు. శనివారం నంద్యాల జిల్లా కోర్టు ఆవరణంలో నంద్యాల డివిజన్ పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. న్యాయమూర్తి అమ్మనరాజా మాట్లాడుతూ, లోక్ అదాలత్‌లో రాజీ చేయదగ్గ కేసులను రాజీ చేయడం జరుగుతుందని తెలిపారు. రాజీ మార్గం ద్వారా అమూల్యమైన సమయాన్ని, ఖర్చులను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. ఎక్కువ కేసులను పరిష్కరించడమే లక్ష్యంగా కక్షిదారులు ముందుకు రావాలని కోరారు. లోక్ అదాలత్‌లో రాజీ కుదిరిన కేసులపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నొక్కిచెప్పారు.
    1
    నంద్యాల కోర్టులో జూలై 11న జరగనున్న మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మనరాజా సూచించారు. శనివారం నంద్యాల జిల్లా కోర్టు ఆవరణంలో నంద్యాల డివిజన్ పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

న్యాయమూర్తి అమ్మనరాజా మాట్లాడుతూ, లోక్ అదాలత్‌లో రాజీ చేయదగ్గ కేసులను రాజీ చేయడం జరుగుతుందని తెలిపారు. రాజీ మార్గం ద్వారా అమూల్యమైన సమయాన్ని, ఖర్చులను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. ఎక్కువ కేసులను పరిష్కరించడమే లక్ష్యంగా కక్షిదారులు ముందుకు రావాలని కోరారు. లోక్ అదాలత్‌లో రాజీ కుదిరిన కేసులపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నొక్కిచెప్పారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • ఎమ్మిగనూరు నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఫౌండర్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గత 76 సంవత్సరాలుగా మదాసి కురువ/మదారి కురువ కులస్తులకు జరుగుతున్న అన్యాయంపై ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, కన్వర్టెడ్ క్రిస్టియన్ పాస్టర్లకు SC సర్టిఫికెట్లను అంగడిలో పప్పుల బెల్లాలు లాగా పంచిపెడుతూ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. నిజమైన ఎస్సీలైన మదాసి కురువ/మదారి కురువ సోదరులకు SC సర్టిఫికెట్ ఇస్తే, కురుబ/కురుమలు తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారని ప్రచారం చేయడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది. SCలో ఉన్న 59 కులాలకు సమన్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని సమితి తెలియజేసింది. రాయలసీమ జిల్లాలలో అత్యధిక జనాభా కలిగినటువంటి మదాసి కురువ/మదారి కురువ కులస్తులను కుల మార్పిడి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎస్సీలోని 58 కులాలు హక్కులను పొందుతూ ముందుకు పోతూ ఉంటే, ఏకైక కులమైనటువంటి మదాసి కురువ/మదారి కురువ కులస్తులు ఇప్పటివరకు కోల్పోయిన రాజ్యాంగ హక్కులను పునరుద్ధరించేంతవరకు షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి పోరాడుతూనే ఉంటుందని ప్రసన్నకుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ మద్దిలేటి మదాసి కురువ, సాల్వాడి సురేంద్ర, మహదేవప్ప పవన్, జూలకల్లు మునిష్, సుంకేసుల హుస్సేన్ అప్ప, అలువాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ఎమ్మిగనూరు నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఫౌండర్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గత 76 సంవత్సరాలుగా మదాసి కురువ/మదారి కురువ కులస్తులకు జరుగుతున్న అన్యాయంపై ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, కన్వర్టెడ్ క్రిస్టియన్ పాస్టర్లకు SC సర్టిఫికెట్లను అంగడిలో పప్పుల బెల్లాలు లాగా పంచిపెడుతూ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. నిజమైన ఎస్సీలైన మదాసి కురువ/మదారి కురువ సోదరులకు SC సర్టిఫికెట్ ఇస్తే, కురుబ/కురుమలు తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారని ప్రచారం చేయడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది.

