బిజెపి జాతీయ కార్యదర్శిగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మంత్రి సత్య కుమార్ యాదవ్ కు బిజెపి నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలిపారు బిజెపి జాతీయ కార్యదర్శిగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను పట్టణ బిజెపి నాయకులు ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్కు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ దేశంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి అత్యున్నత నాయకులతో నేరుగా మాట్లాడగలిగే అవకాశం ఉన్న అతితక్కువ మంది నాయకుల్లో మీరు ఒకరు అని తెలిపారు. ఒక తెలుగువాడిగా ఆ స్థానంలో మిమ్ములను చూడటం నిజంగా గర్వకారణం సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఒక సాధారణ ఏబీవీపీ కార్యకర్తగా ప్రారంభమైన మీ ప్రజా జీవిత ప్రయాణం… నేడు బీజేపీ జాతీయ కార్యదర్శిగా, రాష్ట్ర మంత్రిగా ఎదిగిన తీరు నేటి యువతకు గొప్ప స్ఫూర్తి అని తెలిపారు. అంకితభావం, క్రమశిక్షణ, నిరంతర శ్రమ ఉంటే ఎంతటి ఉన్నత స్థానానికైనా చేరుకోవచ్చని మీప్రయాణం నిరూపించింది అని తెలిపారు. ఢిల్లీ ఎర్రకోట ప్రాకారాలపై నుంచి దేశాన్ని ఉద్దేశించి మీరు ప్రసంగించే గర్వకారణమైన క్షణాన్ని చూడాలని బిజెపి నాయకుడుగా తాము కోరుకుంటున్నామని వారు స్పష్టం చేశారు.
బిజెపి జాతీయ కార్యదర్శిగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మంత్రి సత్య కుమార్ యాదవ్ కు బిజెపి నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలిపారు బిజెపి జాతీయ కార్యదర్శిగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను పట్టణ బిజెపి నాయకులు ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్కు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ దేశంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి అత్యున్నత నాయకులతో నేరుగా మాట్లాడగలిగే అవకాశం ఉన్న అతితక్కువ మంది నాయకుల్లో మీరు ఒకరు అని తెలిపారు. ఒక తెలుగువాడిగా ఆ స్థానంలో మిమ్ములను చూడటం నిజంగా గర్వకారణం సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఒక సాధారణ ఏబీవీపీ కార్యకర్తగా ప్రారంభమైన మీ ప్రజా జీవిత ప్రయాణం… నేడు బీజేపీ జాతీయ కార్యదర్శిగా, రాష్ట్ర మంత్రిగా ఎదిగిన తీరు నేటి యువతకు గొప్ప స్ఫూర్తి అని తెలిపారు. అంకితభావం, క్రమశిక్షణ, నిరంతర శ్రమ ఉంటే ఎంతటి ఉన్నత స్థానానికైనా చేరుకోవచ్చని మీప్రయాణం నిరూపించింది అని తెలిపారు. ఢిల్లీ ఎర్రకోట ప్రాకారాలపై నుంచి దేశాన్ని ఉద్దేశించి మీరు ప్రసంగించే గర్వకారణమైన క్షణాన్ని చూడాలని బిజెపి నాయకుడుగా తాము కోరుకుంటున్నామని వారు స్పష్టం చేశారు.
- శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం డిప్యూటీ MRO శ్రీ గస్తీ నారాయణస్వామి గారి ఆత్మీయ పదవీ విరమణ మరియు సన్మాన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సోమల ప్రకాష్ నాయుడు గారు.. సోమల ప్రకాష్ నాయుడు గారు మాట్లాడుతూ డిప్యూటీ MRO నారాయణ స్వామి గారి గురించి ఆయన ముదిగుబ్బ మండలానికి చేసిన మంచి గురించి ప్రజలకు తెలియజేశారు... ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కిసాన్ మోర్చా నాయకులు పసుపులేటి వెంకటేష్ గారు పీవీ శివకుమార్ గారు దేశు నారాయణ గారు ఆర్వేటి గంగప్ప గారు నాగభూషణ గారు జనార్ధన గారు రాములు గారు2
- ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు: మున్సిపల్ కమిషనర్ ప్రొద్దుటూరు పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగంపై కమిషనర్ విశ్వనాథ్ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. శానిటేషన్ విభాగం సిబ్బందితో కలిసి కమిషనర్ చేపలు, కోళ్లు, మాంసం దుకాణాలను తనిఖీ చేశారు. పర్యావరణానికి హాని కలిగించే, క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే నిషేధిత సింగిల్ ఈజ్ ప్లాస్టిక్ కవర్లు,కప్పులు, ఇతర ఉత్పత్తులను వ్యాపారులు స్వచ్ఛందంగా అప్పగించాలని ఆదేశించారు.1
- రాయదుర్గం నియోజకవర్గంలో 29,764 ఓట్లు తొలగింపు... అభ్యంతరాలు ఉంటే మరోసారి దరఖాస్తు చేసుకోండి రాయదుర్గంలో 29,764 ఓట్ల తొలగింపు రాయదుర్గం నియోజకవర్గంలో 29,764 ఓట్లు తొలగించేందుకు డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో ప్రతిపాదించారు. జాబితాలో మెత్తం 2,36,579 ఓట్లు ఉండగా పురుష ఓటర్లు 1,17,518 కాగా మహిళా ఓటర్లు 1,19,019 ఉన్నాయి. ఇతరులు 42 మంది ఉన్నారు. వివరాలను ERO రవిశంకర్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో తప్పులు, సవరణలు, అభ్యంతరాలపై నెల రోజుల్లోపు సంబంధిత BLOలకు పిర్యాదు చేయవచ్చన్నారు.1
- ఎల్లంపల్లి తిరుమలనాథస్వామి దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సమావేశం కడప జిల్లా మైదుకూరు మండలంలోని ఎల్లంపల్లి శ్రీ తిరుమలనాథస్వామి దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మైదుకూరు ఖండ పరిధిలోని ఖాజీపేట, చాపాడు, దువ్వూరు, బ్రహ్మంగారిమఠం మండలాల గ్రామ కమిటీ సభ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ కడప జిల్లా సంయోజక్ శ్రీ తమిడేపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని సమాజంలో సమరసత, సేవా కార్యక్రమాలు, ధార్మిక చైతన్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా సహ సంయోజక్ బుసిరెడ్డి నాగేశ్వర్ రెడ్డి, అనంతపురం కన్వీనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, మైదుకూరు మున్సిపాలిటీ కన్వీనర్ ఎం. వీరారెడ్డి తదితరులు పాల్గొని సంస్థ చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ కార్యకర్తలు, గ్రామ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు.1
- పుంగనూరు లో దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు ర్యాలీ.. అన్నమయ్య జిల్లా. పుంగనూరు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 వ తేదీ నుండీ ఈ రోజు అంగ 31 వ తేదీ వరకు దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు అందరూ పెన్ డౌన్ కార్యక్రమాలు చేస్తున్నాము. చివరి రోజు అయిన ఈ రోజు పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12.30. లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండీ గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నా ము. కనుక మీరు ఈ కార్యక్రమములో పాల్గొని మాకు సహకరించగలరు. నమస్కారములతో.... పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం. పుంగనూరు......2
- వైయస్ ఆనంద్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నివాళి పులివెందులలో వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే.ఆయన నివాసానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ చేరుకున్నారు. అనంతరం ఆయన మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.1
- సెల్ ఫోన్ లో రీల్స్ చూస్తూ బస్సును నిర్లక్ష్యముగా నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్. అన్నమయ్య జిల్లా: మదనపల్లి నుండి చిత్తూరు వెళుతున్న బస్సులో సెల్ ఫోన్లో నిమగ్నమైన డ్రైవర్ ఒక చేతితో ఫోన్ చూస్తూ, మరొక్క చేతితో బస్సును నడుపుతున్నాడు. ఈ నిర్లక్ష్యము వలన ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు భాద్యులు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి భాద్యత లేని డ్రైవర్ల వల్ల ఏదైనా ప్రమాదం జరగక మునుపే సంబందిత అధికారులు స్పందిచి మరలా ఇలాంటి నిర్లక్ష్యపు పనులు చేయకుండా వారిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు. సెల్ ఫోన్ చూస్తూ బస్సు నడుపుతున్న డ్రైవర్ ను ప్రయాణికుడు తన ఫోన్ లో చిత్రీకరించడంతో వెలుగులోకి వచ్చింది. ఆ బస్సు పలమనేరు డిపోకు చెందిన బస్సు గా గుర్తింపు.1