తెలంగాణకు రండి.. పెట్టుబడులు పెట్టండి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, శురూ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పిస్తున్నాం, ఫార్చ్చున్ 500 కంపెనీలు ఫ్యూచర్ సిటీకి రావాలనేదే తమ లక్ష్యంగా పని చేస్తున్నామని, రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ లేదని సీఐఐ ఉత్తర భారత ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఉత్తర భారత ప్రతినిధుల సమావేశం హైదరాబాద్ లో జరిగింది. ఈ సీఎం ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వివిధ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ సురక్షిత స్థానమని, తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఉత్తర భారత ప్రతినిధులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం పెట్టుబడులకు రక్షణగా నిలుస్తుందని సీఎం హామీ ఇచ్చారు. భారత దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్లుగా విజయవంతం గా కొనసాగుతున్నట్లే, సీఐఐ కూడా 130 ఏళ్ల నుంచి విజయవంతంగా కొనసాగు తోందన్నారు. తెలంగాణ బిడ్డ పి.వి. నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (LPG) ఫలితాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నామని సీఎం అన్నారు. ప్రభుత్వాలు మారినా తెలంగాణలో పారిశ్రామిక విధానాలను మార్చడం లేదని సీఎం అన్నారు. 1994 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అనేక పెట్టుబడులను ఆకర్షించారని, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి దిగ్గజాలను హైదరాబాద్ కు తీసుకువచ్చారని సీఎం గుర్తు చేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో అంతర్జాతయ ఎయిర్ పోర్టు, అవుటర్ రింగ్ రోడ్డు, ఫార్మా, ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయన్నారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పాలనలో వాళ్లు కొన్ని పాలసీలు తీసుకువచ్చారని, వాటిని కొనసాగిస్తూనే తాము సరికొత్త పాలసీలు తీసుకు వచ్చామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ లేదని, నాయకులు ఎవరైనా, పార్టీ ఏదైనా మంచి పాలసీ తీసుకువస్తే అది కొనసాగుతోందన్నారు. తాము తీసుకువచ్చిన పారిశ్రామిక విధానాలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నా మని, మంచి ప్రతిపాదనలతో వచ్చిన వారికి ప్రోత్సాహాకాలు ఇస్తున్నామని సీఎం తెలిపారు. ఫార్చ్యున్ 500 కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలనేది తమ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో గత డిసెంబర్ లో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేశామని, సమ్మిట్లో 175 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని సీఎం వివరించారు. తెలంగాణ రైజింగ్ - 2047 పాలసీని గ్లోబల్ సమ్మిట్ లో ప్రకటించామని సీఎం తెలిపారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా అయిదు శాతంగా ఉందని, అది 10 శాతంగా ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం వెల్లడించారు. కాలుష్యంతో ఢిల్లీ, వర్షాలతో ముంబయి, ట్రాఫిక్ కష్టాలతో బెంగళూరు, ప్రకృతి వైపరీత్యాలతో చెన్నై సతమవుతున్నా యని, ఈ నేపథ్యంలో భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజించామని సీఎం తెలిపారు. 160 కి.మీ. పొడవైన ఔటర్ రింగు రోడ్డు లోపల ప్రాంతాన్ని క్యూర్‌గా గుర్తించామని, ఇక్కడ సర్వీస్ సెక్టార్‌కు పెద్ద పీట వేస్తున్నామని సీఎం తెలిపారు. ఔటర్ రింగు రోడ్డు నుంచి రీజినల్ రింగు రోడ్డు వరకు ప్రాంతాన్ని ప్యూర్‌గా గుర్తించామని, అక్కడ మాన్యుఫ్యాక్చర్ రంగానికి ప్రాధాన్యమిస్తున్నామని సీఎం తెలిపారు. రీజినల్ రింగు రోడ్డు వెలుపల వ్యవసాయ రంగానికి, అగ్రి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సీఎం వివరించారు. ప్యూర్, రేర్ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు ఇవ్వడంతో పాటు ఇతర వసతులు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల రహదారి నిర్మించనున్నామని, విభాగాల వారీగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని సీఎం వివరించారు. వరంగల్, ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు కేంద్రం నుంచి అనుమతి తెలిపిందని, 7 బుల్లెట్ ట్రైన్ల ను కేంద్రం ప్రకటిస్తే 3 తెలంగాణకు వచ్చాయన్నారు. శంషాబాద్ నుంచి చెన్నై, శంషాబాద్ నుంచి పూణె, శంషాబాద్ నుంచి బెంగళూరు బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నా యన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోటీ పడదల్చుకోలేదని, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోటీ పడి తెలంగాణను ఉన్నత స్థితిలో నిలపడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2037 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు. తెలంగాణ సంస్కృతి తమకు పెద్ద ఆస్తి అని, హైదరాబాద్‌లో అన్ని రాష్ట్రాల ప్రజలున్నారని సీఎం తెలిపారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టిన దానికి రెట్టింపు ఆదాయం వస్తుందని సీఎం అన్నారు. పారిశ్రామికవేత్తలు తమకు ఏం కావాలో చెబితే ఆ వసతులు కల్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నిత్యం అందుబాటులో ఉంటారని, పరిశ్రమల శాఖ మంత్రి ప్రతి రెండు నెలలకోసారి, తాను ప్రతి మూడు నెలలకు ఒకసారి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని సీఎం తెలిపారు. తెలంగాణను మీ సొంత ప్రాంతంగా భావించాలని సీఐఐ ప్రతినిధులకు సీఎం సూచించారు. ఏఐ సునామీతో వైట్ కాలర్ జాబ్‌లు పోతున్నాయని, దాంతో తాము నైపుణ్యాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పామని, దానికి ఛైర్మన్ గా ఆనంద్ మహీంద్రా, డైరెక్టర్లుగా కార్పొరేట్ కంపెనీల దిగ్గజాలు ఉన్నారని సీఎం తెలిపారు. దేశంలోనే తమది బెస్ట్ స్కిల్ యూనివర్సిటీ అని సీఎం అన్నారు. రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా మార్చుతున్నామని, అందులో శిక్షణ పొందిన వారికి 100 శాతం ఉద్యోగాలు వచ్చాయని సీఎం తెలిపారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సులనే బోధిస్తున్నామన్నారు. ఇక్కడి జీసీసీ ల్లో 200 కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని, అమెజాన్ డేటా సెంటర్ల పైన రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెడుతోందని, అదాన్ రూ.35 వేల కోట్లు డేటా సెంటర్ పైన పెట్టుబడి పెడుతోందని సీఎం తెలిపారు. అనంతరం సీఐఐ నార్తరన్ రీజియన్ ఛైర్మన్ పునీత్ కౌరా మాట్లాడుతూ తెలంగాణ పారిశ్రామిక విధానాలకు ఆకర్షితులమయ్యామని అన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానాలు చాలా బాగున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాకాలు, ఇస్తున్న మద్దతుతో జీసీసీలు హైదరాబాద్‌కు వరుసకడుతున్నాయ న్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఇక్కడ ఉందన్నారు. మౌలిక వసతులు, ప్రభుత్వ సహాయ సహకారాలు మెరుగ్గా ఉండడంతోనే సమావేశానికి హైదరాబాద్‌ను ఎంచుకున్నామని, ఇక్కడ అధ్యయనం చేసేందుకు వచ్చామన్నారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య, సీఐఐ నార్తరన్ రీజియన్ వైస్ ఛైర్మన్ శారదా సూరి మార్వా, ప్రతినిధులు కృష్ణ బోధనపు, గౌరవ్ మహేశ్వరి, వనిత దాట్ల, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వినోద్ కె బాప్న తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణకు రండి.. పెట్టుబడులు పెట్టండి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, శురూ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పిస్తున్నాం, ఫార్చ్చున్ 500 కంపెనీలు ఫ్యూచర్ సిటీకి రావాలనేదే తమ లక్ష్యంగా పని చేస్తున్నామని, రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ లేదని సీఐఐ ఉత్తర భారత ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఉత్తర భారత ప్రతినిధుల సమావేశం హైదరాబాద్ లో జరిగింది. ఈ సీఎం ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వివిధ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ సురక్షిత స్థానమని, తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఉత్తర భారత ప్రతినిధులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం పెట్టుబడులకు రక్షణగా నిలుస్తుందని సీఎం హామీ ఇచ్చారు. భారత దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్లుగా విజయవంతం గా కొనసాగుతున్నట్లే, సీఐఐ కూడా 130 ఏళ్ల నుంచి విజయవంతంగా కొనసాగు తోందన్నారు. తెలంగాణ బిడ్డ పి.వి. నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (LPG) ఫలితాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నామని సీఎం అన్నారు. ప్రభుత్వాలు మారినా తెలంగాణలో పారిశ్రామిక విధానాలను మార్చడం లేదని సీఎం అన్నారు. 