Shuru
Apke Nagar Ki App…
పర్వతపూర్‌లో SIR పరిశీలించిన తుంగతుర్తి రవి. మేడిపల్లి పరిధి పర్వతపూర్‌లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పరిశీలించారు. బూత్ నంబర్ 520 నుంచి 526 వరకు మిగిలిన దరఖాస్తులను ఆగస్టు 3లోపు పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.
Telangana news
పర్వతపూర్‌లో SIR పరిశీలించిన తుంగతుర్తి రవి. మేడిపల్లి పరిధి పర్వతపూర్‌లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పరిశీలించారు. బూత్ నంబర్ 520 నుంచి 526 వరకు మిగిలిన దరఖాస్తులను ఆగస్టు 3లోపు పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఫీజు బకాయిలపై బీజేపీ సమరభేరి సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: తాడూరి శ్రీనివాస్1
- ఆసుపత్రిలో ఆర్డీఓ ఆకస్మిక తనిఖీ.. రోగులతో నేరుగా ముచ్చట తూప్రాన్ 50 పడకల సామాజిక ఆసుపత్రిని ఆర్డీఓ బావయ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై సూపరింటెండెంట్ డాక్టర్ అమర్ సింగ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వార్డులను పరిశీలించి రోగులతో నేరుగా మాట్లాడి చికిత్స, మందుల లభ్యత, వైద్య సిబ్బంది సేవలపై అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా రోగులకు సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి రోగితో మానవీయంగా వ్యవహరించి వారికి మనోధైర్యం కల్పించాలని వైద్యులు, సిబ్బందికి ఆర్డీఓ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు.1
- దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్ నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్ నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రమాదాలకు గురికావడంతో అధికారులు వెంటనే స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రమాదాలు నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.1
- ఏ సంపాదన లేకపోయినా ప్రజాక్షేత్రంలో అంకితభావంతో నిలిచి, ప్రజల గుండెల్లో చెరగని ప్రేమను ఆస్తిగా మలుచుకున్న పెద్ది సుదర్శన్ అన్న నిజమైన ధనవంతుడు!1
- అన్నారం ప్రకృతి వనం వెళ్లే కాలనీ రహదారి బురద మా రోడ్డు మరమ్మతులు చేపట్టండి గుమ్మడిదల మున్సిపాలిటీ అన్నారం వార్డులోని ప్రకృతి వనం కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని భారీ గుంతలు, బురదతో ప్రమాదకరంగా మారింది. దీంతో ద్విచక్ర వాహనదారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలల క్రితం ప్రారంభించిన రోడ్డు పనులు నిలిచిపోయాయని, ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు. వెంటనే రహదారి పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.1
- సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుండి నర్సంపేట కు బయలుదేరిన పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుండి నర్సంపేటకు బయలుదేరిన పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థీవదేహం హన్మకొండ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం నర్సంపేటకు తరలింపు మధ్యాహ్నం 3 గంటలకు స్వగ్రామంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు1
- రాజాపేట మండలంలో భూ సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాజాపేట మండలంలోని బసంతపురం, కాల్వపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను నమోదు చేసి, వివాదాలకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.1
- మల్కాజిగిరి పరిధిలోని ఆర్కేపురం చెరువులో నీరు నింపాలని స్థానికుల డిమాండ్ మల్కాజిగిరి పరిధిలోని ఆర్కేపురం చెరువును గత ఏడున్నర నుంచి ఎనిమిది సంవత్సరాలుగా పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఖాళీగా ఉంచారు. ఇప్పటివరకు చెరువులో కలుపు మొక్కలు తొలగించి, నీటిని నిల్వ చేసే చర్యలు చేపట్టకపోవడంతో చెరువు పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది నీటి ఎద్దడి ప్రారంభమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు చెరువును శుభ్రపరచి నీటిని నింపితే భూగర్భ జలాలు పెరిగి, బోరుబావుల్లో నీటి లభ్యత మెరుగుపడి నీటి సమస్య తగ్గుతుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.1