ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా పాల్గొన్న అన్ని శాఖల అధికారులు ఉద్యోగులు యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యోగ జేఏసీ ఆద్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు వేలాది మందితో ఆందోళన మహా ధర్నా కార్యక్రమం పెద్దయెత్తున నిర్వహించడం జరిగినది. మహా ధర్నా కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటడ్ కార్మిక పెన్షనర్లు పెద్దయెత్తున పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్ల సాధనకై ఆందోళన వ్యక్తంచేశారు. మహాధర్నాలో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పదేపదే హామీ ఇస్తున్న సమస్యల అమలుకు నోచుకోలేక అనేకసార్లు వేచి చూసి చివరికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉద్యోగ సంఘాలను పిలిచి సుమారు 3.00 గంటల పాటు చర్చలు జరిపి స్వయంగా హామీ ఇచ్చినప్పటికిని నేటి వరకు ఎలాంటి అమలుకు నోచుకోలేదు. అందువలనే ఉద్యోగులు నేడు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగినదని తెలిపినారు. ఆందోళన కార్యక్రమంలో ముఖ్యంగా ఉద్యోగులకు నగదు రహిత వైద్యం(EHS) పూర్తిస్థాయిలో అమలు జరగడం లేదు అమలు జరపాలి రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ మేరకు PRC నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలి ఉద్యోగులకు రావలసిన 6 పెండింగ్ DA లను ఒకేసారి ఏక మొత్తంలో విడుదల చేయాలి నూతన పెన్షన్ విధానం (CPS) ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS) ను వెంటనే అమలుపరచాలి . ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రావలసిన పెండింగ్ బిల్లులను ఏకకాలంలో ఏక మొత్తంలో విడుదల చేయాలి 317 GO బాధితులకు న్యాయం చేయాలి 190 GO ను అన్ని శాఖలలో అమలుపరచాలి అని మహాధర్నాలో తీర్మానించనైనది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వెంటనే తమ న్యాయమైన డిమాండ్లనునెరవేర్చలని, లేని పక్షంలో సెప్టెంబరు, 10 వ తేదీన లక్షలాది మంది ఉద్యోగులతో ఛలో హైదారాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యోగ జె.ఏ.సి చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, సెక్రెటరీ జెనరల్ ధరణికోట భగత్, అడిషనల్ సెక్రెటరీ జెనరల్ కుంట్ల అమరేందర్ రెడ్డి, కొ చైర్మెన్స్ ఎం. యాదయ్య, చీకూరి జగన్, పదురి శ్రీకాంత్ రెడ్డి, డి.ఆర్.డి.ఓ నాగిరెడ్డి, డిప్యూటీ సి.ఈ.ఓ. శ్రీనివాస్, టి.ఎన్.జి.ఓ జిల్లా కార్యదర్శి ఎం.డి.ఖదీర్, కోశాధికారి కంచనపల్లి శ్రీకాంత్, ఉపాద్యక్షుడు పెండెం శ్రీనివాస్, పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు కె.మోహన్ రెడ్డి, బి. బాలరాజు, అరుణ, ఆర్. శైలజ, కె. ఆనంద్, ఎం.డి. అజీజ్ అలీ ఖాన్, డాక్టర్ పి. శ్రీకాంత్, వి. అశోక్ కుమార్, కె. వినోద్ రెడ్డి, మొయిజున్నిసా బేగం, మాటూరి అశోక్, యదాద్రి దేవాలయ జె.ఏ.సి. నేతలు సురేంద్ర చార్యులు, రఘు, పరమేష్, శ్రవణ్, ఎన్ లక్ష్మీనరసింహ రెడ్డి, మెహతాబ్ సైదులు, పంచాయత్ సెక్రెటరీ ఫోరం అధ్యక్షుడు గణగాని శశికాంత్ గౌడ్, నరేందర్, పి. శ్రీకాంత్, మెడికల్ ఫోరం అధ్యక్షులు వెంకట రమణ రెడ్డి, కార్యదర్శి, సత్యానారాయణ గజిటెడ్ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, కార్యదర్శి ప్రవీణ్ కుమార్, కె. శ్రీనివాస్, జి. అంబిక, వై. శ్రీనివాస్ రెడ్డి ఎం.పి.డి.ఓ, ఏ.