1994 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అనేక పెట్టుబడులను ఆకర్షించారని, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి దిగ్గజాలను హైదరాబాద్ కు తీసుకువచ్చారని సీఎం గుర్తు చేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో అంతర్జాతయ ఎయిర్ పోర్టు, అవుటర్ రింగ్ రోడ్డు, ఫార్మా, ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయన్నారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పాలనలో వాళ్లు కొన్ని పాలసీలు తీసుకువచ్చారని, వాటిని కొనసాగిస్తూనే తాము సరికొత్త పాలసీలు తీసుకు వచ్చామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ లేదని, నాయకులు ఎవరైనా, పార్టీ ఏదైనా మంచి పాలసీ తీసుకువస్తే అది కొనసాగుతోందన్నారు. తాము తీసుకువచ్చిన పారిశ్రామిక విధానాలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నా మని, మంచి ప్రతిపాదనలతో వచ్చిన వారికి ప్రోత్సాహాకాలు ఇస్తున్నామని సీఎం తెలిపారు. ఫార్చ్యున్ 500 కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలనేది తమ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో గత డిసెంబర్ లో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేశామని, సమ్మిట్లో 175 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని సీఎం వివరించారు. తెలంగాణ రైజింగ్ - 2047 పాలసీని గ్లోబల్ సమ్మిట్ లో ప్రకటించామని సీఎం తెలిపారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా అయిదు శాతంగా ఉందని, అది 10 శాతంగా ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం వెల్లడించారు. కాలుష్యంతో ఢిల్లీ, వర్షాలతో ముంబయి, ట్రాఫిక్ కష్టాలతో బెంగళూరు, ప్రకృతి వైపరీత్యాలతో చెన్నై సతమవుతున్నా యని, ఈ నేపథ్యంలో భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజించామని సీఎం తెలిపారు. 160 కి.మీ. పొడవైన ఔటర్ రింగు రోడ్డు లోపల ప్రాంతాన్ని క్యూర్‌గా గుర్తించామని, ఇక్కడ సర్వీస్ సెక్టార్‌కు పెద్ద పీట వేస్తున్నామని సీఎం తెలిపారు. ఔటర్ రింగు రోడ్డు నుంచి రీజినల్ రింగు రోడ్డు వరకు ప్రాంతాన్ని ప్యూర్‌గా గుర్తించామని, అక్కడ మాన్యుఫ్యాక్చర్ రంగానికి ప్రాధాన్యమిస్తున్నామని సీఎం తెలిపారు. రీజినల్ రింగు రోడ్డు వెలుపల
వ్యవసాయ రంగానికి, అగ్రి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సీఎం వివరించారు. ప్యూర్, రేర్ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు ఇవ్వడంతో పాటు ఇతర వసతులు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల రహదారి నిర్మించనున్నామని, విభాగాల వారీగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని సీఎం వివరించారు. వరంగల్, ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు కేంద్రం నుంచి అనుమతి తెలిపిందని, 7 బుల్లెట్ ట్రైన్ల ను కేంద్రం ప్రకటిస్తే 3 తెలంగాణకు వచ్చాయన్నారు. శంషాబాద్ నుంచి చెన్నై, శంషాబాద్ నుంచి పూణె, శంషాబాద్ నుంచి బెంగళూరు బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నా యన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోటీ పడదల్చుకోలేదని, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోటీ పడి తెలంగాణను ఉన్నత స్థితిలో నిలపడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2037 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు. తెలంగాణ సంస్కృతి తమకు పెద్ద ఆస్తి అని, హైదరాబాద్‌లో అన్ని రాష్ట్రాల ప్రజలున్నారని సీఎం తెలిపారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టిన దానికి రెట్టింపు ఆదాయం వస్తుందని సీఎం అన్నారు. పారిశ్రామికవేత్తలు తమకు ఏం కావాలో చెబితే ఆ వసతులు కల్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నిత్యం అందుబాటులో ఉంటారని, పరిశ్రమల శాఖ మంత్రి ప్రతి రెండు నెలలకోసారి, తాను ప్రతి మూడు నెలలకు ఒకసారి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని సీఎం తెలిపారు. తెలంగాణను మీ సొంత ప్రాంతంగా భావించాలని సీఐఐ ప్రతినిధులకు సీఎం సూచించారు. ఏఐ సునామీతో వైట్ కాలర్ జాబ్‌లు పోతున్నాయని, దాంతో తాము నైపుణ్యాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పామని, దానికి ఛైర్మన్ గా ఆనంద్ మహీంద్రా, డైరెక్టర్లుగా కార్పొరేట్ కంపెనీల దిగ్గజాలు ఉన్నారని సీఎం తెలిపారు. దేశంలోనే తమది బెస్ట్ స్కిల్ యూనివర్సిటీ అని సీఎం అన్నారు. రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా మార్చుతున్నామని, అందులో శిక్షణ పొందిన వారికి 100 శాతం ఉద్యోగాలు వచ్చాయని సీఎం తెలిపారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సులనే బోధిస్తున్నామన్నారు. ఇక్కడి జీసీసీ ల్లో 200 కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని, అమెజాన్ డేటా సెంటర్ల పైన రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెడుతోందని, అదాన్ రూ.35 వేల కోట్లు డేటా సెంటర్ పైన పెట్టుబడి పెడుతోందని సీఎం తెలిపారు. అనంతరం సీఐఐ నార్తరన్ రీజియన్ ఛైర్మన్ పునీత్ కౌరా మాట్లాడుతూ తెలంగాణ పారిశ్రామిక విధానాలకు ఆకర్షితులమయ్యామని అన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానాలు చాలా బాగున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాకాలు, ఇస్తున్న మద్దతుతో జీసీసీలు హైదరాబాద్‌కు వరుసకడుతున్నాయ న్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఇక్కడ ఉందన్నారు. మౌలిక వసతులు, ప్రభుత్వ సహాయ సహకారాలు మెరుగ్గా ఉండడంతోనే సమావేశానికి హైదరాబాద్‌ను ఎంచుకున్నామని, ఇక్కడ అధ్యయనం చేసేందుకు వచ్చామన్నారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య, సీఐఐ నార్తరన్ రీజియన్ వైస్ ఛైర్మన్ శారదా సూరి మార్వా, ప్రతినిధులు కృష్ణ బోధనపు, గౌరవ్ మహేశ్వరి, వనిత దాట్ల, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వినోద్ కె బాప్న తదితరులు పాల్గొన్నారు.
- తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.2
- సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న జనగామ నాయకులు.... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ ఎస్ పార్టీ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పార్టీలతో ప్రమేయం లేకుండా పలువురు ప్రజాప్రతినిధులు,పలు పార్టీల నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. శుక్రవారం తన స్వంత గ్రామమైన నల్లబెల్లి లో నిర్వహించిన ఈ అంతిమ యాత్రలో జనగామ జిల్లా నుండి జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే లు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ అంతిమయాత్రలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు జిల్లా నలుమూలల నుండి ప్రజలు హాజరయ్యారు.1
- ప్రజల నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో నర్సంపేట ప్రజా జనం వరంగల్ జిల్లా ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో1
- రాజాపేట మండలంలో భూ సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాజాపేట మండలంలోని బసంతపురం, కాల్వపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను నమోదు చేసి, వివాదాలకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.1
- మోత్కూర్ పాటిమట్ల ఎక్స్ రోడ్డులో 6 బెల్ట్ షాపులపై ఏకకాలంలో తనిఖీలు – భారీగా అక్రమ మద్యం స్వాధీనం1
- భువనగిరి: స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల భారీ ర్యాలీ... భువనగిరిలో విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంపీ టైగర్ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు బస్టాండ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.1
- నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం. పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది భౌతికఖాయానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు.కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు.శోకసంద్రంలో మునిగిపోయిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలు. కొనసాగుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర.1
- పార్టీతో పనిలేదు ప్రతి అర్హత కుటుంబానికి ఇందిరమ్మ సొంత ఇల్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం పార్టీతో పనిలేదుప్రతి అర్హత కుటుంబానికి ఇందిరమ్మ సొంతఇల్లు... అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. ఇది కేవలం పథకం కాదు - గౌరవంతో జీవించే హక్కు... నిరుపేదలకు భరోసా ఇందిరమ్మ ఇల్లు... కప్పు లేని గుడిసెలకు ఆశ్రయమిచ్చి ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం నింపే ఇందిరమ్మ ఇల్లు...!! ఆత్మగౌరవ ప్రతీక కేవలం ఇటుకల నిర్మాణం కాదు, నిరుపేద కుటుంబానికి దక్కిన ఆత్మగౌరవప్రతిక ఇందిరమ్మ ఇల్లు..!! ఎన్నో ఏళ్ల కలల సహకారం ఇందిరమ్మ ఇల్లు.. సొంతింటి కల సహకారమై ప్రతి పేదల ముఖంలో చిరునవ్వులు పూయించే సువర్ణ అవకాశం ప్రజా ప్రభుత్వం చేస్తుంది..!! ఇది ప్రజా ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం.. ప్రతి పేద వాడి ముఖంలో చిరునవ్వులు చూడాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..!! జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై సోని అమ్మ జై జై రాహుల్ అన్న జయహో రేవంతన్న *కొండా దంపతుల నాయకత్వం వర్ధిల్లాలి..* *మీ.. సిలివేరు అనిల్* యువజన కాంగ్రెస్ కొండా యువసేన రాష్ట్ర నాయకులు1