SCలో ఉన్న 59 కులాలకు సమన్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని సమితి తెలియజేసింది. రాయలసీమ జిల్లాలలో అత్యధిక జనాభా కలిగినటువంటి మదాసి కురువ/మదారి కురువ కులస్తులను కుల మార్పిడి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎస్సీలోని 58 కులాలు హక్కులను పొందుతూ ముందుకు పోతూ ఉంటే, ఏకైక కులమైనటువంటి మదాసి కురువ/మదారి కురువ కులస్తులు ఇప్పటివరకు కోల్పోయిన రాజ్యాంగ హక్కులను పునరుద్ధరించేంతవరకు షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి పోరాడుతూనే ఉంటుందని ప్రసన్నకుమార్ వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ మద్దిలేటి మదాసి కురువ, సాల్వాడి సురేంద్ర, మహదేవప్ప పవన్, జూలకల్లు మునిష్, సుంకేసుల హుస్సేన్ అప్ప, అలువాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
    user_User7105
    User7105
    Citizen Reporter శ్రీశైలం, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి గుహల వద్ద జాతీయ మీడియా ప్రతినిధులతో 'యోగాంధ్ర' కార్యక్రమంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని గుర్తు చేశారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని అమరావతిలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ ఇంటికి యోగాను తీసుకెళ్లాలనేదే తమ లక్ష్యమని, దీనిని ఒక మిషన్ మోడ్‌లో అందరికీ చేరువ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఏపీ ప్రభుత్వం యోగాను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. యోగా ప్రపంచానికి భారత్ అందించిన అమూల్యమైన బహుమతి అని, దీని ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకుని ఏకాగ్రత సాధించవచ్చని ఆయన అన్నారు. కేవలం సాంకేతికత మాత్రమే సంపదను తీసుకురాదని, భారతదేశానికి ఆధ్యాత్మికత, సంస్కృతి అత్యంత అమూల్యమైన శక్తి అని, యువత ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సైబరాబాద్ నిర్మాణానంతరం అమరావతి రాజధాని నిర్మాణ అవకాశం భగవంతుడు తనకు ప్రసాదించాడని చంద్రబాబు నాయుడు తెలిపారు. సైబరాబాద్, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతూ, హైదరాబాద్ అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఎదిగిందని చెప్పారు. హైదరాబాద్‌కు అదనంగా, ఆరోగ్యకరమైన, సంపన్నమైన, సంతోషకరమైన, ఆధ్యాత్మిక నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని వివరించారు. సాంకేతికతను అనుసంధానించి, ఈ నగరాన్ని ఒక అధునాతన రాజధానిగా, నాలెడ్జి హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
    1
    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి గుహల వద్ద జాతీయ మీడియా ప్రతినిధులతో 'యోగాంధ్ర' కార్యక్రమంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని గుర్తు చేశారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని అమరావతిలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రతీ ఇంటికి యోగాను తీసుకెళ్లాలనేదే తమ లక్ష్యమని, దీనిని ఒక మిషన్ మోడ్‌లో అందరికీ చేరువ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఏపీ ప్రభుత్వం యోగాను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. యోగా ప్రపంచానికి భారత్ అందించిన అమూల్యమైన బహుమతి అని, దీని ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకుని ఏకాగ్రత సాధించవచ్చని ఆయన అన్నారు. కేవలం సాంకేతికత మాత్రమే సంపదను తీసుకురాదని, భారతదేశానికి ఆధ్యాత్మికత, సంస్కృతి అత్యంత అమూల్యమైన శక్తి అని, యువత ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

సైబరాబాద్ నిర్మాణానంతరం అమరావతి రాజధాని నిర్మాణ అవకాశం భగవంతుడు తనకు ప్రసాదించాడని చంద్రబాబు నాయుడు తెలిపారు. సైబరాబాద్, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతూ, హైదరాబాద్ అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఎదిగిందని చెప్పారు. హైదరాబాద్‌కు అదనంగా, ఆరోగ్యకరమైన, సంపన్నమైన, సంతోషకరమైన, ఆధ్యాత్మిక నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని వివరించారు. సాంకేతికతను అనుసంధానించి, ఈ నగరాన్ని ఒక అధునాతన రాజధానిగా, నాలెడ్జి హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
    user_జేమ్స్
    జేమ్స్
    Vijayawada East, Ntr•
    15 hrs ago
  • వెన్నుపోటు రాజకీయాలకు పేరుగాంచిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా అందరినీ మోసం చేసిందని మాజీ మేయర్ బీవై రామయ్య గారు తీవ్రంగా ఆరోపించారు. మోసం చేయాలనే ఆలోచన లేని రైతన్నలను సైతం ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన విమర్శించారు. రామయ్య గారి ప్రకటన ప్రకారం, 2014లో రైతు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన చంద్రబాబు, ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. దీనికి విరుద్ధంగా, రైతుల కోసం వైయస్ జగన్ రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చి, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు, గిట్టుబాటు ధర వంటి కీలక అంశాలలో అండగా నిలిచారని ఆయన ప్రశంసించారు. చెప్పిన దానికంటే ఎక్కువ చేయడం జగన్ నైజమైతే, కోతలు పెట్టడం చంద్రబాబు నైజమని బీవై రామయ్య గారు స్పష్టం చేశారు.
