Shuru
Apke Nagar Ki App…
Chinni. P
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- manasuloni mata1
- రంపచోడవరం ఐటిడిఎలో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ 155 అర్జీలను స్వీకరించారు. గిరిజన ప్రాంత సమస్యలను నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాజవొమ్మంగిలో బస్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా, పెండింగ్ అర్జీలపై అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.1
- రోడ్డు కోసం ఇబందులు పడుతున్న జన్నాల్ వజంగి గ్రామం దయచేసి రోడ్డు ఇస్తారని కోరుకుంటూనమం ధన్యవాదములు1
- పిఠాపురం: యువత డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండి, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని ఆదర్శ కళాశాల వేదికగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 పేరుతో చేపట్టిన సైకిల్ యాత్రలో భాగంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈగల్ అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ బాబు మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులను, శిక్షలను వివరించారు. చిన్న వయసులో డ్రగ్స్‌కు బానిసలైతే భవిష్యత్తు నాశనమవడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని హెచ్చరించారు. వ్యసనాల నుంచి బయటపడటానికి ఉన్న మార్గాలను విద్యార్థులకు సూచించారు. కాకినాడ జిల్లా ఈగల్ సీఐ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్) మాట్లాడుతూ... వందల అడుగుల ఎత్తులో ఎగిరే గ్రద్ద భూమిపై ఉన్న ఆహారాన్ని ఎంత స్పష్టంగా గమనిస్తుందో...ఈగల్ విభాగం మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అదే స్థాయిలో నిఘా ఉంచుతున్నారని, డ్రగ్స్, గంజాయి విక్రయించినా లేదా వినియోగించినా చట్టం నుంచి తప్పించుకోలేరని, డ్రగ్స్ వినియోగం అనేది కేవలం వ్యక్తిగత సమస్య కాదని, అది జాతీయ భద్రతకే ముప్పు అని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఫౌండర్ విజయ్ కలాం మాట్లాడుతూ... అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నిజమైన దేశభక్తి ఉన్నవారు ఎవరూ డ్రగ్స్ జోలికి వెళ్లరని, విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు,ఈగల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు,గొల్లప్రోలు ఎస్సై ఎన్. రామకృష్ణ, ప్రిన్సిపాల్ వి. శ్రీనివాసరావు, వైబ్రంట్స్ ఆఫ్ కలాం కోఆర్డినేటర్లు, కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మరియు ఈగల్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.3
- శృంగేరి శంకరమఠానికి చెందిన పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు ఆఖరి రోజుకు ఘనంగా చేరుకున్నాయి ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిపారు1
- విశాఖ గాజువాక సోనోవిజన్ 4వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది... జనరేటర్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటున్న సోనో విజన్ షోరూమ్ యాజమాన్యం. ఘటన స్థలాలనికి చేరుకున్న గాజువాక ఫైర్ ఇంజన్లు దట్టమైన పొగలు, మంటలు చెలరేగడంతో అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది... యాభై లక్షలు ఆస్థి నష్టం అంచనా వేసిన అధికారులు... అనాధికార నిర్మాణంలో ఎలక్ట్రికల్ గూడ్స్ స్టోరేజ్ చేయడంతో చెలరేగిన మంటలు... గాజువాకలో అనాదికార నిర్మాణాలకి జీవీఎంసీ, రాజకీయ నేతలు అనుమతులు ఇవ్వడంతో కనీసం ఫైర్ సేఫ్టీ లేని నిర్మాణాలలో మంటలు చెలరేగుతున్నాయి...4
- Post by Rai Narendra1
- పిఠాపురం: పేదవాడు సొంత ఇల్లు కట్టుకోవాలన్నా రాజకీయ నాయకులకు 'లంచాలు' ఇచ్చుకోవాల్సిన దుస్థితి పిఠాపురంలో నెలకొంది. ఇంటి నిర్మాణం చేపట్టిన ఒక పేద మహిళను జనసేన నాయకులు బెదిరింపులకు గురిచేయడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీకి చెందిన కఠారి సత్యవతి అనే పేద మహిళకు ప్రభుత్వం నుండి రెండు సెంట్ల పట్టా మంజూరైంది. తనకున్న కొద్దిపాటి స్థలంలో ఆమె ఇంటి నిర్మాణం చేపట్టింది. ఆదివారం ఇంటికి స్లాబ్ వేసేందుకు సిద్ధమవగా, జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు అక్కడకు చేరుకుని దౌర్జన్యానికి దిగారని, మాకు 60 వేల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాం.. లేదంటే ఇక్కడ ఇటుక కూడా కదలనివ్వం" అంటూ సత్యవతిని బెదిరించారని బాధితురాలు వాపోయారు. నేను ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటుంటే అడ్డుకుంటున్నారు. చివరకు పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పినా సరే, మాకు డబ్బులు ఇవ్వాల్సిందేనని వారు తెగేసి చెబుతున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి అరాచకం వల్ల పని మధ్యలో ఆగిపోయి,సుమారు 20 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. న్యాయం కోసం బాధితురాలు సిపిఐ నాయకులను ఆశ్రయించగా పిఠాపురం సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ,ఖండవల్లి సుబ్బారావు తదితరులు ఆమెకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. అధికార గర్వంతో పేద ప్రజలను వేధించడం సరికాదని మండిపడ్డారు. పట్టా ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే లంచాల కోసం బెదిరించడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ఈ అక్రమ వసూళ్లు, బెదిరింపులపై బాధితురాలు మరియు సిపిఐ నాయకులు కలిసి పాడా ఆఫీసులో ఫిర్యాదు చేశారు. పోలీసులు మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధితురాలికి రక్షణ కల్పించాలని, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.1