ఓ ఎన్. అంజిరెడ్డి, బి. శ్రీనివాస రాజు, బోయ రాములు, జి. లింగయ్య, జి. శ్రీనివాస్, కె. రమేష్, వి. నరేందర్, కె. యశోద, ఎం. కృష్ణ, బి. బాలరాజు జిల్లాలోని అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా పాల్గొన్న అన్ని శాఖల అధికారులు ఉద్యోగులు యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యోగ జేఏసీ ఆద్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు వేలాది మందితో ఆందోళన మహా ధర్నా కార్యక్రమం పెద్దయెత్తున నిర్వహించడం జరిగినది. మహా ధర్నా కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటడ్ కార్మిక పెన్షనర్లు పెద్దయెత్తున పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్ల సాధనకై ఆందోళన వ్యక్తంచేశారు. మహాధర్నాలో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పదేపదే హామీ ఇస్తున్న సమస్యల అమలుకు నోచుకోలేక అనేకసార్లు వేచి చూసి చివరికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉద్యోగ సంఘాలను పిలిచి సుమారు 3.00 గంటల పాటు చర్చలు జరిపి స్వయంగా హామీ ఇచ్చినప్పటికిని నేటి వరకు ఎలాంటి అమలుకు నోచుకోలేదు.
అందువలనే ఉద్యోగులు నేడు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగినదని తెలిపినారు. ఆందోళన కార్యక్రమంలో ముఖ్యంగా ఉద్యోగులకు నగదు రహిత వైద్యం(EHS) పూర్తిస్థాయిలో అమలు జరగడం లేదు అమలు జరపాలి రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ మేరకు PRC నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలి ఉద్యోగులకు రావలసిన 6 పెండింగ్ DA లను ఒకేసారి ఏక మొత్తంలో విడుదల చేయాలి నూతన పెన్షన్ విధానం (CPS) ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS) ను వెంటనే అమలుపరచాలి . ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రావలసిన పెండింగ్ బిల్లులను ఏకకాలంలో ఏక మొత్తంలో విడుదల చేయాలి 317 GO బాధితులకు న్యాయం చేయాలి 190 GO ను అన్ని శాఖలలో అమలుపరచాలి అని మహాధర్నాలో తీర్మానించనైనది.
ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వెంటనే తమ న్యాయమైన డిమాండ్లనునెరవేర్చలని, లేని పక్షంలో సెప్టెంబరు, 10 వ తేదీన లక్షలాది మంది ఉద్యోగులతో ఛలో హైదారాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యోగ జె.ఏ.సి చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, సెక్రెటరీ జెనరల్ ధరణికోట భగత్, అడిషనల్ సెక్రెటరీ జెనరల్ కుంట్ల అమరేందర్ రెడ్డి, కొ చైర్మెన్స్ ఎం. యాదయ్య, చీకూరి జగన్, పదురి శ్రీకాంత్ రెడ్డి, డి.ఆర్.డి.ఓ నాగిరెడ్డి, డిప్యూటీ సి.ఈ.ఓ. శ్రీనివాస్, టి.ఎన్.జి.ఓ జిల్లా కార్యదర్శి ఎం.డి.ఖదీర్, కోశాధికారి కంచనపల్లి శ్రీకాంత్, ఉపాద్యక్షుడు పెండెం శ్రీనివాస్, పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు కె.మోహన్ రెడ్డి, బి. బాలరాజు, అరుణ, ఆర్. శైలజ, కె. ఆనంద్, ఎం.డి. అజీజ్ అలీ ఖాన్, డాక్టర్ పి. శ్రీకాంత్,
వి. అశోక్ కుమార్, కె. వినోద్ రెడ్డి, మొయిజున్నిసా బేగం, మాటూరి అశోక్, యదాద్రి దేవాలయ జె.ఏ.సి. నేతలు సురేంద్ర చార్యులు, రఘు, పరమేష్, శ్రవణ్, ఎన్ లక్ష్మీనరసింహ రెడ్డి, మెహతాబ్ సైదులు, పంచాయత్ సెక్రెటరీ ఫోరం అధ్యక్షుడు గణగాని శశికాంత్ గౌడ్, నరేందర్, పి. శ్రీకాంత్, మెడికల్ ఫోరం అధ్యక్షులు వెంకట రమణ రెడ్డి, కార్యదర్శి, సత్యానారాయణ గజిటెడ్ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, కార్యదర్శి ప్రవీణ్ కుమార్, కె. శ్రీనివాస్, జి. అంబిక, వై. శ్రీనివాస్ రెడ్డి ఎం.పి.డి.ఓ, ఏ.ఓ ఎన్. అంజిరెడ్డి, బి. శ్రీనివాస రాజు, బోయ రాములు, జి. లింగయ్య, జి. శ్రీనివాస్, కె. రమేష్, వి. నరేందర్, కె. యశోద, ఎం. కృష్ణ, బి. బాలరాజు జిల్లాలోని అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
- అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రతి ఒక్కరి ఓటు పరిరక్షణే SIR-2 లక్ష్యం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బోనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో SIR-2 వార్డు సభ నిర్వహించారు. ప్రజలకు మరింత చేరువగా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ప్రజలతో కలిసి నేలపై కూర్చొని సభ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై SIR-2 కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి అర్హుడి ఓటు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని, ఒక్క అర్హుడి ఓటు కూడా పోకుండా కాపాడుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.. ఏవైనా లోపాలు ఉన్నట్లయితే సంబంధిత బీఎల్ఓలను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు. ప్రతి ఓటు విలువైనదని, ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని పేర్కొంటూ, ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భువనగిరి సర్ కోఆర్డినేటర్ ఇ.వి. శ్రీనివాస్ రావు మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ , వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు జిల్లా గ్రంధాలయ చైర్మన్ అవెస్ చిస్తి PACS చైర్మన్ కొండల్ రెడ్డి ,RDO కృష్ణారెడ్డి గ, MRO జగన్ , పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ , కౌన్సిలర్స్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు BLA లు పాల్గొన్నారు... ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకమైన ఓటరు జాబితా – ప్రజాస్వామ్య పరిరక్షణే మనందరి లక్ష్యం అని నాయకులు పేర్కొన్నారు.4
- వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం............. ఉమ్మడి వరంగల్ హనుమకొండ జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. గురువారం వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లిన సంఘటన లో మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. భీమదేవరపల్లి మండలం రాంనగర్ శివారులో జరిగిన ఈ విషాద సంఘటనలో హుస్నాబాద్ మండలం పోతారం లో జరిగిన వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందనీ ఈ సంఘటనలో ఏలూరి రాధా (61) అక్కడికక్కడే మృతి చెందగా వీరారెడ్డి,కిరణ్,రవీందర్ రెడ్డి అనే మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి నట్లు, వీరంతా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.1
- *- భారీ బండరాయి ఎలా కొట్టుకుపోయిందో చూడండి!* నేపాల్ వరదల్లో ఓ భారీ బండరాయి కొట్టుకుపోయిన వీడియో వైరల్ అవుతోంది. టన్నుల కొద్దీ బరువుండే ఆ రాయిని నదీ ప్రవాహం సులభంగా ముందుకు తీసుకెళ్లింది. అంత పెద్ద రాయి పరిస్థితే ఇలా ఉంటే తీరం వెంబడి ఉన్న ఇళ్లు, వాహనాలు పూర్తిగా ధ్వంసం అయి ఉంటాయని నెటిజన్లు అంటున్నారు. కాగా 2013లో కేదార్నాథ్ వరదల్లో ఓ భారీ బండరాయి వచ్చి ఆలయం వెనుక ఆగింది. దాన్ని భక్తులు 'భీమశిల'గా భావించి పూజలు చేస్తున్నారు.. *- భారీ బండరాయి ఎలా కొట్టుకుపోయిందో చూడండి!* నేపాల్ వరదల్లో ఓ భారీ బండరాయి కొట్టుకుపోయిన వీడియో వైరల్ అవుతోంది. టన్నుల కొద్దీ బరువుండే ఆ రాయిని నదీ ప్రవాహం సులభంగా ముందుకు తీసుకెళ్లింది. అంత పెద్ద రాయి పరిస్థితే ఇలా ఉంటే తీరం వెంబడి ఉన్న ఇళ్లు, వాహనాలు పూర్తిగా ధ్వంసం అయి ఉంటాయని నెటిజన్లు అంటున్నారు. కాగా 2013లో కేదార్నాథ్ వరదల్లో ఓ భారీ బండరాయి వచ్చి ఆలయం వెనుక ఆగింది. దాన్ని భక్తులు 'భీమశిల'గా భావించి పూజలు చేస్తున్నారు..1