    1
    వెన్నుపోటు రాజకీయాలకు పేరుగాంచిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా అందరినీ మోసం చేసిందని మాజీ మేయర్ బీవై రామయ్య గారు తీవ్రంగా ఆరోపించారు. మోసం చేయాలనే ఆలోచన లేని రైతన్నలను సైతం ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన విమర్శించారు.

రామయ్య గారి ప్రకటన ప్రకారం, 2014లో రైతు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన చంద్రబాబు, ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. దీనికి విరుద్ధంగా, రైతుల కోసం వైయస్ జగన్ రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చి, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు, గిట్టుబాటు ధర వంటి కీలక అంశాలలో అండగా నిలిచారని ఆయన ప్రశంసించారు. చెప్పిన దానికంటే ఎక్కువ చేయడం జగన్ నైజమైతే, కోతలు పెట్టడం చంద్రబాబు నైజమని బీవై రామయ్య గారు స్పష్టం చేశారు.
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • ప్రొద్దుటూరు కమిషనర్ రవిచంద్రారెడ్డి శనివారం స్థానిక 2టౌన్ బైపాస్ రోడ్డులోని మునిసిపల్ పార్కులో పచ్చదనం-పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, నిషేధిత సింగిల్ యూజ్ డిస్పోజబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలని ఆయన నొక్కి చెప్పారు. ప్రొద్దుటూరులో పచ్చదనం మరియు పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కమిషనర్ రవిచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
    1
    ప్రొద్దుటూరు కమిషనర్ రవిచంద్రారెడ్డి శనివారం స్థానిక 2టౌన్ బైపాస్ రోడ్డులోని మునిసిపల్ పార్కులో పచ్చదనం-పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, నిషేధిత సింగిల్ యూజ్ డిస్పోజబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలని ఆయన నొక్కి చెప్పారు. ప్రొద్దుటూరులో పచ్చదనం మరియు పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కమిషనర్ రవిచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • ఇబ్రహీంపట్నంలో గత రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఒక వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. తాను మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని పోలీసులు చెప్పగా, ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నన్నే ఆపుతావా, నేను ఎమ్మెల్యే తాలూకా, పలానా తమ్ముడిని' అంటూ పోలీసులపై మండిపడ్డాడు. అంతేకాకుండా, తాను ఒక రిపోర్టర్‌నని పేర్కొంటూ పోలీసులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. 'మీ అంతు చూస్తాం' అంటూ పోలీసులను, ముఖ్యంగా ఒక మహిళా ఎస్సైపై దురుసుగా ప్రవర్తించి, వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.
    1
    ఇబ్రహీంపట్నంలో గత రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఒక వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. తాను మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని పోలీసులు చెప్పగా, ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నన్నే ఆపుతావా, నేను ఎమ్మెల్యే తాలూకా, పలానా తమ్ముడిని' అంటూ పోలీసులపై మండిపడ్డాడు. అంతేకాకుండా, తాను ఒక రిపోర్టర్‌నని పేర్కొంటూ పోలీసులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. 'మీ అంతు చూస్తాం' అంటూ పోలీసులను, ముఖ్యంగా ఒక మహిళా ఎస్సైపై దురుసుగా ప్రవర్తించి, వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.
    user_జేమ్స్
    జేమ్స్
    Vijayawada East, Ntr•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.