*పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం* కథలాపూర్ ఏప్రిల్ 01 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం కథలాపూర్ మండల కేంద్రంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మండల ప్రశిక్షణ మహా అభియాన్ - 2026 సందర్భంగా 24 గంటల శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల, సిద్ధాంతపరమైన పార్టీ అని తెలిపారు. ఇతర పార్టీలతో పోలిస్తే బిజెపి ప్రత్యేకత దాని బలమైన సిద్ధాంతాలు, దేశభక్తి భావన, మరియు సేవా దృక్పథం అని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను గుండెల్లో పెట్టుకుని పనిచేయాలని సూచించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి అంత్యోదయ సిద్ధాంతం—సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేరాలి అన్న భావన—ప్రతి కార్యకర్తకు మార్గదర్శకమని అన్నారు.అదే భావంతో పార్టీ కార్యకర్తలు ప్రజల మధ్య ఉండి,వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణే పార్టీ బలమని,ఒక కార్యకర్త తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ మరియు దేశ ప్రయోజనాలను ముందుంచాలని తెలిపారు.పార్టీ ఇచ్చిన బాధ్యతలను నిబద్ధతతో,అంకితభావంతో నిర్వర్తిస్తేనే బిజెపి మరింత బలపడుతుందని అన్నారు. ఇలాంటి శిక్షణ శిబిరాలు కార్యకర్తలకు పార్టీ చరిత్ర, సిద్ధాంతాలు,విధానాలపై స్పష్టమైన అవగాహన కల్పించి నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని చెప్పారు.ప్రతి కార్యకర్త ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాసేవలో ముందుండాలని కోరారు. మండల స్థాయి నుండి బూత్ స్థాయి వరకు క్రమబద్ధమైన వ్యవస్థను నిర్మించి పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పని చేస్తే భవిష్యత్తులో బిజెపి ఘన విజయాలు సాధించడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ముఖ్య వక్తలు మాజీ మండల అధ్యక్షులు ముంజ శ్రీనివాస్,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి,జిల్లా కార్యదర్శి నంద్యాడపు వెంకటేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి కరండ్ల మధుకర్ హాజరై కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు ఈ సమావేశం విజయవంతం కావడానికి కృషి చేసిన మండల నాయకులు వారు అభినందనలు తెలియజేశారు.పాల్గొన్న ప్రతి కార్యకర్త ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో కథలాపూర్ మండల అధ్యక్షులు మల్యాల మారుతి,ప్రధాన కార్యదర్శి నరెడ్ల రవి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కథలాపూర్ మహేష్, సీనియర్ నాయకులు బద్రి సత్యం, గాందారి శ్రీనివాస్, పిడుగు ఆనంద్ రెడ్డి,కంటే రాజాం, అందే రాజాం మరియు బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంఛార్జ్,సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు
*పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం* కథలాపూర్ ఏప్రిల్ 01 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం కథలాపూర్ మండల కేంద్రంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మండల ప్రశిక్షణ మహా అభియాన్ - 2026 సందర్భంగా 24 గంటల శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల, సిద్ధాంతపరమైన పార్టీ అని తెలిపారు. ఇతర పార్టీలతో పోలిస్తే బిజెపి ప్రత్యేకత దాని బలమైన సిద్ధాంతాలు, దేశభక్తి భావన, మరియు సేవా దృక్పథం అని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను గుండెల్లో పెట్టుకుని పనిచేయాలని సూచించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి అంత్యోదయ సిద్ధాంతం—సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేరాలి అన్న భావన—ప్రతి కార్యకర్తకు మార్గదర్శకమని అన్నారు.అదే భావంతో పార్టీ కార్యకర్తలు ప్రజల మధ్య ఉండి,వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణే పార్టీ బలమని,ఒక కార్యకర్త తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ మరియు దేశ ప్రయోజనాలను ముందుంచాలని తెలిపారు.పార్టీ ఇచ్చిన బాధ్యతలను నిబద్ధతతో,అంకితభావంతో నిర్వర్తిస్తేనే బిజెపి మరింత బలపడుతుందని అన్నారు. ఇలాంటి శిక్షణ శిబిరాలు కార్యకర్తలకు పార్టీ చరిత్ర, సిద్ధాంతాలు,విధానాలపై
స్పష్టమైన అవగాహన కల్పించి నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని చెప్పారు.ప్రతి కార్యకర్త ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాసేవలో ముందుండాలని కోరారు. మండల స్థాయి నుండి బూత్ స్థాయి వరకు క్రమబద్ధమైన వ్యవస్థను నిర్మించి పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పని చేస్తే భవిష్యత్తులో బిజెపి ఘన విజయాలు సాధించడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ముఖ్య వక్తలు మాజీ మండల అధ్యక్షులు ముంజ శ్రీనివాస్,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి,జిల్లా కార్యదర్శి నంద్యాడపు వెంకటేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి కరండ్ల మధుకర్ హాజరై కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు ఈ సమావేశం విజయవంతం కావడానికి కృషి చేసిన మండల నాయకులు వారు అభినందనలు తెలియజేశారు.పాల్గొన్న ప్రతి కార్యకర్త ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో కథలాపూర్ మండల అధ్యక్షులు మల్యాల మారుతి,ప్రధాన కార్యదర్శి నరెడ్ల రవి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కథలాపూర్ మహేష్, సీనియర్ నాయకులు బద్రి సత్యం, గాందారి శ్రీనివాస్, పిడుగు ఆనంద్ రెడ్డి,కంటే రాజాం, అందే రాజాం మరియు బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంఛార్జ్,సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు
- *సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్,వాహనాలకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరి* కోరుట్ల మార్చి 31 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం పట్టణంలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads” కార్యక్రమంలో భాగంగా సోమవారం కొరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో కొరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలకు చెందిన లారీ, ఐచర్ ఇతర భారీ వాహనాల డ్రైవర్లు, యజమానుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ట్రాఫిక్ నియమాలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాముఖ్యత, రహదారి భద్రతపై మార్గదర్శకాలు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “Arrive Alive” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. రాత్రి సమయంలో వాహనాలను రోడ్డు పక్కన నిలిపే సందర్భాల్లో రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని, తద్వారా ఇతర వాహనదారులకు వాహనాలు స్పష్టంగా కనిపించి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అధిక ప్రకాశం ఉన్న ఎల్ఈడి లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తాయని, వాటిని నియంత్రణలో వినియోగించాలని సూచించారు. అలాగే అధిక లోడ్‌తో లారీలు, ఐచర్ వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా లారీలు, వ్యాన్ వాహనాలకు రేడియం స్టిక్కర్లను అతికించి డ్రైవర్లకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, ఎంవిఐ శ్రీనివాస్ తదితరులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్, కొరుట్ల ఎస్సైలు చిరంజీవి, రామచంద్రం, మెట్‌పల్లి ఎస్సై కిరణ్, మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి, కథలాపూర్ ఎస్సై రవికిరణ్, అలాగే లారీ, వ్యాన్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు, యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు4
- లక్షెట్టిపేటలో హనుమాన్ శోభాయాత్ర నేత్రపర్వంగా జరుగుతోంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం రాత్రి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయం నుండి హనుమాన్ భక్తులు, ప్రజలు హనుమాన్ ఫ్లెక్సీని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తి గీతాలు ఆలపించారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని తిప్పాపురం గోశాలను ఆలయ ఈవో ఎల్. రమాదేవి, జిల్లా వెటర్నరీ అనిమల్ హస్బండ్రీ అధికారి రవీందర్ రెడ్డి కలిసి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోవులను ఎండ వేడి ప్రభావం నుండి రక్షించేందుకు చేపట్టిన చర్యలను వారు పరిశీలించారు.గోశాల చుట్టూ గ్రీన్ నెట్ ఏర్పాటు, జంబో కూలర్లు, ఫ్యాన్లు, చలువ పందిళ్లు వంటి సౌకర్యాలను సమీక్షించారు.అలాగే గోవులకు తాగునీరు, కార్న్ సైలేజ్ (పశువులకు ప్రత్యేక ఆహారం) సరైన విధంగా అందుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించారు. గోవులకు అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా చూసి, వాటికి పెట్టి గోవులు తింటున్నాయా అనే విషయాన్ని కూడా ఈవో రమాదేవి గమనించారు.గోవుల ఆరోగ్య పరిస్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోశాలలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి, గోవుల సంరక్షణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇదే సందర్భంలో రాజన్న కోడె మొక్కుల నిర్వహణ, వాటి ప్రాముఖ్యత గురించి కూడా వివరంగా చర్చించారు.ఈ తనిఖీలలో పర్యవేక్షకులు విజయ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి తదితర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.1
- నేరడిగొండ మండలంలోని బొందిడి గ్రామానికి చెందిన ఆడే రమేష్ (టీచర్) పదవి విరమణ సందర్భంగా ఆయన నివాసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ హాజరై టీచర్ రమేష్ ని శాలువాతో సన్మానించి వారి సేవలను ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన కవ్వంపల్లి రవి ఆవుతోపాటు లేగ దూడ పై హైనా దాడి చంపి వేయడంతో వెంటనే రవి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫిసర్ చేరుకొని దాడి చేసిన జంతువు హైనాగా గుర్తించారు రాత్రి వెళ్లలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్ సూచించారు.1
- కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్లోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన 'రైతునేస్తం' కార్యక్రమంలో భాగంగా వీసీ ద్వారా యూరియా యాప్పై రైతులకు అవగాహన కల్పించారు. ఏఈవో సౌమ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ.. దళారీల ప్రమేయం లేకుండా, ఎరువులు పక్కదారి పట్టకుండా ఉండేందుకే ఈ యాప్ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రైతులు నేరుగా యాప్ ద్వారానే యూరియా కొనుగోలు చేయాలని సూచించారు.1
- Post by Solanke Ravi4
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గత 18 రోజుల కాలంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయం వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు. రూ.93,52,748/- నగదు రూపం లో ఆదాయంగా వచ్చినట్లు, అదే విధంగా, మిశ్రమ బంగారం – 60 గ్రాములు,100 మిల్లి గ్రాములు మిశ్రమ వెండి – 2 కిలోల 900 గ్రాములు వచ్చినట్లుగా తెలిపారు.ఈ హుండీ లెక్కింపు ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి , శ్రీ రాజమౌళి (కరీంనగర్ ఏసీఆఫీస్) , పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సహాయ కార్య నిర్వహణాధికారులు, అధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి పాల్గొన్నారు.1