మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం – కల్వకుర్తి సన్నాహక సమావేశంలో నేతల పిలుపు అచ్చంపేట, జనవరి 10,(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాల్టీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని బీజేపీ నాయకులు శనివారం కల్వకుర్తి లో నిర్వహించారు. ఈ సమావేశం కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో బీజేపీ నాయకులు గుర్రాల రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు , కంటెస్టెడ్ ఎమ్మెల్యే తల్లోజు .ఆచారి, అచ్చంపేట మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు హాజరయ్యారు. నేతలు మాట్లాడుతూ కల్వకుర్తి మున్సిపాల్టీలో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలనిపిలుపునిచ్చారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డులో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజల్లో బీజేపీ విధానాలను విస్తృతంగా తీసుకెళ్లాలని వారు సూచించారు. పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ పట్టణం ఖాళీగా దర్శనమిస్తుంది. నల్గొండ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాల రద్దీ పెరగడంతో రోడ్లు ట్రాఫిక్ జాములతో దర్శనమిస్తోంది. నిన్న ఈరోజు దాదాపు లక్ష వాహనాలు విజయవాడ వైపుగా వెళ్ళినట్లు కొర్లపాడు చౌటుప్పల్ టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించారు. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే విపరీతమైన ట్రాఫిక్ జాం నెలకొంది.1
- మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల కేంద్రంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గత వారం రోజులుగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున హరి, శివ నామ సంకీర్తనతో గ్రామ పురవీధులలో భజన పాటలు ఆలకిస్తూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో శివదిక్షాపరులు గ్రామ ప్రజలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.1
- Post by Paramesh Ratnagiri1
- - ఏకశిలానగర్ రియల్ ఎస్టేట్ గుండా వెంకటేష్ కి సహకరిస్తుంది పోలీసులా ? ప్రభుత్వ పెద్దలా ? - ఈ ప్రాంత ఎంపీగా ఉన్న నేనే స్వయంగా హెచ్చరించిన తర్వాత కూడా బరితెగిస్తున్నారు అంటే ఎవరి అండ చూసుకుని ? - కత్తులు, రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ల వెనుక ఉంది ఎవరు ? - ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ? - పోలీసులు, లా అండ్ ఆర్డర్ ఏమైనట్టు ? - రోజుకో దగ్గర ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిచ్చేస్టమై పోయింది. - ప్రజల రక్తం కళ్ళచూస్తున్నా కళ్లు తెరవని ప్రభుత్వం. - ముడుపుల కోసం నోరు మూసుకుంటే.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోతే.. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. - వారికి అండగా మేమున్నాం.. ఉంటాం అంటున్న - ఈటల రాజేందర్.1
- సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ను ఎస్ సి లకు కేటాయించలి1
- సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పండగ: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్1
- గజ్వేల్ మున్సిపల్‌లో బిజెపి జెండా ఎగరవేస్తాం – బైరి శంకర్ 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 10 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని అన్ని 20 వార్డుల్లో బిజెపి జెండాను గర్వంగా ఎగరవేస్తామని బిజెపి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజా వ్యతిరేక విధానాలతో అధికార పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, రానున్న ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ప్రతి వార్డులో బలమైన కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా బిజెపి పనిచేస్తోందని అన్నారు. గజ్వేల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని, మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం వంటి అంశాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని బైరి శంకర్ హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ విజయానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.బైరి శంకర్ ముదిరాజ్, ఎల్లు రామ్ రెడ్డి, గడిపల్లి భాస్కర్, కప్పర ప్రసాద్ రావు, దేవులపల్లి మనోహర్ యాదవ్, శ్రీను, ఏల్కంటి సురేష్, చెప్యాల వెంకట్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, రామచంద్ర చారి, కమ్మరి, నాయిని సందీప్ కుమార్, మడుగురి నరసింహ ముదిరాజ్, బారు అరవింద్,నాగు ముదిరాజ్, బింగి లక్ష్మీనారాయణ, మంద వెంకట్,దయాకర్ రెడ్డి, పోకల ప్రభాకర్, రామచంద్ర రెడ్డి,నిరంజన్ రెడ్డి,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు1
- చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర పార్బాయిల్డ్ రైస్ మిల్, వెంకటేశ్వర మోడరన్ రైస్ మిల్ ఇవి రెండు విసర్జిస్తున్న వాయు, ఘన, ద్రవ కాలుష్యాలను చిట్యాల మున్సిపల్ అధికారులు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నియంత్రించకపోవడం వల్ల చంద్రపురి కాలనీ, సాయి ద్వారకాపురి కాలనీ, ఆదర్శనగర్, ఆటోనగర్, ముత్యాలమ్మ గూడెం, సంజీవనగర్ తదితర పట్టణవాసుల జీవనానికి ఈ రైస్ మిల్లులు రెండు విసర్జించే కాలుష్యం తీవ్ర ఆటంకంగా మారిందని చంద్రపురి కాలనీ చుట్టూరా రైల్వే లైన్ ప్రక్కన చెత్త డెంపు యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల రైస్ మిల్ విసర్జిత కాలుష్యపు నీరు చెత్తలో పేరుకుపోవడంతో ప్రజలు శ్వాస పీల్చలేక, దోమలతో జీవించలేక ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని, వీటిని నివారించడంలో మున్సిపల్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వీటిని కంట్రోల్ చేయకపోతే రెండు రైస్ మిల్లులకు తాళాలు వేసి నిలిపివేస్తామని" ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మిల్లు యాజమాన్యాలను హెచ్చరిక చేశారు.* *మూడు జిల్లాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) వెంకన్న గారితో ఫోన్లో మాట్లాడి, వారు సందర్శించి మిల్లుల నుండి వస్తున్న కాలుష్యాన్ని నివారిస్తామని హామీ ఇచ్చిన తర్వాత ధర్నాను విరమించారు.* ఈ ధర్నాలో కాలనీకి చెందిన మహిళలు, బాలబాలికలు వీరితోపాటు చేపూరి శ్రీనివాస్ నేత, మారగొని యాదగిరి గౌడ్, రుద్రారపు నరసింహ, రుద్రారపు కిష్టయ్య, ఆదిరెడ్డి, నరసింహ, రావిడి సత్తిరెడ్డి, బిల్లపాటి అలివేలు, మారగోని జ్యోతి, రుద్రారపు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.1