తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం: అట్టహాసంగా వేడుకలు - సంక్షేమ ఫలాల వెల్లువ* కుమ్రంభీం ఆసిఫాబాద్ అక్షిత తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, అధికారులకు, యువతకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగమైన చారిత్రక ఘట్టాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఆనాటి వీరయోధులు, ముఖ్యంగా 'జల్, జంగల్, జమీన్' కోసం గర్జించిన ఆదివాసి యోధుడు కొమురంభీమ్ పోరాటాన్ని కొనియాడారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దార్శనిక పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని, సంక్షేమ పథనాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో అమలువుతున్న ప్రధాన సంక్షేమ పథకాల లబ్ధి వివరాలు: *మహాలక్ష్మి (ఉచిత బస్సు ప్రయాణం):* జిల్లాలో ఇప్పటివరకు 2 కోట్ల 41 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోగా, రూ. 88.05 కోట్ల లబ్ధి చేకూరింది. *రూ. 500 కే ఎల్పీజీ సిలిండర్:* మహాలక్ష్మి పథకం ద్వారా 78,467 కుటుంబాలకు లబ్ధి చేకూరుతూ, రూ. 8.32 కోట్ల రాయితీ సొమ్మును మహిళల ఖాతాల్లో జమ చేశారు. *రాజీవ్ ఆరోగ్యశ్రీ:* పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు పరిమితిని రూ. 10 లక్షలకు పెంచగా, జిల్లాలో ఇప్పటివరకు రూ. 21.99 కోట్లు ఖర్చు చేశారు. *ఇందిరమ్మ ఇళ్లు*: జిల్లాకు మొత్తం 8,798 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 875 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. *గృహజ్యోతి*: 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా జిల్లాలోని 83,684 కుటుంబాలకు లబ్ధి చేకూరుతూ రూ. 55.53 కోట్ల రాయితీ అందజేశారు. *రైతు భరోసా & భీమా*: 2025-26 వానకాలంలో 1,33,860 మంది రైతుల ఖాతాలలో రూ. 250.30 కోట్లు జమ చేశారు. అలాగే రైతు భీమా ద్వారా మరణించిన 470 మంది రైతుల నామినీలకు రూ. 23.50 కోట్లు (ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు) అందించారు. *విద్యా రంగానికి పెద్దపీట*: పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు అందజేసినట్లు డిప్యూటీ చైర్మన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల'ను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. యంత్రాంగం అప్రమత్తత: వర్షాకాలంలో ముందస్తు చర్యలు, అధికార యంత్రాంగం సమన్వయంతో వరద విపత్తుల సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా తగు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గొడం నగేష్, ఎమ్మెల్సీ దండే విఠల్, స్థానిక ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం ఘటన: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ప్రయాణిస్తున్న కారులో పవర్ బ్యాంక్ పేలింది. కారణం: కారు క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాంతం: మహబూబాబాద్‌లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా, చింతపల్లి గ్రామ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నష్టం: డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. ప్రస్తుత పరిస్థితి: భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్‌కు పయనమయ్యారు.1
- బెల్లంపల్లిలో ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు చేసిన కొయ్యల ఏమాజి విశ్వ విఖ్యాత ప్రపంచ నాయకుడు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 76 వ జన్మదినోత్సవ వేడుకలు ఈ రోజు బెల్లంపల్లిలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు సిబ్బంది బిజెపి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారని ఏమాజి తెలిపారు విద్యార్థులకు కొయ్యల ఏమాజి పండ్లు పంపిణీ చేశారు సందర్భంగా కొయ్యల ఏమాజి మాట్లాడుతూ నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం దేశ ప్రజల అదృష్ట అన్నారు ఆయన నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. మోడీ వల్లనే ప్రపంచంలో దేశ ప్రతిష్ట పెరిగిందని తెలిపారు. ఇలాంటి దూర దృష్టి ఉన్న నాయకుడు ప్రపంచంలోనే లేడని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మిస్ట్రెస్ భాగ్యలక్ష్మి, బిజెపి సీనియర్ నాయకులు గోవర్ధన్ ఆకుల శంకర్ యుగంధర్ శ్రావణ్ కుమార్ నవీన్ కుమార్ నర్సింగ్, శ్రీనివాస్, గణేష్, మోహన్ రమేష్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.3
- ఉట్నూర్‌లో తుడుందెబ్బ ఐటీడీఏ మార్చ్ కదం తొక్కిన ఆదివాసీలు.. హక్కుల పరిరక్షణకు నినాదాలు ఉట్నూర్‌లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీడీఏ మార్చ్ ర్యాలీ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు ర్యాలీలో పాల్గొని తమ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నినాదాలు చేశారు. తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగగా, ఆదివాసీ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.1
- కొండాపూర్ గ్రామ పంచాయితిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుక తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం జాతీయ జెండాను సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్ ఆవిష్కరించారు. అనంతరం గీతాలాపన చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ నగేష్, వార్డు సభ్యులు భూమారావు, సుమన్, శ్రీధర్,FA సతీష్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు భాగమ్మ, ఆశ కార్యకర్తలు సుమలత, సువర్ణ, ఆయా స్రవంతి, కారోబార్ ప్రభాకర్ యువత గ్రామస్తులు పాల్గొన్నారు.1
- జన్నారంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు జన్నారం మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జన్నారం మండల అధ్యక్షులు కడారి నర్సయ్య ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కులస్తులు గురువారం ఉదయం జన్నారంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.1
- గణేష్ నవరాత్రి ఉత్సవాల జగిత్యాల పట్టణంలో వీధి దీపాల అలంకరణ, నిమజ్జన చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ మందు బిజేపి నాయకుల నిరసన కమిషనర్ కు బిజెపి నాయకుల వినతి1
- శ్రీ కోటేశ్వర స్వామి కోటిలింగాల ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి దేవస్థానంలో 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నూతన ఆలయ నిర్మాణానికి రూ.4.50 కోట్లు, రాజగోపురం నిర్మాణానికి రూ.1 కోటి మంజూరయ్యాయి. నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా పురాతన ఆలయ శిఖరాలను యంత్రాల సాయంతో తొలగించారు.1
- జన్నారం మండలంలోని విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరణ జన్నారం: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని జన్నారం మండలంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి, విశ్వకర్మ మహనీయుల సేవలను స్మరించుకున్నారు. సంఘం అధ్యక్షుడు కడర్ల నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నర్సింగ్ ఓజి శ్రీనివాస్, కోశాధికారి కొత్త శ్రీనివాస్‌తో పాటు సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ ఐక్యత, సమాజ అభివృద్ధి, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.1