logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి ఫోర్త్ సిటీలో 5 ఎకరాల భూమిని కట్టబెట్టారు: బిఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి చెందిన కంపెనీకి రావిర్యాలలోని ఫోర్త్ సిటీలో రూ.100 కోట్లకు పైగా విలువైన 5 ఎకరాల భూమిని కేవలం రూ.7 కోట్లకు కట్టబెట్టారు కొండల్ రెడ్డి సూట్ వెయ్యగానే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ యొక్క ఎక్స్‌పర్ట్ అయిపోయారా? ఈ డొల్ల షెల్ కంపెనీని అడ్డం పెట్టుకొని కొండల్ రెడ్డి అమెరికా వాళ్లను కూడా మోసం చేస్తూ, వాళ్లతో సమావేశం పెడుతున్నాడు * బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్

2 days ago
user_Sangareddy News
Sangareddy News
Local News Reporter Saidabad, Hyderabad•
2 days ago

రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి ఫోర్త్ సిటీలో 5 ఎకరాల భూమిని కట్టబెట్టారు: బిఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి చెందిన కంపెనీకి రావిర్యాలలోని ఫోర్త్ సిటీలో రూ.100 కోట్లకు పైగా విలువైన 5 ఎకరాల భూమిని కేవలం రూ.7 కోట్లకు కట్టబెట్టారు కొండల్ రెడ్డి సూట్ వెయ్యగానే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ యొక్క ఎక్స్‌పర్ట్ అయిపోయారా? ఈ డొల్ల షెల్ కంపెనీని అడ్డం పెట్టుకొని కొండల్ రెడ్డి అమెరికా వాళ్లను కూడా మోసం చేస్తూ, వాళ్లతో సమావేశం పెడుతున్నాడు * బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్

