Shuru
Apke Nagar Ki App…
ఉపవాసం ఉన్న వారికి భోజనం వండుతున్న వెంకటేశ్వరరావు గుంటూరులోనీ గుజ్జనగుండ్ల మసీదులో రంజాన్ నెల లో రోజా ఉన్నవారికి మసీదు కమిటీ సహారీ ఏర్పాటు చేయడం జరిగింది. నెల రోజుల నుండి రోజా ఉన్నవారికి రాత్రి 12 గంటల నుంచి సహారీ ఏర్పాటు చేస్తూ అల్తాఫ్ క్యాటరింగ్ వంట మాస్టర్ సుభాని, వెంకటేశ్వరరావు మతసామరస్యాన్ని చాటుతున్నారు.
SHOT NEWS
ఉపవాసం ఉన్న వారికి భోజనం వండుతున్న వెంకటేశ్వరరావు గుంటూరులోనీ గుజ్జనగుండ్ల మసీదులో రంజాన్ నెల లో రోజా ఉన్నవారికి మసీదు కమిటీ సహారీ ఏర్పాటు చేయడం జరిగింది. నెల రోజుల నుండి రోజా ఉన్నవారికి రాత్రి 12 గంటల నుంచి సహారీ ఏర్పాటు చేస్తూ అల్తాఫ్ క్యాటరింగ్ వంట మాస్టర్ సుభాని, వెంకటేశ్వరరావు మతసామరస్యాన్ని చాటుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- Post by V Ramarao4
- ఈ సందర్భంగా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీ సండ్ర వెంకట వీరయ్య గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ కూసంపూడి మహేష్ అయ్యప్ప స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవాలయానికి విచ్చేసిన నాయకులకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందిన నాయకులు ప్రజల సుఖశాంతి, ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమం ఘనంగా కొనసాగింది.1
- నకిరేకల్ నియోజకవర్గం:- ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మర్రిగూడ బైపాస్ వద్ద మరియు స్థానిక డిఈఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు.. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరణ... అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి” – మంత్రి... కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు... అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణ...1
- నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డు అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారింది. గ్రామపంచాయతీలో సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చాల్సింది పోయి, డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ దహనం చేస్తున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సేగ్రిగేషన్ షెడ్డును వెంటనే వినియోగంలోకి తెచ్చి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని పెంచాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నివాళులర్పించడం జరిగింది. #AmbedkarJayanti #StatueOfSocialJustice1
- పెదకూరపాడు: మాజీ ఎమ్మెల్యే టిడిపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ఓర్వలేక గత ప్రభుత్వంలో తామే చేసామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని జిల్లా మాజీ టిడిపి కార్యదర్శి ఆర్తి మల్ల రమేష్ అన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో కూడా గ్రామ గ్రామాన 70% సిసి రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత టిడిపికే దక్కిందన్నారు. తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బ్రహ్మయ్య ముంతాజ్ అప్పారావు పాల్గొన్నారు.1
- మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలో అంబేద్కర్ జయంతి రోజున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 135వ జయంతి సందర్భంగా ఘనంగా ఆవిష్కరించాల్సిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపింది. గ్రామస్తులు తెల్లవారుజామున విగ్రహం ముఖ భాగం పూర్తిగా చిద్రమై ఉండటాన్ని గమనించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా గ్రామంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పెద్దఎత్తున ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. జయంతి రోజునే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది కావాలనే చేసిన దుశ్చర్యగా భావిస్తూ, నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండటం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. కార్యక్రమం నిర్వహణపై అనిశ్చితి నెలకొనగా, అధికారులు, ప్రజాప్రతినిధులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్ర స్పందనలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.1
- సామాజిక సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత. సమానత్వం, విద్య, స్వాభిమానం మార్గంలో ముందుకు సాగుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన దారిలో కలిసి నడుద్దాం. జై భీమ్ ✊ జై భారత్ 🇮🇳1