- పాలిటెక్నిక్ కళాశాలలపై జీవో 97 రద్దు చేయాలి విద్యార్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: డా. రామచంద్రరావు హైదరాబాద్: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ ఎడ్యుకేషనల్ వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97పై విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవో అమలు వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలుగుతుందని, తమకు అన్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీవో 97ను పునఃసమీక్షించి రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా. రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.1
- Ghar Par Behtar Elder Care – Apno Ki Dekhbhal, Samarth Ke Saath! #ElderCareIndia #SamarthCare #GharParCare #SeniorCare #24x7Support #TrustedElderCare #NRICare #HealthAtHome #ApnoKiDekhbhal #CareWithCompassion Ghar Par Behtar Elder Care – Apno Ki Dekhbhal, Samarth Ke Saath! #ElderCareIndia #SamarthCare #GharParCare #SeniorCare #24x7Support #TrustedElderCare #NRICare #HealthAtHome #ApnoKiDekhbhal #CareWithCompassion1
- మేడ్చల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. బీసీ ఎమ్మెల్యే కోసం ‘సర్జికల్ స్ట్రైక్–59’ మేడ్చల్: నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మేడ్చల్‌లో బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు బలమైన నాయకులు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎన్నికవుతూ వచ్చారని ‘సర్జికల్ స్ట్రైక్–59’ ప్రతినిధులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.1
- మార్పులు ప్రధాన కారణం హిమాలయాల్లో భూతాపం తినడం వల్ల మంచు గడ్డలు వేగంగా కరిగి పెద్ద సరస్సుగా మారుతాయి టిబెట్,నేపాల్ ప్రాంతాల్లో ఇటీవల సంభవించిన తీవ్రమైన వరదలు మరియు కొండచరియలు విరిగిపడటానికి గ్లేషియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్స్ (GLOFs)తీవ్రమైన మేఘావృత్త వర్షాలు (Cloudbursts)మరియు వాతావరణ మార్పులు (Climate Change)ప్రధాన కారణాలు.* వరదలకు మరియు తీవ్ర వాతావరణ మార్పులకు ప్రధాన కారణాలు *గ్లేషియల్ లేక్ అవుట్‌బర్స్ట్ (GLOF):* హిమాలయాల్లో భూతాపం పెరగడం వల్ల మంచు గడ్డలు (Glaciers) వేగంగా కరిగి పెద్ద సరస్సులుగా మారుతున్నాయి. ఈ సరస్సుల గట్లు తీవ్రమైన వర్షాలకు లేదా భూకంపాలకు ఒక్కసారిగా తెగిపోయినప్పుడు 'గ్లేషియల్ లేక్ అవుట్‌బర్స్ట్' జరిగి గియిరోంగ్ పోర్ట్ (Gyirong Port) వంటి సరిహద్దు ప్రాంతాలపైకి సునామీలా బురద వరదలు విరుచుకుపడతాయి. *గ్లోబల్ వార్మింగ్ (భూతాపం పెరగడం):*ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల కంటే హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుండి 3 రెట్లు వేగంగా పెరుగుతున్నాయి. దీనివల్ల వాతావరణంలో తేమను పట్టి ఉంచే సామర్థ్యం పెరిగి,అనుకోని సమయంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. *వర్షాకాలంలో మార్పులు :* అతి తక్కువ సమయంలో చాలా ఎక్కువ విస్తీర్ణంలో భారీ వర్షం ప1
- రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ చేశారని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాం చందర్ రావు ఆరోపించారు. జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై లాఠీచార్జీలు, కేసులు పెట్టడం సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్టైఫండ్లు, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిందని, విశ్వవిద్యాలయాలు, పాఠశాలల్లోనూ సమస్యలు ఉన్నాయని విమర్శించారు. విద్యార్థులను కలవకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. బైట్...రాం చందర్ రావు4