More news from తెలంగాణ and nearby areas
  • కంటి వెలుగు ఆపేశారు: కేటీఆర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో కేటీఆర్ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి, కళ్లద్దాలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిన 'కంటి వెలుగు'ను కొనసాగించేలా ఈ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ అవసరమైన 171 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. మనల్ని చూసైనా ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తే మంచిదని హితవు పలికారు.
    2
    కంటి వెలుగు ఆపేశారు: కేటీఆర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు
సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో కేటీఆర్ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి, కళ్లద్దాలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిన 'కంటి వెలుగు'ను కొనసాగించేలా ఈ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ అవసరమైన 171 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. మనల్ని చూసైనా ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తే మంచిదని హితవు పలికారు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    13 hrs ago
  • తగ్గిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. నిత్య ఆర్జిత సేవలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అందులో VIP దర్శనాల ద్వారా రూ.87,900, బ్రేక్ దర్శనాలతో తగ్గిన యాదగిరిగుట్ట రూ.88,200, అన్న ప్రసాదంతో రూ.1,26,335, కార్ పార్కింగ్ తో రూ.2,21,500, ప్రసాద్ విక్రయాలతో రూ.4,03,350 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,54,133 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.
    1
    తగ్గిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. నిత్య ఆర్జిత సేవలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అందులో VIP దర్శనాల ద్వారా రూ.87,900, బ్రేక్ దర్శనాలతో తగ్గిన యాదగిరిగుట్ట రూ.88,200, అన్న ప్రసాదంతో రూ.1,26,335, కార్ పార్కింగ్ తో రూ.2,21,500, ప్రసాద్ విక్రయాలతో రూ.4,03,350 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,54,133 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    1 hr ago
  • వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే కడియం.. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామంలో శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.బుధవారం శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక విశిష్టత కలిగిన ఆలయం శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా 86 రకాల సర్ప దోషాలకు నివారణ పూజలు ఈ ఒక్క శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలోనే జరుగుతాయని,ఇంత గోప్ప విశిష్టత కలిగిన ఆలయంలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఆలయ అభివృద్ధికి సంబందించి ఇప్పటికే ఆలయ ప్రధాన అర్చకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారని, ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కేశవనగర్ నుండి శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మీదుగా పెద్దపెండ్యాల వరకు త్వరలోనే రోడ్డు మంజూరు చేయిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
    1
    వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే కడియం..
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామంలో శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.బుధవారం శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. 
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక విశిష్టత కలిగిన ఆలయం శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా 86 రకాల సర్ప దోషాలకు నివారణ పూజలు ఈ ఒక్క శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలోనే జరుగుతాయని,ఇంత గోప్ప విశిష్టత కలిగిన ఆలయంలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఆలయ అభివృద్ధికి సంబందించి ఇప్పటికే ఆలయ ప్రధాన అర్చకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారని, ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కేశవనగర్ నుండి శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మీదుగా పెద్దపెండ్యాల వరకు త్వరలోనే రోడ్డు మంజూరు చేయిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    6 hrs ago
  • ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిరసన సెగ... 60ఏండ్ల మీరు ఎమ్మెల్సీ కావొచ్చు... 30 ఏండ్ల మేము ఉద్యోగులు కాకుడదా? మీరు చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము, ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు కోదండరాంను అడ్డుకుని నిలదీసిన నిరుద్యోగులు, సమాధానం చెప్పలేక వెనుదిరిగిన వైనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంచే అంశంపై కోదండరాంను అడ్డుకున్న నిరుద్యోగులు. మీ మాటలు నమ్మి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాము, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పట్టించుకోకపోతే ఎందుకు మౌనంగా ఉన్నారు. మీడియా కూడా మా సమస్యలను కవర్ చేయడం లేదు, మా సమస్యలను కవర్ చేయమని మీడియాకు చెప్పండి అంటూ కోదండరాంను నిలదీసిన నిరుద్యోగులు.
    1
    ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిరసన సెగ... 60ఏండ్ల మీరు ఎమ్మెల్సీ కావొచ్చు... 30 ఏండ్ల మేము ఉద్యోగులు కాకుడదా?
మీరు చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము, ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు కోదండరాంను అడ్డుకుని నిలదీసిన నిరుద్యోగులు, సమాధానం చెప్పలేక వెనుదిరిగిన వైనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంచే అంశంపై కోదండరాంను అడ్డుకున్న నిరుద్యోగులు. మీ మాటలు నమ్మి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాము, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పట్టించుకోకపోతే ఎందుకు మౌనంగా ఉన్నారు. మీడియా కూడా మా సమస్యలను కవర్ చేయడం లేదు, మా సమస్యలను కవర్ చేయమని మీడియాకు చెప్పండి అంటూ కోదండరాంను నిలదీసిన నిరుద్యోగులు.
    user_Journalist Anil kumar
    Journalist Anil kumar
    Local News Reporter Medipally, Medchal Malkajgiri•
    3 hrs ago
  • ఫహద్ ఫాజిల్ నటించిన 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' (Don’t Trouble the Trouble) చిత్రం నుండి 'కేకు వాక్కు' (Cakeu Walku) అనే మ్యూజిక్ వీడియో విడుదలైంది. ఈ పాటను కాల భైరవ సంగీత దర్శకత్వంలో రూపొందించారు. ఇందులో ఫహద్ ఫాజిల్ మరియు సారా పలేకర్ డ్యాన్స్‌తో అలరించారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది.
    1
    ఫహద్ ఫాజిల్ నటించిన 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' (Don’t Trouble the Trouble) చిత్రం నుండి 'కేకు వాక్కు' (Cakeu Walku) అనే మ్యూజిక్ వీడియో విడుదలైంది.

ఈ పాటను కాల భైరవ సంగీత దర్శకత్వంలో రూపొందించారు.
ఇందులో ఫహద్ ఫాజిల్ మరియు సారా పలేకర్ డ్యాన్స్‌తో అలరించారు.
ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • మెదక్‌లో జిల్లా కేంద్రంలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల చలో కలెక్టరేట్ విద్యా రంగంలో సమస్యలను పరిష్కరించడంతో పాటు విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమం మెదక్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తతకు దారితీసింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలెక్టరేట్ వైపు ర్యాలీగా బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
    1
    మెదక్‌లో జిల్లా కేంద్రంలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల చలో కలెక్టరేట్
విద్యా రంగంలో సమస్యలను పరిష్కరించడంతో పాటు విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమం మెదక్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తతకు దారితీసింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలెక్టరేట్ వైపు ర్యాలీగా బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.